ముంబయి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం(నవంబర్ 16) మధ్యాహ్నం అమరావతిలో రాహుల్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు ఆయన బ్యాగులు చెక్ చేశారు.
బ్యాగులతో పాటు రాహుల్‌గాంధీ వచ్చిన హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖ నేతల బ్యాగుల తనిఖీలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి.
ఈ తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
అయితే,ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. కాగా,మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి: కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా
Comments
Please login to add a commentAdd a comment