కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా | Bajrang Punia And Vinesh Phogat Joins In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా

Published Fri, Sep 6 2024 3:18 PM | Last Updated on Fri, Sep 6 2024 3:48 PM

Bajrang Punia And Vinesh Phogat Joins In Congress

సాక్షి, ఢిల్లీ: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. పార్టీ సీనియర్‌ నేతల మధ్య కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 

ఈ సందర్భంగా వినేష్‌ ఫోగట్‌ మాట్లాడుతూ.. ‘మా పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఆ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఆ పోరాటంలో కూడా విజయం సాధిస్తాం. మేము తీసుకున్న నిర్ణయంతో దేశ సేవకు కట్టుబడి ఉన్నాం. మా అక్కాచెల్లెళ్లకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీ కోసం ఎవరూ లేకున్నా నేను ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే హామీ ఇస్తున్నా’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

భజరంగ్‌ పూనియా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని, దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. వినేష్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన రోజు దేశంలో అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ బాధపడ్డారు. మేము కేవలం రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. మహిళల కోసం గొంతు వినిపించేందుకు ముందుకు వస్తున్నాం అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

 ఇక, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కూడా కలిశారు. దీంతో, హర్యానా రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాగా, వీరు హస్తం పార్టీలో చేరడంతో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదని సమాచారం. మరోవైపు.. ఈ పరిణామాల మధ్య వినేష్ ఫోగట్, పూనియా ఇద్దరూ రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

 

 

 

ఇదిలా ఉండగా.. అక్టోబర్ ఐదో తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఆప్‌తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం ఇంకా రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. కానీ, ఆప్ మాత్రం 10 స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, గందరగోళ పరిస్థితి నెలకొంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement