Cricketer Sarfaraz Khan Gets Married In Kashmir - Sakshi
Sakshi News home page

#Sarfaraz Khan: కశ్మీర్‌ యువతిని పెళ్లాడిన ముంబై క్రికెటర్‌.. ఫోటోలు, వీడియోలు వైరల్‌!

Published Mon, Aug 7 2023 8:39 AM | Last Updated on Mon, Aug 7 2023 9:24 AM

Cricketer Sarfaraz Khan Gets Married In Kashmir - Sakshi

ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన యువతిని సర్ఫరాజ్ పెళ్లాడాడు. వీరి వివాహ వేడుక వధువు స్వస్థలం షోపియాన్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు కొందరు క్రికెటర్లు కూడా హజరై ఈ జంటను ఆశ్వీరాదించారు. వీరి వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా క్రికెటర్లు సూర్యకుమార్‌ యాదవ్, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌ హర్షిత్‌ రాణా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన విహహం అనంతరం స్ధానిక విలేకరులతో సర్ఫరాజ్‌ మాట్లాడాడు. టీమిండియా ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా.. "దేవుడు దయ వుంటే కచ్చితంగా ఎదో ఒక రోజు భారత్‌కు ఆడుతాను" అని సర్ఫరాజ్‌ పేర్కొన్నాడు. అదే విధంగా కాశ్మీర్‌ యువతిని పెళ్లిచేసుకోవడం విధి అని సర్ఫరాజ్‌ అన్నాడు.

అదరగొడుతున్నా కానీ..
కాగా దేశీవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్‌ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగిణలోకి తీసుకోలేదు. అయితే అతడి ఫిట్‌నెస్‌ కారణంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని బీసీసీఐ వర్గాలు సృష్టం చేశాయి. 

కాగా సర్ఫరాజ్‌ ప్రస్తుతం అద్భుతమై ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్‌ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్‌లో 900 పరుగులు, 2020-21 సీజన్‌లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్‌లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్‌లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్‌.. 3175 పరుగులు చేశాడు.
చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement