పార్లమెంట్‌లో ఆసక్తికర పరిణామం.. రాజ్‌నాథ్‌తో రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Gives Rose,Tricolour To Rajnath Singh | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ఆసక్తికర పరిణామం.. రాజ్‌నాథ్‌తో రాహుల్‌ గాంధీ

Published Wed, Dec 11 2024 1:19 PM | Last Updated on Wed, Dec 11 2024 3:20 PM

Rahul Gandhi Gives Rose,Tricolour To Rajnath Singh

ఢిల్లీ: పార్లమెంట్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ వెలుపల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతికి కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ గులాబీ పూలు, జాతీయ పతకాన్ని అందించారు. ఆ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

అదానీ అంశం ఉభయ సభల్ని కుదిపేస్తుంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌కు కూటమి నేతలు గులాబీ పూలు, జాతీయ జెండాలు చేతికి ఇచ్చి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్‌ రాహుల్‌ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్‌నాథ్‌ స్వీకరించారు.

 నవంబర్ 20న నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యపై నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి.  అదానీ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి,. జార్జ్  సోరోస్  ఫౌండేషన్  ఫండింగ్  చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టింది. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement