ఎస్పీ, బీజేపీ విఫలం
అధికారమిస్తే అవినీతిరహిత పాలన: మాయావతి
లక్నో: వచ్చే ఏడాది యూపీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి.. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లపై లక్నోలో తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ పాలనలో ఎస్పీ, బీజేపీలు అన్ని విధాలుగా విఫలమయ్యారని ఆరోపించారు.
తమ పార్టీకి అధికారమిస్తే భయ, అవినీతి రహిత పాలన అందిస్తామని మాయవతి హామీనిచ్చారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామన్న హామీ అమలులో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘భారత్ మాతా కీ జై’ అనడం తప్పనిసరి కాదన్నారు. ‘బీఎస్పీలో జై భీమ్, జై భారత్ అంటారు. కొందరు జైహింద్ అంటారు. దేశభక్తిని ప్రదర్శించడానికి ఇతర విధానాలు ఉన్నాయి’ అని చెప్పారు.