రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్‌.. బీజేపీ ఆరోపణలు | Rahul Gandhi disrespected President alleges BJP, shares videos | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్‌.. బీజేపీ ఆరోపణలు

Published Tue, Nov 26 2024 4:40 PM | Last Updated on Tue, Nov 26 2024 5:25 PM

Rahul Gandhi disrespected President alleges BJP, shares videos

న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్‌ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్‌ మీడియాలో వరుస వీడియోలను షేర్‌ చేసింది.

పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. 

అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్‌ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారు

‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్‌ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్‌, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.

 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్‌ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్‌ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్‌ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement