వినేశ్‌ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ స్పందన.. కీలక ఆదేశాలు | PM Narendra Modi reacts to Vinesh Phogat disqualification | Sakshi
Sakshi News home page

వినేశ్‌ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ స్పందన.. కీలక ఆదేశాలు

Published Wed, Aug 7 2024 1:17 PM | Last Updated on Wed, Aug 7 2024 3:15 PM

PM Narendra Modi reacts to Vinesh Phogat disqualification

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్‌ తగిలింది. ఓవర్‌ వెయిట్‌ కారణంగా రెజ్లర్‌  వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్‌ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు.

వినేశ్‌. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్‌. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి.  ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

పీటీ ఉష​కు మోదీ కీలక ఆదేశాలు  

మరోవైపు ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వినేశ్‌కు సహాయం చేసేందుకు వీలైన అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషను ఆదేశించారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని.. అదే విధంగా అనర్హత వేటు విషయంలో న్యాయబద్ధంగా పోరాటం చేయాలని కూడా ఉషను ఆదేశించారని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement