Curator
-
మరిచిపోలేని క్షణాలు.. సచిన్ ఎమోషనల్ పోస్ట్! ఎవరీ జసింత?
International Women’s Day: గత కొన్నేళ్లుగా క్రీడా రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెరగడం హర్షణీయమని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అన్నాడు. వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే క్రీడలకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ రాణించగలరని పేర్కొన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తన కెరీర్‌లోని ప్రత్యేక క్షణాలను పంచుకుంటూ సచిన్ టెండుల్కర్ ఈ మేరకు ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశాడు. ‘‘గడిచిన కొన్నేళ్లలో భారత్, ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. 2008లో.. 26/11 (ముంబై పేలుళ్ల) ఘటన తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. జాతి మొత్తానికి అదో భావోద్వేగపూరిత సందర్భం. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ మెంబర్స్‌లో ఒకరైన మహిళ నా దగ్గరకు వచ్చి అందరి తరపునా శుభాకాంక్షలు తెలిపి.. తన ఆనందాన్ని పంచుకున్నారు. నా జీవితంలో అదొక మరుపురాని అనుభూతి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2024లో.. జసింత కళ్యాణ్ ఇండియాలో మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా అవతరించారు. ఆమె ఒక అడుగు ముందుకు వేశారు. భవిష్యత్తులో మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అడ్డంకులు అధిగమించి.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఇలాంటి రోల్ మోడల్స్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ప్రశంసించుకుందాం’’ అని సచిన్ టెండుల్కర్ వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. ఎవరీ జసింత కళ్యాణ్? కర్ణాటకకు చెందిన జసింత బెంగళూరులోని హరొబెల్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి రైతు. ఇక చిన్నతనం నుంచే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడ్డ జసింత.. ఉపాధి కోసం బెంగళూరులో అడుగుపెట్టారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరి.. అనంతరం అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వర్తించే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆట కంటే పిచ్‌పైనే ఎక్కువగా దృష్టి సారించిన జిసింత అభిరుచిని గమనించిన అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్.. స్టేడియంలో పనిచేసే మాలీలపై బాస్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలో పిచ్ క్యూరేటర్ ప్రశాంత్‌రావు జసింత ఆసక్తిని గమనించి పిచ్ తయారీలో మెళకువలు నేర్పాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి అనుభవం గడించిన జసింత.. భారత దేశంలోనే మొదటి మహిళా క్యూరేటర్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు పిచ్‌ల తయారీని ఆమె పర్యవేక్షిస్తున్నారు. Over the years, the rise of women in sport, in India and across the world, has been very encouraging. In 2008, in the aftermath of 26/11, India won the match against England, and it was an emotional moment for the entire nation. One of the first people with whom I was able to… pic.twitter.com/lw0lbRT5hy — Sachin Tendulkar (@sachin_rt) March 8, 2024 -
WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత
క్రికెట్ ఫీల్డ్‌లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతోంది. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ వృందా రతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా జి.ఎస్.లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కల్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్ క్యూరేటర్‌గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఆమె పరిచయం. క్రికెట్ అంటే సచిన్, ద్రవిడ్, గంగూలి అనేవారు ఒకప్పుడు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అంటున్నారు ఇప్పుడు. క్రికెట్ కామెంటేటర్స్ అంటే హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్ అనేవారు మొన్న. ఫిమేల్ క్రికెట్ యాంకర్స్‌గా మందిరా బేడీ, సంజనా గణేశన్ పేరు గడించారు ఇవాళ. మహిళా అంపైర్లు ఇదివరకే రంగంలోకి వచ్చారు. వారి వరుసలో చేరింది జసింత కల్యాణ్. ఈమె భారతదేశంలో తొలి మహిళా పిచ్ క్యూరేటర్. 1980ల నుంచి మనదేశంలో పిచ్ క్యూరేటర్లు 1980 వరకూ లేరు. స్టేడియంలో గడ్డి పెంచే మాలీలే పిచ్‌ను కూడా తయారు చేసేవారు, తెలిసినంతలో చూసుకునేవారు. కాని వాన పడితే పిచ్‌ను తడవడానికి వదిలేయడం, స్టంప్స్ వదిలేసి పోవడం జరిగేది. దానివల్ల మ్యాచ్ కొనసాగే సమయంలో పిచ్ అనూహ్యంగా మారేది. అలా కాకుండా స్టేడియంలోని మట్టిని బట్టి, రుతువులను బట్టి, ఆట సమయానికి పిచ్‌ను శాస్త్రీయంగా తయారు చేసేందుకు ‘పిచ్ క్యూరేటర్లు’ రంగం మీదకు వచ్చారు. వీరు పిచ్‌ను తీర్చిదిద్దుతారు. రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడి పిచ్‌ను ఎప్పుడూ ఆటకు వీలుగా ఉంచుతారు. అయితే ఈ నలభై ఏళ్ల నుంచి కూడా పురుషులే పిచ్ క్యూరేటర్లుగా ఉన్నారు. ఒక స్టేడియంలోని పిచ్‌లను స్త్రీలకు అప్పజెప్పడం ఎప్పుడూ లేదు. మొదటిసారి అలా బాధ్యత తీసుకున్న మహిళ జసింత కల్యాణ్. బెంగళూరులో జసింత బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్ కోసం పిచ్‌ను తయారు చేసే బాధ్యతను అందుకున్నారు జసింత కల్యాణ్. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరొబెలె అనే ఊరిలో జన్మించిన జసింత తండ్రి వరి రైతు. చిన్నప్పుడు ఆర్థిక కష్టాలు పడిన జసింత బెంగళూరు చేరుకుని ‘కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్’లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోట్ అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆమె ఆఫీసు ఉన్నా మ్యాచ్‌లు చూసేది కాదు. సిక్సర్లు, ఫోర్లు వినిపిస్తే తప్ప. అయితే ఆమెకు స్టేడియంలోని పచ్చగడ్డి అంటే ఇష్టం. అది గమనించిన అసోసియేషన్ సెక్రటరీ బ్రిజేష్ 2014లో స్టేడియంలో పని చేసే మాలీలపై అజమాయిషీని అప్పజెప్పాడు. ఆ తర్వాత ఆ స్టేడియంకు చెందిన పిచ్ క్యూరేటర్ ప్రశాంత్ రావు ఆమెకు పిచ్‌లు తయారు చేయడంలో మెళకువలు నేర్పాడు. దాంతో ఆమె పూర్తిగా అనుభవం గడించింది. ఆ అనుభవం నేడు ఆమెను మన దేశ తొలి మహిళా పిచ్ క్యూరేటర్‌గా నిలిపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్‌లను ఆమె అజమాయిషీ చేస్తోంది. క్యూరేటర్‌గా జసింత నియామకం గురించి తెలిశాక క్రికెట్ రంగం నుంచి, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుంటే బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతూ పోస్ట్ చేశారు. తన పనితీరుకు మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
ఆసియా కప్-2023 విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్
2023 ఆసియా కప్ టైటిల్‌ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌 The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆 Their unwavering commitment and… — Jay Shah (@JayShah) September 17, 2023 తెర వెనుక హీరోలకు గుర్తింపు.. 2023 ఆసియా కప్ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్మెంట్ లేనిది ఆసియా కప్ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్‌లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్‌లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్‌మెన్ సేవలు వెలకట్టలేనివి. Join us in appreciating the Sri Lanka groundsmen 👏👏 pic.twitter.com/0S7jpERgxj — CricTracker (@Cricketracker) September 17, 2023 వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్‌తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్‌ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్స్ అని సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్‌మెన్, క్యూరేటర్లకు 50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు. వారి కమిట్మెంట్, హార్డ్వర్క్లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ తనకు లభించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. -
టీమిండియా మాజీ క్రికెటర్ మృతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ బుధవారం మృతి చెందారు. ముంబైకి చెందిన 78 ఏళ్ల సుధీర్ నాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్లో రంజీ చాంపియన్ గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు. -
అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య
అబుదాబి: భారత్‌కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ ఆదివారం అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గత 15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్ క్రికెట్ స్టేడియంలో చీఫ్ క్యూరేటర్‌గా పని చేస్తున్నారు. భారత్‌లోని మొహాలీ పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ దగ్గర సుదీర్ఘకాలం పనిచేసిన మోహన్ తదనంతరం యూఏఈకి తరలివెళ్లారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 45 ఏళ్ల మోహన్ న్యూజిలాండ్–అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ కు ముందే ఆత్మహత్యకు పాల్పడినట్లు యూఏఈ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఉదయమే గ్రౌండ్‌కు వచ్చిన ఆయన పిచ్‌ను పర్యవేక్షించి తన గదిలోకి వెళ్లి మళ్లీ ఎంతకీ తిరిగి రాలేదు. గ్రౌండ్ సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించారు. -
పచ్చిక పిలుస్తోంది!
