Mohan Singh
-
మన్మోహన్సింగ్ను ఎన్డీఏ అవమానించింది: రాహుల్
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) అంత్యక్రియల వేళ ఆయన్ను బీజేపీ తీవ్రంగా అవమానించిందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. దేశానికి పదేళ్ల పాటు విలువైన సేవలందించిన ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని(BJP-Led NDA) ఎన్డీఏ అవమానించిన తీరు బాధాకరమన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్ని నిగమ్ బోధ్ వద్ద నిర్వహించి ఆయన్ని అవమానపరిచారన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ లో రాహుల్ విమర్శలు గుప్పించారు.‘మన్మోహన్ భారతదేశానికి ముద్దుబిడ్డ. సిక్కు కమ్యూనిటీకి తొలి ప్రధాని కూడా. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్థికరంగంలో ఒక సూపర్ పవర్‌గా భారతదేశం ఎదగడంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. ఆయన విధానాల వల్ల ఇప్పటికీ పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అటువంటి ఆయన్ను అంత్యక్రియల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించింది. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అనేవి అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీనివల్ల ప్రధానుల అంతిమ సంస్కరాల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి మన్మోహన్ సింగ్ విషయంలో మాత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్( Nigam Bodh Ghat)లో నిర్వహించారు. ఇది ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించినట్లే’ అని ధ్వజమెత్తారు. మన్మోహన్‌సింగ్‌కు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చిన వారమవుతున్నామన్నారు రాహుల్. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. भारत माता के महान सपूत और सिख समुदाय के पहले प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी का अंतिम संस्कार आज निगमबोध घाट पर करवाकर वर्तमान सरकार द्वारा उनका सरासर अपमान किया गया है।एक दशक के लिए वह भारत के प्रधानमंत्री रहे, उनके दौर में देश आर्थिक महाशक्ति बना और उनकी नीतियां आज भी देश के…— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2024 -
గ్యాంగ్‌స్టర్ ఆనంద్ విడుదల.. మోదీకి ఐఏఎస్ కుటుంబీకుల కన్నీటి వేడుకోలు
పాట్నా: బిహార్ గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 29 ఏళ్ల క్రితంఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ.. తాజాగా బయటకొచ్చారు. ఏలాంటి హడావిడీ లేకుండా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన్ను రిలీజ్ చేశారు అధికారులు. కాగా తన కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థం కోసం 15 రోజుల పెరోల్‌పై ఇటీవలే బయటికొచ్చిన ఆనంద్ మోహన్.. పెరోల్ ముగించుకొని నిన్ననే పోలీసులకు సరెండర్ అయ్యారు. అంతలోనే విడుదలై బయటకు రావడం గమనార్హం. కాగా ఆనంద్ మోహన్ విడుదలను ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమా వ్యతిరేకించారు. తన భర్త చనిపోవడానికి కారణమైన నిందితుడిని ఎందుకు విడుదల చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లనాటి ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తోందని వాపోయారు. ఇలా క్రిమినల్స్‌ను విడుదల చేస్తే రాజకీయ నాయకుల అండ చూసుకుని మరింత మంది రెచ్చిపోతారని తెలిపారు నేరస్థులకు ప్రభుత్వం మద్దతు తెలపడం సరికాదని, బిహార్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ మేరకు నంద్ మోహన్ విడుదల ఆపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐఏఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. చదవండి: స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ప్రధానికి కన్నీటి వేడుకోలు ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని కృష్ణయ్య కుమార్తె పద్మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ప్రధాని మోదీని నేను వేడుకుంటున్నాను. దయచేసి ఆనంద్‌లాంటి వ్యక్తులను తిరిగి సమాజంలో తిరగనివ్వద్దు. దీనిపై పోరాడే శక్తి మాకు లేదు. అలాంటి గ్యాంగ్స్టర్లు, మాఫియాలు బీహార్‌లో లేదా మరే రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా సంచరించకుండా చట్టం తీసుకురావాలి. మా నాన్న గురించి తెలియకపోతే బీహార్ ప్రజలను అడగండి. 29 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కూడా ప్రజలు దీనిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిర్ణయాన్ని పునరాలోచించండి. మాకు ఇది తగిన న్యాయం కాదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా ఐఏఎస్ అధికారి కృష్ణయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్. కృష్ణయ్య మృతి తర్వాత ఆయన భార్య హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం నిహారిక బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఇటీవల నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ జైలు మన్యువల్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నీతీష్ సర్కారు రూల్స్ మార్చడంతో.. గత 15 ఏళ్లుగా జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమమైనట్లు అయ్యింది. అనుకున్నట్లుగానే యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 27 మంది ఖైదీల విడుదలకు ఈనెల 24న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. అందులో ఆనంద్ మోహన్ పేరు కూడా ఉండటం తీవ్ర దుమారానికి తెరలేపింది. గ్యాంగ్‌స్టర్ కోసమే నీతీశ్ జైలు నిబంధనలు మార్చేశారంటూ విపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా.. దేశంలోని ఐఏఎస్‌లు సైతం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో ఈ వ్యవహారం పెద్ద రాజకీయ వివాదంగా మారింది. చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అమిత్‌షాపై కాంగ్రెస్ సీరియస్ -
T20 WC 2021 NZ Vs ENG: మన క్యూరేటర్‌కు నివాళిగా...
T20 WC 2021 NZ Vs ENG: Tribute To Indian Curator Minutes Silence Observed: భారత్‌కు చెందిన అబుదాబి చీఫ్ క్యూరేటర్ మోహన్ సింగ్ మృతికి ఇరు జట్ల క్రికెటర్లు నివాళులర్పించారు. షేక్ జాయెద్ స్టేడియానికి 45 ఏళ్ల మోహన్ సింగ్ సుదీర్ఘ సేవలు అందించారు. అయితే తీవ్రమైన డిప్రెషన్‌తో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. కాగా అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ దశలో తమను దెబ్బ కొడుతున్న ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుని దర్జాగా ఫైనల్ చేరుకుంది. ఇక నవంబరు 10న జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు నవంబరు 14న కివీస్‌తో ఫైనల్ ఆడనుంది. స్కోర్లు: ఇంగ్లండ్: 166/4 (20) న్యూజిలాండ్: 167/5 (19) చదవండి: మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది -
అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య
అబుదాబి: భారత్‌కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ ఆదివారం అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గత 15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్ క్రికెట్ స్టేడియంలో చీఫ్ క్యూరేటర్‌గా పని చేస్తున్నారు. భారత్‌లోని మొహాలీ పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ దగ్గర సుదీర్ఘకాలం పనిచేసిన మోహన్ తదనంతరం యూఏఈకి తరలివెళ్లారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 45 ఏళ్ల మోహన్ న్యూజిలాండ్–అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ కు ముందే ఆత్మహత్యకు పాల్పడినట్లు యూఏఈ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఉదయమే గ్రౌండ్‌కు వచ్చిన ఆయన పిచ్‌ను పర్యవేక్షించి తన గదిలోకి వెళ్లి మళ్లీ ఎంతకీ తిరిగి రాలేదు. గ్రౌండ్ సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించారు. -
అవని మోహన భావన విజయం
ముదితల్ నేర్వగ రాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్... చాలా పాతకాలపు మాటే. కానీ... ఈ కాలంలో అది వాళ్లను కించపరచడమే! అవకాశం దొరకాలేగానీ.. మహిళలు రాణించని రంగమంటూ లేదనేందుకు చరిత్రే సాక్ష్యం! ఓ ఇందిరాగాంధీ.. ఇంకో సునీతా విలియమ్స్.. మరో ఇంద్ర నూయీ! ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే స్త్రీ శక్తి విజయాలకు తార్కాణాలు కోకొల్లలు! తాజా ఉదాహరణలు కావాలా... అవని.. మోహన... భావనల జైత్రయాత్ర చూడండి!!! హైదరాబాద్ శివార్లలోని హకీంపేట్... ఆకాశంలో రయ్యి రయ్యి మంటూ విమానాలు దూసుకెళుతున్నాయి!! ఆకాశంలో సగమే కాదూ... అంతా మాదేనన్న ఆత్మవిశ్వాసంతో.. ఈ ముగ్గురు మూలపుటమ్మలు ముందడుగేశారు!! అభినందన్ వర్ధమాన్ నడిపిన మిగ్ – 21 బైసన్.. ధ్వనివేగంతో పోటీపడే సుఖోయ్–ఎంకే21, మిరాజ్ –2000లనూ అలవోకగా చక్కర్లు కొట్టిస్తున్నారు! ఇంకో కొన్ని నెలలు గడిస్తే.. పుల్వామా తరహా ఉగ్రదాడులకు దీటైన సమాధానం చెప్పే వాయుసేనలో అవనీ చతుర్వేదీ, భావనా కాంత్, మోహన సింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోవద్దు! దశాబ్దాల నిషేధాలు, ఆంక్షలను తోసిరాజంటూ 2016లో అవని చతుర్వేది భారతీయ వాయుసేనలో తొలి యుద్ధవిమాన పైలట్‌గా చరిత్ర సృష్టించగా.. ఆ తరువాత కొద్ది కాలానికే భావనా కంఠ్... మోహన సింగ్‌లు చేరారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వీర వనితలు హకీంపేటలోని వాయుసేన శిక్షణ కేంద్రంలో తమ నైపుణ్యాలకు తుదిమెరుగులు దిద్దుకుంటున్నారు. ఇప్పటికే పలు యుద్ధవిమానాలను నడపడంలో సిద్ధహస్తులైన ఈ ముగ్గురు ఎప్పుడెప్పుడు సుఖోయ్, మిరాజ్ కాక్పిట్లలోకి చేరిపోయి.. భారతీయ మహిళల సత్తాను ఆకాశానికి చేర్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత త్రివిధ దళాల్లో మహిళల పాత్ర ఏమిటన్నది ఒక్కసారి చూసుకుంటే కొంచెం నిరాశ ఆవహించక మానదు. ఆర్మీ, నేవీల్లో ఇప్పటికే మహిళల ప్రమేయం కేవలం వైద్య, దంత సేవలకు పరిమితం కాగా.. ఒక్క వాయుసేనలో మాత్రం 13 శాతం మహిళలు పనిచేస్తున్నారు. మూడు రక్షణ దళాలను పరిగణనలోకి తీసుకున్నా సరే.. మహిళల శాతం చాలా తక్కువ. వైద్య, దంత సేవల్లో 21.63, 20.75 శాతం మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. యుద్ధరంగంలో తుపాకీ పట్టేందుకూ మహిళకు అవకాశమివ్వాలన్న వాదన చాలాకాలంగా నడుస్తున్నా.. 2015 అక్టోబరులో ఇందుకు అనుమతిస్తూ భారతీయ వాయుసేన చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్‌లో ఉండే ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఉన్న మొత్తం 120 మంది కేడెట్ల నుంచి యుద్ధవిమానాల శిక్షణ కోసం 37 మందిని ఎంపిక చేయగా.. కఠినాతి కఠినమైన పరీక్షలకు ఓర్చి ఈ ముగ్గురు తుదిజాబితాలో స్థానం సంపాదించుకున్నారు. మిగిలిన వారిలోనూ ముగ్గురు మహిళలు ఉండగా.. వారిని హెలికాప్టర్, రవాణా విమానాలు నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. అవని చతుర్వేది ఫ్లైట్ లెఫ్టినెంట్ పుట్టింది: అక్టోబరు 27, 1993 కుటుంబం: తండ్రి దినకర్ చతుర్వేది మధ్యప్రదేశ్ నీటివనరుల విభాగంలో ఇంజినీర్. తల్లి గృహిణి, అవని అన్న కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నారు. విద్య: షాడోల్ జిల్లాలోని డియోలాంగ్లో పాఠశాల విద్య, రాజస్తాన్‌లోని బనస్థలి విశ్వవిద్యాలయం నుంచి బీటెక్. ఘనతలు: సూరత్‌గఢ్‌లోని వాయుసేన 23వ స్క్వాడ్రన్‌లో చేరారు. మిగ్ –21 బైసన్‌ను నడిపిన తొలి మహిళా పైలట్. ఇష్టాఇష్టాలు: చదరంగం, టేబుల్ టెన్నిస్లపై మక్కువ ఎక్కువ. స్ఫూర్తి: అన్నే. కాలేజీ ఫ్లైయింగ్ క్లబ్లో చిన్నసైజు విమానాలను నడిపిన అనుభవమూ ఉంది. ఏ వాయుసేనకైనా అందులోని యోధులే కీలకం. యుద్ధవిమాన పైలట్ కావాలన్నది నా కల. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధవిమానాలను నడపాలని.. ప్రతిరోజూ కొత్తకొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నా. – అవని చతుర్వేది భావన కంఠ్ ఫ్లయింగ్ ఆఫీసర్ పుట్టింది: 1992, బిహార్‌లోని దర్భంగ జిల్లాలో కుటుంబం: తండ్రి తేజ్ నారాయణ్ కంఠ్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. విద్య: రాజస్తాన్‌లోని కోటలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ శిక్షణ పొందారు. మహిళలకు అనుమతి లేకపోవడంతో అప్పట్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష రాయలేకపోయారు. బెంగళూరులోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ చదివారు. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికై వాయుసేనలో చేరారు. తొలిదశ శిక్షణలో భాగంగా యుద్ధవిమానాలు నడిపేందుకు ఎంపికయ్యారు. ఘనతలు: అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే మక్కువ ఎక్కువ. వాయుసేనలో రెండో దశ శిక్షణలో భాగంగా హకీంపేటలోని శిక్షణ కేంద్రంలో కిరణ్ విమానాలను నడిపారు. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న అనుభవమూ భావన కంఠ్ సొంతం. మోహన సింగ్ ఫ్లైట్ ఆఫీసర్ పుట్టింది: రాజస్తాన్‌లోని ఝున్ఝును జిల్లాలో. కుటుంబం: తండ్రి వాయుసేనలోనే వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తాత లాడూ రామ్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో ఫ్లైట్ గన్నర్. 1948 భారత్ – పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్ చక్ర అవార్డు గ్రహీత కూడా. విద్య: అమృత్‌సర్‌లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో గ్రాడ్యుయేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఘనతలు: తండ్రి ప్రతాప్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్న చోటే ట్రెయినీ కేడెట్‌గా చేరడం. -
