ఢిల్లీ: తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాట్‌లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలంటూ ఆయన హెచ్చరించారు.
ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన క్రమంలో తావ్డే లీగల్ నోటీసు ఇచ్చారు.
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలాంటి చర్యలకు ఎన్నడూ పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తన పరువుకు భంగం కలిగించి పార్టీని దెబ్బతీయాలని చూశారన్నారు. కాంగ్రెస్ నేతలు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. అందుకోసమే ఈ నోటీసులు పంపాను’’ అంటూ తావ్డే మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment