న్యూఢిల్లీ: ప్రముఖ స్వాంతంత్ర్య సమర యోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ 133 వ జయంతిని పురస్కరింరచుకొని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులు అర్పించారు. వీరసావర్కర్ భరతమాత నిజమైన బిడ్డ అని, ఆయన నుంచి దేశ ప్రజలు స్ఫూర్తిని పొందుతున్నారని మోదీ ట్వీట్ చేశారు.
1883 మే 28 న జన్మించిన సావర్కర్ హిందూ అతివాదిగా ప్రసిద్ధులు. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించి అండమాన్ నికోబార్ జైల్లో ఉంచింది. సావర్కర్ ముంబైలో 1966 ఫిబ్రవరి 26 న మృతి చెందారు.