న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్(Manmohan Singh) అంత్యక్రియల వేళ ఆయన్ను బీజేపీ తీవ్రంగా అవమానించిందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. దేశానికి పదేళ్ల పాటు విలువైన సేవలందించిన ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని(BJP-Led NDA) ఎన్డీఏ అవమానించిన తీరు బాధాకరమన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్ని నిగమ్ బోధ్ వద్ద నిర్వహించి ఆయన్ని అవమానపరిచారన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ లో రాహుల్ విమర్శలు గుప్పించారు.
‘మన్మోహన్ భారతదేశానికి ముద్దుబిడ్డ. సిక్కు కమ్యూనిటీకి తొలి ప్రధాని కూడా. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్థికరంగంలో ఒక సూపర్ పవర్‌గా భారతదేశం ఎదగడంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. ఆయన విధానాల వల్ల ఇప్పటికీ పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుంది.
అటువంటి ఆయన్ను అంత్యక్రియల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించింది. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అనేవి అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీనివల్ల ప్రధానుల అంతిమ సంస్కరాల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి మన్మోహన్ సింగ్ విషయంలో మాత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్( Nigam Bodh Ghat)లో నిర్వహించారు. ఇది ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించినట్లే’ అని ధ్వజమెత్తారు. మన్మోహన్‌సింగ్‌కు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చిన వారమవుతున్నామన్నారు రాహుల్. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు.
भारत माता के महान सपूत और सिख समुदाय के पहले प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी का अंतिम संस्कार आज निगमबोध घाट पर करवाकर वर्तमान सरकार द्वारा उनका सरासर अपमान किया गया है।
एक दशक के लिए वह भारत के प्रधानमंत्री रहे, उनके दौर में देश आर्थिक महाशक्ति बना और उनकी नीतियां आज भी देश के…— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2024
Comments
Please login to add a commentAdd a comment