న్యూఢిల్లీ: అదానీ అంశంపై విపక్షాలు సోమవారం పార్లమెంటు మకరద్వారం వద్ద వినూత్నంగా నిరసన తెలిపాయి. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు పారిశ్రామికవేత్త గౌతం అదానీలా మాణిక్కం ఠాగూర్, ప్రధాన నరేంద్ర మోదీలా సప్తగిరి శంకర్ మాస్కులు ధరించారు. వారితో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్లమెంటును ఎందుకు నడవనీకయకుండా చేస్తున్నారని అదానీ (ఠాగూర్)ను ప్రశ్నించారు.
‘‘ఇది అమిత్ భాయ్ (హోం మంత్రి అమిత్ షా)ను అడగాలి. కానీ ఆయన కని్పంచడం లేదుగా’’ అంటూ ఆయన బదులిచ్చారు. మీ మధ్య సంబంధమేమిటని రాహుల్ మరో ప్రశ్నించగా, ‘‘మేమిద్దరం ఒకటే. ఎయిర్‌పోర్టయినా, మరొకటయినా నేనేది అడిగినా చేస్తారాయన’’ అంటూ ఠాగూర్ మళ్లీ బదులిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ రెట్టించగా, ‘‘ఆయన ఈ మధ్య చాలా టెన్షన్‌గా ఉంటున్నారెందుకో’’ అని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment