సాక్షి, హైదరాబాద్: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.
‘‘నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?. గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదు!. అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ అందరూ బాధితులే. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకూ వంచితులే. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం. మేము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
‘‘మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?. ఈ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే! అంటూ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS లేఖ
♦️చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు.
♦️ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?
♦️తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?
♦️నమ్మి అధికారమిస్తే… pic.twitter.com/D4Nt9d8yDf— BRS Party (@BRSparty) December 11, 2024
ఇదీ చదవండి: ఏం చేశాం.. ఏం చేద్దాం?
Comments
Please login to add a commentAdd a comment