న్యూఢిల్లీ : వీహెచ్పీ యాత్రపై రాజ్యసభ సోమవారం దద్దరిల్లింది. ఎస్పీ, బీజేపీ సభ్యుల నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే వీహెచ్పీ యాత్రపై బీజేపీ, ఎస్పీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో ప్రారంభం అయిన కొద్ది సేపటికే రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సభ మరోసారి మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడింది. కాగా లోక్సభలోనూ ఇదే అంశంపై వాడీ వేడిగా చర్చ జరిగింది.