వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు సెలక్టర్లు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు.
ఈ క్రమంలో భారత సెలక్షన్ కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. రుత్‌రాజ్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక చేయాల్సింది అని పలువురు మాజీ క్రికెటర్‌లు అభిఫ్రాయపడుతున్నారు. కాగా టెస్టు జట్టుకు తనని ఎంపిక చేయకపోవడంపై సర్ఫరాజ్ ఎట్టకేలకు మౌనం వీడాడు. సర్ఫరాజ్ రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోకు సర్ఫరాజ్ ఎటువంటి క్యాప్షన్‌ను జోడించలేదు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదుర్స్..
సర్ఫరాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్‌లో 900 పరుగులు, 2020-21 సీజన్‌లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్‌లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్‌లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
చదవండి: #ViralVideo: 'అయ్యో శివుడా ఏమాయే'.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడితే!
Sarfaraz Khan's latest Instagram Story after he wasn't selected for West Indies Tests. 👇🏻👇🏻 pic.twitter.com/ITzJMl7QUD
— Harshit Bisht (@rk_harshit29) June 25, 2023
Comments
Please login to add a commentAdd a comment