వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. తన సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె 4,08. 036 ఓట్ల మెజార్టీతో తన సమీప సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై గెలుపొందారు.
రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్
వయనాడ్ ఉప ఎన్నికల్లో ఏకంగా సోదరుడు రాహుల్ గాంధీ మెజార్టీ ప్రియాంక బ్రేక్ చేశారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీ రాగా.. ప్రియాంకకు 4 లక్షల 8 వేల ఓట్ల మెజార్టీ లభించింది. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరి రెండో స్థానంలో, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ డో స్థానంలో ఉన్నారు.
కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. 3, 64, 653 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు రాగా.. సీపీఐ నేత అన్నీ రాజాకు 2,83023 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్‌ను 1, 41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment