సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు రెజ్లర్ వినేశ్ ఫొగాట్(30). జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన ఫొగాట్ దాదాపు 19 ఏళ్ల అనంతరం ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. రెజ్లింగ్‌లో విజయం సాధించలేకపోయిన ఫొగాట్‌ను జులానా ఓటర్లు ఆదరించారు. ఫొగాట్‌కు 65,080 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌కు 59,065 ఓట్లు పడ్డాయి.
ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఫొగాట్ మధ్యలో కాస్త వెనుకబడ్డారు. చివరకు 6,015 ఓట్ల తేడాతో గెలుపు తీరాలకు చేరారు. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 12,440 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒలింపియన్ వినేశ్ ఫొగాట్‌ను బరిలోకి దింపి జాట్ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసి, సఫలమైంది. మరోవైపు, బీజేపీ యోగేష్ కుమార్‌ను నిలిపి ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచి, విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment