T20 World Cup 2021: Abu Dhadi Stadium Pitch Curator Mohan Singh Commits Suicide - Sakshi
Sakshi News home page

Abu Dhabi Pitch Curator: అబుదాబిలో భారత క్యూరేటర్‌ ఆత్మహత్య

Published Mon, Nov 8 2021 5:31 AM | Last Updated on Mon, Nov 8 2021 11:39 AM

Abu Dhabi stadium pitch curator Mohan Singh found dead - Sakshi

అబుదాబి: భారత్‌కు చెందిన చీఫ్‌ పిచ్‌ క్యూరేటర్‌ మోహన్‌ సింగ్‌ ఆదివారం అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గత 15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో చీఫ్‌ క్యూరేటర్‌గా పని చేస్తున్నారు. భారత్‌లోని మొహాలీ పిచ్‌ క్యూరేటర్‌ దల్జీత్‌ సింగ్‌ దగ్గర సుదీర్ఘకాలం పనిచేసిన మోహన్‌ తదనంతరం యూఏఈకి తరలివెళ్లారు.

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 45 ఏళ్ల మోహన్‌ న్యూజిలాండ్‌–అఫ్గానిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ కు ముందే ఆత్మహత్యకు పాల్పడినట్లు యూఏఈ క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. ఉదయమే గ్రౌండ్‌కు వచ్చిన ఆయన పిచ్‌ను పర్యవేక్షించి తన గదిలోకి వెళ్లి మళ్లీ ఎంతకీ తిరిగి రాలేదు. గ్రౌండ్‌ సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement