'థౌజండ్ వాలా'కు ప్రోత్సాహం | MCA announces scholarship to Pranav Dhanawade | Sakshi
Sakshi News home page

'థౌజండ్ వాలా'కు ప్రోత్సాహం

Published Wed, Jan 6 2016 5:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

'థౌజండ్ వాలా'కు ప్రోత్సాహం

'థౌజండ్ వాలా'కు ప్రోత్సాహం

ముంబై: 'థౌజండ్ వాలా' ప్రణవ్ ధనావ్‌డేను ప్రోత్సహించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ముందుకు వచ్చింది. అతడికి నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్టు ఎంసీఏ ప్రకటించింది. 2016 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు స్కాలర్‌ షిప్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా అతడి ఆట, విద్యకు సంబంధించిన అంశాలను ఎంసీఏ పర్యవేక్షించనుంది. కాగా, ముంబై అండర్-19 జట్టులో స్థానమే తన తదుపరి లక్ష్యమని ప్రణవ్ ధనావ్‌డే తెలిపాడు.

15 ఏళ్ల ప్రణవ్ ధనావ్‌డే ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో 129 ఫోర్లు, 59 సిక్సర్లు 1009 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో అతడీ ఘనత సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement