పరువు నష్టం కేసు.. రాహుల్‌ గాంధీకి బెయిల్‌ | Savarkar Defamation Case: Pune Court Grants Bail To Rahul Gandhi | Sakshi
Sakshi News home page

పరువు నష్టం కేసు.. రాహుల్‌ గాంధీకి బెయిల్‌

Published Fri, Jan 10 2025 8:08 PM | Last Updated on Fri, Jan 10 2025 8:11 PM

Savarkar Defamation Case: Pune Court Grants Bail To Rahul Gandhi

పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. ఈ కేసులో పుణె కోర్టు(Pune Court) ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.  2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వినాయక్ దామోదర్ సావర్కర్‌(Vinayak Damodar Savarkar)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలపై రాహుల్‌పై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి విచారణకు రాహుల్‌ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుకాగా, ఆయనకు రూ.25వేల పూచీకత్తు బాండ్‌పై ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కాగా, రాహుల్‌ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోహన్‌ కోర్టు ముందు హాజరయ్యారు. మరోవైపు, ఈ కేసులో రాహుల్‌ హాజరు విషయంలో న్యాయస్థానం శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరఫు న్యాయవాది మిలింద్‌ పవార్‌ వెల్లడించారు. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కోల్డ్‌ కాఫీ చేసిన రాహుల్‌ గాంధీ, వైరల్‌ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement