ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ గా చంద్రశేఖర్ | hca chandra sekhar as best curator of ipl 9 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ గా చంద్రశేఖర్

Published Tue, May 31 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ గా చంద్రశేఖర్

ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్ గా చంద్రశేఖర్

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం  (హెచ్‌సీఏ) క్యూరేటర్ వై.ఎల్.చంద్రశేఖర్ రావు వరుసగా మూడో ఏడాది ఐపీఎల్‌లో పురస్కారాన్ని దక్కించుకున్నారు.  మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఐపీఎల్-9 సీజన్‌లో బెస్ట్ క్యూరేటర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయనకు రూ. 25 లక్షల పారితోషికంతోపాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. 2014లో బెస్ట్ క్యూరేటర్‌గా రూ. 12 లక్షల పారితోషికం అందుకున్న చంద్రశేఖర్... గతేడాది బెస్ట్ క్యూరేటర్‌గా రెండోసారి ఐపీఎల్ నిర్వాహకుల నుంచి రూ. 9 లక్షలను బహుమతిగా పొందారు. 

 

ఈ ఏడాది నెల రోజులుగా క్రికెట్ అభిమానులను హోరెత్తించిన ఐపీఎల్ సీజన్ ముగియడంతో పిచ్‌ల తయారీలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన చంద్రశేఖర్‌రావుకు నిర్వాహకులు మూడోసారి బెస్ట్ క్యూరేటర్‌గా అవార్డును ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో విధులు నిర్వహించే చంద్రశేఖర్‌కు ఈ ఏడాది రూ. 25 లక్షల నజరానా లభించింది. చంద్ర శేఖర్‌రావు బెస్ట్ క్యూరేటర్‌గా అవార్డును పొందడం పట్ల సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు రాజు, మహేష్, మల్లికార్జున్‌తో పాటు ఎస్‌పీఎల్ బృందం హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement