ఒంగోలు: ఆంధ్రా, ముంబై జట్ల మధ్య రంజీ మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం ముంబై జట్టు మెరుపులు మెరిపించింది. తొలి రెండు రోజులు డిఫెన్స్‌కే పరిమితమైన ముంబై జట్టు మూడో రోజు బ్యాట్ ఝులిపించి సత్తా చాటింది. సెలవు దినం కావడంతో ఆదివారం స్థానిక శర్మా కాలేజ్ గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.
టెయిలెండర్లు టపాటపా..
రెండు వికెట్ల నష్టానికి 74 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆంధ్రా జట్టుకు ఆరంభం కలిసి వచ్చింది. క్రీజులో నిలదొక్కుకున్న కెప్టెన్ హనుమవిహారి, రికీభుయి ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచే యత్నం చేశారు. 57.2వ ఓవర్‌లో భారీషాట్ కొట్టబోయి కెప్టెన్ విహారి 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 62వ ఓవర్‌లో రికీభుయి పెవిలియన్‌కు చేరడంతో జట్టును ఆదుకునే బాధ్యత మిడిలార్డర్‌పై పడింది. బి.సుమంత్ ఒక వైపు పరుగుల వేగాన్ని పెంచే ప్రయత్నంలో ఉండగా సెకండ్ ఎండ్‌లో వికెట్లు మాత్రం టపటపా పడిపోవడం ప్రారంభించాయి. సుమంత్ 28, కేవీ శశికాంత్ 12 పరుగులు సాధించడం మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ముంబై జట్టు కేవలం 13 పరుగులిచ్చి ఏడు ఓవర్లలో చివరి అయిదు వికెట్లను నేలకూల్చింది. దీంతో ఆంధ్రా జట్టు 77 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఏకంగా 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
కదం తొక్కిన ముంబై జట్టు
తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు కదం తొక్కింది. టెస్టు మ్యాచ్ అయినప్పటికీ వన్‌డే తరహాలో బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసిన పృథ్వీ షా 21 పరుగుల వద్ద రనౌటయ్యాడు. జేజీ బిస్తా 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 33, సిద్దేష్‌లాడ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్(75), ముంబై కెప్టెన్ ఎ.పి తారేలు(1) క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుంటే ముంబై జట్టు 307 పరుగుల ఆధిక్యాన్ని కలిగి ఉంది. మ్యాచ్‌లో విజయం సాధించాలని ముంబై టీం ఉవిళ్లూరుతోంది.
స్కోర్ వివరాలు:
ముంబై తొలి ఇన్నింగ్స్: 132 ఓవర్లలో 332కు ఆలౌట్
ఆంధ్రా తొలి ఇన్నింగ్స్: డి.బి ప్రశాంత్‌కుమార్–11, కేఎస్ భరత్–11, జి.హనుమవిహారి–70, రికీభుయి–69, బి.సుమంత్–28, అశ్విన్ హెబ్బర్–4, కెవి శశికాంత్–12 నాటౌట్, అయ్యప్పభండారు–0, భార్గవ్ భట్–1, పి.విజయ్‌కుమార్–0 ; ఎక్స్‌ట్రాలు : నోబాల్–1. మొత్తం స్కోరు: 77 ఓవర్లలో 215 పరుగులు
వికెట్ల పతనం: 1–19, 2–25, 3–157, 4–172, 5–192, 6–202, 7–207, 8–209, 9–214, 10–215
ముంబై బౌలింగ్: శార్దూల్: 23–2–55–5; మంజ్రేకర్: 9–1–41–0; అభిషేక్ నాయర్: 16–2–43–1; దావల్ కులకర్ణి: 19–6–44–3; కార్‌ష కొఠారి: 9–0–31–0; జేజీ బిస్తా: 1–0–1–0
ముంబై సెకండ్ ఇన్నింగ్స్: పృథ్వీ షా–21(రనౌట్), జేజీ బిస్తా–36, శ్రేయాస్ అయ్యర్(75 – నాటౌట్), సూర్యకుమార్ యాదవ్–33, సిద్దేష్‌లాడ్–22, ఏపీ తారే(1 – నాటౌట్). మొత్తం స్కోరు : 190/4
వికెట్ల పతనం: 1–39, 2–73, 3–135, 4–190
ఆంధ్రా బౌలింగ్: అయ్యప్పభండారు: 12–0–72–1; పి.విజయ్‌కుమార్: 13–1–46–0; కేవీ శశికాంత్: 6–0–33–1; భార్గవ్‌భట్:10–0–37–1.
Comments
Please login to add a commentAdd a comment