T20 WC 2021 NZ Vs ENG: Tribute To Indian Curator Mohan Singh - Sakshi
Sakshi News home page

T20 WC 2021 NZ Vs ENG: మన క్యూరేటర్‌కు నివాళిగా...

Published Thu, Nov 11 2021 9:52 AM | Last Updated on Thu, Nov 11 2021 10:32 AM

T20 WC 2021 NZ Vs ENG: Tribute To Indian Curator Minutes Silence Observed - Sakshi

Mohan Singh(PC: Twitter)

T20 WC 2021 NZ Vs ENG: Tribute To Indian Curator Minutes Silence Observed: భారత్‌కు చెందిన అబుదాబి చీఫ్‌ క్యూరేటర్‌ మోహన్‌ సింగ్‌ మృతికి ఇరు జట్ల క్రికెటర్లు నివాళులర్పించారు. షేక్‌ జాయెద్‌ స్టేడియానికి 45 ఏళ్ల మోహన్‌ సింగ్‌ సుదీర్ఘ సేవలు అందించారు. అయితే తీవ్రమైన డిప్రెషన్‌తో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి సెమీస్‌ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. 

కాగా అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్‌ దశలో తమను దెబ్బ కొడుతున్న ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుని దర్జాగా ఫైనల్‌ చేరుకుంది. ఇక నవంబరు 10న జరుగనున్న రెండో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు నవంబరు 14న కివీస్‌తో ఫైనల్‌ ఆడనుంది.

స్కోర్లు:
ఇంగ్లండ్‌: 166/4 (20)
న్యూజిలాండ్‌: 167/5 (19)

చదవండి: మరో మిచెల్‌ అవుదామనుకున్నాడు.. కానీ మిస్‌ అయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement