న్యూఢిల్లీ: తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను న్యాయమైన వ్యాపార పద్దతులకు మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. భారత్‌లో కార్పొరేట్ శక్తులపై రాహుల్‌చేసిన వ్యాఖ్యలను బీజేపీ విమర్శించడంతో.. ఆయన ఈ విధంగా స్పందించారు.
ఈ మేరకు గురువారం రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను ఓ విషయాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. బీజేపీలోని కొందరు వ్యక్తులు నన్ను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. నేను వ్యాపార వ్యతిరేకిని అస్సలే కాదు. ఉద్యోగాల కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తా.
నేను గుత్తాధిపత్యానికి వ్యతిరేకిని. మార్కెట్ నియంత్రణ శక్తులకు వ్యతిరేకిని. కేవలం కొంతమంది వ్యక్తులే ఆధిపత్యం చేలాయించడానికి విరుద్దం’ అని రాహుల్ పేర్కొన్నారు. మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించానన్న రాహుల్.. వ్యాపారం విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకోగలనని తెలిపారు. తన వ్యాఖ్యలు కేంద్రీకృత శక్తికి వ్యతిరేకంగా ఉన్నాయని, సంస్థకు వ్యతిరేకంగా కాదని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment