savarkar
-
సావర్కర్‌ను ప్రశంసించిన ఇందిరా గాంధీ: బీజేపీ
న్యూఢిల్లీ: సావర్కర్‌పై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సావర్కర్‌ను ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారని పేర్కొంది. సావర్కర్ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియాలంటే అండమాన్‌లోని సెల్యూలార్ జైలును రాహుల్ సందర్శించాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఎన్డీఏ భాగస్వామి శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా లోక్‌సభలో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రాహుల్ నాన్నమ్మ ఇందిర కూడా సావర్కర్‌ను భారతదేశపు గొప్ప పుత్రుడంటూ పొగిడారు. సావర్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు’’ అన్నారు. సావర్కర్‌ను కొనియాడుతూ పండిట్ బాఖ్లేకు ఇందిర రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. సావర్కర్‌ను ప్రశంసించినందుకు ఇందిర కూడా కాంగ్రెస్ లెక్క ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకి అవుతారా అని ప్రశ్నించారు. సావర్కర్‌పై విమర్శలు రాహుల్‌కు అలవాటుగా మారాయని మండిపడ్డారు. -
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ వినాయక్ దామోదర్ సావర్కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న హాజరుకావాలని కోరుతూ రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. సత్య సావర్కర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 500 ప్రకారం రాహుల్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.ఇదీ చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
ఓటీటీలోకి ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మరో డిఫరెంట్ మూవీ రాబోతుంది. 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' టైటిల్‌తో తీసిన ఈ బయోపిక్.. మార్చి 22న థియేటర్లలోకి వచ్చింది. అయితే బయోపిక్స్ ట్రెండ్ పాతబడటం వల్లో ఏమో గానీ ఈ సినిమాకు అనుకున్నంతగా వసూళ్లు రాలేదు. టైటిల్ రోల్లో రణ్‌దీప్ హుడా అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ సావర్కర్ జయంతి సందర్భంగా ఓటీటీలోకి రాబోతుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)రణ్ దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' సినిమాని ఇతడే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు సావర్కర్ జీవితంలో ఏం జరిగింది? ఇంతకు ఆయన ఎవరు అనే విషయాల్ని ఇందులో చూపించారు. రూ.20 కోట్ల బడ్జెట్ పెడితే రూ.30 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.సావర్కర్ గురించి ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవడం వల్లే ఈ మూవీ సగటు ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇకపోతే మే 28న సావర్కర్.. 141వ జయంతి సందర్భంగా మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారు. జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్స్ చూసే ఆసక్తి ఉంటే మీరు దీన్ని ట్రై చేయండి.(ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!)Ankhand Bharat tha unka sapna, Hindutva thi jiski buniyaad. Watch the untold story of #VeerSavarkar - ‘India’s Most Dangerous Revolutionary Ever’, premiering on his 141st birthday, 28th May only on #ZEE5.#ReliveSavarkarOnZEE5 pic.twitter.com/m06edcUwft— ZEE5 (@ZEE5India) May 20, 2024 -
New Parliament Opening: రాజకీయ రగడ
కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. అదే తేదీన సావర్కర్ జయంతి కావడం, పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఇరుపక్షాలు నడుమ సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. వీడీ సావర్కర్ జయంతి రోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇది స్వాతంత్ర్య సమరయోధుల్ని పూర్తిగా అవమానించడమేనని విమర్శిస్తోంది. లేని చోట వివాదాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. రాష్ట్రపతి దేశాధినేత. కానీ, ప్రధానిప్రభుత్వాధినేత.. ప్రభుత్వం తరపున పార్లమెంటుకు నాయకత్వం వహిస్తారు. ఆ నాయకత్వంలోనే విధానాలు చట్టాల రూపంలో అమలు చేయబడతాయి. రాష్ట్రపతి ఉభయ సభలలో సభ్యులు కాదు. కానీ, ప్రధాని మాత్రం సభ్యులే కదా అని కేంద్ర హోం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. Congress has a habit of raking controversies where none exist. While President is the Head of State, PM is the Head of Govt & leads the Parliament on behalf of the Govt, whose Policies are effected in form of Laws. The President is not a Member of either House, whereas PM is. pic.twitter.com/73Ns7NP8EK — Hardeep Singh Puri (@HardeepSPuri) May 22, 2023 కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతిని, మాజీ రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. ప్రభుత్వం పదే పదే ఔచిత్యాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారాయన. గతంలో పార్లమెంట్ శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదు.. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు అని ట్వీట్ ద్వారా ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం, ఆఖరికి దేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆమె. దేశానికి ప్రథమ పౌరురాలు. It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons. While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony… 1/4 — Mallikarjun Kharge (@kharge) May 22, 2023 ఆయన (ప్రధాని మోదీ) కార్యనిర్వాహక మండలికి అధిపతి అంతేగానీ చట్టసభకు కాదు. ఆ చట్ట సభలోనూ మాకు అధికారాల విభజన ఉంది. గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్ లేదంటే రాజ్యసభ చైర్లు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించొచ్చు. ఇది ప్రజల సొమ్ముతో కట్టింది. ప్రధాని ఏదో తన స్నేహితులు వాళ్ల ప్రైవేట్ నిధుల నుంచి స్పాన్సర్ చేసినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. Why should PM inaugurate Parliament? He is head of the executive, not legislature. We have separation of powers & Hon’ble @loksabhaspeaker & RS Chair could have inaugurated. It’s made with public money, why is PM behaving like his “friends” have sponsored it from their private… https://t.co/XmnGfYFh6u — Asaduddin Owaisi (@asadowaisi) May 19, 2023 మోదీగారి ఫొటోలకు ఫోజులు, సెల్ఫ్ ఇమేజ్ కోసం పాకులాట.. మర్యాదను, నిబంధనలను పక్కనపడేసిందని సీబీఐ నేత డీ రాజా విమర్శించారు. 26 నవంబర్ 2023- దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత రాజ్యాంగం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని.. కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఇది తగినది.. అయితే ఇది సావర్కర్ పుట్టినరోజు మే 28న జరుగుతుంది- ఇది ఎంతవరకు సముచితం?” అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ట్వీట్ చేశారు రాహుల్. नए संसद भवन का उद्घाटन राष्ट्रपति जी को ही करना चाहिए, प्रधानमंत्री को नहीं! — Rahul Gandhi (@RahulGandhi) May 21, 2023 కాంగ్రెస్ పనికిమాలిన పార్టీ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. వీర సావర్కర్.. ప్రతీ భారతీయుడికి గర్వకారణమైన వ్యక్తి. ఆయన కాలి దుమ్ముకు కూడా పనికి రాని వాళ్లు ఇవాళ విమర్శిస్తున్నారని ఘాటుగా మండిపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తే వస్తే నష్టం ఏంటి?. రాహుల్ గాంధీవి ఏడుపుగొట్టు రాజకీయాలు. ఏదైనా చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోబోతున్న సమయంలోనే.. ఏదో జరిగిపోతోందన్న రేంజ్లో తన గుండెలు బాదుకుంటారు. దేశం ప్రగతి వైపు వెళ్తుంటే.. అపశకునంలా రాహుల్ అడ్డుపడుతున్నారు అని గౌరవ్ భాటియా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ సైతం కొత్త పార్లమెంట్ భవనం ఆవశ్యకతను చెప్పారని, అలాంటి కలను నిజం చేస్తుంటే పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారాయన. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యతిరేకించేలా విపక్షాలన్నీ కలిసి మెగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నాయి. -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల వివాదం... తగ్గేదేలే! అంటున్న శివసేన
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్ అన్నారు. ఇది కేవలం సావర్కర్ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్‌తో కొనసాగుతాం, రాహుల్ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు. అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ తనని ఫోన్లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్ రౌత్ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉన్న సావర్కర్ బ్రిటీష్ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్ లాల్ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు కూడా బ్రిటీష్పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్ అవమానించినట్లేనని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఏదీఏమైనా రాహుల్ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంజయ్ రౌత్.. కటీఫ్ లేనట్టే?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా గతవారం వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇది స్ఫష్టమవుతోంది. సోమవారం ట్వీట్ చేసిన రౌత్.. రాహుల్ గాంధీ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు వివరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాహుల్ తనతో మాట్లాడారని రౌత్ చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలోని తన మిత్రులు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ప్రేమ, కరుణపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు. రౌత్ వ్యాఖ్యలను గమనిస్తే మహావికాస్ అఘాడీకి బీటలు పడే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. pic.twitter.com/FpaxllR7jk — Sanjay Raut (@rautsanjay61) November 21, 2022 చదవండి: మెగాస్టార్‌పై ప్రధాని ప్రశంసల వర్షం.. తెలుగులో ట్వీట్ చేసిన మోదీ -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్‌ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్‌రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు. సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్‌తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్‌ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది. చదవండి: 'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు -
కూటమికి బీటలు..
-
ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్
ముంబై: వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపాయి. అయితే గురువారం మరోమారు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యముంటే తాను చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆపాలని సవాల్ విసిరారు. ఈ పాదయాత్రలో భాగంగా అకోలా జిల్లాలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇది సావర్కర్ విజన్‌కు, మహాత్మగాంధీ విజన్‌కు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ విషయంపై చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. మా పార్టీలో నియంతలు లేరు. అని రాహుల్ పేర్కొన్నారు. అలాగే క్షమాభిక్ష కోసం బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖ ప్రతులను రాహుల్ ఆధారంగా చూపారు. ఆయన బ్రిటిషర్లకు భయపడే ప్రాణభిక్ష ప్రసాదించాలని లేఖ రాశారని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్‌పై రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. హిందుత్వ సిద్ధాంతాలను అమమానిస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడితే మహారాష్ట్ర ప్రజలు సహించరని హెచ్చరించారు. ఉద్ధమ్ థాక్రే కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పదించారు. వీర్ సావర్కర్ అంటే తమ పార్టీకి అపార గౌరవం అని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తాము ధ్రువీకరించబోమని చెప్పారు. మంగళవారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ల చిహ్నం అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండు మూడేళ్లు అండమాన్ జైళ్లో ఉండగానే.. క్షమాభిక్ష ప్రసాదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి దారితీశాయి. చదవండి: అక్రమ మైనింగ్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం -
మంచివాళ్లే... కానీ మీద ఉమ్మేస్తారు!
అండమాన్ ప్రజలు అబద్ధం చెప్పరు, మోసం చేయరు. మన వస్తువులను ఎక్కడైనా మర్చిపోయినా కూడా వాటిని తీసుకోరు, తమది కాని వస్తువు కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తారు. ఇక్కడ స్థానికులు అంటే బ్రిటిష్ కాలంలో అండమాన్ జైలు నిర్వహణ కోసం వచ్చిన ఉద్యోగుల కుటుంబాలే. అలా స్థిరపడిన వారిలో బెంగాలీలు, తమిళులు, తెలుగు వాళ్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటారు. పాన్ దో జార్వాన్ అనే ఆటవిక తెగల వాళ్లు వర్షం వస్తే బయటకు రారు. పర్యాటకుల కారణంగా వీళ్లకు పాన్ అలవాటైంది. వెళ్లిన వారందరినీ ‘పాన్ దో’ అని అడుగుతారు. హిందీలో వీళ్లకు వచ్చిన పదం ఇదొక్కటే. వీళ్లను ఫొటో తీస్తే ఒప్పుకోరు. వాహనంలో 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఫొటో తీసినా సరే అంతవేగంతోనూ పరుగెత్తుకు వచ్చేసి వాహనం ఎదురుగా నిలబడతారు. ఫొటో తీసిన వాళ్ల ముఖాన కోపంగా ఉమ్మేస్తారు. గోనె దుస్తులు సెల్యూలార్ జైల్ దగ్గరకు వెళ్తే మనకు తెలియ కుండానే భావోద్వేగాలకు లోనవుతాం. జాతీయోద్యమంలో పాల్గొన్న మన జాతీయ నాయకులను బంధించిన జైలు గదుల్లో తిరుగుతుంటే ఆ సంఘటనలన్నీ కళ్ల ముందు మెదలుతాయి. స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులు జైల్లో గోనెసంచులతో కుట్టిన దుస్తులను ధరించారని తెలిసినప్పుడు మనసు పిండేసినట్లవుతుంది. లేజర్ షో బ్యాక్‌గ్రౌండ్ ఆడియోలో జైలు అధికారి సావర్కర్ సెల్‌కు రావడం, గద్దించి ప్రశ్నించడం, సావర్కర్ వంటి వీరులు సమాధానం చెప్పడం ఉంటుంది. ఇక్కడి పోర్ట్ హాల్లో జాతీయపోరాట యోధులను ఉరితీసేవాళ్లు. విచారణ కాలంలో కూడా ఇక్కడే జైల్లో ఉంచేవారు. చూడాల్సిందే అండమాన్ తీరంలో ముత్యాలు వలిచిన చిప్పలు, పగడపు అవశేషాలు, శంఖువులు ఉంటాయి. వాటిని చూడాల్సిందే తప్ప మనం తెచ్చుకోవడానికి అనుమతించరు. ముత్యాలు, పగడాలు తక్కువ ధరలో వస్తాయి. ఇది కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పన్నులు ఉండవు. చాలా వస్తువులు చవగ్గా దొరుకుతాయి, ముఖ్యంగా లిక్కర్ సగం ధరకే వస్తుంది. -
వాళ్లంతా నకిలీ గాంధీలు
బెంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘సావర్కర్’ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శల దాడి కొనసాగుతోంది. రాహుల్, ఆయన కుటుంబీ కులంతా ఉత్తుత్తి గాంధీలంటూ కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి ఎద్దేవా చేశారు. లౌకికవాదులుగా చెప్పుకునే కాంగ్రెస్ తదితర పార్టీలు దేశంలో అశాంతి సృష్టించేందుకు పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వాడుకుంటున్నా యని కర్ణాటకలోని హుబ్బళిలో ఆదివారం ఆయన మీడియాతో అన్నారు. ‘మీరు కావాలనుకుంటే ఎవరితోనైనా సయోధ్య కుదుర్చుకుంటారు. రాహుల్ ఉద్ధవ్ ఠాక్రేగా కూడా మీరు కాగలరు. గతంలో ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మీరు చేసిన పనులు, ఆరోపణలు అందరికీ తెలుసు. సావర్కర్ వంటి దేశభక్తుడిపై విమర్శలు చేయడం చూస్తే మీరెంత అసహనంతో ఉన్నారో తెలుస్తుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా..వీళ్లంతా నకిలీ గాంధీలు. వీరు మాత్రమే ఇతరుల గురించి ద్వేషంతో మాట్లాడగలరు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘దేశంలో హింసను ప్రేరేపించడానికి లౌకికవాదులమని చెప్పుకునే కాంగ్రెస్ వంటి పార్టీలు పౌరసత్వ చట్టాన్ని హిందు–ముస్లిం అంశంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నాయి’ అని ఆరోపించారు. గతంలో ఉగాండా, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన వారితోపాటు శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు సైతం పౌరసత్వం ఇచ్చామన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో 550 మంది మైనారిటీ వలసదారులకు పౌరసత్వం కల్పించామన్నారు. (రాహుల్ గాంధీని పబ్లిక్‌లో కొట్టాలి..) -
రాహుల్ గాంధీని పబ్లిక్‌లో కొట్టాలి..
ముంబై: హిందూత్వ యోధుడు వీడీ సావర్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిల్చోబెట్టి కొట్టాలని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ఎవరైనా సావర్కర్‌ను అవమానిస్తే పబ్లిక్‌లో కొట్టాలని గతంలో ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చిన విషయాన్ని రంజిత్ గుర్తు చేశారు. రంజిత్ సావర్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా తాత బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ పదేపదే అంటున్నారు. అది నిజం కాదు. జైలు నుంచి విడుదల అయ్యేందుకు బ్రిటిష్ వారు పెట్టిన నిబంధనలకు ఆయన అంగీకరించారు. అంతేకానీ క్షమాపణ చెప్పలేదు’ అని వివరణ ఇచ్చారు. ‘పౌరసత్వం’ సావర్కర్‌కు భిన్నం: శివసేన బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం హిందూవాద నాయకుడైన వీర్ సావర్కర్ ఆలోచనలకు భిన్నమైనదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహిళలకు రక్షణ లేకపోవడం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలను కప్పిపుచ్చేందుకు బీజేపీ ‘పౌరసత్వ’ వాదనను తెరపైకి తెచ్చిందని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఒకే దేశం ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని, ఇప్పుడు ఆయన ఆలోచనలకు తూట్లు పొడిచేలా ఇతర దేశాల మైనారిటీలను భారత్‌లోకి బీజేపీ ఆహ్వాని స్తోందని అన్నారు. (చదవండి: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) -
రాహుల్‌పై శివసేన ఆగ్రహం..!
సాక్షి, ముంబై: వీర్ సావార్కర్‌పై కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉండటంతో తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతోంది. అయితే సందర్భం దొరికితే మాత్రం.. ఏమాత్రం ఆలోచన చేయకుండా రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ రాహుల్ వ్యాఖ్యలను ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ కీలక నేత, రాష్ట్రమంత్రి ఏక్నాథ్ షిండే రాహుల్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. దేశంలో ప్రతిఒక్కరూ వీర్ సావార్కర్‌ను గౌరవించాల్సిందేనని అన్నారు. జాతి నిర్మాణంలో ఆయన పాత్రను ఏ ఒక్కరూ ప్రశ్నించడానికి వీల్లేదని రాహుల్‌ను ఉద్దేశించి చురకలు అంటించారు. (రాహుల్‌పై పరువునష్టం దావా!) హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇదివరకే స్పష్టం చేశారు. ‘వీర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్ చేశారు. కాగా ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ వ్యాఖ్యలు మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చుపెట్టేలా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందుత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంభిస్తోందంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో శివసేనతో జట్టుకట్టి.. మరోవైపు సావార్కర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. (నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) దీనిపై వీర్ సావార్కర్ మనవడు రంజిత్ సావార్కర్ మరింత ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించాలని ఠాక్రేను కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్‌తో స్నేహానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు. ఠాక్రే మంత్రివర్గంలోని కాంగ్రెస్ మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. -
రాహుల్‌పై పరువునష్టం దావా!
-
రాహుల్‌పై పరువునష్టం దావా!
సాక్షి, ముంబై: ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూవులు దైవంతో సమానంగా పూజించే సావార్కర్‌ను కించపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యానించారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా వీర్ సావార్కర్ మనవడు రంజిత్ సావార్కర్ స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించాలని ఠాక్రేను కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. (నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) ఆదివారం ముంబైలో నిరసన ర్యాలీని చేపట్టిన రంజిత్ ఆ సమావేశంలో ప్రసంగించారు. శివసేన హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్‌తో స్నేహానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు. ఠాక్రే మంత్రివర్గంలోని కాంగ్రెస్ మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాట యోధులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. రాహుల్ ‘సావర్కర్’ వ్యాఖ్యలపై శివసేన ఇదివరకే స్పందించింది. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ‘వీర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్ చేశారు. -
మెడలో చెప్పుల దండ.. ముఖంపై నలుపు రంగు
న్యూఢిల్లీ: రెండు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల మధ్య విబేధాలు ఓ విపరీతానికి దారి తీశాయి. అనుమతి లేకుండా యూనివర్సిటీ ఆవరణలో సావర్కర్ విగ్రహం ప్రతిష్టించారంటూ.. దాని మెడలో చెప్పుల దండ వేయడమే కాక.. విగ్రహం ముఖానికి నలుపు రంగు పూశారు. ఈ సంఘటన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ యూనివర్సిటీలోని కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ.. హిందు మహాసభ అధ్యక్షుడైన వీర్ సావర్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించింది. అనుమతి లేకపోయినా యూనివర్సిటీ ప్రాంగణంలో విగ్రహాన్ని పెట్టారన్న కారణంతో.. చెప్పుల దండ వేసి, ముఖానికి నలుపు రంగు పూసింది. మంగళవారం ఉదయం వర్సిటీలోని ఏబీవీపీ అధ్యక్షుడు శక్తి సింగ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటు అనుమతి కోసం ఢిల్లీ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చుట్టూ తాను చాలాసార్లు తిరిగానని.. కానీ ఎవరూ పట్టించుకోలేదని శక్తి సింగ్ తెలిపాడు. ఇక చేసేదేమీ లేక.. తామే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సావర్కర్ వంటి వ్యక్తుల విగ్రహాలు యువతకు స్ఫూర్తినిస్తాయని.. అందుకే ఏర్పాటు చేశామని అన్నారు. అయితే ఎన్ఎస్యూఐ దీన్ని అంగీకరించడం లేదు. చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహనీయుల సరసన.. సావర్కర్ విగ్రహాన్ని పెట్టడం సరికాదని ఎన్ఎస్యూఐ వాదిస్తోంది. ముగ్గురి విగ్రహాలు ఒకేచోట కలిపి పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అంతేకాక 24గంటల్లోగా విగ్రహాన్ని తొలగించకపోతే వర్సిటీ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కానీ ఈలోపే విగ్రహానికి చెప్పుల దండ వేసి, నలుపు రంగు పూయడం గమనార్హం. -
సావర్కర్ కు మోదీ నివాళి
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాంతంత్ర్య సమర యోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ 133 వ జయంతిని పురస్కరింరచుకొని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులు అర్పించారు. వీరసావర్కర్ భరతమాత నిజమైన బిడ్డ అని, ఆయన నుంచి దేశ ప్రజలు స్ఫూర్తిని పొందుతున్నారని మోదీ ట్వీట్ చేశారు. 1883 మే 28 న జన్మించిన సావర్కర్ హిందూ అతివాదిగా ప్రసిద్ధులు. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించి అండమాన్ నికోబార్ జైల్లో ఉంచింది. సావర్కర్ ముంబైలో 1966 ఫిబ్రవరి 26 న మృతి చెందారు.