చండీగఢ్: ఈరోజు(శనివారం) హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఇంతలో బీజేపీ సంచలన ప్రకటన చేసింది. నలుగురు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.
బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నలుగురూ హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ కూడా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతల్లో ఉన్నారు. ఈమెతో పాటు గౌతమ్ సర్దానా, తరుణ్ జైన్, అమిత్ గ్రోవర్‌లను పార్టీ బహిష్కరించింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన నలుగురు నేతలను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురికావడంపై విలేకరులు సావిత్రి జిందాల్‌ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తెలిస్తే చెబుతానని అన్నారు. తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. 2009లో సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్ ఓటు వేసేందుకు గుర్రంపై స్వారీ చేసుకుంటూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రపు స్వారీ చేయడం శుభపరిణామంగా భావిస్తారని, మా అమ్మ సావిత్రి జిందాల్ హిసార్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, హిసార్ అభివృద్ధికి ఆమె పాటుపడాలనుకుంటున్నారన్నారు. కాగా నవీన్ జిందాల్ బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే తన తల్లి నిర్ణయాన్ని సమర్థించారు. తన తల్లికి మద్దతు ఇస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా?
Comments
Please login to add a commentAdd a comment