Mumbai Cricketer
-
కశ్మీర్ యువతిని పెళ్లాడిన ముంబై క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్!
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన యువతిని సర్ఫరాజ్ పెళ్లాడాడు. వీరి వివాహ వేడుక వధువు స్వస్థలం షోపియాన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు కొందరు క్రికెటర్లు కూడా హజరై ఈ జంటను ఆశ్వీరాదించారు. వీరి వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ హర్షిత్ రాణా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన విహహం అనంతరం స్ధానిక విలేకరులతో సర్ఫరాజ్ మాట్లాడాడు. టీమిండియా ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా.. "దేవుడు దయ వుంటే కచ్చితంగా ఎదో ఒక రోజు భారత్‌కు ఆడుతాను" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. అదే విధంగా కాశ్మీర్ యువతిని పెళ్లిచేసుకోవడం విధి అని సర్ఫరాజ్ అన్నాడు. Wishing a happy married life for Sarfaraz Khan & his wife. Congratulations to both of them. pic.twitter.com/BqwXiGGWtd — Johns. (@CricCrazyJohns) August 6, 2023 అదరగొడుతున్నా కానీ.. కాగా దేశీవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగిణలోకి తీసుకోలేదు. అయితే అతడి ఫిట్నెస్ కారణంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని బీసీసీఐ వర్గాలు సృష్టం చేశాయి. కాగా సర్ఫరాజ్ ప్రస్తుతం అద్భుతమై ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ Indian cricketer sarfaraz khan got married in shopian pic.twitter.com/inEvFiWk6t — Mastaan🇵🇸 (@Sartaj_4u) August 6, 2023 -
టీమిండియా మాజీ క్రికెటర్ మృతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ బుధవారం మృతి చెందారు. ముంబైకి చెందిన 78 ఏళ్ల సుధీర్ నాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్లో రంజీ చాంపియన్ గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు. -
Irani Cup 2023: స్టార్ క్రికెటర్‌కు దక్కని చోటు.. కారణం ఏంటంటే..?
ముంబై స్టార్ క్రికెటర్, అప్ కమింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌కు దేశవాలీ ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఇరానీ కప్‌లో ఆడే అవకాశం లభించలేదు. మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సర్ఫరాజ్ సారధ్యం వహించాల్సి ఉండింది. అయితే చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సెలెక్టర్లు సర్ఫరాజ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. సర్ఫరాజ్ గైర్హాజరీలో మయాంక్ అగర్వాల్ రెస్ట్ ఆఫ్ ఇండియా పగ్గాలు చేపడతాడు. డీవై పాటిల్ టీ20 కప్ సందర్భంగా సర్ఫరాజ్‌కు గాయమైనట్లు సమాచారం. కాగా, సర్ఫరాజ్ గతకొంతకాలంగా జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇతను దేశవాలీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నా.. సెలెక్టర్లు ప్రతిసారి మొండిచెయ్యే చూపిస్తున్నారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధిస్తున్నప్పటికీ.. ఈ ముంబై ఆటగాడిపై సెలెక్టర్లు కనికరం చూపించడం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఒకానొక దశలో సహనం కోల్పోయి సెలెక్టర్లు, బీసీసీఐపై విరుచుకుపడ్డాడు. సెలక్టర్లు తనను మోసం చేశారంటూ వాపోయాడు. ఇదిలా ఉంటే, దేశవాలీ కెరీర్లో ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 79.65 సగటున 13 శతకాల సాయంతో 3505 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 92.66 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు సాధించాడు. రెస్టాఫ్ ఇండియా : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ సేథ్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్ -
అన్న బాటలో.. ట్రిపుల్ సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్
Sarfaraz Khan Brother Musheer Khan: దేశవాలీ టోర్నీల్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అతను ఈసారి వార్తల్లోకెక్కింది తన వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి కాదు. తన తమ్ముడు ముషీర్ ఖాన్ కారణంగా. రంజీల్లో ముంబైకే ప్రాతినిధ్యం వహించే 17 ఏళ్ల ముషీర్ ఖాన్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ-2023లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ బాదాడు. Sarfaraz Khan's younger brother Musheer Khan has smashed a triple century for Mumbai in CK Nayudu Trophy against Hyderabad.#CricTracker #SarfarazKhan #MusheerKhan pic.twitter.com/b7C6VtJoTp— CricTracker (@Cricketracker) January 23, 2023 ఈ మ్యాచ్‌లో 367 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 34 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 339 పరుగులు స్కోర్ చేశాడు. ముషీర్ కళాత్మకమైన ఇన్నింగ్స్‌లో 190 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో రావడం విశేషం. ట్రిపుల్ హండ్రెడ్‌తో ముషీర్ చెలరేగడంతో ముంబై తమ ఇన్నింగ్స్‌ను 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముషీర్ గత నెలలోనే రంజీల్లోకి అరంగేట్రం చేసి ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక జట్టులో స్థానం కోల్పోయాడు. సౌరాష్ట్రతో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టకుండా కేవలం 35 (12, 23) పరుగులు చేసిన ముషీర్.. అస్సాంతో జరిగిన రెండో మ్యాచ్‌లో 42 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే అతికష్టం మీద లభించిన మూడో అవకాశంలోనూ ముషీర్ తనను తాను నిరూపించుకోలేకపోవడంతో వేటు తప్పలేదు. తన మూడో మ్యాచ్‌లో ఢిల్లీపై ముషీర్ వికెట్లు లేకుండా కేవలం 19 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. తద్వారా ముంబై యాజమాన్యం అతన్ని మరుసటి మ్యాచ్ నుంచి తప్పించింది. అయితే, అన్న సర్ఫరాజ్ లాగే పట్టువదలని ముషీర్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో హైదరాబాద్‌పై ట్రిపుల్ సెంచరీ బాది, ముంబై యాజమాన్యం తిరిగి తనవైపు చూసేలా చేశాడు. మరోపక్క రంజీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ మీద సెంచరీలు బాదుతూ, టీమిండియాలో చోటు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 92.66 సగటున 556 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు సీజన్లలోనూ ఇదే తరహాలో రెచ్చిపోయిన సర్ఫరాజ్.. వరుసగా 928 (9 ఇన్నింగ్స్‌ల్లో 154.66 సగటున), 982 (9 ఇన్నింగ్స్‌ల్లో 122.75 సగటున) పరుగులు చేసి టీమిండియా నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. తన ప్రదర్శన కారణంగా సర్ఫరాజ్ ఇండియా-ఏ టీమ్‌లో అయితే చోటు దక్కించుకోగలిగాడు కానీ, జాతీయ సెలెక్టర్లు మాత్రం ఈ ముంబై కుర్రాన్ని కరుణించడం లేదు. ఆసీస్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసొస్తుందేమో వేచి చూడాలి. గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శ్రేయస్.. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకోలేకపోతే, సెలెక్టర్లు సర్ఫరాజ్‌ను కటాక్షించే అవకాశాలు లేకపోలేదు. -
అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan: అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతూ, దేశవాలీ టోర్నీల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ, పరుగుల వరద పారిస్తున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అతని తండ్రి నౌషద్ ఖాన్ ఇటీవలే మీడియాతో షేర్ చేసుకున్నాడు. తన కొడుకు సర్ఫరాజ్ ఖాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌తో కూడిన ఓ యధార్థ సన్నివేశాన్ని నౌషద్ మీడియాకు వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హృదయాన్ని కదిలించే ఈ సన్నివేశంలో సర్ఫరాజ్ తనతో అన్న మాటలను గుర్తు చేసుకుంటూ నౌషద్ కన్నీరుమున్నీరయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే (నౌషద్ కథనం మేరకు).. సర్ఫరాజ్ ఖాన్, సచిన్ తనయుడు అర్జున్ జూనియర్ లెవెల్ నుంచి ముంబై తరఫున కలిసి క్రికెట్ ఆడేవారు. ఒక రోజు సర్ఫరాజ్ తన తండ్రి నౌషద్ దగ్గరకు వచ్చి.. నాన్న.. అర్జున్ ఎంత అదృష్టవంతుడు కదా.. అతని దగ్గర కార్లు, ఐపాడ్స్ అన్నీ ఉన్నాయి అని అన్నాడు. కొడుకు అన్న మాటలకు నౌషద్ నోటి వెంట మాట రాలేదు. నిస్సహాయ స్థితిలో అలాగే మిన్నకుండిపోయాడు. తమ ఆర్థిక స్థోమత గురించి కొడుకుకు తెలుసో లేదో అని మనసులో అనుకున్నాడు. కొద్దిసేపటికి సర్ఫరాజ్ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుని.. అర్జున్ కంటే నేనే అదృష్టవంతున్ని నాన్న.. ఎందుకంటే, నా తండ్రి నాతో పాటు రోజంతా గడుపుతాడు, అర్జున్ తండ్రి అతనితో ఎక్కువ సేపు గడపలేడు అంటూ చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు. ఈ విషయాన్ని నౌషద్ ఓ ప్రముఖ దినపత్రికతో షేర్ చేసుకున్నాడు. చిన్నతనం నుంచి తన కొడుకుకు ఉన్న పరిపక్వత గురించి వివరిస్తూ నౌషద్ తెగ మురిసిపోయాడు. తన కొడుకు తిరిగి వచ్చి తనను కౌగిలించుకున్న క్షణంలో తనకు ఏమని మాట్లాడాలో అర్ధం కాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు. దిగువ మధ్య తరగతికి చెందిన నౌషద్.. కొడుకు సర్ఫరాజ్ కోసం చాలా త్యాగాలు చేశాడు. వర్షం పడితే గ్రౌండ్‌ను వెళ్లడం కుదరదని, ఇంటినే గ్రౌండ్‌గా మార్చేశాడు. క్రికెట్‌కు సంబంధించి కొడుకుకు కావాల్సిన సలహాలు ఇస్తూ అన్నీ తానై వ్యవహరిస్తుంటాడు. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్లోనూ 6 మ్యాచ్‌ల్లో 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ తాజా ప్రదర్శన నేపథ్యంలో భారత టెస్ట్ జట్టులో (ఆసీస్ సిరీస్) చోటు గ్యారెంటీ అని అంతా ఊహించారు. అయితే ఈ ముంబై ఆటగాడికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. గత 24 ఇన్నింగ్స్‌ల్లో 71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59*, 134, 45, 5, 126*, 75, 20, 162, 125, 0 ఓ ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 7 సెంచరీలు, 5 అర్ధసెంచరీ బాది పరుగల వరద పారించిన సర్ఫరాజ్‌ను కాదని టీ20ల్లో సత్తా చాటాడన్న కారణంగా సూర్యకుమార్‌ను టెస్ట్ జట్టుకు ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్ గాయపడ్డాడు. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులో అయ్యర్ కూడా ఉన్నాడు. ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి అయ్యర్ కోలుకోకపోతే సర్ఫరాజ్‌కు టీమిండియా నుంచి మెయిడిన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు ఛాన్స్ దొరకబట్టిన సచిన్ తనయుడు
Ranji Trophy 2022-23: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘంగా నిరీక్షించిన అర్జున్.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో గోవాకు షిష్ట్ అయి రంజీ ఛాన్స్ దొరకబట్టాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో అర్జున్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడిన అర్జున్‌కు ఇది తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 23 ఏళ్ల అర్జున్.. గ్రూప్-సిలో భాగంగా ఇవాళ రాజస్తాన్‌తో మొదలైన మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గోవా.. సుయాశ్ ప్రభుదేశాయ్ (81 నాటౌట్), స్నేహల్ సుహాస్ ఖౌతాంకర్ (59) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సుయాశ్, అర్జన్ టెండూల్కర్ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్తాన్ బౌలర్లలో అంకిత్ చౌధరీ 2 వికెట్లు పడగొట్టగా.. అరాఫత్ ఖాన్, కమలేశ్ నాగర్‌కోటీ, మానవ్ సుతార తలో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు. ఎంత సచిన్ కుమారుడైనా టాలెంట్ ఉంటేనే తుది జట్టులో అవకాశం కల్పిస్తామని ముంబై కోచ్ జయవర్ధనే అప్పట్లో ప్రకటించాడు. ఎట్టకేలకు అర్జున్ తన స్వయంకృషితో గోవా రంజీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్జున్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఆటతీరుపై అతని భవితవ్యం ఆధారపడి ఉంది. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జై వచ్చాడు.. మరో సెంచరీ కొట్టాడు.. అయినా కరుణించరా..?
దేశవాలీ క్రికెట్లో అభినవ బ్రాడ్‌మన్‌గా పిలుచుకునే ముంబై రన్ మెషీన్ సర్ఫరాజ్ ఖాన్ మరో సెంచరీ బాదాడు.విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా బుధవారం (నవంబర్ 23) రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి తన జట్టును గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 117; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ ఆజింక్య రహానే (82 బంతుల్లో 88; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), పృథ్వీ షా (47 బంతుల్లో 51; 8 ఫోర్లు) కలిసి ముంబైని విజయతీరాలకు (48.3 ఓవర్లలో 338/5) చేర్చారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సర్ఫరాజ్ ఖాన్.. డిశ్చార్జ్ అయిన వెంటనే రెస్ట్ కూడా తీసుకోకుండా నేరుగా వచ్చి సెంచరీ బాదడం అందరినీ ఆశ్చర్యపరిచింది.సర్ఫరాజ్ సాహసానికి ముగ్దులైన అభిమానులు అతన్ని వేనోళ్లతో పొగుడుతున్నారు. ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగడమే ఓ ఎత్తైతే, సెంచరీ బాది మరీ గొప్పతనాన్ని చాటుకున్నాడంటూ ఆకాశానికెత్తుతున్నారు. సర్ఫరాజ్ గురించి బాగా తెలిసిన వాళ్లైతే.. వీడు టీమిండియాలో చోటు దక్కేంతవరకు సెంచరీలు బాదుతూనే ఉంటాడని అంటున్నారు. కాగా, దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ టీమిండియాలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతనికి భారత జట్టులో చోటు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ను ఇటీవలే సెలెక్టర్లు కరుణించారు.త్వరలో బంగ్లాదేశ్‌లో జరుగనున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు అతన్ని ఎంపిక చేశారు. -
బ్రాడ్‌మన్‌తో సరిసమానమైన గణాంకాలు.. అయినా ఏం ప్రయోజనం..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 43 ఇన్నింగ్స్‌ల తర్వాత లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్‌తో సరిసమానమైన గణాంకాలు.. తానాడిన ఆఖరి 21 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు.. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ కెరీర్లో బ్రాడ్‌మన్ (95.14) తర్వాత అత్యధిక సగటు (81.49).. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం తరం యువ క్రికెటర్లలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సాధించినటువంటి ఈ గణాంకాలు మరే ఇతర క్రికెటర్ సాధించలేదనే చెప్పాలి. అయితే, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఈ ఆటగాడికి టీమిండియా తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు. దేశవాళీ టోర్నీల్లో భీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు ఈ ముంబైకర్‌ను కనీసం దేకట్లేదు. అడపాదడపా ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్న సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈ 25 ఏళ్ల క్రికెటర్‌ను మాత్రం ఎంపిక చేయట్లేదు. బంగ్లాదేశ్ పర్యటన కోసం నిన్న (అక్టోబర్ 31) ప్రకటించిన టీమిండియాలో స్థానం ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్ ఖాన్.. తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. టీమిండియాకు ఆడటానికి ఇంతకంటే నేనేం చేయగలనని వాపోతున్నాడు. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నా సెలెక్టర్లు తనను చిన్న చూపు చూడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేస్తామని హామీ ఇచ్చిన సెలెక్టర్లు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్ఫరాజ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగుల సునామీ సృష్టిస్తున్నా ఇతన్ని ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని జాలి పడతున్నారు. నువ్వేమీ చేశావు నేరం.. నిన్నెక్కడంటిది పాపం అంటూ తెలుగు సినిమా పాటను గుర్తు చేస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు. కాగా, ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో భీకరమైన ఫామ్‌లో ఉండిన సర్ఫరాజ్ ఖాన్.. 982 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో 43 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను.. 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ గణాంకాలు కూడా 43 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సర్ఫరాజ్ ఖాన్ బ్రాడ్‌మన్ కంటే ఓ పరుగు అధికంగానే సాధించాడు. Sarfaraz Khan now has one more run than the DON after 43 FC inns Don Bradman 22 matches, 8 no, 2927 runs, ave 83.63, 100s: 12, 50s: 9 Sarfaraz Khan 29 matches, 7 no, 2928 runs, ave 81.33, 100s: 10, 50s: 8 Note: In his next match in Jan 1930, Bradman made a record unbeaten 452! https://t.co/7HPwPl72fz — Mohandas Menon (@mohanstatsman) October 2, 2022 43 ఇన్నింగ్స్‌ల తర్వాత బ్రాడ్‌మన్ 83.63 సగటున 12 శతకాలు, 9 అర్ధశతకాల సాయంతో 2927 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ అదే 43 ఇన్నింగ్స్‌ల తర్వాత 81.33 సగటున 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 2928 పరుగులు చేశాడు. ఈ 43 ఇన్నింగ్స్‌ల్లో బ్రాడ్‌మన్ 8 సార్లు నాటౌట్‌గా నిలువగా.. సర్ఫరాజ్ 7 సార్ల నాటౌట్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ లాగే మరో ముంబై ఆటగాడు పృథ్వీ షా కూడా టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డాడు. బంగ్లా టూర్‌కు జట్టు ప్రకటన తర్వాత షా.. వైరాగ్యంతో కూడిన ఓ ట్వీట్‌ను కూడా చేశాడు. అంతా దేవుడు చూస్తున్నాడంటూ దేవుడిపై భారం వేశాడు. -
ముంబై క్రికెటర్ అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసం.. ఏకధాటిగా 72 గంటల పాటు..!
ముంబై: ముంబై యువ క్రికెటర్ సిద్దార్థ్ మోహితే అబ్బురపరిచే బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఏకధాటిగా 72 గంటల ఐదు నిమిషాల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2015లో విరాగ్ మానే అనే క్రికెటర్ 50 గంటల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ చేయగా, తాజాగా సిద్దార్థ్.. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడంలో విరాగ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. తనలో ఎక్స్ట్రా టాలెంట్ ఉందిన ప్రపంచానికి తెలియజేయడానికే ఈ ప్రదర్శనను చేసినట్లు మోహితే చెప్పుకొచ్చాడు. మోహితే ఈ ఫీట్ సాధించడంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పర్సనల్ కోచ్ జ్వాలా సింగ్ కీలకంగా వ్యవహరించాడు. మోహితే ఈ రికార్డు సాధించడం కోసం జ్వాలా సింగ్‌ను మెంటార్‌గా నియమించుకున్నాడు. చదవండి: IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ -
ఆ క్రికెట్ దిగ్గజం సలహాలు నా ఆటతీరుని మెరుగుపర్చాయి..
ముంబై: ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో ముచ్చటించడం తనకు మరపురాని అనుభూతిని కలిగించిందని ముంబై యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. సచిన్ అంతటి ఆటగాడు తనకు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించిందని, వాటి వల్ల నా ఆటతీరు చాలా మెరుగుపడిందని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ముచ్చటించడంపై యశస్వి స్పందిస్తూ.. ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ సచిన్‌తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలిసి ఎగిరి గంతులేశానని, ఈ సందర్భంగా సచిన్‌తో మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా యశస్వి ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లపై కూడా స్పందించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యశస్వి.. ఒమన్ పర్యటన తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు. ఒమన్‌లోని వాతావరణం యూఏఈలో లాగే ఉంటుందని, పిచ్‌లు దాదాపు ఒకే విధంగా ఉంటాయని, ఈ అంశాలు తాను రాణించేందుకు తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే రాజస్థాన్ ప్లే ఆఫ్ దశకు చేరుతుందని, టీమిండియాకు ఆడడమే తన తదుపరి లక్ష్యమని యశస్వి చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్లో యశస్వి తొలిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ సీజన్లో ఆర్ఆర్ జట్టు అతన్ని రూ. 20లక్షల కనీస ధరకు చేజిక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో 3 మ్యాచ్‌లు ఆడిని యశస్వి.. 66 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ 2021 క్వాలిఫయర్స్ నేపథ్యంలో సన్నాహక మ్యాచ్‌ల కోసం ముంబై క్రికెట్ జట్టుని ఒమన్ తమ దేశానికి ఆహ్వానించింది. ఈ పర్యటనలో ఒమన్.. ముంబైతో మూడు టీ20లు, నాలుగు వన్డేలు ఆడింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లో యశస్వి జైశ్వాల్ అద్భుతంగా రాణించాడు. పలు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
వసీం జాఫర్ మేనల్లుడి అద్భుత శతకం.. రెండో వన్డేలో ముంబై ఘన విజయం
మస్కట్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఒమన్‌తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అర్మాన్తో పాటు సుజిత్ నాయక్ (70 బంతుల్లో 73; 6 ఫోర్లు) రాణించాడు. ఒమన్ బౌలర్లలో మహ్మద్ నదీమ్ 4, నెసట్ర్ దంబా 2, కలీముల్లా, ఆకిబ్ ఇలియాస్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ ముంబై బౌలర్లు మోహిత్ అవస్థి (4/31), ధుర్మిల్ మట్కర్ (3/21), దీపక్ షెట్టి (2/9), అమాన్ ఖాన్(1/8) ధాటికి 22.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ఒమన్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ నదీమ్(35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 4 వన్డేల సిరీస్‌లో ముంబై 2-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో కూడా ముంబై జట్టే విజయం సాధించింది. మూడో వన్డే సెప్టెంబర్ 2న జరుగనుంది. చదవండి:క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ బౌలర్.. -
నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త
ముంబై: సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం సజావుగా సాగదు. క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఇప్పుడు మనం చూపబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఈ శతాబ్దపు ఆరంభంలో(2003) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆవిష్కార్ సాల్వి.. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు. ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు. కాగా, సాల్వి.. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి.. తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో కూడా పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్‌గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా పని చేశారు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సాల్వి.. 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..? -
'థౌజండ్ వాలా'కు ప్రోత్సాహం
ముంబై: 'థౌజండ్ వాలా' ప్రణవ్ ధనావ్డేను ప్రోత్సహించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ముందుకు వచ్చింది. అతడికి నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్టు ఎంసీఏ ప్రకటించింది. 2016 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా అతడి ఆట, విద్యకు సంబంధించిన అంశాలను ఎంసీఏ పర్యవేక్షించనుంది. కాగా, ముంబై అండర్-19 జట్టులో స్థానమే తన తదుపరి లక్ష్యమని ప్రణవ్ ధనావ్‌డే తెలిపాడు. 15 ఏళ్ల ప్రణవ్ ధనావ్‌డే ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో 129 ఫోర్లు, 59 సిక్సర్లు 1009 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో అతడీ ఘనత సాధించాడు. -
అతడి పేరు... హికేన్ షా
* తాంబేను ఫిక్సింగ్ చేయమన్నది అతనే * ముంబై క్రికెటర్‌పై వేటు వేసిన బీసీసీఐ న్యూఢిల్లీ: ఐపీఎల్లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయాల్సిందిగా సహచర ముంబై క్రికెటర్ ప్రవీణ్ తాంబేను కోరిన ఆటగాడి పేరును బీసీసీఐ వెల్లడించింది. 30 ఏళ్ల హికేన్ షా.. తాంబేను సంప్రదించాడని, బోర్డు అవినీతి వ్యతిరేక కోడ్‌ను ఉల్లంఘించినందుకు వెంటనే అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొంది. తుది శిక్ష కోసం క్రమశిక్షణ కమిటీకి అతడి పేరును పంపినట్టు తెలిపింది. అలాగే షాను సస్పెండ్ చేస్తున్నట్టు ముంబై క్రికెట్ సంఘానికి సమాచారమిచ్చింది. ‘బీసీసీఐ అవినీతి వ్యతిరేక కోడ్‌ను షా అతిక్రమించినట్టు రుజువైంది. క్రమశిక్షణ కమిటీ తుది తీర్పు వెల్లడించేదాకా బోర్డు గుర్తింపు పొందిన ఏ క్రికెట్ మ్యాచ్‌లను కూడా తను ఆడడానికి వీల్లేకుండా సస్పెండ్ చేస్తున్నాం’ అని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గుజరాత్‌కు చెందిన హికేన్ షా ఇప్పటిదాకా ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించకపోయినా ముంబై తరఫున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2,160 పరుగులు సాధించాడు. ఐపీఎల్-8 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ప్రవీణ్ తాంబేను హికేన్ షా ఫిక్సింగ్ కోసం ప్రలోభ పెట్టగా అతడు ఏసీఎస్‌యూకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షాపై తీసుకున్న నిర్ణయం అవినీతిపై బోర్డు ఎంత కఠినంగా ఉందో తెలియపరుస్తుందని అధ్యక్షుడు దాల్మియా అన్నారు. నమ్మలేకపోతున్నాం: ఎంసీఏ హికేన్ షాపై బోర్డు సస్పెన్షన్ విధించడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ‘షా ఇలాంటి పనికి పాల్పడ్డాడంటే నమ్మలేకున్నాం. నిజంగా ఇది మాకు షాకింగ్ వార్త. అతనెప్పుడూ ఇలా అనుమానాస్పదంగా కనిపించింది లేదు. చాలా సిన్సియర్‌గా కనిపించేవాడు’ అని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పీవీ శెట్టి అన్నారు. ముంబై క్రికెట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కోచింగ్ విషయంపై సంప్రదించాను ‘బీసీసీఐ నిర్ణయంతో షాక్‌కు గురయ్యాను. నేను ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. కోచింగ్ విషయంలో తాంబేను నేను కలుసుకున్నాను. అంతేకానీ అవినీతి విషయంలో కాదు. ఇప్పటికే బోర్డుకు నేను సమాధానం చెప్పాను. అంతకుమించి చెప్పాల్సింది ఏమీ లేదు’ - హికేన్