సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగాన్ని రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులు లక్షలాది మంది ఉన్నారని.. ప్రభుత్వం షరతులు పెట్టి 40 శాతం మందికే రుణమాఫీ చేసిందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నా.. ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను లేఖలో కేటీఆర్ వివరించారు.
40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచింది. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలి. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారు. సీఎం మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే.. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment