Mumbai Ranji team
-
పృథ్వీ షాపై వేటు
ముంబై: భారత జట్టు మాజీ సభ్యుడు, టాపార్డర్ బ్యాటర్ పృథ్వీ షాను ముంబై రంజీ జట్టు నుంచి తప్పించారు. ఫామ్‌లో లేకపోవడం, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా అతనిపై వేటు పడింది. టీమిండియా ఓపెనర్‌గా అంతర్జాతీయ కెరీర్లో ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడిన 24 ఏళ్ల పృథ్వీ ఇటీవలి కాలంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం కూడా ముంబై సెలక్టర్ల ఆగ్రహానికి కారణమైంది. తరచూ జట్టు ట్రెయినింగ్ సెషన్లకు డుమ్మా కొట్టడంతో పాటు బరువు పెరిగి మ్యాచ్ ఫిట్నెస్ను కోల్పోవడంతో అతనికి ఉద్వాసన పలికారు. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 7, 12, 1, 39 నాటౌట్ స్కోర్లు చేశాడు. ఫిట్నెస్ సమస్యలతో ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా స్పందించడం లేదు. దీంతో అతన్ని తప్పించి 29 ఏళ్ల ఎడంచేతి ఓపెనింగ్ బ్యాటర్ అఖిల్ హేర్వడ్కర్ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. అతను 41 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 36.51 సగటు నమోదు చేశాడు. ఏడు సెంచరీలు, పది అర్ధసెంచరీలు బాదాడు. ముంబై తదుపరి మ్యాచ్‌ను త్రిపురతో ఆడనుంది. అగర్తలాలో ఈ నెల 26 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత టి20 కెపె్టన్, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. -
ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి
2023-24 దేశీయ సీజన్‌కు గాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఓంకార్ సాల్విని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. ఓంకార్ సాల్వి ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఓంకార్ ముంబై పురుషుల జట్టుతో చేరనున్నాడు. కాగా గతంలో ముంబై బౌలింగ్ కోచ్‌గా కూడా ఓంకార్ సాల్వి పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ అమోల్ ముజుందార్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ కోచ్‌గా ఆజట్టు మాజీ ఆటగాడు వినిత్ ఇందుల్కర్ నియమితులు కాగా, మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఓంకార్ గురవ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించనున్నాడు. ముంబై తరపున 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఓంకార్ గురవ్.. 434 పరుగులు చేశాడు. ఓంకార్ కంటే వినిత్ ఇందుల్కర్కు ఎక్కువ దేశీవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఇందుల్కర్ ముంబై తరపున 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 32 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: WTC FINAL 2023: కిషన్ కంటే అతడు చాలా బెటర్.. ఎందుకు సెలక్ట్ చేశారో అర్ధం కావడం లేదు! -
టీమిండియా మాజీ క్రికెటర్ మృతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ బుధవారం మృతి చెందారు. ముంబైకి చెందిన 78 ఏళ్ల సుధీర్ నాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి స్టార్స్ జట్టుకు అందుబాటులో లేని సమయంలో సుధీర్ తన నాయకత్వంలో ముంబై జట్టును 1971 సీజన్లో రంజీ చాంపియన్ గా నిలబెట్టారు. 1974–1975లలో ఆయన భారత్ తరఫున మూడు టెస్టులు ఆడి 141 పరుగులు, రెండు వన్డేలు ఆడి 38 పరుగులు చేశారు. -
Ranji Trophy-2022: ఆంధ్రాపై ముంబై ఘన విజయం..
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు ఘనవిజయంతో శుభారంభం చేసింది. ఆంధ్ర జట్టుతో ఇక్కడ జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 290/6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన ముంబై మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 331 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ అర్మాన్ జాఫర్ (116; 16 ఫోర్లు, 1 సిక్స్) అదే స్కోరు వద్ద అవుటవ్వగా... తనుష్ కొటియన్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ నాలుగు వికెట్లు తీయగా... శశికాంత్, లలిత్ మోహన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. 93 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 47 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఉప్పర గిరినాథ్ (27; 6 ఫోర్లు), రికీ భుయ్ (16; 2 ఫోర్లు), కెప్టెన్ విహారి (14), నితీశ్ రెడ్డి (15; 3 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ముంబై బౌలర్లలో తుషార్ (3/34), తనుష్ (2/18), సిద్ధార్థ్ (2/26) రాణించారు. 39 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై 6.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. చదవండి: PKL 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పింక్ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ -
టెస్టు క్రికెట్‌పై సూర్య కుమార్ కన్ను.. అందుకోసం మాస్టర్ ప్లాన్!
పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టెస్టు క్రికెట్‌పై కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ దేశీవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో అద్భుతంగా రాణించి భారత టెస్టు క్రికెట్లోకి సూర ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సూర్య ముంబై తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబరు 13న వైజాగ్ వేదికగా ఆంధ్రాతో జరిగే తొలి మ్యాచ్‌కు సూర్య దూరంగా ఉండనున్నాడు. కాగా డిసెంబర్ 20 నుంచి హైదరాబాద్‌తో జరిగే ముంబై రెండో మ్యాచ్‌కు సూర్య జట్టుతో చేరనున్నట్లు మహారాష్ట్ర క్రికెట్ ఆసోషియన్ సెక్రటరీ అజింక్యా నాయక్ తెలిపారు. "సూర్య గత కొన్ని రోజులుగా టీమిండియా తరపున వైట్‌బాల్ క్రికెట్లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు బాగా అలిసిపోయాడు. అందుకే చిన్న విరామం తీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రాతో జరిగే మా తొలి మ్యాచ్‌కు సూర్య దూరం కానున్నాడు. మళ్లీ అతడు ఫ్రెష్ మైండ్‌తో జట్టులో చేరుతాడు. డిసెంబర్ 20 నుంచి హైదరాబాద్‌తో జరిగే మా రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ భాగం అవుతాడు" అని అజింక్యా నాయక్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 77 మ్యాచ్‌లు ఆడిన సూర్య 5326 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్ సెంచరీతో పాటు 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: IPL Mini Auction: అతడి కోసం లక్నో పోటీ పడుతుంది! సీఎస్కే కూడా: అశ్విన్ -
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైకు గుడ్‌బై చెప్పనున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్‌కు అంతగా అవకాశాలు లభించడం లేదు. దీంతో వచ్చే దేశేవాళీ సీజన్ నుంచి గోవా తరపున ఆడేందుకు అర్జున్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా అర్జున్ ఇప్పటి వరకు ముంబై తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ--2021లో భాగంగా హర్యానా, పుదుచ్చేరి మ్యాచ్‌ల్లో అర్జున్ ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో గత రెండు సీజన్ల నుంచి ముంబై జట్టులో అర్జున్ సభ్యునిగా ఉన్నప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. కాగా ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో చోటుదక్కక పోవడంతోనే అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై టెండూల్కర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్పందిస్తూ.. "అర్జున్ తన కెరీర్ మెరుగుపరుచుకోవాలంటే ఎక్కువ సమయం గ్రౌండ్లో గడపడం చాలా ముఖ్యం. అర్జున్ గోవా జట్టు తరపున ఆడితే అతడికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ మార్పు అతడి క్రికెట్ కెరీర్లో కొత్త దశ" అని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇదే విషయంపై గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లోట్లికర్ మాట్లడుతూ.. "మేము ప్రస్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల కోసం ఎదురు చూస్తున్నాము. అర్జున్ టెండూల్కర్ గోవా జట్టులో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీ-సీజన్ ట్రయల్-మ్యాచ్‌లు ముందు మేము నిర్వహిస్తాం. అతడి ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేస్తారు" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: WI vs NZ: హెట్‌మైర్ అద్భుత విన్యాసం.. క్యాచ్ ఆఫ్‌ది సీజన్! -
సచిన్ తనయుడికి మరో అవమానం.. ముంబై రంజీ జట్టులోనూ నో ప్లేస్
ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మరో అవమానం జరిగింది. రంజీ నాకౌట్స్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో అతని స్థానం గల్లంతైంది. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేతో పాటు ముంబై జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్ను.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌కు పక్కకు పెట్టారు. ముంబై తరఫున టీ20ల్లో మాత్రమే అరంగేట్రం చేసిన అర్జున్.. ఈ సీజన్ నాకౌట్ మ్యాచ్ ద్వారా ఎలాగైనా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అయితే సెలెక్టర్లు అతని ఆశలను అడియాశలు చేశారు. ఐపీఎల్లో 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా అవమానించగా.. తాజాగా ముంబై రంజీ టీమ్ కూడా అదే తరహాలో అర్జున్‌పై శీతకన్ను వేసింది. కాగా, జూన్‌లో జరిగే రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ కోసం ఇవాళ ముంబై జట్టును ప్రకటించారు. బెంగుళూరు వేదికగా ఉత్తరాఖండ్‌తో తలపడే ముంబై జట్టుకు పృథ్వీ షా నాయకత్వం వహించనున్నాడు. గాయం కారణంగా సీనియర్ ప్లేయర్ రహానే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్ (వసీం జాఫర్ మేనల్లుడు), ధావల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై రంజీ జట్టు: పృథ్వీ షా(కెప్టెన్), యశస్వి జైస్వాల్, భూపేన్ లాల్వానీ, అర్మాన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్, ఆకర్షిత్ గోమల్, ఆదిత్య తారే, హార్ధిక్ తమోర్, అమాన్ ఖాన్, సాయిరాజ్ పాటిల్, షమ్స్ ములానీ, దృమిల్ మట్కర్, తనుష్ కోటియాన్, శశాంక్ అతార్డే, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ, రొస్తాన్ డయాస్, సిద్ధార్థ్ రౌత్, ముషీర్ ఖాన్. చదవండి: ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే
చాలా కాలంగా ఫాం లేమితో సతమతమవుటూ జట్టులో స్థానాన్నే ప్రశ్నర్ధకంగా మార్చుకున్న టీమిండియా మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎట్టకేలకు తిరిగి ఫాంను దొరకబుచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ (250 బంతుల్లో 108; 14 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అదరగొట్టి, వరుస వైఫల్యాలకు అడ్డుకట్ట వేశాడు. పృథ్వీ షా సారథ్యంలో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన రహానే.. నాలుగో స్థానంలో బరిలోకి దిగి అజేయమైన సెంచరీతో మెప్పించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పృథ్వీ షా (1), ఆకర్షిత్ గోమెల్ (8) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రహానే ఆరంభంలో ఆచి తూచి ఆడినప్పటికీ, ఆతర్వాత గేర్ మార్చి పరుగులు రాబట్టాడు. మరో ఎండ్ లో సర్ఫరాజ్ ఖాన్ (219 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం సూపర్ సెంచరీతో రెచ్చిపోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఇదిలా ఉంటే, రహానే తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలంటే రంజీ ట్రోఫీలో సత్తా చాటాల్సి ఉంటుందని బీసీసీఐ బాస్ గంగూలీ ఇది వరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానే ఇవాళ సాధించిన శతకంతో త్వరలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్ లో చోటు సంపాదించడం ఖాయంగా తెలుస్తోంది. మరోవైపు రహానే ఫాంలోకి రావడంతో ఇటీవల అతన్ని ఐపీఎల్ వేలంలో దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సైతం ఆనందం వ్యక్తం చేస్తుంది. వేలంలో కేకేఆర్ రహానేను కోటి రూపాయల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..! -
పృథ్వీ షా కెప్టెన్సీలో రహానే..
Rahane To Play Under Prithvi Shaw In Ranji Trophy: త్వరలో ప్రారంభంకానున్న రంజీ సీజన్ 2022లో టీమిండియా మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. తన కంటే చాలా జూనియర్ అయిన పృథ్వీ షా సారధ్యంలో ముంబై రంజీ జట్టుకు ఆడేందుకు రెడీ అయ్యాడు. సలీల్ అంకోలా నేతృత్వంలోని ముంబై సెలెక్షన్ కమిటీ ఈ విషయాన్ని దృవీకరించింది. రహానే చేరకతో ముంబై టీం మరింత బలంగా మారనుందని ముంబై కోచ్ అమోల్ ముజుందార్ పేర్కొన్నాడు. కాగా, ఇటీవలి కాలంలో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రహానే రంజీల్లో ఆడి ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ బాస్ గంగూలీ కూడా ఇటీవల స్పష్టం చేశాడు. టీమిండియా తరఫున 82 టెస్ట్‌లు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానే జట్టు సాధించిన ఎన్నో మరపురాని విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు ఖరారు..! -
ముంబై జట్టు కెప్టెన్‌గా పృథ్వీ షా!
ముంబై: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే 20 మంది సభ్యుల ముంబై జట్టును బుధవారం ప్రకటించారు. పృథ్వీ షా ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్, ఆదిత్య తారే, శివమ్ దూబేవంటి ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉంది. దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌కు కూడా ముంబై జట్టులో చోటు లభించింది. గత ఏడాది ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున రెండు టి20 మ్యాచ్ లు ఆడిన 22 ఏళ్ల అర్జున్ను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్ తీసుకున్నా...మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జనవరి 13నుంచి జరిగే తమ తొలి పోరులో మహారాష్ట్రతో ముంబై తలపడుతుంది. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్.. -
టెయిలెండర్లు టపాటపా..
ఒంగోలు: ఆంధ్రా, ముంబై జట్ల మధ్య రంజీ మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం ముంబై జట్టు మెరుపులు మెరిపించింది. తొలి రెండు రోజులు డిఫెన్స్‌కే పరిమితమైన ముంబై జట్టు మూడో రోజు బ్యాట్ ఝులిపించి సత్తా చాటింది. సెలవు దినం కావడంతో ఆదివారం స్థానిక శర్మా కాలేజ్ గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. టెయిలెండర్లు టపాటపా.. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆంధ్రా జట్టుకు ఆరంభం కలిసి వచ్చింది. క్రీజులో నిలదొక్కుకున్న కెప్టెన్ హనుమవిహారి, రికీభుయి ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచే యత్నం చేశారు. 57.2వ ఓవర్లో భారీషాట్ కొట్టబోయి కెప్టెన్ విహారి 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 62వ ఓవర్లో రికీభుయి పెవిలియన్‌కు చేరడంతో జట్టును ఆదుకునే బాధ్యత మిడిలార్డర్‌పై పడింది. బి.సుమంత్ ఒక వైపు పరుగుల వేగాన్ని పెంచే ప్రయత్నంలో ఉండగా సెకండ్ ఎండ్‌లో వికెట్లు మాత్రం టపటపా పడిపోవడం ప్రారంభించాయి. సుమంత్ 28, కేవీ శశికాంత్ 12 పరుగులు సాధించడం మినహా మిగిలిన బ్యాట్స్మెన్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ముంబై జట్టు కేవలం 13 పరుగులిచ్చి ఏడు ఓవర్లలో చివరి అయిదు వికెట్లను నేలకూల్చింది. దీంతో ఆంధ్రా జట్టు 77 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఏకంగా 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కదం తొక్కిన ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు కదం తొక్కింది. టెస్టు మ్యాచ్ అయినప్పటికీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసిన పృథ్వీ షా 21 పరుగుల వద్ద రనౌటయ్యాడు. జేజీ బిస్తా 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 33, సిద్దేష్‌లాడ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్(75), ముంబై కెప్టెన్ ఎ.పి తారేలు(1) క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుంటే ముంబై జట్టు 307 పరుగుల ఆధిక్యాన్ని కలిగి ఉంది. మ్యాచ్‌లో విజయం సాధించాలని ముంబై టీం ఉవిళ్లూరుతోంది. స్కోర్ వివరాలు: ముంబై తొలి ఇన్నింగ్స్: 132 ఓవర్లలో 332కు ఆలౌట్ ఆంధ్రా తొలి ఇన్నింగ్స్: డి.బి ప్రశాంత్‌కుమార్–11, కేఎస్ భరత్–11, జి.హనుమవిహారి–70, రికీభుయి–69, బి.సుమంత్–28, అశ్విన్ హెబ్బర్–4, కెవి శశికాంత్–12 నాటౌట్, అయ్యప్పభండారు–0, భార్గవ్ భట్–1, పి.విజయ్‌కుమార్–0 ; ఎక్స్‌ట్రాలు : నోబాల్–1. మొత్తం స్కోరు: 77 ఓవర్లలో 215 పరుగులు వికెట్ల పతనం: 1–19, 2–25, 3–157, 4–172, 5–192, 6–202, 7–207, 8–209, 9–214, 10–215 ముంబై బౌలింగ్: శార్దూల్: 23–2–55–5; మంజ్రేకర్: 9–1–41–0; అభిషేక్ నాయర్: 16–2–43–1; దావల్ కులకర్ణి: 19–6–44–3; కార్ష కొఠారి: 9–0–31–0; జేజీ బిస్తా: 1–0–1–0 ముంబై సెకండ్ ఇన్నింగ్స్: పృథ్వీ షా–21(రనౌట్), జేజీ బిస్తా–36, శ్రేయాస్ అయ్యర్(75 – నాటౌట్), సూర్యకుమార్ యాదవ్–33, సిద్దేష్‌లాడ్–22, ఏపీ తారే(1 – నాటౌట్). మొత్తం స్కోరు : 190/4 వికెట్ల పతనం: 1–39, 2–73, 3–135, 4–190 ఆంధ్రా బౌలింగ్: అయ్యప్పభండారు: 12–0–72–1; పి.విజయ్‌కుమార్: 13–1–46–0; కేవీ శశికాంత్: 6–0–33–1; భార్గవ్భట్:10–0–37–1. -
ముంబై రంజీ జట్టు కోచ్‌గా సమీర్ దిఘే
ముంబై: భారత మాజీ వికెట్ కీపర్ సమీర్ దిఘే, ముంబై రంజీ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. 2017–18 సీజన్లో రంజీ జట్టుకు సమీర్ కోచ్‌గా వ్యవహరిస్తారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ స్థానంలో సమీర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ పదవికి మరో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే పోటీపడగా అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఎంసీఏ క్రికెట్ అభివృద్ధి కమిటీ సమీర్‌ను ఎంపికచేసింది. 48 ఏళ్ల సమీర్ 2000–2001 మధ్య కాలంలో భారత్‌కు 6 టెస్టులు, 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు.