న్యూఢిల్లీ: 2030 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా వెల్లడించారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని... ఆ క్రమంలో 2030 యూత్ ఒలింపిక్స్‌కు బిడ్ వేయనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో 2030 యూత్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ వేయనున్నాం. మా ప్రధాన దృష్టి మాత్రం 2036 ఒలింపిక్స్ నిర్వహణపైనే ఉంది’ అని ఆదివారం ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మాండవియా పేర్కొన్నారు. కాగా, 2030 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పెరూ, కొలంబియా, మెక్సికో, థాయ్‌లాండ్, మంగోలియా, రష్యా, ఉక్రెయిన్, బోస్నియా హెర్జెగోవినాలతో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment