‘బీజేపీని ఓడించేందుకు ఎవ్వరితోనైనా సై’ | we Open to alliance with any party to fight BJP: Mayawati | Sakshi
Sakshi News home page

‘బీజేపీని ఓడించేందుకు ఎవ్వరితోనైనా సై’

Published Sat, Apr 15 2017 9:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘బీజేపీని ఓడించేందుకు ఎవ్వరితోనైనా సై’ - Sakshi

‘బీజేపీని ఓడించేందుకు ఎవ్వరితోనైనా సై’

లక్నో: బీజేపీని ఓడించడమే తన లక్ష్యం అని బీఎస్పీ అదినేత్రి మాయావతి శపథం చేశారు. అందుకోసం ఏ పార్టీతోనైనా తాను చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. విషాన్ని(పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ) విషంతోనే దెబ్బకొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల కిందట సమాజ్‌వాది పార్టీతో పొత్తుపెట్టుకొని విడిపోయిన ఆమె ఈ వ్యాఖ్యల ద్వారా తొలిసారిగా బహిరంగంగా ఎస్పీతో పొత్తుకు కూడా స్వాగతం అంటూ పరోక్షంగా చెప్పారు.

అంబేద్కర్‌ జయంతి మాట్లాడిన ఆమె భవిష్యత్తులో బహుజన ఉద్యమం తీసుకొచ్చేందుకు, మత శక్తులను నిలువరించేందుకు ఇతర పార్టీలతో సత్సంబంధాలు అవసరం అని ఆమె అన్నారు. అంతకుముందు సమాజ్‌వాది పార్టీ నేత రాజేంద్ర చౌదరీ మాట్లాడుతూ దేశంలో లౌకిక రాజకీయాలు రక్షించేందుకు మేం ఏమైనా చేస్తాం. విభజన శక్తులను అడ్డుకోవాలి. మాలాగా ఆలోచించే పార్టీలన్నీ కూడా కలిసి రావాలి. కావాలంటే బీఎస్పీ కూడా’ అని చెప్పారు. అయితే, అలాంటి కూటమి ఒకటి వస్తే దానికి నాయకత్వం ఎవరు వహిస్తారనే దానిపై మాత్రం బదులివ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement