
ముంబై: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో పాల్గొనే 20 మంది సభ్యుల ముంబై జట్టును బుధవారం ప్రకటించారు. పృథ్వీ షా ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్, ఆదిత్య తారే, శివమ్ దూబేవంటి ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉంది.
దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌కు కూడా ముంబై జట్టులో చోటు లభించింది. గత ఏడాది ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై తరఫున రెండు టి20 మ్యాచ్ లు ఆడిన 22 ఏళ్ల అర్జున్‌ను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ తీసుకున్నా...మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జనవరి 13నుంచి జరిగే తమ తొలి పోరులో మహారాష్ట్రతో ముంబై తలపడుతుంది.
చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment