న్యూఢిల్లీ:ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.వాస్తవాలను వక్రీకరించిన భారత్ పరువు పోయేలా మాట్లాడినందుకుగాను రాహుల్‌గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రక్రియ ప్రారంభించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు దూబే స్పీకర్‌కు ఒక లేఖ రాశారు.
మేక్ ఇన్ ఇండియా ఫెయిలనందుకే చైనా భారత్‌ను ఆక్రమించిందని రాహుల్ అవాస్తవాలు మాట్లాడారని స్పీకర్‌కు రాసిన లేఖలో దూబే పేర్కొన్నారు.పార్లమెంట్ వేదికగా దేశం పరువు తీసేలా రాహుల్ మాట్లాడరని ఆరోపించారు. రాహుల్ తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించలేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని దూబే గుర్తు చేశారు.
కాగా, లోక్‌సభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌గాంధీ మాట్లాడారు. చైనా భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిందన్నారు. ఇంతేగాక విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనపైనా రాహుల్ విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరుపైనా రాహుల్ మాట్లాడారు. రాహుల్ ప్రసంగంలోని ఈ అంశాలన్నీ వివాదాస్పదమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment