
సాక్షి, వరంగల్: రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.
బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది.