బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి బంగ్లా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమచారం. దేశవాళీ టోర్నీ ఇరానీ ట్రోఫీ కోసం సర్ఫరాజ్ పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆక్టోబర్ 1 నుంచి లక్నో వేదికగా ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఇందులో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరపున ఆడనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రెండు టెస్టుకు ముందు ఆఖరి నిమషంలో భారత జట్టులో ఎవరైనా గాయపడితే సర్ఫరాజ్ మళ్లీ వెనక్కి వచ్చే అవకాశముంది. కాగా తొలి టెస్టు తుది జట్టులో కూడా సర్ఫరాజ్‌కు చోటు దక్కలేదు. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దాదాపు చెపాక్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌నే భారత జట్టు మెనెజ్‌మెంట్ కొనసాగించే ఛాన్స్ ఉంది.
"భారత జట్టులోని ప్రధాన బ్యాటర్లలో ఎవరికైనా ఫిట్‌నెస్ సమస్యలు లేదా గాయపడితే సర్ఫరాజ్‌కు రెండో టెస్టులో ఆడే అవకాశం కచ్చితంగా దక్కుతుంది. లేనియెడల ఇరానీ ట్రోఫీ కోసం అతడిని ప్రధాన జట్టు నుంచి రిలీజ్ చేసేందుకు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సిద్దంగా ఉన్నాడు.
కాన్పూర్ నుంచి లక్నోకు ప్రయాణానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. తుది జట్టును ఎంపిక మ్యాచ్‌కు ముందే ఎంపిక చేస్తారు. కాబట్టి కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment