ఢిల్లీ: ‘వారికి అత్యంత ఖరీదైన వైద్యం(high-quality healthcare) చేయించుకునే స్థోమత లేదు. నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు వారి స్థాయి సరిపోవడం లేదు. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని వందలాది మంది రోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఫుట్‌పాత్‌లే వారికి దిక్కు అవుతున్నాయి.’ అని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖా మాత్యులు జేపీ నడ్డాకు, ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాశారు రాహుల్ గాంధీ.
‘ ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) దగర్గ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ బయట చూస్తే వందలాది మంది రోగులు ఫుట్‌పాత్‌లపైనే ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచన చేస్తే కోట్ల మంది ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి దేశంలోలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ వంటి మహా నగరంలో ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రికి అధిక భారంగా మారింది.
దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి. అందుకే కేంద్ర హెల్త్ మినిస్టర్.జేపీ నడ్డాకు విన్నవించుకుంటున్నా. హెల్త్ సిస్టమ్‌లోని లోపాల్ని గుర్తించండి, మొదటిగా దేశంలోన ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిల్లో పరిస్థితిని చక్కదిద్దండి. ఎంత తొందరగా ఆ సమస్యను పరిష్కారిస్తానే ఇక్కడ ముఖ్యం. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలి. ఇది అన్నిస్థాయిల్లోనూ జరగాల్సిన అవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయండి’ అని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం
కాంగ్రెస్ అగ్రనేత (రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్‌లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment