
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.
బీజేపీ నేతలు సీఎం రేవంత్‌ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.
వరంగల్‌కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment