![Rahane To Play Under Prithvi Shaw In Ranji Trophy 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/7/Untitled-8.jpg.webp?itok=JjYLDC8N)
Rahane To Play Under Prithvi Shaw In Ranji Trophy: త్వరలో ప్రారంభంకానున్న రంజీ సీజన్ 2022లో టీమిండియా మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. తన కంటే చాలా జూనియర్ అయిన పృథ్వీ షా సారధ్యంలో ముంబై రంజీ జట్టుకు ఆడేందుకు రెడీ అయ్యాడు. సలీల్ అంకోలా నేతృత్వంలోని ముంబై సెలెక్షన్ కమిటీ ఈ విషయాన్ని దృవీకరించింది. రహానే చేరకతో ముంబై టీం మరింత బలంగా మారనుందని ముంబై కోచ్ అమోల్ ముజుందార్ పేర్కొన్నాడు.
కాగా, ఇటీవలి కాలంలో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రహానే రంజీల్లో ఆడి ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ బాస్ గంగూలీ కూడా ఇటీవల స్పష్టం చేశాడు. టీమిండియా తరఫున 82 టెస్ట్‌లు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానే జట్టు సాధించిన ఎన్నో మరపురాని విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.
చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు ఖరారు..!
Comments
Please login to add a commentAdd a comment