privilege motion notice
-
అమిత్ షాకు ‘టీఎంసీ’ షాక్.. రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాకిచ్చింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ షాపై రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన అనంతరం డెరెక్ ఒబ్రియెన్ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను తక్కువ చేయడమే కాకుండా సభా మర్యాదను తగ్గించాయన్నారు. సభా మర్యాదను కించపరిచినందుకు షా పై చర్య తీసుకోవాలని ఒబ్రియెన్ కోరారు.అమిత్ షా రాజీనామా చేయాలి:కాంగ్రెస్అంబేద్కర్పై చేసినవ్యాఖ్యలకు గాను అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం(డిసెంబర్ 18) పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయడమే కాకుండా దేశ ప్రజలకు షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్
-
రఫేల్‌పై పోటాపోటీగా నోటీసులు
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు మరింత తీవ్రమవుతోంది. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సోమవారం సభా హక్కుల నోటీసు ఇచ్చింది. దీనికి ప్రతిగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అలాంటి నోటీసే ఇచ్చారు. కాంగ్రెస్ పంపిన నోటీసు తనకు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు జీరో అవర్‌లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. రఫేల్ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఎందుకిచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ ఉభయ సభల్లో సభా హక్కుల తీర్మానాల్ని ప్రవేశపెట్టింది. రాజ్యసభలో గులాం నబీ ఆజాద్.. చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో మల్లికార్జున ఖర్గే.. స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఈ నోటీసులు అందజేశారు. మరోవైపు, రఫేల్ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిశికాంత్ దూబే, సంజయ్ జైశ్వాల్..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపారు. కాగా, రఫేల్ విషయంపై అధికార, విపక్షాల నినాదాలతో సోమవారం లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది. దీంతో రెండు సభలు పెద్దగా కార్యకలాపాలు చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి.‡ రఫేల్‌పై కాగ్ ముసాయిదా నివేదిక రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తొలి ముసాయిదా నివేదికను రక్షణ శాఖకు పంపింది. నివేదికలోని అంశాలపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని కోరింది. అయితే ఈ నివేదికను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు లేనట్లేనని సమాచారం. -
జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం
హైదరాబాద్ : ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, జూపూడి ప్రభాకరరావుల మధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన అంశంపై శాసనమండలిలో మాట్లాడుతున్న తనను చెంగల్రాయుడు దూషించి అవమానపరిచారంటూ శుక్రవారం ఉదయం జూపూడి ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో తన వ్యాఖ్యలు జూపూడికి బాధకలిగించి ఉంటే ఉపసంహరించుకుంటున్నట్లు చెంగల్రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చెంగల్రాయుడు వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లలేదన్నారు. మరోవైపు చెంగల్రాయుడిపై జూపూడి సభా హక్కుల నోటీసు ఇచ్చారు.