పూడ్చిన నెల తర్వాత పోస్ట్‌మార్టం
-సాధరణ మరణమని గత నెల 29న అంత్యక్రియలు... -అనుమానం ఉందని ఫిర్యాదు...కేసు నమోదు...పోస్ట్‌మార్టం చిన్నశంకరంపేట(మెదక్ జిల్లా) సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత తమకు అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు పోలీస్‌లకు పిర్యాదు చేశారు. దీంతో నెల రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిన శవాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాలిపేట గ్రామానికి చెందిన ఐతరబోయిన బుచ్చయ్య(45) డిసెంబర్ 29న వెల్దూర్తి మండలం రామాంతాపూర్‌లో రోడ్డు పనుల నిర్వహణకు వెల్లి మతి చెందాడు. అప్పట్లో సాధారణ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తీరా ట్రాక్టర్‌ను తీసుకువచ్చి చూడగా ముందు బాగం దెబ్బతినడంతో అనుమానం వచ్చిన కుటుంభ సభ్యులు ఆరాతీయగా, ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని, గాయాలైన బుచ్చయ్య మృతి చెందగా స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుసుకున్నారు. దీంతో బార్య శ్యామవ్వ ఈ నెల 18న చేగుంట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేపాట్టారు.ఈ మేరకు బుధవారం మండలంలోని శాలిపేటలో బుచ్చయ్య శవాన్ని వెలికితీసి తహశిల్దార్ విజయలక్ష్మి సమాక్షంలో పంచనామ నిర్వహించారు. గాంధీ అస్పత్రి ప్రొపెసర్ డాక్టర్ మోహన్‌సింగ్ పోస్ట్‌మార్టం చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు మృతుడు బుచ్చయ్య ట్రాక్టర్ ప్రమాదంలో మతి చెందినట్లు తమకు అనుమానాలున్నాయని అతని బార్య శ్యామవ్వ ఫిర్యాదు చేసిందని.. దీంతో అనుమానస్పద మృతిగా కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపాట్టిన ట్లు తెలిపారు.పోస్ట్‌మార్టం నివేదిక తరువాత విషయాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. -
జవాను కాల్పుల్లో ముగ్గురు మృతి
కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో దుశ్చర్య చెన్నై, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్యాంపులో తన పైఅధికారి, సాటి జవాన్లపై ఓ జవాను విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు అధికారులు ప్రాణాలు విడిచారు. తమిళనాడులోని కాంచీపురం కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో ఐదు వేల మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యంత భద్రతా పరమైన అణు విద్యుత్ కేంద్రం కావడంతో 500 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు షిఫ్టుల వారీగా బందోబస్తులో ఉంటారు. వీరి కోసం కల్పాక్కంనగర్‌లో బ్యారక్స్ క్యాంప్ ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ స్థాయి జవాను విజయ్ ప్రతాప్ సింగ్ (57) బుధవారం తెల్లవారుజామున బ్యారెక్స్‌లోని మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న తన పైఅధికారి, రాజస్థాన్‌కు చెందిన మోహన్‌సింగ్ (42)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. తుపాకీ శబ్దం విని కొందరు జవాన్లు బ్యారెక్స్ వద్దకు రాగా వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించడంతో సేలంకు చెందిన స్పెషల్ ఎస్ఐ గణేశన్ (38), మదురైకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజ్ (42) మృతి చెందారు. విజయ్ ప్రతాప్ సింగ్‌ను తోటి జవాన్లు పట్టుకుని తుపాకీ లాక్కున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ ప్రతాప్ సింగ్ కొంతకాలంగా పైఅధికారులపై కోపంగా ఉన్నాడని, మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవాడని తోటి జవాన్లు చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కాల్పులకు కారణాలను తెలుసుకుంటున్నారు.