parlimament
-
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. - ఇక, ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2. - జూలై 18న పోలింగ్, - జూలై 21వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఈసారి బ్రాహ్మణులకు రాష్ట్రపతి, ముస్లింలకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అగ్రవర్ణాల నుంచి రేసులో సుమిత్రా మహాజన్, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నట్టు సమాచారం. మైనార్టీ కోటాలో గులామ్ నబీ ఆజాద్, నఖ్వీ, అరిఫ్ మహ్మద్ ఖాన్ ఉన్నారు. ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి. -
బీజేపీ ఎంపీకి జయాబచ్చన్ కౌంటర్
న్యూఢిల్లీ: మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ నరేష్ అగర్వాల్ తన మీద చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జయాబచ్చన్ స్సందించారు. సినీ నటిగా తాను ఎంతో గర్వపడుతున్నానని, చిత్ర పరిశ్రమలో సభ్యురాలు అయినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇతరులు తనపై చేసిన కామెంట్స్ పట్టించుకోనని జయాబచ్చన్ తెలిపారు. తనకు రాజ్యసభలో మరోసారి అవకాశం కల్పించిన సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని దానిలో భాగంగానే తనకు మరోసారి అవకాశం కల్పించారన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్త పరుచుకునే హక్కు ఉందని, దానిని నియంత్రించే హక్కు ఎవరికి లేదన్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ తనకు కాకుండా ఒక ఫిల్మ్ డ్యాన్సర్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిందంటూ జయాపై నరేష్ అగర్వాల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నరేష్ అగర్వాల్ జయాపై వ్యాఖ్యలు చేయడం ఇది ఐదోసారి. గతంలో కూడా తనపై నరేష్ అనేక వ్యాఖ్యలు చేశారని నేనేప్పుడు వాటిని సీనియస్‌గా తీసుకోలేదని తెలిపారు. మరోవైపు జయాపై చేసిన కామెంట్స్‌ను రాజ్యసభలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో నరేష్ అగర్వాల్...తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ అన్నారు. -
వీహెచ్‌పీ యాత్రపై రాజ్యసభలో రగడ
న్యూఢిల్లీ : వీహెచ్‌పీ యాత్రపై రాజ్యసభ సోమవారం దద్దరిల్లింది. ఎస్పీ, బీజేపీ సభ్యుల నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే వీహెచ్‌పీ యాత్రపై బీజేపీ, ఎస్పీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో ప్రారంభం అయిన కొద్ది సేపటికే రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సభ మరోసారి మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది. కాగా లోక్‌సభలోనూ ఇదే అంశంపై వాడీ వేడిగా చర్చ జరిగింది.