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ మైదానంలో గత మూడు సీజన్లలో మూడు డే అండ్ నైట్ టెస్టులు జరిగాయి. ఏ మ్యాచ్ కూడా పూర్తిగా ఐదు రోజుల పాటు సాగలేదు. ఆ మ్యాచ్‌లలో గులాబీ బంతి మన్నిక కోసం పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చికను ఉంచారు. ఫలితంగా ఆరంభంలో పిచ్ పేస్‌కు బాగా అనుకూలించింది. ఈసారి డే అండ్ నైట్ టెస్టు కాకపోయినా... తాము అదే తరహాలో పిచ్‌ను సిద్ధం చేస్తున్నామని క్యురేటర్ డామియెన్ హాఫ్ చెప్పాడు. ‘మేం డే టెస్టు కోసం భిన్నంగా ఏమీ చేయడం లేదు. అదే తరహాలో పిచ్‌ను రూపొందిస్తాం. పిచ్‌పై కొంత పచ్చిక ఉంటేనే అటు బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరు సాగుతుందనేది మా నమ్మకం. ప్రస్తుతానికి మాత్రం మేం అదే పనిలో ఉన్నాం’ అని అతను అన్నాడు. టెస్టు సాగినకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినా... మొదటి రోజు మాత్రం పేసర్లకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన పేస్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో సిరీస్‌కు ఆసక్తికర ఆరంభం లభించవచ్చు. అరవడం కంటే కరవడం ముఖ్యం! బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల వ్యవహారశైలి మారిపోయిందని, వారంతా బుద్ధిగా వ్యవహరిస్తారని తరచూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే మాటల్లో తీవ్రత లేకపోయినా... తమ దూకుడు మాత్రం తగ్గదని ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రవిస్ హెడ్ అన్నాడు. తమ బౌలర్లు ఆ పని చేయగలరని అతను అభిప్రాయపడ్డాడు. ‘అవసరం లేకపోయినా మాట్లాడే మాటలకు విలువే ఉండదు. మా బౌలర్లు స్టార్క్ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి, కమిన్స్, హాజల్‌వుడ్ బౌన్స్‌తో చెలరేగి మైదానంలో దూకుడును ప్రదర్శిస్తారు. బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో కూడా ఇలాగే చేస్తాం. టీవీల్లో ఇది కనిపించకపోవచ్చు. నా దృష్టిలో అరిచే కుక్కకంటే కరిచే కుక్క ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’ అని హెడ్ అన్నాడు. కెరీర్లో 2 టెస్టులే ఆడిన హెడ్‌కు అడిలైడ్ సొంత మైదానం. ఆసీస్ కూర్పు ప్రకారం చూస్తే అతడికి తుది జట్టులో చోటు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న హ్యారీ నీల్సన్ నుంచి తాను కొన్ని సూచనలు తీసుకుంటానని అతను చెప్పాడు. కోహ్లిని ఇబ్బంది పెట్టగలం: పైన్ భారత కెప్టెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం తమ పేసర్లను ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. తమ బౌలర్లు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా లేదని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘మా బౌలర్లు తమ స్థాయిలో సత్తా చాటితే విరాట్ కోహ్లిని అడ్డుకోగలరు. అయితే మరీ ఎక్కువగా భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే మా ఆట దెబ్బ తింటుంది. మేం బాగా బౌలింగ్ చేస్తుంటే కోహ్లితో మాటల యుద్ధం అనే ప్రశ్నే తలెత్తదు. ఒక్కో ఆటగాడు తమకు అలవాటైన రీతిలో ఆడితే చాలు. అవసరమైతే కోహ్లితో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరించాల్సి వచ్చినా తప్పు లేదు. అయితే హద్దులు దాటకుండా ఉంటే చాలు’ అంటూ పైన్ తమ జట్టు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. -
'కోహ్లి ఏమీ చెప్పలేదే'
రాంచీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సంబంధించి ఫలాన పిచ్ కావాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అడిగాడంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్సీఏ) స్టేడియం క్యూరేటర్ ఎస్ బీ సింగ్ స్పష్టం చేశారు. మూడో టెస్టు మ్యాచ్ పిచ్ కు సంబంధించి విరాట్ కోహ్లి తమతో కలిసినట్లు ఆస్ట్రేలియన్ దినపత్రిక ప్రచురించిన వార్తల్లో నిజం లేదన్నారు. మరొకవైపు పిచ్ రూపకల్పనపై విరాట్ పాత్ర లేదనే విషయాన్ని జేఎస్సీఏ జాయింట్ సెక్రటరీ దేబాశిస్ చక్రబొర్తి సైతం ఖండించారు. 'ఎస్ బీ సింగ్ చెప్పింది ముమ్మాటికీ నిజం. రాంచీలో జరిగే టెస్టు మ్యాచ్ నిర్వహణకు మూడు పిచ్ లను తయారు చేసిన మాట వాస్తవం. ఆ విషయాన్నేచెప్పాం. అంతేకానీ పిచ్ రూపకల్పనలో విరాట్ పాత్ర ఉన్న విషయాన్ని క్యూరేటర్ ఎక్కడా చెప్పలేదు. ఆ పిచ్ తయారీపై కోహ్లి కూడా క్యూరేటర్లకు ఏమీ చెప్పలేదే. మరి అటువంటప్పుడు ఆ కథనాల్ని ఎలా ప్రచురిస్తారు. ఇక్కడ 4,5,7 నంబర్లు గల పిచ్ లను తయారు చేసి ఉంచాం. మ్యాచ్ నిర్వహణ అధికారులు వచ్చి ఫలాన పిచ్ ను సిద్ధం చేయమని చెప్పిన తరువాత మాత్రమే ఆ రకంగా ముందుకు వెళతాం. అప్పటివరకూ కొన్ని పిచ్ లను తయారు చేసి పక్కకు పెడతాం. భారత జట్టుకు అనుకూలంగా పిచ్ ను తయారు చేయమన్నారని కోహ్లి చెప్పినట్లు వచ్చిన వార్తలు నిజం కాదు'అని దేబాశిస్ చక్రబొర్తి తెలిపారు. మార్చి 16వ తేదీన ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రాంచీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
బీసీసీఐని హెచ్చరించినప్పటికీ..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయానికి కారణం ఏంటి? బ్యాటింగ్ వైఫల్యమా? నాణ్యత లేని పిచ్ తయారు చేయడమా? ఇవి రెండూ కారణమా? ఏమైనా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. రెండు రోజుల్లో 24 వికెట్లు పడ్డాయి. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇద్దరూ కలసి మొత్తం 12 వికెట్లు తీయగా, ఆసీస్ స్పిన్నర్ ఓకెఫీ ఒక్కడే 12 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్ తో్ మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి. మూడొందలకు పైగా పరుగుల తేడాతో పరాజయం. పైగా మూడు రోజుల్లో మ్యాచ్ ముగిసిపో్వడం. దాంతో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వికెట్‌ను రూపొందించిన క్యూరేటర్ పై ఎన్నో ప్రశ్నలు. ఇందుకు కారణం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కారణమంటున్నాడు పుణె పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సాల్గోన్. బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలు వ్యవహరించిన తీరు కారణంగానే పుణె మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిందని తాజాగా స్పష్టం చేశాడు.. 'ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. పిచ్ తయారీకి సంబంధించి నాకు నిర్దేశించిన కొన్ని ఆదేశాలు ఆధారంగా బీసీసీఐని ముందుగానే హెచ్చరించా. ఎటువంటి పచ్చదనం లేకుండా పూర్తిగా పొడి పిచ్ ను రూపొందించడం మంచికాదనే చెప్పా. అసలు నీటితో పిచ్ ను తడపకుండా గడ్డిని తీసేయమన్నారు. ఇది ప్రమాదమని ముందుగానే బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలకు తెలిపా. వారు నా మాట వినలేదు. దాంతో పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్ కు అనుకూలించింది. ఆ బీసీసీఐ పెద్దల పేర్లను ఇక్కడ చెప్పాలనుకోవడం లేదు. వారి ఆదేశాల్ని నేను పక్కకు పెట్టలేను కదా. సాధ్యమైనంత వరకూ పిచ్ ను బాగా రూపొందించాలనే యత్నించా. అయినా పిచ్ లో నాణ్యత లేకుండా పోయింది. నా జాబ్ బీసీసీఐ ఆదేశాల్ని పాటించడమే కదా' అని పాండురంగ్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా పై విషయాల్ని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా పుణె పిచ్ ను బీసీసీఐ పిచ్ కమిటీ హెడ్ దల్జిత్ సింగ్ ఆదేశాలతోనే ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది. పుణె టెస్టును రూపొందించేటప్పుడు వెస్ట్ జోన్ చీఫ్ ధీరజ్ ప్రసన్న కలిసి దల్జిత్ సింగ్ అక్కడికి హాజరయ్యాడు. వారిద్దరి ఆదేశాలతోనే పిచ్ ను పూర్తిగా పొడిగా తయారీ చేసినట్లు సమాచారం. -
యథాతథంగా వైజాగ్ వన్డే!
విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 29న విశాఖపట్నంలో జరగాల్సిన ఐదో వన్డేపై నెలకొన్న సందేహాలు తొలగిపోయారుు. ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పిచ్ వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం సిద్ధంగా లేకపోవడం వల్ల వేదిక మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చారుు. అరుుతే ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం వైజాగ్‌లోనే జరగనుంది. బుధవారం బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స) ఎంవీ శ్రీధర్, బోర్డు క్యురేటర్ ఇక్కడి పిచ్‌ను పరిశీలించారు. పూర్తి తనిఖీ తర్వాత పిచ్‌పై వారిద్దరు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ’వైజాగ్ స్టేడియంలో అంతా బాగుంది’ అని వ్యాఖ్యానించిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మ్యాచ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదే స్టేడియంలో నవంబర్ 17నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు కూడా జరగనుంది. -
ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ గా చంద్రశేఖర్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) క్యూరేటర్ వై.ఎల్.చంద్రశేఖర్ రావు వరుసగా మూడో ఏడాది ఐపీఎల్లో పురస్కారాన్ని దక్కించుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఐపీఎల్-9 సీజన్లో బెస్ట్ క్యూరేటర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రూ. 25 లక్షల పారితోషికంతోపాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. 2014లో బెస్ట్ క్యూరేటర్‌గా రూ. 12 లక్షల పారితోషికం అందుకున్న చంద్రశేఖర్... గతేడాది బెస్ట్ క్యూరేటర్‌గా రెండోసారి ఐపీఎల్ నిర్వాహకుల నుంచి రూ. 9 లక్షలను బహుమతిగా పొందారు. ఈ ఏడాది నెల రోజులుగా క్రికెట్ అభిమానులను హోరెత్తించిన ఐపీఎల్ సీజన్ ముగియడంతో పిచ్‌ల తయారీలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన చంద్రశేఖర్‌రావుకు నిర్వాహకులు మూడోసారి బెస్ట్ క్యూరేటర్‌గా అవార్డును ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో విధులు నిర్వహించే చంద్రశేఖర్‌కు ఈ ఏడాది రూ. 25 లక్షల నజరానా లభించింది. చంద్ర శేఖర్‌రావు బెస్ట్ క్యూరేటర్‌గా అవార్డును పొందడం పట్ల సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు రాజు, మహేష్, మల్లికార్జున్‌తో పాటు ఎస్పీఎల్ బృందం హర్షం వ్యక్తం చేసింది.