![Former India Cricketer Sudhir Naik Passed Away Aged 78 - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/6/Untitled-1.jpg.webp?itok=OaVK90AE)
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ బుధవారం మృతి చెందారు. ముంబైకి చెందిన 78 ఏళ్ల సుధీర్ నాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్‌లో రంజీ చాంపియన్ గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment