![Pune Court Summons Rahul Gandhi In Defamation Case Over Remarks On Savarkar](/styles/webp/s3/article_images/2024/10/5/Pune-Court-Summons-Rahul-Ga.jpg.webp?itok=bEyDwws-)
పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ వినాయక్ దామోదర్ సావర్కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న హాజరుకావాలని కోరుతూ రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. సత్య సావర్కర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 500 ప్రకారం రాహుల్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్
Comments
Please login to add a commentAdd a comment