Update: బెంగళూరు టెస్టులో భారత్ 32 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. దాదాపు రెండు గంటల విరామం తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. 79 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(85), సర్ఫరాజ్ ఖాన్(144) పరుగులతో ఉన్నారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా అదరగొడుతోంది. భారత యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ కివీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
మరోవైపు గాయం నుంచి కోలుకుని బ్యాటింగ్ చేస్తున్న పంత్ కూడా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే భారత్ జోరుకు వరుణుడు బ్రేక్‌లు వేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో 20 నిమిషాల ముందే లంచ్‌కు ఆటగాళ్లు వెళ్లిపోయారు.
వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 344 పరుగుల స్కోర్ చేసింది. ప్రస్తుతం భారత్ ఇంకా 12 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), రిషబ్ పంత్(53) పరుగులతో ఉన్నారు. పంత్, ఖాన్ నాలుగో వికెట్‌కు ఇప్పటికే 113 పరుగులు జోడించారు.
కాగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment