cancelled
-
విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్‌లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్చ్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్‌కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్లైన్లో యాక్టివ్‌గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. భూసేకరణపై స్టే
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ.. తక్షణమే భూసేకరణ ఆపేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట పరిధిలో 8 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా.. బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్ బాధితుల తరఫున పిటిషన్ వేయగా.. అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం.. భూసేకరణపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. -
Vizag: రుషికొండ బీచ్ కు ఉన్న బ్లూఫాగ్ హోదా రద్దుతో పర్యాటకుల విచారం
-
రాహుల్ వరంగల్ పర్యటన రద్దు
సాక్షి, వరంగల్: రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
మాదాపూర్: శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల (Sri Chaitanya Educational Institutions) సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(Food Safety Department) రద్దు చేసింది. శుక్రవారం ఈ కిచెన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు.వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు.కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. కిచెన్‌ను సీజ్ చేయడంతో పాటు ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం -
ఆ పది రోజులు టోకెన్ లేకుంటే దర్శనం లేదు
తిరుమల: తిరుమలలో వచ్చేనెలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో టోకెన్ లేని భక్తులను దర్శనానికి అనుమ తించమని టీటీడీ పీఆర్వో విభాగం శని వారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో వచ్చేనెల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్య మిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. జనవరి 10 నుంచి 19 వరకు దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్ర మే అనుమతిస్తారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణశాఖ, ఎన్ ఆర్ఐ మొదలైన వారికి పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్, విశేష దర్శనాలు రద్దు. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతించబడరు. 11 నుంచి 19 తేదీ వరకు అనుమతిస్తారు. 28న డయర్ యువర్ ఈవోటీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్ర మా న్ని వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసా రం చేస్తుంది. భక్తులు తమ సందేహా లను, సూచనలను టీటీడీ ఈఓ శ్యామల రావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877– 2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ తెలిపింది. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. ఏడు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్ కారణంగా ఏర్పడిన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబులిటీ) తగ్గడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దాదాపు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం విమానాలు బయలుదేరే సమయంలో సగటున 22 నిమిషాల ఆలస్యం జరిగింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఐదు విమానాలను (జైపూర్-04, డెహ్రాడూన్-01) దారి మళ్లించారు. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమనాశ్రయ అధికారులు పేర్కొన్నారు.ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గినందున సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడు విమానాలను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడిన పొగమంచు విజిబులిటీని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమాన షెడ్యూళ్లలో జాప్యం జరగవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు విమాన రాకపోకల స్థితిని ఒకసారి చెక్ చేసుకోవాలి’ అని తెలియజేసింది. స్పైస్‌జెట్ కూడా ఇదే విధమైన సూచన చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 481కి చేరింది. కాలుష్యం కారణంగా ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల దృష్ట్యా నేటి (సోమవారం) నుంచి ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలను అమలు చేశారు.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి -
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది. -
ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
కెనడాలో కాన్సులర్ క్యాంప్‌లు రద్దు చేసిన భారత్
భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు రోజురోజుకీ దెబ్బతింటున్నాయి. ఇటీవల కెనడాలో హిందూ ఆలయంపై దాడి జరగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశంలో కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘కెనడాలోని భారత కమ్యూనిటీ క్యాంప్ నిర్వహకులకు కనీస భద్రత కల్పించలేమని అక్కడి భద్రతా ఏజెన్సీలు తెలిపాయి. అందువల్ల ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మా షెడ్యూల్ కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.కాగా ఇటీవల కెనడాలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు వీరంగం సృష్టించారు. భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న వ్యక్తులు.. కర్రలతో హిందూ సభా మందిరం ప్రాంగణంలోని వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. -
భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పూణె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాని మోదీ ఈరోజు (గురువారం) పుణె మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు రూ.22,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల దృష్ట్యా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.భారీ వర్షాల కారణంగా పూణె, పింప్రీ చించ్వాడ్లలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా గోవండి-మాన్‌ఖుర్ద్ మధ్య నడిచే ముంబై లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణె జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద సుమారు రూ. 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నేడు ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ)సిస్టమ్‌ను కూడా ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 850 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ నేడు రద్దయ్యాయి.ఇది కూడా చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు -
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై జూ.ఎన్టీఆర్ రియాక్షన్..
-
మీకంటే నేనెక్కువగా బాధపడుతున్నాను: ఎన్టీఆర్
‘‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా బాధగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. ‘దేవర’ సినిమా గురించి చె΄్పాలని, ఈ సినిమా కోసం మేం పడ్డ కష్టాన్ని వివరించాలని చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. కానీ భద్రతా పరమైన కారణాల వల్ల ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది... ఎక్కువ కూడా’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఇది.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటించారు. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ నిర్వహించాలనుకున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రతా కారణాల వల్ల రద్దు అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మీరు నాపై కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను.ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ‘దేవర’ సినిమా నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను బ్లేమ్ చేయడం తప్పని నా భావన. కానీ ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబరు 27న మనందరం కలవబోతున్నాం. ‘దేవర’ చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. నేను మీకు ఎప్పుడూ చెప్పినట్లే... మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత. దాంతో వచ్చే ఆనందాన్ని నా మాటల్లో చెప్పలేను. ఈ సెప్టెంబరు 27న అదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి. అందరూ ఆనందించండి.మీ ఆశీర్వాదం ఈ ‘దేవర’కు చాలా అవసరం. నాకూ చాలా అవసరం. దయచేసి మీ అశీర్వాదాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకొక్కమాట.. మీరందరూ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్లాలని ఇంకొక్కసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...‘దేవర’ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్‌లో ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని’ అనే డైలాగ్ ఒకటి. -
ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు
భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య ఆదివారం మాంచెస్టర్‌లో జరగాల్సిన చివరి టి20 మ్యాచ్ రద్దయింది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండా నిర్ణీత సమయానికి రెండు గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఈ నెల 19 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన వన్డే సిరీస్ జరుగుతుంది. -
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్ఈ బోధన రద్దు... ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్టేట్ బోర్డు పరీక్షలే.. ఇంకా ఇతర అప్డేట్స్
-
chhattisgarh: 72 రైళ్లు రద్దు.. రూ. 29 కోట్లు నష్టం
జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదం తర్వాత ఈ మార్గంలోని అరడజనుకు పైగా రైళ్లు రద్దు కావడంతో ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు రైల్వేశాఖ ఆదాయానికి గండిపడింది.తాజాగా రాజ్‌నంద్‌గావ్-కల్మనా రైల్వే సెక్షన్ మధ్య మూడవ రైల్వే లైన్‌ను కలమన రైల్వే స్టేషన్‌కు అనుసంధానించేందుకు రైల్వేశాఖ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ప్రీ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్, మెమూ రైళ్లు ఆగస్టు 4 నుండి 20 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో రక్షాబంధన్ సందర్భంగా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.బిలాస్పూర్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు ప్రభావం అటు ప్రయాణికులపైన, ఇటు రైల్వే ఆదాయంపైన పడనుంది.అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత మూడు నెలలుగా రాయ్‌పూర్ మీదుగా వెళ్లే రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 రైళ్లను (416 ట్రిప్పులు) రద్దు చేయడంతో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో కన్ఫర్మ్ చేసిన 4 లక్షల 32 వేల టిక్కెట్లను రద్దు చేయడంతో, రైల్వేశాఖ ప్రయాణికులకు రూ.28 కోట్ల 86 లక్షలు వాపసు చేయాల్సి ఉంటుంది. -
విజయవాడ రూట్లో పలు రైళ్ల రద్దు: ఎస్సీఆర్
సాక్షి,విజయవాడ: ఆగస్ట్ నెలలో ఐదు రోజుల పాటు పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం(జులై 3) ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మూడవ లైన్ ఏర్పాటులో భాగంగా మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మరమ్మతుల వల్లే రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి ఆగస్ట్ 8 వరకు 37 రైళ్లు రద్దు చేయనుండగా 38 రైళ్లను దారి మళ్లించనున్నారు. -
కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
రాయ్‌పూర్: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్, ఇండియా కూటమిలు కోపంతో ఉన్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. బస్తర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 500 ఏళ్ల కల నెరవేరి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయినందుకు రాముని మాతృమూర్తి పుట్టినల్లు అయిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అయితే రాముని గుడి విషయంలో కాంగ్రెస్ ఇండియా కూటమి మాత్రం కోపంగా ఉన్నాయని సెటైర్లు వేశారు. రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ తిరస్కరించిందని ఎద్దేవా చేశారు. ఆహ్వానం తిరస్కరించడం తప్పని మాట్లాడిన నేతలను ఆ ఫ్యామిలీ పార్టీ నుంచి బయటికి పంపించిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకునేందుకు తమకు లైసెన్స్ ఉందని కాంగ్రెస్ భావించిందని, అయితే 2014లో మోదీ ప్రభుత్వం వచ్చి ఆ లూఠీ లైసెన్స్‌ను రద్దు చేసిందన్నారు. ప్రజలు మోదీకి లైసెన్స్ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ దోపిడీ లైసెన్స్‌ను మోదీ రద్దు చేయగలిగాడని చెప్పారు. గిరిజనులను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించిందని, బీజేపీ మాత్రం గిరిజన మహిళన రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి.. ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్‌జెండర్ గురించి తెలుసా -
2018 గ్రూప్-1 రద్దు తీర్పు.. ఆందోళన వద్దన్న ఏపీ ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మెయిన్స్‌ను మళ్లీ ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ బోర్డుకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 2018లో 167 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సిందేనని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది. -
మియాపూర్ లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
-
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు
-
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు అయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ సోమవారం రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక.. త్వరలో 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్-1కు సంబంధించి పూర్తి వివరాలపై కమిషన్ విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కమిషన్ వెల్లడించింది. ఇక.. రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. చదవండి: సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ -
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్–విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం–తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం–బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు బెంగళూరు–విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్–తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–భువనేశ్వర్ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా–సికింద్రాబాద్ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్–పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు సికింద్రాబాద్–పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్–సికింద్రాబాద్ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు సికింద్రాబాద్–ధనాపూర్ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 28 వరకు బెంగళూరు–ధనాపూర్ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్–హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ–నర్సాపూర్ (17226), హుబ్లీ–గుంతకల్లు (07337), గుంతకల్లు–హుబ్లీ (07338), బల్గెవి–కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట–బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
ఫార్ములా ఈ-రేస్ రద్దు...కేటీఆర్ సీరియస్
-
‘సీడబ్ల్యూసీ’కి వెళ్లని సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి వెళ్లాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కారణంగానే ఇదే రోజు జరగాల్సిన కలెక్టర్ల సదస్సు కూడా వాయిదా వేశారు. అందుకు అనుగుణంగా ఉదయం తన నివాసంలోనే సాగునీటి శాఖపై రివ్యూ చేశారు. కానీ, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ షెడ్యూల్ మారిపోయింది. విద్యుత్‌పై చర్చ సందర్భంగా వాడీవేడిగా సభ సాగడంతో ఆయన అసెంబ్లీలోనే ఉండిపోయారు. ఒక దశలో సీఎం జోక్యం చేసుకొని విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటన పూర్తయిన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళతారనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరిగినా, సీఎం ఢిల్లీకి బయలుదేరలేదు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను సీడబ్ల్యూసీకి రాలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌కు చెప్పి ఢిల్లీ పర్యటన విరమించుకున్నారని సమాచారం. అయితే సీడబ్ల్యూసీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్న అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. కారణమేంటి? సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లకపోవడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడమే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధ, గురువారాల్లో రెండు కీలక అంశాలపై ప్రభు త్వం శ్వేతపత్రాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం సభలో లేకుండా పార్టీ సమావేశానికి వెళితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే సీఎం సభలో లేకుండా వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఎత్తిపొడిచే అవకాశం వచ్చి ఉండేదని, దీనికి తోడు కీలక రంగాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం సభలో లేకపోతే అధికార పక్షానికి కూడా సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందనే కారణంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని ప్రభుత్వ, పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కేవలం అసెంబ్లీ సమావేశాలే కాదని, మరో ముఖ్యమైన పనిలో ఉన్న కారణంగానే సీఎం ఢిల్లీ వెళ్లలేదనే చర్చ కూడా జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో మంత్రి ఉత్తమ్ కూడా రేవంత్‌రెడ్డితో చాలా సేపు అసెంబ్లీ లాబీల్లోని సీఎం చాంబర్లో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ తర్వాతే రేవంత్ తన టూర్ రద్దు చేసుకున్నారనే చర్చ కూడా జరిగింది. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్
భారతదేశంలోని బ్యాంకులపై గట్టి నిఘా పెట్టిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి జరిమానాలు విధించింది. కాగా ఇప్పుడు మరిన్ని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మకారిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నియమాలు డిసెంబర్ 04 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. సదరు బ్యాంకు వద్ద మూలధనం ఎక్కువగా లేకపోవడమే కాకుండా.. ఆదయ మార్గాలు కూడా లేకపోవడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) నిబంధనలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. నిబంధనలను అమలు చేయడంలో శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ విఫలం కావడం వల్ల.. కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇస్తే కస్టమర్లు ఇబ్బందిపడే అవకాశం ఉందని RBI భావించింది. ఇప్పటికే డిపాజిట్లు చేసుకున్న వారికి తిరిగి చెల్లించే పరిస్థిలో ఈ బ్యాంక్ లేకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు ఇన్ని రకాలా..! ఇవెలా ఉపయోగపడతాయంటే..? ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిన ఆర్బీఐ లెక్కకు మించిన లైసెన్సులను రద్దు చేసింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ బ్యాంకులు ఉండటం గమనించదగ్గ విషయం. -
మిచౌంగ్ తుపాను : దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్
సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాన్ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో) తెలిపారు. ఎస్సీఆర్ పరిధిలో రైళ్లపై తుపాన్ ఎఫెక్ట్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రస్తుతం రైల్వే ట్రాక్ లపై ఎక్కడా నీళ్ళు నిలవలేదు. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమచారం అందించాం. ఎస్ఎంఎస్లు, సామాజిక మాధ్యమాల్లోనూ అందించాం. ప్రయాణికుల రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేశాం. తుపాను తీరం దాటాక వీలైనంత త్వరగా రైళ్లు పునరుద్ధరిస్తాం’ అని సీపీఆర్వో తెలిపారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి పట్టణానికి ప్రతిపాదించిన మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కామారెడ్డి రైతు జేఏసీ నాయకులు శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతమున్న పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ పాలకమండలి తీర్మానించిందని, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటామని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ రద్దు కోసం జరిగిన ఆందోళనలలో రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కేసుల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ చేసిన ప్రకటనపై కామారెడ్డి రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?
న్యూఢిల్లీ: బాలీవుడ్నటి పరిణీతి చోప్రో భర్త, ఆప్ ఎంపీ, రాఘవ్ చద్దాకు ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను ఖాళీ చేయాలన్న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. అయితే ఏప్రిల్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ అక్టోబర్ 5న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాఘవ్ చద్దా సవాలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాఘవ్ చద్దాకు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 18న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీతో కూడిన సింగిల్ బెంచ్ సమర్ధించింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం ఈ తీర్పుపై స్పందించిన రాఘవ్ చద్దా ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తన పోరాటం ఇల్లు లేదా దుకాణం గురించి రాజ్యంగ రక్షణ గురించి అని ట్వీట్ చేశారు. యువ ఎంపీగా తన నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ కక్షతోనే తన బంగ్లా కేటాయింపు రద్దు చేశారని విమర్శించారు.కోట్లాది మంది భారతీయుల తరపున మాట్లాడేవారిని, ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ తాను పార్లమెంటులో రెండు ప్రసంగాలు చేశానని, తన తొలి ప్రసంగం తర్వాత తన అధికారిక వసతి రద్దు చేశారన్నారు.అలాగే రెండో ప్రసంగం తరువాత ఎంపీగా తన సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడితే ఏమవుతుందో భయపడుతూంటే ఇక ఏ ఎంపీ పని చేయలేరంటూ తన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. Ye makan ya dukan ki nahin, Samvidhan ko bachane ki ladhayi hai In the end, truth and justice have prevailed My statement on the Hon'ble Delhi High Court's ruling to set aside the unjust order to evict me from my official residence. pic.twitter.com/fA7BJ2zLYm — Raghav Chadha (@raghav_chadha) October 17, 2023 -
హైకోర్టు సీరియస్..గ్రూప్ 1 పరీక్ష రద్దు..
-
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ రద్దు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ: గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లి నిర్వహించాలన్న పిటిషన్‌పై విచారణ చేప్పట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. జూన్ 11వ తేదీన జరిగిన ఈ పరీక్ష రద్దు చేసి మళ్లి నిర్వహించాలని TSPSCని కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజీ కారణాల వలన ఒకసారి రద్దు చేసి మళ్ళీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు ఇది రెండవ సారి రద్దు అవ్వడం. ఇదీ చదవండి: బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్పీఎస్సీపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్ షీట్లపై హాల్‌టికెట్ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసిన విషయం తెల్సిందే. జూన్ 11న టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వాదనలు ఇలా జరిగాయి టీఎస్పీఎస్సీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ ఎం.రాంగోపాల్ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పా రు. అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్ కార్టు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థు లు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మా త్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది -
కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు
ముంబయి: ఇండియా- కెనడా మధ్య వివాదాస్పద పరిస్థితుల ప్రభావం ఓ సింగర్ సంగీత కచేరి మీద పడింది. ముంబయిలో జరగనున్న ఖలిస్థానీ మద్దతుదారుడైన కెనడియన్ పంజాబీ సింగర్ శుభ్ సంగీత కచేరీ రద్దైంది. సింగర్ శుభ్ భారత పర్యటన కూడా రద్దైంది. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగీత కచేరి కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి బుక్ మై షో ఇప్పటికే రీఫండ్ కూడా చేసేసింది. ఖలిస్థానీలకు మద్దతు తెలుపుతున్నట్లు సింగర్ శుభ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్న నేపథ్యంలో.. సంగీత కచేరీని రద్దు చేయాలని భారతీయ యువ మోర్చా డిమాండ్ చేసింది. దీంతో శుభ్ పర్యటనకు స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ బీఓఏటీ ఈ మేరకు సంగీత కచేరిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ కెనడాకు చెందిన ఈ పంజాబీ సింగర్ శుభ్ వివాదాస్పద భారత్ చిత్రపటాన్ని షేర్ చేశారు. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేని భారత్ మ్యాప్‌ను షేర్ చేయడంతో క్రికెటర్ విరాట్ కొహ్లీ కూడా శభ్ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ -
వానదే విజయం
పల్లెకెలె: భారత్‌తో ఆసియా కప్ పోరులో పాకిస్తాన్ విజయలక్ష్యం 267 పరుగులు... పాక్ దీనిని ఛేదిస్తుందా లేక తొలి ఇన్నింగ్స్ తరహాలో భారత బౌలర్లు కూడా చెలరేగి ప్రత్యచ్చిని కట్టడి చేస్తారా... ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ... అయితే అందరి ఆసక్తిపై వర్షం నీళ్లు చల్లింది... పాకిస్తాన్ అసలు బ్యాటింగ్‌కు దిగే అవకాశమే రాలేదు. అత్యంత ఆసక్తికర, హోరాహోరీ సమరంగా అంచనాలు పెంచిన మ్యాచ్ చివరకు వరుణుడి బారిన పడింది. శనివారం భారత్, పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. భారత్ ఇన్నింగ్స్ పూర్తిగా సాగగా, ఆపై వానదే విజయమైంది. అర్ధాంతరంగా ముగిసిన మ్యాచ్‌లో టాప్–4 విఫలం కావడం భారత్ కోణంలో నిరాశపర్చే అంశం కాగా... ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ విశేషం. ముగ్గురు ప్రధాన పేసర్లు చెలరేగడం పాకిస్తాన్‌కు సంబంధించి పెద్ద సానుకూలాంశం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. షాహిన్ అఫ్రిది (4/35) బౌలింగ్ హైలైట్ కాగా, నసీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్ నెగ్గిన పాకిస్తాన్ ఈ ఫలితంతో ‘సూపర్–4’ దశకు చేరగా, రేపు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సూపర్–4 దశకు అర్హత సాధిస్తుంది. టాప్–4 విఫలం... రోహిత్ శర్మ (22 బంతుల్లో 11; 2 ఫోర్లు), గిల్ (32 బంతుల్లో 10; 1 ఫోర్) కలిసి జాగ్రత్తగా భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రోహిత్ రెండు బౌండరీలు కొట్టినా గిల్ పదో బంతికి గానీ తొలి పరుగు చేయలేకపోయాడు. పాక్ బౌలర్ల జోరుతో కొద్ది వ్యవధిలోనే అంతా మారిపోయింది. చక్కటి బంతితో రోహిత్‌ను క్లీన్»ౌల్డ్ చేసి షాహిన్ మొదటి దెబ్బ కొట్టగా, అతని తర్వాతి ఓవర్లోనే కోహ్లి (4) బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన శ్రేయస్ (14), కెరీర్లో పాక్‌తో తొలి మ్యాచ్‌లో తడబడుతూనే ఆడిన గిల్‌ను రవూఫ్ పెవిలియన్ పంపించాడు. దాంతో 66/4తో భారత్ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కిషన్, పాండ్యా భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. తాను ఆడిన గత మూడు వన్డేల్లో (వెస్టిండీస్‌తో) అర్ధసెంచరీలు సాధించిన కిషన్ ఇక్కడా అదే ఫామ్‌ను కొనసాగించగా... పాండ్యా పాక్‌పై మరోసారి సత్తా చాటాడు. వీరిద్దరు పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చక్కటి సమన్వయంతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 54 బంతుల్లో కిషన్, పాండ్యా 62 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వికెట్ల మధ్య పరుగెత్తడంలో కొంత ఇబ్బంది పడిన కిషన్ భారీ షాట్‌కు ప్రయత్నించడంతో ఈ భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పాండ్యా సహా 7 బంతుల వ్యవధిలో జట్టు తర్వాతి 3 వికెట్లు కోల్పోగా, నసీమ్ 49వ ఓవర్లో 2 వికెట్లతో భారత్ ఆట ముగించాడు. మళ్లీ మళ్లీ అడ్డుపడి... భారత జట్టు ఇన్నింగ్స్ సమయంలో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. 4.2 ఓవర్ల తర్వాత (స్కోరు 15/0) 33 నిమిషాల పాటు... 11.2 ఓవర్ల తర్వాత (స్కోరు 51/3) 20 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. భారత్ ఇన్నింగ్స్ ముగియగానే విరామ సమయంలో వచ్చిన వర్షం కారణంగా సమయం నష్టపోవాల్సి వచ్చింది. ఎంతసేపు నిరీక్షించినా తెరిపి లభించలేదు. రెండు సార్లు అంపైర్లు పరీక్షించినా ఆ వెంటనే చినుకులు రావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. చివరకు రాత్రి గం. 9.52కు మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. 5 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రద్దయిన వన్డే మ్యాచ్‌లు. రెండు జట్ల మధ్య మొత్తం 133 మ్యాచ్‌లు జరిగాయి. 55 మ్యాచ్‌ల్లో భారత్, 73 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలుపొందాయి. 26 వన్డే ఫార్మాట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు కావడం 26 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1997లో టొరంటోలో జరిగిన సహారా కప్‌లో చివరిసారి ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) షాహిన్ 11; గిల్ (బి) రవూఫ్ 10; కోహ్లి (బి) షాహిన్ 4; శ్రేయస్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 14; కిషన్ (సి) బాబర్ (బి) రవూఫ్ 82; పాండ్యా (సి) సల్మాన్ (బి) షాహిన్ 87; జడేజా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 14; శార్దుల్ (సి) షాదాబ్ (బి) నసీమ్ 3; కుల్దీప్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 4; బుమ్రా (సి) సల్మాన్ (బి) నసీమ్ 16; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 266. వికెట్ల పతనం: 1–15, 2–27, 3–48, 4–66, 5–204, 6–239, 7–242, 8–242, 9–261, 10–266. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–2–35–4, నసీమ్ షా 8.5–0–36–3, రవూఫ్ 9–0–58–3, షాదాబ్ 9–0–57–0, నవాజ్ 8–0–55–0, సల్మాన్ 4–0–21–0. -
అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్
లక్నో: కాసేపట్లో పెళ్లి జరగబోతోందనగా కాస్త ముందుగానే కళ్యాణ మండపానికి వచ్చిన వరుడికి సూపర్ షాకిచ్చింది వధువు తల్లి. కళ్యాణ మండపానికి వధువుని వెంటబెట్టుకుని వచ్చే క్రమంలో డాన్సులు చేస్తూ ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ కనిపించిన అత్తగారిని చూసి కాబోయే అల్లుడు హతాశుడయ్యాడు. అత్తగారి విచిత్ర ధోరణికి మండిపడి పెళ్లి పెటాకులు చేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఉత్తరాదిలో పెళ్లిళ్లంటే ఆ ధూమ్ ధామ్ సందడే వేరు. పెళ్ళికి ముందు నుంచే ప్రతిరోజూ పెళ్లే అన్నంత కోలాహలంగా ఉంటుంది వాతావారణం. హల్దీ, మెహందీ, సంగీత్, షాదీ ఇలా పెళ్ళి పేరుతో పెద్ద తంతే నడుస్తుంది. ఇక అక్కడి పెళ్లిళ్లలో లింగ భేదం లేకుండా విందు చేయడం చిందులేయడం సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పధ్ధతి రుచించక వరుడు పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పంచాయతీ జరిపిన తర్వాత పెళ్ళికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన వరుడికి, రాజ్ పురకు చెందిన వధువుకి జూన్ 27న వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లిలో సందడి చేయడానికి డీజే కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందనగా వరుడు బంధువర్గ సపరివారసమేతంగా ముందే కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే వధువు తరపు బృందం ఊరేగింపుగా వచ్చారు. కానీ వధువు పల్లకికి ముందు వధువు తల్లి సిగరెట్ కాలుస్తూ తన్మయత్వంతో చిందులేస్తూ కనిపించింది. వధువు కోసం వేచి ఉన్న వరుడు అత్తని అలా చూసి షాక్ కి గురయ్యాడు. కోపోద్రిక్తుడై పెళ్లి వద్దనుకుని పెళ్లి మటపం నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం రెండువర్గాల పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వరుడు పెళ్ళికి అంగీకరించాడు. తర్వాత పెళ్లి కార్యక్రమం యధాతధంగా కొనసాగింది. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ప్రధాని పేరు చెప్పలేకపోయాడని ఓ వధువు పెళ్లిని రద్దు చేసింది. అంతేకాకుండా వెంటనే వరుని తమ్ముడినే వివాహమాడింది. సైద్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదీ జరిగింది.. శివ శంకర్(27) నాసిర్పూర్ గ్రామానికి చెందిన రామ్ అవతార్ కుమారుడు. ఇతనికి సమీప గ్రామానికి చెందిన రంజన అనే అమ్మాయితో జూన్ 11న వివాహం జరిగింది. మరుసటి రోజు వధువు ఇంటి వద్ద ఓ చిన్న వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో వరుడు తన మరదలు, బావమరిదిని సరదాగ ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో మరదలు కూడా వరున్ని ప్రధాని ఎవరని ప్రశ్నించింది. దేశ ప్రధాని పేరు ఆయన చెప్పలేకపోయాడు. వధువు బంధువులు వరున్ని హేళన చేశారు. దీన్ని అవమానంగా భావించిన రంజన అక్కడికక్కడే అనంత్‌ను వివాహమాడింది. అనంత్ శివ శంకర్ సోదరుడు. వయస్సులో చిన్నవాడు. దీనిని రామ్ అవతార్ ఖండించాడు. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదీ చదవండి: స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే.. -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్జాయ్ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది. దీంతో ఖమ్మం సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు నిలిపివేశారు!. కాగా ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న అమిత్ షా భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, పార్టీ కమిటీల్లో మార్పులపై జరిగిన ప్రచారంతో కూడా కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. అమిత్ షా పర్యటన క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపే అవకాశం ఉందని ఊహించారు. అయితే తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దవ్వడంతో కాషాయ పార్టీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక.. ఆయన రావడం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో హైదరాబాద్‌కు రాకున్నా.. కనీసం ఖమ్మం సభకైనా ఆయన నేరుగా హాజరు అయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. చదవండి: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో -
111 జీవో రద్దుకు తెలంగాణ కేబీనెట్ ఆమోదం
-
తీవ్ర ఇబ్బందులు: రెండు రోజులు విమానాలను రద్దు చేసిన సంస్థ
న్యూఢిల్లీ: వాడియా గ్రూప్ యాజమాన్యంలోని బడ్జెట్ ధరల విమానాయాన సంస్థ గోఫస్ట్ ఫండ్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ కారణంగా రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) తీవ్రమైన నిధుల కొరత కారణంగా (బుధవారం, గురువారం (మే 3, 4 తేదీలు) విమానాలను రద్దు చేసింది. ఈ మేరకు గోఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనాను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. అంతేకాదు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసింది. ప్రాట్ అండ్ విట్నీ (P&W) ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో 28 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖోనా పీటీఐకి చెప్పారు. స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియల దాఖలు దురదృష్టకర నిర్ణయమని పేర్కొన్నారు. కానీ కంపెనీ ప్రయోజనాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు) -
బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
-
రెండు నెలల్లో 6 ఐపివోలకు చెక్: లిస్ట్‌లో ఓయో, షాక్‌లో పేటీఎమ్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు వస్తున్న కంపెనీలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠినంగా వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ ఐపీవో తదుపరి తలెత్తిన సవాళ్లరీత్యా అన్‌లిస్టెడ్ కంపెనీలు అందిస్తున్న సమాచారంపై మరింత ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి గత రెండు నెలల్లో ఆరు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను తిప్పి పంపింది. ఓయో బ్రాండుతో ఆతిథ్య రంగ సేవలందిస్తున్న ఒరావెల్ స్టేస్ ఈ జాబితాలో చోటు చేసుకోవడం గమనార్హం! మరింత లోతైన సమాచారంతో తిరిగి తాజా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేయమంటూ సెబీ ఆయా కంపెనీలను ఆదేశిస్తోంది. జాబితాలో..: ఓయోతోపాటు.. సెబీ ప్రాస్పెక్టస్‌లను వెనక్కి పంపిన జాబితాలో ఫెయిర్‌ఫాక్స్(కెనడా) గ్రూప్‌నకు పెట్టుబడులున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, బీ2బీ పేమెంట్స్, సర్వీసుల సంస్థ పేమేట్ ఇండియా, మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్, ఫైనాన్షియల్ సేవల సంస్థ ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా, సమీకృత సర్వీసుల సంస్థ బీవీజీ ఇండియా ఉన్నాయి. 2021 సెపె్టంబర్ - 2022 మే నెల మధ్యలో ఈ 6 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ ఏడాది జనవరి - మార్చి10 మధ్య సెబీ వీటి ప్రాస్పెక్టస్‌లను తిప్పి పంపింది. ఈ కంపెనీలు ఉమ్మడిగా రూ. 12,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. 2021లో నష్టాల ఎఫెక్ట్... 2021లో కొన్ని బడా కంపెనీల పబ్లిక్ ఇష్యూల ద్వారా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఇటీవల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైమ్‌డేటాబేస్ గణాంకాల ప్రకారం 2022లో సగటున సెబీ ఐపీవోలకు 115 రోజుల్లోగా అనుమతిని ఇచ్చింది. కొత్తతరం డిజిటల్ కంపెనీలు పేటీఎమ్, జొమాటో, నైకా ఇష్యూలలో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఐపీవోకు అనుమతించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పరిరక్షణరీత్యా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేసేటపుడు ఇన్వెస్టర్లు ప్రధానంగా అధిక ధరను ఆశిస్తున్న కంపెనీలకు దూరంగా ఉండాలని సూచించారు. పేటీఎమ్ షాక్ పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ 16 నెలల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి అత్యధికంగా రూ. 18,300 కోట్లు సమీకరించి 2021 నవంబర్‌లో లిస్టయ్యింది. తదుపరి ఇష్యూ ధరలో 72 శాతాన్ని కోల్పోయింది. కాగా.. సెబీ ఇటీవలి చర్యలు నిబంధనల అమలులో మర్చంట్ బ్యాంకర్లకు హెచ్చరికలుగా భావించవచ్చని మూలా వ్యవస్థాపక సీఈవో ప్రకార్ పాండే అభిప్రాయపడ్డారు. మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఇన్వెస్టర్ల బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ 9 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్, గ్లోబల్ సర్ఫేసెస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 730 కోట్లు సమీకరించాయి. రూ. 66 కోట్లు సమకూర్చుకునేందుకు ఉదయ్‌శివ్‌కుమార్ వచ్చే వారం ఐపీవోకు రానుంది. 2022లో ఓకే... గతేడాది(2022) మొత్తం 38 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. తద్వారా రూ. 59,000 కోట్లు సమీకరించాయి. అయితే 2021లో రికార్డ్‌స్థాయిలో 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. రూ. 1.2 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. ఇక గతేడాది బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీ రూ. 20,557 కోట్లు సమీకరించడం ద్వారా స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్టయ్యింది. వెరసి 2022 ఐపీవో నిధుల్లో 35 శాతం వాటాను ఆక్రమించింది. ఈ ఇష్యూని మినహాయిస్తే ప్రైమరీ మార్కెట్ నీరసించినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్య భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) ద్వితీయార్ధంలో ప్రైమరీ మార్కెట్ పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలతోపాటు పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్థిక మందగమనం, షేర్ల అధిక విలువలు తదితర అంశాలు మార్కెట్లలో దిద్దుబాట్లకు కారణంకానున్నట్లు విశ్లేషించారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్‌ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. రక్షణ శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. కంటోన్మెంట్ బోర్డుకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా, రక్షణ శాఖ స్పందించి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే.. మరోవైపు కంటోన్మెంట్ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు చేపట్టిన ప్రాసెస్కొనసాగుతుండగా, బోర్డు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెట్వికాస్మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై 23న విచారణ జరగనుంది. -
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్పీఎస్సీ. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం జరిగిన కమిషన్ ప్రత్యేక సమావేశంలో.. పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సిట్ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. ఇక రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. మరోవైపు జూనియర్ లెక్చరర్స్ పరీక్షలతో పాటు మరికొన్ని ఎగ్జామ్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్పీఎస్సీ. ఇక రద్దు చేసిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలని, వీలైనంత త్వరలో వాటి పరీక్షా తేదీలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అయితే.. కమిషన్ తాజా నిర్ణయంపై గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను జనవరి 13వ తేదీ (శుక్రవారం) విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. 503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ తొలుత భావించింది. ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేయడంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్పీఎస్సీ ముట్టడికి ఎన్ఎస్యూఐ యత్నించింది. NSUI నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఎన్ఎస్యూఐ నేతలు వాగ్వాదానికి దిగారు. -
రాహుల్ గాంధీనే స్వయంగా పర్యటన రద్దు చేసుకున్నారు
సాక్షి, లక్నో: రాహుల్ గాంధీ ప్రయాణంపై ఆకస్మిక రద్దుపై కాంగ్రెస్ రాజకీయ విమర్శకు దిగింది. సోమవారం అర్థరాత్రి లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం(యూపీ)లో షెడ్యూల్ ప్రకారం విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఐతే అనుహ్యంగా చివరి నిమిషంలో అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. దీంతో అధికారుల ఒత్తిడికి తలొగ్గి ల్యాండింగ్ చేసేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు నిరాకరించారంటూ ఆరోపణలు చేసింది కాంగ్రెస్. దీనికి వారణాసి ఎయిర్పోర్ట్ స్పందిస్తూ..రాహుల్ గాంధీనే స్వయంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించింది. దయచేసి మీ వ్యాఖ్యలను సరిదిద్దుకోండి అంటూ చురకలంటించింది. రాహుల్ ఎయిర్‌పోర్ట్‌కి తన పర్యటన రద్దు గురించి తెలియజేస్తూ ఈమెయిల్ పంపినట్లు కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ రాయ్ వాయనాడ్ నుంచి తిరిగి రాగానే విమానాశ్రయంలో రాహుల్ విమానం ల్యాండ్ కావాల్సి ఉందంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించారు. అధికారుల ఒత్తిడికిలోనై అనుమతి ఇవ్వలేదని, పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను సాకుగా ఉపయోగించుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతేగాదు తమ పార్టీ నాయకులు రాహుల్‌ని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తున్నామని, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు రాయ్. అంతేగాదు రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందని, అందుకనే వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు నిరాకరించిందని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రధానిలో ఆందోళన మొదలైందని, అందుకనే రాహుల్‌ని ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి రాహుల్ మంగళవారం కమల నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్లో జరిగే కార్యక్రమంలో ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించాల్సి ఉందని రాయ్ తెలిపారు. #Varanasi : Rahul Gandhi का प्रयागराज दौरा रद्द, फ्लाइट को नहीं मिली लैंडिंग की इजाजत, कांग्रेस नेता बोले- राहुल की लोकप्रियता से डरी सरकार@RahulGandhi @INCIndia #BreakingNews #LatestNews #UttarPradesh https://t.co/VDHtWrImfU pic.twitter.com/JdXpRkjQ5C — भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 14, 2023 (చదవండి: జస్ట్ కారు దిగి వచ్చింది.. దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..) -
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం
-
30 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం నిర్ణయించింది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కన్నెర్ర చేసింది. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేసింది. అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల పర్యవేక్షణ పూర్తయ్యింది. కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి- అధ్యాపక నిష్పత్తి, కళాశాల క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలించడానికి యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమించింది. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్ధారణ కమిటీలతో పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫార్సు ఆధారంగా ఏయే కళాశాలకు ఎన్ని ఇంజినీరింగ్ సీట్లు కేటాయించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులే కీలకం. నిజనిర్ధారణ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు జేఎన్టీయూ (ఏ) పరిధిలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో మొత్తం 98 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఉంది. 2022–23 విద్యా సంవత్సరంలో 68 ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు. తక్కిన 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. గత మూడు సంవత్సరాల్లో 25 శాతం లోపు అడ్మిషన్లు కలిగిన కళాశాలలపై వేటు పడింది. అనుభవం లేని బోధన సిబ్బంది, అరకొర వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం, అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు కల్పించకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ గుర్తింపును యూనివర్సిటీ రద్దు చేశారు. 39,195 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి 2022–23 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 39,195 ఇంజినీరింగ్ సీట్లు, 3,030 ఫార్మసీ సీట్లు, 745 ఫార్మా–డి సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. ఏపీ ఈఏపీసెట్ సీట్లు త్వరలో కేటాయించనున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ (ఏ) ఈ మేరకు నివేదించింది. కంప్యూటర్ సైన్సెస్‌తో కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులకు 53 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. కంప్యూటర్ సైన్సెస్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింహభాగం కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్ అదనపు బ్రాంచులు కావాలని కోరాయి. సదుపాయాలున్న కళాశాలలకే గుర్తింపు సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. అలాంటి కళాశాలల్లో చదివితే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడతారు. గుర్తింపు తీసుకున్న కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
ట్విటర్ గుర్రు: పగలబడి నవ్వుతున్న మస్క్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ డీల్ ప్రకటించినప్పటి నుంచి రోజుకో కొత్త పరిణామం వెలుగులోకి వస్తుంది. 44 బిలియన్ల డాలర్లతో ట్విటర్‌ను సొంతం చేసుకోవాలనుకున్న మస్క్ ఆ తరువాత, ఆ డీల్‌ను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు ప్రకటించారు. నకిలీ ఖాతాల సమాచారాన్ని అందించడంలో ట్విటర్ వైఫల్యం నేపథ్యంలో కొనుగోలు విరమించుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ట్విటర్ డీల్ రద్దుపై ట్విటర్ దావా వేయనుందన్న వార్తలపై తాజాగా మస్క్ స్పందించారు. వరుస ట్వీట్స్‌తో ట్విటర్‌పై సెటైర్లు వేశారు. మొదట నేను అసలు ట్విటర్‌ను కొనుగోలు చేయలేను అన్నారు. డీల్ ప్రకటించిన తరువాత నకిలీ ఖాతాల సమాచారాన్ని వెల్లడించలేదు. ఇపుడు ట్విటర్‌ను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారంటూ ఎగతాళిగా కమెంట్ చేశారు. అంతేకాదు ఇపుడిక వారు కోర్టులో నకిలీ ఖాతాల సమాచారాన్ని బహిర్గతం చేయాలంటూ ట్వీట్ చేశారు. కాగా మల్టీ బిలియన్ డాలర్ల ట్విటర్ డీల్ రద్దు చేసుకున్న బిలియనీర్‌పై దావా వేసేందుకు ట్విటర్ ప్రముఖ లా ఏజెన్సీతో సంప్రదింపులు చేస్తోంది. అమెరికా ఆధారిత న్యాయ సంస్థ వాచెల్, లిప్టన్, రోసెన్ కాట్జ్ ఎల్ఎల్పీని ఇందుకోసం నియమించుకుంది. ఈ వారం ప్రారంభంలో డెలావేర్లో పిటిషన్ దాఖలు చేయనుందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. మరోవైపు ఇదే ఏజెన్సీ 2018లో టెస్లాను తీసుకోవాలనే మస్క్‌కు సలహాదారుగా ఉండటం విశేషం. pic.twitter.com/JcLMee61wj — Elon Musk (@elonmusk) July 11, 2022 -
విజయవాడ ప్యాసింజర్ లేనట్టేనా?
అనంతపురం సిటీ: కరోనా సాకుతో మూడేళ్ల క్రితం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లలో ‘అనంతపురం–విజయవాడ’ ఒకటి. అయితే, కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గినా నేటికీ ఈ రైలును పునఃప్రారంభించలేదు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. రెండేళ్ల తరువాత దశల వారీగా రైళ్లను పునఃప్రారంభిస్తున్నా.. ఈ ప్యాసింజర్ రైలు విషయంలో రైల్వే శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద,మధ్య తరగతికి పెద్దదిక్కు విజయవాడకు వెళ్లే (ట్రైన్ నంబర్:56503/04) ఈ ప్యాసింజర్ రోజూ ఉదయం 7.20 గంటలకు బెంగళూరు (యశ్వంతపుర)లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం చేరేది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకునేది. మొత్తం 13 బోగీలతో 700 మంది ప్యాసింజర్ల కెపాసిటీతో 75 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణించి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేది. రైలు ద్వారా రోజూ 2 వేల నుంచి 3 వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. వీరిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే అధికం. రాష్ట్ర విభజన తరువాత విజయవాడకు పెరిగిన రద్దీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నత చదువులు గానీ, మెరుగైన వైద్యసేవల కోసం గానీ మరే ఇతర అవసరాల కోసమైనా ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌తో సత్సంబంధాలు తగ్గిపోయాయి. పిల్లల చదువులు, ఇతర పనులపై ఇప్పుడు ఎక్కువగా విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు ఎక్కువగా విజయవాడకు తిరగడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందిపోయి, ఉన్న రైళ్లను రద్దు చేయడం ఏమిటో అంతుబట్టడం లేదు. (చదవండి: కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం) -
రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దేశంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఆయా మార్గాలలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ► విశాఖపట్నంలో ఈ నెల 29, వచ్చేనెల 5, 12, 19 తేదీలలో బయల్దేరే విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్(22847) వయా రాయగడ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. ► లోకమాన్యతిలక్ టెర్మినస్‌లో ఈ నెల 31, వచ్చేనెల 7, 14, 21 తేదీలలో బయల్దేరే లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(22848) ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో రద్దయిన రైళ్లు.. ► సంబల్పూర్లో బయల్దేరాల్సిన సంబల్పూర్–రాయగడ(18301) ఎక్స్‌ప్రెస్ ► రాయగడలో బయల్దేరాల్సిన రాయగడ–సంబల్పూర్(18302) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–భువనేశ్వర్(22820) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► భువనేశ్వర్‌లో బయల్దేరాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం (22819) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–పలాస(18532) ఎక్స్‌ప్రెస్ ► పలాసలో బయల్దేరవలసిన పలాస– విశాఖపట్నం(18531) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరవలసిన విశాఖపట్నం–కోరాపుట్(08546) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► కోరాపుట్‌లో బయల్దేరవలసిన కోరాపుట్–విశాఖపట్నం(08545) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► పూరీలో బయల్దేరాల్సిన పూరి–గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్ ► గుణుపూర్‌లో బయల్దేరాల్సిన గుణుపూర్–పూరి (18418) ఎక్స్‌ప్రెస్. -
ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..
దేశవ్యాప్తంగా పలు ప్యాసింజర్ రైళ్లను అర్ధాంతరంగా ఇండియన్ రైల్వేస్ రద్దు చేస్తోంది. అంతేకాదు చాలావరకు ప్యాసింజర్ రైళ్లు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. ఈ పరిణామాలేవీ ఊహించని ప్రయాణికులు.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎందుకంటారా?.. తీవ్రమైన బొగ్గు కొరత. అవును.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొనసాగుతోంది. వేసవి కావడం.. విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం తలెత్తే ఘటింకలు మోగుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. బొగ్గు సరఫరా కోసం మార్గం సుగమం చేసేందుకే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపడం చేస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతంగా బొగ్గు లోడ్‌ను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో 70 శాతం కరెంట్ బొగ్గు నుంచే ఉత్పత్తి అయ్యేది. అలాంటిది దేశంలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్ కోతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే ఈ శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తంగా 670 ప్యాసింజర్ ట్రిపులను మే 24వ తేదీవరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు నొటిఫై చేసింది రైల్వేస్. అయితే ఏయే రూట్లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్‌కృష్ణ బన్సాల్. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరుతున్నారు. బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కొనడం సహజంగా మారింది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. అలాగే రద్దీగా ఉండే మార్గాల్లో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తంటాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ, గనులకు దూరంగా ఉన్న వినియోగదారుల కోసం క్యారియర్ బొగ్గు రవాణా కొనసాగుతోంది. ఢిల్లీలో పరిస్థితి ఘోరం ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్‌ను దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మెట్రో రైళ్లతో పాటు ఆస్పత్రుల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోతుందటూ ఢిల్లీ సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
రమేశ్ బాబు మృతి.. 'హీరో' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
Ramesh Babu Passed Away,Hero Movie Pre Release Event Cancelled: సూపర్‌స్టార్ కృష్ణ మనువడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా నటించిన చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు(ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న హీరో చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఏపీ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
-
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహించడానికే ముందు నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇదే మా మొదటి ప్రాధాన్యం. ఈ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదు. కానీ సుప్రీంకోర్టు పేర్కొన్న టైమ్ షెడ్యూల్లో పరీక్షలు, ఫలితాల ప్రకటన వీలుకాదు. అందుకే పరీక్షలను రద్దు చేస్తున్నాం. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడానికి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నాం. – మంత్రి ఆదిమూలపు సురేష్ సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పదిరోజుల్లో మార్కుల ఎవాల్యుయేషన్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31లోగా ఫలితాలు ప్రకటించేలా గురువారం సుప్రీంకోర్టు ప్రకటించిన టైమ్ షెడ్యూల్లో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలకు కామన్‌గా ఇదే టైమ్ షెడ్యూల్ ఉంది. పైగా జూలై 31 తరువాత ఉన్నతవిద్య ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా యూజీసీని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల అవకాశాలను మన విద్యార్థులు నష్టపోరాదు. అందుకే రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నాం..’ అని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు టెన్త్ పరీక్షలను కూడా రద్దుచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడం సహా ఇతర అంశాలకు సంబంధించి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణే మొదటి ప్రాధాన్యమని, కానీ కోర్టు పేర్కొన్న టైమ్ షెడ్యూల్లో పరీక్షలు, ఫలితాల ప్రకటన సాధ్యంకాదు కనుకనే రెండో ఆప్షన్‌గా పరీక్షలను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్షలు, ఫలితాల వెల్లడికి కనీసం 45 రోజులు పడుతుంది ‘12వ తరగతి (ఇంటర్మీడియట్)కు సంబంధించి మార్కులు పదిరోజుల్లోపల ఫైనలైజ్ చేయాలని, మొత్తం ఫలితాలు జూలై 31 లోపల ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షల నిర్వహణ మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయం అవసరం. దీనికి అదనంగా 15 రోజులు ముందుగా విద్యార్థులకు టైమ్‌టేబుల్ సమాచారం ఇవ్వాలి. మొత్తం ప్రక్రియ పూర్తిచేయడానికి కనీసం 45 రోజులు పడుతుందని గతంలో కూడా పలుమార్లు చెబుతూ వచ్చాం. ఆ మేరకు సమయం ఉంటేనే ప్రాసెస్ అంతా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించేందుకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని ఆదేశాల ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో అనగా జూలై 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తిచేయడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి తెలియచేశాం. ఈ విషయంపై పూర్తిగా చర్చించాం. సుప్రీంకోర్టు గడువు తేదీలను పేర్కొంటూ చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని చెప్పింది. అంతకు ముందు ఉన్నతవిద్య ప్రవేశాలకు సంబంధించి యూజీసీకి కొన్ని ఆదేశాలు, సూచనలు ఇచ్చింది. సీబీఎస్ఈ, ఐసీఎస్సీ, స్టేట్‌బోర్డులు ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉన్నతవిద్య కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోకి ప్రవేశాలను చేపట్టాలని యూజీసీకి ఆదేశాలు ఇచ్చి ఉంది. యూజీసీ కూడా ఉన్నతవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను జూలై 31 తరువాత చేపడతామని ప్రకటించింది. కనుక దేశమంతా ఒకే పద్ధతి వస్తున్న పరిస్థితుల్లో మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో, వేరే సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులో ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వీలుకాదు. ఈ పరిస్థితుల్లో ఇంటర్ థియరీ పరీక్షలు 2020–21ని రద్దుచేస్తున్నాం. అదేవిధంగా ఇవే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షలను కూడా రద్దుచేస్తున్నాం..’ అని మంత్రి సురేష్ చెప్పారు. పరీక్షల నిర్వహణే మా మొదటి ఆప్షన్ ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పరీక్షల విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్థావస్థ లేనేలేదని స్పష్టం చేశారు. ‘ప్రారంభం నుంచి ఈరోజు (గురువారం) ఉదయం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసేవరకు కూడా కోవిడ్–19 ప్రొటోకాల్ నిబంధనలన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామనే మేం చెబుతూ వచ్చాం. ప్రతి గదికి 15 మంది విద్యార్థులుండేలా చూడడం, భౌతికదూరం పాటించడం, కోవిడ్–19 ప్రొటోకాల్‌లోని చివరి అంశం వరకు అన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతోనే ఉన్నాం. పరీక్షల నిర్వహణ అనేదే మా మొదటి ప్రాధాన్యం. పరీక్షల రద్దు అనేది రెండో ఆప్షన్ మాత్రమే. మా ముఖ్యమంత్రి మొదటినుంచి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని పలుసార్లు చెబుతూ వస్తున్నారు. పరీక్షలు నిర్వహించడానికే మేము ముందునుంచి ప్రయత్నిస్తున్నాం.అదే విషయాన్ని అఫిడవిట్లో కూడా స్పష్టంగా చెప్పాం. పరీక్షల విషయంలో ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ అనేది ఎక్కడా లేదు. అఫిడవిట్లో కూడా పరీక్షలు ఎలా నిర్వహిస్తామో అన్న అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నాం. మొదటి నుంచి కూడా పరీక్షల నిర్వహణకు ఎన్నిరోజులు ఉండాలో చెబుతూ వస్తున్నాం. పరీక్షల నోటిఫికేషన్ నుంచి విద్యార్థులు సన్నద్ధం అవ్వడానికి తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు కనీసం 15 రోజులైనా సమయం ఇచ్చి తరువాత పరీక్షలు నిర్వహించాలి. ఇంటర్లో 7 పేపర్లున్నాయి. రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించేలా ఇంతకుముందే షెడ్యూల్ కూడా ఇచ్చాం. జూలై 27లోగా పూర్తిచేయాలనుకున్నాం. ఆ తరువాత ఎవాల్యుయేషన్కు 15 రోజులు. అనంతరం ఇతర ప్రక్రియలను పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలనుకున్నాం. గౌరవ న్యాయస్థానం గడువులను నిర్దేశిస్తూ వాటిని అనుసరించి ముందుకెళ్లాలని ఆదేశించినందున మాకు మరో ఆప్షన్ లేదు. కోర్టు ఆదేశించిన టైమ్ షెడ్యూల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చింది’ అని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను నెలరోజుల కిందటే తాము ప్రకటించామని గుర్తుచేస్తూ ఆ షెడ్యూల్ ప్రతిని చూపారు. ‘పరీక్షలను జూలై 7 నుంచి ప్రారంభిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నాం. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్వహిస్తారని అడగలేదు. ఎలా నిర్వహిస్తారని మాత్రమే అడిగింది. అదే విషయం చెప్పాం. ఏయే ప్రక్రియలను దశలవారీగా ఎలా నిర్వహిస్తామో కూడా కోర్టుకు చెప్పాం. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వంలో తొలినుంచి ఎలాంటి సందిగ్ధతా లేదు..’ అని మంత్రి స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ సూచనల మేరకు మార్కుల కేటాయింపు ‘ఆయా తరగతులకు సంబంధించిన మార్కులను ఏ పద్ధతుల్లో కేటాయించాలన్న దానిపై త్వరలోనే విధానాన్ని ప్రకటిస్తాం. మార్కులు ఎలా తీసుకోవాలన్న దానిపై సీబీఎస్ఈ సవివర గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఎలా అసెస్మెంటు చేయాలి? ఏయే పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలను అందులో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏవిధంగా అసెస్మెంటు చేయాలి? ఎలా మార్కులు తీసుకోవాలో ఆ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు. చదవండి: ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ -
ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన
సాక్షి, అమరావతి: గ్రూప్ -1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్ – 2, గ్రూప్ – 3 సహా ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వివరించాయి. ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట... ప్రిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థులు ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తమ వారి కోచింగ్ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్ –1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చేది. కోచింగ్ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతోపాటు కోచింగ్ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
Lockdown: పెళ్లి వాయిదా మనస్తాపంతో టవరెక్కిన యువకుడు
సాక్షి, హొసపేటె(కర్ణాటక): తనను ప్రేమించిన అమ్మాయితో తల్లిదండ్రులు వివాహం చేయలేదని ఆవేదన చెందిన ఓ యువకుడు మొబైల్ టవరెక్కి హల్చల్ చేశాడు. వివరాలు... తాలూకాలోని మరియమ్మనహళ్లికి చెందిన చిరంజీవి గొసంగి (23) ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. అయితే లాక్డౌన్ కారణంగా పెళ్లిని వాయిదా వేయడం చిరంజీవికి నచ్చలేదు. సోమవారం పాత వీరభద్రశ్వర టాకీస్ వద్ద నున్న మొబైల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. పెళ్లి చేయకపోతే దూకుతానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకొన్న చుట్టు పక్కల ప్రజలు టవర్ వద్దకు వచ్చి మకాం వేశారు. సమాచారం అందుకున్న సీఐ వసంత, ఎస్ఐ మీనాక్షి, అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు రప్పించడంతో కథ సుఖాంతమైంది. చదవండి: నాకూ ఈటల గతి పడుతుందని అనుకున్నారు -
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు: మంత్రి సబితా
►సబ్జెక్టుల వారీగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో.. అవే మార్కులను సెకండియర్‌లోనూ కేటాయించే అవకాశం ఉంది.విద్యార్థులు రాసిన ►రికార్డ్ బుక్‌ల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులను ఇవ్వాలని అధికారుల ఆలోచన. ►బైపీసీ విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 30 మార్కుల చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులు, ఎంపీసీ విద్యార్థులకు రెండు సబ్జెక్టులకు కలిపి 60 మార్కులను కేటాయించే యోచన. ►ఫస్టియర్‌లో ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఇవ్వాలని.. పైచదువులకు వెళ్లేవారికి కనీస మార్కుల నిబంధన సమస్య రాకుండా చూడాలనే ప్రతిపాదన! ►మార్కులపై ఏం చేయాలన్న దానిపై కమిటీ. ఆ కమిటీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు చదవడమే ఓ పరీక్షగా మారిందని.. దానికితోడు పరీక్షల నిర్వహణ సమస్య తలెత్తిందని ఆమె చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్ ఇంతకు ముందే.. విద్యార్థుల ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులు కేటాయించాలని ఆదేశించారు. తర్వాత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను కూడా రద్దుచేసి, విద్యార్థులను సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించినా.. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం వద్దని సీఎం సూచించారు. తల్లిదండుల ఆందోళన, విద్యార్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు చేయాలన్నారు.ఈ మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నాం..’’ అని సబిత ప్రకటించారు. విధి విధానాలపై కమిటీ.. విద్యార్థులను ఎలా పాస్ చేయాలన్న దానిపై విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం కమిటీ వేశామని, రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక వస్తుందని, త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థుల ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్‌లో మార్కులు వేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చే మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలను ఇటీవల రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల రద్దు వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. కనీస మార్కుల సమస్య రాకుండా.. గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో దాదాపు 1.99 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో కొందరు ఒక సబ్జెక్టు ఫెయిల్ కాగా.. మరికొందరు ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ప్రస్తుతం వారంతా సెకండియర్ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో.. ఫస్టియర్ ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీస మార్కులను కేటాయించేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. వారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు వేసి పాస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంతేగాకుండా సెకండియర్‌లోనూ 45 శాతం మార్కులు వేయాలని.. పైచదువులకు వెళ్లినపుడు కనీస అర్హత మార్కుల నిబంధనతో ఇబ్బంది రాకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. జూలై మధ్యలో నిర్వహించాలనుకున్నా.. వాస్తవానికి జూలై మధ్యలో ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రం ప్రభుత్వం కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. జూలై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టులో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. పరీక్ష సమయాన్ని 90 నిమిషాలకు కుదిస్తామని, సగం ప్రశ్నలకే జవాబులు రాసేలా చర్యలు చేపడతామని పేర్కొంది. అయితే కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయడం, కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం, థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో పరీక్షల రద్దుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. అధికారుల కమిటీ ఇచ్చే విధివిధానాల మేరకు ఇంటర్ బోర్డు మార్కులను కేటాయించి ఫలితాలను వెల్లడించనుంది. చదవండి: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు లాక్డౌన్: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు -
TSRJC: టెన్త్ గ్రేడ్‌లతోనే ఇంటర్ అడ్మిషన్
సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పరీక్ష రద్దు చేసి పదోతరగతి గ్రేడ్ పాయింట్ల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) నిర్ణయించింది. ఈ సొసైటీ పరిధిలో దాదాపు రెండువందల గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పదో తరగతి గ్రేడ్ పాయింట్లను అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ మేరకు వెబ్సైట్లో ఆప్షన్లు ఇస్తూ సాంకేతిక మార్పులు చేసింది. ఈ నెల ఏడో తేదీలోగా వెబ్సైట్లో టెన్త్ గ్రేడ్ పాయింట్లు, జీపీఏ పాయింట్లు తదితర వివరాలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. పాయింట్ల ఆధారంగా వడపోసి సీట్లు కేటాయించనున్నట్లు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ స్పష్టం చేసింది. ఇతర సొసైటీలదీ అదే దారి? తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఈ సొసైటీలు కూడా ఏటా అడ్మిషన టెస్ట్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ మాదిరిగానే ఇతర సొసైటీలు కూడా పదోతరగతి గ్రేడ్ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అతి త్వరలో ఈ సొసైటీలు కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాణాలు మెరుగుపడటంతో... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో గురుకుల విద్యాసంస్థలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. వీటిలో ప్రవేశాలకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తూ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నాయి. ఈ ఏడాది కూడా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఆర్జేసీ సెట్) నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాయి. కానీ, కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో అడ్మిషన్ టెస్ట్ నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రవేశపరీక్ష విధానాన్ని ఈసారికి రద్దు చేసింది. -
ఏపీ పరిషత్ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. పరిషత్ ఎన్నికలపై హైడ్రామా ఏప్రిల్ 8న ఏపీలో పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 1న పోలింగ్ తేదీలు ఎస్ఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 6న పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇవ్వగా, ఏప్రిల్ 8న హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే రద్దు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించింది. ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. నేడు పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే AP Budget 2021: జన సాధికార బడ్జెట్ -
పీటల మీద పెళ్లి ఆపిన వధువు.. కారణం తెలిస్తే షాకే!
పెళ్లి పీటల వరకూ వచ్చి వివాహాలు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మాయి వాళ్లు కట్నం తక్కువ ఇచ్చారని, మర్యాదలు సరిగా చేయలేదని, వధూవరుల్లో ఎవరికైనా ప్రేమ వ్యవహారం ఉందని తెలియడం.. ఇలా పెళ్లి నిలిచిపోవడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు చిన్న విషయాలు దాచడం వల్ల కూడా పెళ్లి ఆగిపోతుంది. అబ్బాయికి బట్టతల ఉందని, అమ్మాయి పొట్టిగా ఉందని ఇలాంటి కారణాలతో కూడా జరగకుండా ఆగిపోతుంటాయి. అచ్చం ఇలాంటి కారణంతోనే ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని ‘స్టాప్’ అంటూ క్యాన్సిల్ చేసింది. ఇంతకీ ఆ రీసన్ ఎంటో తెలుసుకోవాలంటే మ్యాటర్‌లోకి ఎంటర్ అవ్వాల్సిందే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విద్యావంతురాలైన యువతికి ఇటీవల మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. శనివారం సాయంత్రం వివాహ కోసం మందిరానికి చేరుకున్నారు. అయితే వరుడి విద్యార్హతలపై అనుమానం వచ్చిన వధువు.. తనకు కాబోయే భర్తకు పెళ్లికి కొన్ని క్షణాల ముందు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టింది.పెళ్లి దండలు మార్చుకునే ముందు అతన్ని రెండో ఎక్కం చెప్పాలని ప్రశ్నించింది. కానీ ఇది చెప్పడంలో వరుడు తడబడ్డాడు. ‘రెండో ఎక్కమేగా.. హహ చెప్పేస్తా.. చిన్నప్పుడు చదివింది కదా.. ఏం గుర్తుంటుంది.. చెప్పేస్తా... రెండు... రెండు.. ఆరు అంటూ నీళ్లు మింగాడు. ఇంకేముంది ఆగ్రహం చెందిన వధువు నిరక్షరాస్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోనని ఖరాకండిగా చెప్పేసింది. ఆ వ్యక్తికి కనీసం రెండో ఎక్కం కూడా రాదని, పెళ్లిని నిలిపివేసింది. పెళ్లి చేసుకోమని స్నేహితులు, బంధువులు వధువును ఒప్పించినా ఫలితం లేకపోయింది. వరుడు చదువురానివాడు అని తెలిసి తాము షాక్ అయ్యారని వధువు బంధువు చెప్పారు. వరుడి విద్య గురించి తమ కుటుంబం అబద్దం చెప్పారని, అతను పాఠశాలకు కూడా పోలేదని తెలిసిందన్నారు. వరుడి కుటుంబం మమ్మల్ని మోసం చేసినప్పటికీ నా సోదరి ధైర్యంగా సమాజానికి భయపకుండా పెళ్లిని ఆపేసిందని తెలిపారు. చదవండి: కరోనా ఎఫెక్ట్ : లైవ్‌లో పెళ్లి.. ఆన్లైన్లో దీవెనలు -
చేతక్ వాహనప్రియులకు షాక్: మళ్లీ బ్రేకులు
ముంబై: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. బుకింగ్స్‌ను పునఃప్రారంభించిన 48 గంటల్లోనే కంపెనీ మళ్లీ నిలిపివేసింది. సప్లయి చెయిన్‌లో అనిశ్చితే ఇందుకు కారణమని తెలిపింది. తదుపరి బుకింగ్ రౌండ్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. బజాజ్ కంపెనీ చేతక్ ఈ-స్కూటర్స్ బుకింగ్స్‌ను ఈ నెల 13న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్లైన్లో రీ-ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత బెంగళూరు, పుణే నగరాల్లో మాత్రమే బుకింగ్స్‌కు అవకాశం కల్పించింది. కస్టమర్ల నుంచి అధిక స్పందన లభించిందని.. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో విపరీతమైన అంతరాయాలు, సుదీర్ఘ నిరీక్షణ కాలం ఉన్నప్పటికీ బుకింగ్స్‌ను చాలా తక్కువ రద్దు చేశామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. ఇప్పటికే బుకింగ్స్ తీసుకున్న కస్టమర్లు త్వరగా డెలివరీలను స్వీకరించి, రైడింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సరఫరా గొలుసు సమస్యలను పరిష్కరించి.. వీలైనంత త్వరగా బుకింగ్స్‌ను రీ–ఓపెన్ చేస్తామని.. వచ్చే త్రైమాసికంలో మరిన్ని నగరాలలో కూడా బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చేతక్‌లో అర్బన్, ప్రీమియం రెండు మోడల్స్ ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రత్యేకమైన యాప్‌కు కనెక్ట్ చేయబడిన ఈ–స్కూటర్లకు ప్రమాదం జరిగినా లేదా దొంగిలించబడినా సరే సంబంధిత స్కూటర్ యజమానికి నోటిఫికేషన్స్ వెళతాయి. ధరలు అర్బన్ రూ.1.22 లక్షలు, ప్రీమియం రూ.1.26 లక్షలు(పుణే ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. -
పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.10 వేల జరిమానా
హైదరాబాద్: ఒప్పంద డిగ్రీ, జూనియర్ అధ్యాపకులను క్రమబద్ధీకరించవద్దన్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. క్రమబద్ధీకరించకుండా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని 2016లో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరించిందా అని ఈ సందర్భంగా పిటీషనర్లను న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు రూపొందించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మంది నిరుద్యోగులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరిస్తున్నారని ఊహించుకొని పిటిషన్ ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ఒక్కొక్కరు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ చర్యతో పిటిషన్‌దారులు అవాక్కయ్యారు. -
ఎంసెట్‌లో వెయిటేజీ రద్దు?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25% వెయిటేజీ విధానం ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చలేకపోతుం డటంతో దాన్ని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇం టర్ చదువుకు ప్రాధాన్యం పెంచడంతో పాటు ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఈ విధా నాన్ని 2008లో అమల్లోకి తీసుకురాగా నాటి నుంచి కార్పొ రేట్ కాలేజీలు దీన్ని అనుకూలంగా మార్చుకున్నాయన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇంటర్ ప్రాక్టికల్స్‌లో తమ విద్యార్థుల సామ ర్థ్యం మేరకు మార్కులు వేస్తుండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం తమ విద్యార్థులకు అక్రమంగా 120కి 120 మార్కులు వేసుకొని ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు కొల్లగొడుతూ విద్యా వ్యాపారం సాగిస్తున్నాయన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెయిటేజీ విధానాన్ని రద్దు చేసే యోచనలో ప్రభుత్వ వర్గాలు పడ్డాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలోనే ఈ మేరకు కసరత్తు జరిగినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం ఈ అంశం తెలం గాణ, ఏపీ ఉమ్మడి ప్రవేశాల విధానంతో ముడిపడి ఉన్నందు వల్ల ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్‌తోనూ చర్చించాల్సి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అదేమీ సమస్య కాబోదని, ప్రభుత్వం తలచుకుంటే సులభమేనని అధికారులు చెబుతున్నారు. వెయిటేజీ ఎందుకు వచ్చిందంటే.. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం 1983లో ఎంసెట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కొన్నాళ్లు అది బాగానే ఉన్నా కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ కంటే ఎంసెట్ శిక్షణకు ప్రాధాన్యాన్ని పెంచాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు సమస్యలు మొదలయ్యాయి. జూనియర్ కాలేజీలు రెండుగా విడిపోయాయి. ప్రభుత్వ కాలేజీలు కేవలం ఇంటర్ చదువుకే ప్రాధాన్యం ఇవ్వగా కార్పొరేట్ కాలేజీలు సీట్ల కోసం ఎంసెట్‌కు ప్రాధాన్యం పెంచుతూ పోయాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఎంసెట్ వంటి శిక్షణ లేక ఎంసెట్‌లో వెనుకబడిపోవడం, కార్పొరేట్ కాలేజీలు ప్రత్యేక శిక్షణల పేరుతో ముందుకు సాగడంతో ఇంటర్ విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై అప్పట్లో ప్రభుత్వం ప్రొఫెసర్ దయారత్నం కమిటీని నియమించింది. అమలుకు నోచుకోని మిగతా సిఫారసులు.. ప్రొఫెసర్ దయారత్నం కమిటీ ఇంటర్ విద్యపై అనేక కోణాల్లో అధ్యయనం చేసి 12 ప్రధాన అంశాలపై సిఫారసులు చేసింది. అందులో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ప్రధాన అంశంగా పేర్కొంది. దాంతోపాటు ఎంసెట్ ప్రాధాన్యాన్ని తగ్గించి ఇంటర్ ప్రాధాన్యాన్ని పెంచేలా సిఫారసులు చేసింది. భవిష్యత్తులో ఎంసెట్ అవసరమే లేకుండా ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టేలా సిఫారసు చేసింది. అందులో భాగంగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో మొదటి ఏడాది ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ (ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ఖరారు చేసేలా) ఇవ్వాలని సూచించింది. ఆ తరువాత సంవత్సరాల్లో ఏటా ఇంటర్ వెయిటేజీని 50 శాతం, 75 శాతం ఇచ్చేలా, చివరకు 100 శాతం ఇంటర్ మార్కులతోనే ప్రవేశాలు చేపట్టేలా సిఫారసు చేసింది. ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం పెంచిన నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేసుకోకుండా చూసేలా మరో సిఫారసు చేసింది. అందుకే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. అయితే ఆ సిఫారసుల్లో 25 శాతం వెయిటేజీని 2008లో అమల్లోకి తెచ్చారు. ఆ తరువాత కాలంలో మిగతా సిఫారసులను అమలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నష్టపోతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు... ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ లేకపోవడం, ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ వల్ల ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల విద్యార్థులకు కూడా నష్టం తప్పట్లేదు. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో ఎక్కువ మార్కులు వేయట్లేదు. నాలుగు సబ్జెక్టులకుగాను ప్రాక్టికల్ మార్కులు ఒక్కో దాంట్లో 30 చొప్పున 120 ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఆయా కాలేజీల ఫ్యాకల్టీ... విద్యార్థులకు వచ్చిన మేరకే మార్కులను వేస్తున్నారు. మరోవైపు ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం లేకపోవడంతో కార్పొరేట్ కాలేజీలు తమ విద్యార్థుల్లో ఎక్కువ మందికి 120కి 120 మార్కులను వేసుకుంటున్నాయి. దీంతో కార్పొరేట్ కాలేజీల విద్యార్థులకు ప్రాక్టికల్ మార్కులు స్కోరింగ్‌కు బాగా ఉపయోగపడి మంచి ర్యాంకులు వస్తుండగా, ఇవేవీ లేని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల్లో వెనుకబడిపోతున్నారు. పైగా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల నియామకం లేక కొందరు రెగ్యులర్ లెక్చరర్లు, మరికొందరు కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొట్టుస్తుండటం, ఎంసెట్ కోసం ప్రత్యేక శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిపై 2012లో అప్పటి ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన అసెంబ్లీ కమిటీ కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దుకే సిఫారసు చేసింది. 2014లో రాష్ట్ర విభజన తరువాత దీనిపై చర్చ జరిగినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మళ్లీ ఈ అంశంపై మళ్లీ ఆలోచనలు మొదలయ్యాయి. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులపై ఒత్తిడి... ప్రభుత్వ కాలేజీల్లో ఎంసెట్ శిక్షణపై ప్రత్యేక విధానం ఏమీ లేదు. పైగా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కాలేజీలు, గ్రామీణప్రాంత కాలేజీల్లో చదివే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంటర్‌తోపాటు ఎంసెట్ శిక్షణ తీసుకోలేని విద్యార్థులు నష్టపోతున్నారు. – డాక్టర్ పి. మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రద్దు చేయడమే మంచిది ఇంటర్లో ప్రాక్టికల్స్ మార్కుల విధానంపై అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తే మంచిది. దీనిపై అవసరమైతే ప్రభుత్వానికి లేఖ రాస్తాం. జేఈఈలో ఇంటర్‌కు ఉన్న 40 శాతం వెయిటేజీ మార్కులను ఇప్పటికే తొలగించారు. – ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సవరించిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక క్యాలెండర్లో భారత్‌లో జరగాల్సిన ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నీ, సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్–300 టోర్నీలకు స్థానం లేకుండా పోయింది. ఈ ఏడాదికి ఈ రెండు టోర్నీలను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. పాత షెడ్యూల్ ప్రకారం ఇండియా ఓపెన్ మార్చిలో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా ఈ టోర్నీని డిసెంబర్‌కు వాయిదా వేశారు. సయ్యద్ మోదీ ఓపెన్‌ను నవంబర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ తాజాగా సవరించిన క్యాలెండర్లో ఈ రెండు టోర్నీలను తొలగించారు. అయితే అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో జరగాల్సిన థామస్ కప్, ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను యధావిధిగా నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. -
నాలుగో రోజు వర్షార్పణం
మాంచెస్టర్: ఇంగ్లండ్ చేతికొచ్చిన మ్యాచ్‌పై చినుకులు పడ్డాయి. అలా... ఆఖరి టెస్టులో ఓటమికి సిద్ధమైన దశలో వెస్టిండీస్‌కు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానమంతా చిత్తడిగా మారడంతో ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. రోజంతా వాన అంతరాయం కలిగించగా... అంపైర్లు పలుమార్లు అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు. అయితే ఏ దశలోనూ మ్యాచ్ జరిగేలా కనిపించలేదు. ఇక చేసేదిలేక భారత కాలమానం ప్రకారం రా.8.40 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 399 పరుగుల ఛేదనలో విండీస్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. విండీస్ బ్యాటింగ్ బలహీనతను బట్టి చూస్తే రెండు రోజులు క్రీజ్‌లో నిలబడటం అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు ఒక రోజంతా వాన బారినపడటం జట్టుకు ఊరట కలిగించింది. ఇక చివరి రోజు మంగళవారం తమ 8 వికెట్లను కాపాడుకొని విండీస్ డ్రా చేసుకోగలదా అనేది ఆసక్తికరం. మరో రోజు కూడా వరుణుడు వారికి అండగా నిలిస్తే విజ్డన్ ట్రోఫీని హోల్డర్ సేన నిలబెట్టుకుంటుంది. -
మూడో రోజు వర్షార్పణం
మాంచెస్టర్: వెస్టిండీస్‌పై రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ మూడో రోజు శనివారం వాన కారణంగా ఆట పూర్తిగా రద్దయింది. ఉదయంనుంచి కురిసిన వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో నిర్ణీత సమయంకంటే ఆట ఆలస్యంగా ప్రారంభం కావచ్చని అనిపించింది. అయితే మరోసారి వాన రావడంతో అది సాధ్యం కాలేదు. కొంత తగ్గినట్లు అనిపించినా...విరామం లేకుండా కురిసిన చినుకులతో ఒక్క బంతి కూడా వేసే అవకాశం లేకపోయింది. ఐదు గంటలకు పైగా వేచి చూసిన అంపైర్లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 469 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. మూడో రోజు ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఇంగ్లండ్ కోల్పోయింది. తొలి టెస్టు నెగ్గిన విండీస్ ప్రస్తుతం 1–0తో ముందంజలో ఉంది. -
ఆసియాకప్ 2020 వాయిదా : గంగూలీ
ముంబై : కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే ఆసియా కప్ నిర్వహించాలా వద్దా అనే దానిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం (జూలై 9న) జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా ఒకరోజే ముందే గంగూలీ ఆసియా కప్ రద్దు అయినట్లు ప్రకటించడం విశేషం. బుధవారం ఒక ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్లో పాల్గొన్న గంగూలీ.. అందులో భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ జట్టును తిరిగి మైదానంలో ఎప్పుడు చూస్తామని ప్రశ్నించారు. (క్రికెట్ బంతితో కరోనా వైరస్?) దీనిపై గంగూలీ స్పందిస్తూ.. 'టీమిండియా మొదట ఏ సిరీస్ ఆడుతుందో చెప్పడం కష్టం. కరోనా వైరస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. మనం చేయగలిగేది వేచి ఉండటమే. అయితే ఐపీఎల్ 2020 వాయిదా పడింది. టీ 20 ప్రపంచ కప్ పై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటే... మనం ఐపీఎల్ గురించి ఆలోచించగలము. ఇక సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ రద్దు చేయబడింది. కాబట్టి భారతదేశంలో క్రికెట్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో ప్రస్తుతానికి నేను చెప్పలేను' అని తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ ఈ ఏడాది చివర్లో శ్రీలంకలో లేదా యుఎఇలో షెడ్యూల్ చేసిన విధంగా ఆసియా కప్ 2020 ముందుకు సాగుతుందని హామీ ఇచ్చిన కొద్ది రోజులకే గంగూలీ ఈ ప్రకటన చేశాడు. అయితే ఈ విషయం పై పీసీబీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. -
విమాన టికెట్ డబ్బు వెనక్కి ఇవ్వరా..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్ డబ్బులను పూర్తిగా వాపసు ఇవ్వకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు దృష్టి సారించింది. పూర్తి సొమ్ము వెనక్కు ఇచ్చేలా విమానయాన సంస్థలకు ఆదేశాలకు ఇవ్వాలని దాఖలైన ఒక పిటిషన్‌పై పౌర విమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)లకు నోటీసులు జారీ చేసింది. ‘ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా’ రద్దయిన ప్రయాణ టిక్కెట్ డబ్బును తరువాత వినియోగించడానికి ఉద్దేశించిన ‘క్రెడిట్ షెల్’ యంత్రాంగంలోకి మళ్లించడం ‘చట్ట విరుద్ధమని’ పిటిషన్ సుప్రీంకు విన్నవించింది. ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించి నోటీసులకు ఆదేశాలిచ్చింది. కోవిడ్–19 నేపథ్యంలో రద్దయిన విమాన టికెట్ల డబ్బును వెనక్కు ఇచ్చే విషయంలో సంయుక్తంగా కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలని పౌర విమానయాన శాఖ, ఎయిర్‌లైన్స్‌కు జూన్ మొదట్లో సుప్రీం సూచనలు ఇచ్చింది. -
మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దయ్యాయి. ఆగస్టులో జరగాల్సిన చైనా మాస్టర్స్ సూపర్–100తోపాటు అక్టోబర్‌లో జరగాల్సిన డచ్ ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించింది. కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీడబ్ల్యూఎఫ్ కార్యవర్గం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. -
ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రద్దు
న్యూఢిల్లీ: మహమ్మారి దెబ్బకు వాయిదా పడిన ‘ఇండియన్ ఓపెన్’ గోల్ఫ్ టోర్నమెంట్ ఇప్పుడు రద్దయ్యింది. కోవిడ్ వల్లే ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు భారత గోల్ఫ్ యూనియన్ (ఐజీయూ) చైర్మన్ దేవాంగ్ షా శుక్రవారం ప్రకటించారు. యూరోపియన్ గోల్ఫ్ టూర్లో భాగంగా జరిగే ఈ టోర్నీ... వాస్తవానికి మార్చి 19 నుంచి 23 వరకు గురుగ్రామ్‌లో జరగాల్సింది. కరోనా వైరస్ నేపథ్యంలో అప్పట్లో ఈ టోర్నీని వాయిదా వేశారు. అక్టోబర్‌లో నిర్వహించాలని తొలుత భావించినా... దేశంలో వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో టోర్నీ రద్దుకే మొగ్గు చూపామని షా తెలిపారు. ‘ఆటగాళ్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ఓపెన్‌ను రద్దు చేస్తున్నాం. యూరోపియన్ టూర్ అధికారులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని దేవాంగ్ షా అన్నారు. -
అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జూలై 31 వరకు కొనసాగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. పరిస్థితులను బట్టి, కొన్ని ఎంపికచేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమానాలను కొనసాగించవచ్చునని వెల్లడించింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. జూలై 15 వరకు షెడ్యూల్ అయిన సర్వీసులను నిలిపివేసి, జూన్ 26న ఇచ్చిన సర్క్యులర్ని సవరిస్తూ, జూలై 31 వరకు విమానాల రద్దును కొనసాగించాలని నిర్ణయించింది. వివిధ దేశాల విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ అరవింద్ సింగ్ చెప్పారు.అమెరికా, యుకె, జర్మనీ, ఫ్రాన్స్లతోనూ చర్చలు జరుపుతున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. -
సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతితో పాటు డిగ్రీ, పీజీ అన్ని రకాల పరీక్షలు రద్దు చేశాయి. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కూడా పరీక్షలను రద్దు చేసింది. 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి గురువారం తెలిపారు. వీటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేసినట్టు వెల్లడించారు. 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు కోర్టుకు సీబీఎస్ఈ తెలిపింది. పరీక్షకు హాజరవుతారా? ఇంటర్నర్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకుంటారా అనేది విద్యార్థుల నిర్ణయానికే వదిలిపెట్టినట్టు వెల్లడించింది. సీబీఎస్ఈ తీసుకున్న తాజా నిర్ణయాలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు(శుక్రవారం) వెలువడనుంది. -
మరో మూడు ఎఫ్1 రేసులు రద్దు
సింగపూర్: కరోనా కారణంగా ఫార్ములావన్‌లో తాజాగా మూడు రేసులు రద్దు అయ్యాయి. వేర్వేరు కారణాలతో అజర్బైజాన్, జపాన్, సింగపూర్లలో జరగాల్సిన గ్రాండ్‌ప్రి రేసుల్ని రద్దు చేసినట్లు ఫార్ములావన్ (ఎఫ్1) యాజమాన్యం పేర్కొంది. వీధి సర్క్యూట్లను సిద్ధం చేయడంలో ఏర్పడిన సవాళ్ల కారణంగా అజర్బైజాన్, సింగపూర్లలో... ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో జపాన్ గ్రాండ్ప్రిను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే 8 రేసులతో కూడిన సవరించిన క్యాలెండర్‌ను ప్రకటించిన ఫార్ములావన్... జూలై 7న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో పోటీలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 22 రేసులు జరగాల్సిన ఈ సీజన్లో ఇప్పటికే ఆస్ట్రేలియా, డచ్, మొనాకో, ఫ్రెంచ్ రేసులు రద్దు కాగా... తాజాగా వీటికి మరో మూడు జత చేరాయి. అయితే సీజన్ రెండో భాగంలో ఎక్కువ రేసులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఫార్ములావన్ మోటార్‌స్పోర్ట్స్ చీఫ్ రాస్ బ్రాన్ అన్నారు. ‘త్వరితగతిన పరిణామాలు మారిపోతున్నాయి. అయినప్పటికీ ఇంకా మా వద్ద చాలా సమయముంది. రేసుల నిర్వహణకు అనేక అవకాశాలు కనుగొంటున్నాం. యూరోప్‌లో వేదికలను పెంచుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. -
జింబాబ్వే పర్యటన కూడా రద్దు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 ఉధృతి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో పర్యటనను పక్కన పెట్టింది. ఇప్పటికే శ్రీలంకతో సిరీస్‌కు ‘నో’ చెప్పిన భారత్... ఆగస్టులో జరగాల్సిన జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో భారత్ 3 వన్డేలు ఆడాల్సి ఉంది. కరోనా కారణంగా నెలకొని ఉన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆట సాధ్యం కాదని స్పష్టం చేసింది. మరోవైపు భారత జట్టుకు కూడా ఇప్పట్లో శిక్షణా శిబిరం జరిగే అవకాశం కనిపించడం లేదు. ‘మైదానంలో సాధన చేసేందుకు అనుకూలమైన, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయని భావించినప్పుడే బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు శిక్షణా శిబిరం నిర్వహిస్తాం. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ను మొదలు పెట్టాలని బీసీసీఐకి కూడా ఉంది. అయితే కరోనాను కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం, రాష్ట్రాలు చేపడుతున్న చర్యలకు మేం విఘాతం కల్పించకూడదు. కాబట్టి తొందరపాటుతో ఏ నిర్ణయం కూడా తీసుకోం’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. కోవిడ్–19కు సంబంధించి నిపుణులతో మాట్లాడుతూ బీసీసీఐ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం చివరిసారిగా మార్చిలో టీమిండియా మైదానంలోకి దిగింది. ఇందులో వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా... కరోనా కారణంగా మిగతా రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. రాజ్‌పుత్ నిరాశ... మరోవైపు ఈ పర్యటన రద్దుతో జింబాబ్వే జట్టు హెడ్ కోచ్, భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జింబాబ్వే జట్టు మంచి అవకాశం కోల్పోయిందని ఆయన అన్నారు. ‘జింబాబ్వే క్రికెట్ జట్టుకు ఈ పరిణామం తీవ్ర నిరాశ కలిగించింది. ఎందుకంటే సమీప భవిష్యత్తులో వారికి మళ్లీ భారత్‌తో తలపడే అవకాశం రాకపోవచ్చు. ప్రపంచంలోని ప్రతీ జట్టు భారత్‌లాంటి అత్యుత్తమ టీమ్‌తో ఆడాలని కోరుకుంటుంది. కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ఆటగాళ్లతో తలపడే అవకాశం వారికి చేజారింది’ అని రాజ్‌పుత్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా జింబాబ్వేకు రాజ్‌పుత్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
హైదరాబాద్ ఓపెన్ రద్దు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నీల రీషెడ్యూల్లో భాగంగా జరగాల్సిన తొలి టోర్నీ ‘హైదరాబాద్ ఓపెన్’ రద్దయింది. టూర్లో సూపర్–100 హోదా గల ఈ టోర్నీ ఆగస్టు 11నుంచి 16నుంచి నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. అయితే కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నందున ఈ టోర్నీని రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ గురువారం ప్రకటించింది. తమ నిర్ణయాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కూడా అంగీకరించిందని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ప్రపంచమంతటా పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్న నేపథ్యంలో రీషెడ్యూల్ చేసిన మిగతా టోర్నీల వివరాలను సందర్భానుసారం ప్రకటిస్తామని సమాఖ్య కార్యదర్శి థామస్ లాండ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందించారు. లాక్డౌన్ ఇంకా అమల్లో ఉన్న తెలంగాణలో ఆగస్టులో హైదరాబాద్ ఓపెన్ నిర్వహించడం నిజంగానే కష్టమయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాక్టీస్‌లో అశ్విని, లక్ష్యసేన్ భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప, యువ ఆటగాడు లక్ష్యసేన్ రెండు నెలల తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టారు. బెంగళూరులోని ప్రకాశ్ పదుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) వేదికగా కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో వీరిద్దరూ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 20 మంది షట్లర్లు ప్రాక్టీస్‌కు హాజరవుతున్నట్లు విమల్ కుమార్ తెలిపారు. అకాడమీలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ సమర్థంగా అమలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన... పరిశుభ్రత విషయంలో ఆటగాళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరినట్లు పేర్కొన్నాడు. -
లైసెన్సుల ‘లొల్లి’
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో రాష్ట్రంలోని 30 వైన్ (ఏ4) షాపుల లైసెన్సుల రద్దు అంశం చర్చనీయాంశం అవుతోంది. లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవొద్దన్న ప్రభుత్వ నిబంధనలను పాటించని కారణంగా ఈ షాపులపై కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతుంటే, తమపై కక్ష సాధింపు ధోరణితోనే అధికారులు తమ లైసెన్సులు రద్దు చేశారని లైసెన్సీలు వాపోతున్నారు. కరోనా ప్రత్యేక సెస్‌పై వడ్డీ చెల్లింపును సవాల్ చేస్తూ తాము కోర్టుకు వెళ్లిన కారణంగానే ఎలాంటి తప్పు చేయకుండానే తమ లైసెన్సులు రద్దు చేయించారని, దీనిపైనా న్యాయ పోరాటం చేస్తామని పేర్కొంటున్నారు. అసలేం జరిగింది? ఈ ఏడాది మార్చి 22 నుంచి రాష్ట్రంలోని వైన్ షాపులను ప్రభుత్వం మూయించి వేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మకాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి నుంచి మే 6 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు మూసేశారు. మే 6న మళ్లీ నిబంధనలు సడలించి మద్యం దుకాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే సమయంలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. కరోనా ప్రత్యేక సెస్ పేరుతో 16 శాతం మేర ధరలను సవరించింది. ఈ మేరకు పెంచిన ధరలకు మద్యం అమ్మాలని లైసెన్సీలను నిర్దేశించింది. అయితే, మే 6కు ముందు రోజు ఎక్సైజ్ యంత్రాంగం రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులను జల్లెడ పట్టింది. షాపులను మూసివేసే ముందు రోజు వరకు షాపుల్లో ఉన్న సరుకు వివరాలను స్టాక్ రిజిస్టర్ ద్వారా తెలుసుకుంది. మే 6న షాపులు తెరిచిన తర్వాత గతంలో ఉన్న స్టాకును కూడా పెరిగిన ధరలకు అమ్ముతున్నందున పెరిగిన ధరల మేరకు ప్రభుత్వానికి వైన్‌షాపు యజమానులు కరోనా సెస్ చెల్లించాలని అంతర్గతంగా ఉత్తర్వులిచ్చింది. దీంతో కొందరు వైన్స్ యజమానులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సెస్ చెల్లించగా, మరికొందరు చెల్లించలేదు. దీంతో ఈ ఫీజును వసూలు చేయాలనే ఆలోచనతో ప్రత్యేక సెస్ సకాలంలో చెల్లించని పక్షంలో వడ్డీతో పాటు వసూలు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని 21 మంది వైన్స్ యజమానులు హైకోర్టులో సవాల్ చేశారు. లాక్డౌన్ సమయంలో షాపులు తెరవక, వ్యాపారం నడపక తాము ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక సెస్ చెల్లించాలని, అందుకు వడ్డీ చెల్లించాలని కోరడం భావ్యం కాదని, ఆ ఉత్తర్వులను నిలిపేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు 4 వారాల పాటు ఎలాంటి వడ్డీ వసూలు చేయడానికి వీల్లేదని, తమ తుది తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు తమపై కక్ష తీర్చుకునేందుకు లైసెన్సులు రద్దు చేశారని కోర్టుకెళ్లిన 21 మంది లైసెన్సీలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం వారి వాదనను కొట్టిపారేస్తున్నారు. కోర్టుకు వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, కోర్టు వారి పిటిషన్‌పై స్టే ఇవ్వలేదని, న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూనే కోర్టుకు ఏం చెప్పాలో, ఎందుకు సెస్ వసూలు చేయాల్సి వచ్చిందో చెబుతామని అంటున్నారు. ఆ 21 మందిపైనే చర్యలు తీసుకోలేదని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మరో 9 మందిని కూడా గుర్తించి, ఎక్సైజ్ రూల్స్ ప్రకారం చట్టానికి అనుగుణంగా నడుచుకున్నామని పేర్కొంటున్నారు. -
మహమ్మారితో ఆ‘పరేషాన్’లు..
లండన్ : కోవిడ్-19 ప్రభావంతో భారత్‌లో 5,80,000కు పైగా సర్జరీలు రద్దవడం లేదా జాప్యానికి గురయ్యాయని అంతర్జాతీయ కన్సార్షియం చేపట్టిన అథ్యయనం అంచనా వేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆస్పత్రి సేవలకు 12 వారాల పాటు తీవ్ర అంతరాయం నెలకొన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలు రద్దవడం లేదా వాయిదా పడవచ్చని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. దీంతో రోగులు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్జికల్ కేర్‌పై కోవిడ్-19 ప్రభావం గురించి 120 దేశాలకు చెందిన 5000 మంది సర్జన్లతో కూడిన కోవిడ్సర్జ్ కొలాబరేటివ్ ఈ పరిశోధనను నిర్వహించింది. బ్రిటన్, అమెరికా, భారత్, ఇటలీ, మెక్సికో, నైజీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన సభ్యుల నేతృత్వంలో ఈ అథ్యయనం సాగింది. ఆస్పత్రి సేవలకు అదనంగా ఏ ఒక్క వారం విఘాతం కలిగినా మరో 24 లక్షల సర్జరీలు వాయిదా పడటమో, రద్దవడమో జరుగుతాయని అథ్యయనం స్పష్టం చేసింది. 71 దేశాల్లోని 359 ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సహా ఇతర పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. చదవండి : మరో సరికొత్త ఆవిష్కరణ కోవిడ్-19 అవాంతరాలతో ప్రపంచవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన 72.3 శాతం సర్జరీలు రద్దవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సరేతర ఆపరేషన్లే వీటిలో అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇక భారత్‌లో కోవిడ్-19 కలకలంతో 12 వారాల సమయంలో 5,84,737మంది రోగులకు ఆపరేషన్లు వాయిదా పడ్డాయని అథ్యయనం అంచనా వేసింది. ఇక ఈ 12 వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 63 లక్షల ఆర్ధోపెడిక్ ఆపరేషన్లు రద్దయ్యాయని పరిశోధకులు పేర్కొన్నారు. -
ప్లస్‌టూ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం
న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలన్నింటిని రద్దు చేస్తూ సీబీఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సీబీఎస్ఈ పరిధిలోని ప్లస్‌టూ (12 వ తరగతి) పరీక్షలను రద్దుచేసే ఆలోచన ఇప్పుడు లేదని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి వెల్లడించారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం పోరాడుతుందని, దానికి సీబీఎస్ఈ కూడా అతీతం కాదని అన్నారు. తల్లిదండ్రులు సంయమనం పాటించాలని కోరారు. పరిస్థితి మెరుగుపడ్డాక పరీక్షల గురించి వెల్లడిస్తామని, అప్పటివరకు ఓపికతో ఉండాల్సింగా పేర్కొన్నారు. (కోవిడ్-19 ఎఫెక్ట్ : టెన్త్ పెండింగ్ పరీక్షలు రద్దు) అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలు రద్దు చేసినందున, వారి ఇంటర్నల్ మార్కులు, మరికొన్ని అంశాల ఆధారంగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయబడతారని స్పష్టం చేశారు. అయితే కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానందున విద్యార్థుల పనితీరు, ప్రీవియస్ మార్కులను దృష్టిలో ఉంచుకొని 10, 12వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సినోడియా సూచించారు. ఈ విషయంలో మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. 1. CBSE की 10 व 12वीं की बची हुई परीक्षाएँ कराना अभी सम्भव नहीं होगा अतः internal exams के आधार पर ही बच्चों को पास किया जाय जैसा कि 9 वीं और 11वीं के बच्चों को पास किया गया है. 2/4 — Manish Sisodia (@msisodia) April 28, 2020 -
కోవిడ్-19 ఎఫెక్ట్ : సీబీఎస్ఈ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న క్రమంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించబోమని బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా పది, పన్నెండో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తారని గతంలో వచ్చిన వార్తలను సీబీఎస్ఈ తోసిపుచ్చింది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని గతంలో ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు తాజాగా పదో తరగతి పెండింగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. చదవండి : సీబీఎస్ఈ సిలబస్ హేతుబద్ధీకరణ -
వేడుకకు సచిన్ దూరం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం (ఏప్రిల్ 24) 48వ పడిలోకి అడుగుపెట్టాడు. కానీ వేడుకకు మాత్రం ‘మాస్టర్’ దూరంగా ఉన్నాడు. కరోనా మహమ్మారి వల్ల అంతా అతలాకుతలమవుతున్న వేళ తను పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం తగదని సచిన్ నిర్ణయించుకున్నాడు. ‘నా జన్మదినం నా తల్లి ఆశీర్వాదంతోనే మొదలవుతుంది. ఆమె ఇచ్చిన గణపతి బప్పా ప్రతిమ అమూల్యమైంది’ అని ట్విట్టర్లో ఈ బ్యాటింగ్ లెజెండ్ పోస్ట్ చేశాడు. ఈ క్రికెట్ దేవుడి పుట్టినరోజంటే భారత అభిమానులకు పండగ రోజు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల సంబరాలు జరుపుకునే అవకాశం లేదు. అయితే సామాజిక సైట్ల ద్వారా భారత ఆటగాళ్లు విఖ్యాత అటగాడికి శుభాకాంక్షలు తెలిపారు. ‘బ్యాటింగే ప్రాణంగా... క్రికెటే లోకంగా ఎదిగిన సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మాలాంటి ఎందరికో మీరే స్ఫూర్తి’ అని కెప్టెన్ కోహ్లి ట్వీట్ చేశాడు. ‘మన గ్రేట్ మ్యాన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి’ అని రోహిత్ శర్మ పోస్ట్ చేశాడు. పేసర్ బుమ్రా సహా పలువురు భారత క్రికెటర్లు, ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీ, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ శుభాకాంక్షలు చెప్పినవారిలో ఉన్నారు. -
వింబుల్డన్‌కు బీమా ధీమా
లండన్: మహమ్మారి దెబ్బకు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రద్దయ్యింది. ఇందులో విశేషమేమీ లేదు ఎందుకంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్సే ఈ ఏడాది జరగడం లేదు. దాంతో పోల్చితే వింబుల్డన్ ఓ టెన్నిస్ టోర్నీ మాత్రమే! టోక్యో ఈవెంట్ రద్దు కాకపోయినా వాయిదా వల్లే జపాన్ కోట్ల నష్టం చవిచూడనుంది. కానీ వింబుల్డన్ రద్దయినా పైసా నష్టం లేదు. కోట్ల రూపాయలు రానున్నాయి. చిత్రంగా ఉన్నా... ఇది నిజంగా నిజమే! ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ముందుచూపు వారి కొంప మునగకుండా చేసింది. కొన్నేళ్లుగా టోర్నీకి బీమా చేయించింది. అయితే కరోనా కొత్త వైరస్ దీంతో బీమా చెల్లింపులు జరగవనుకుంటే పొరపాటే! ఎందుకంటే నిర్వాహకులు దూరదృష్టితో ఆలోచించారు. ఏదో బీమా చేశాంలే అని ‘మమ’ అనిపించలేదు. పాలసీలో ఎండవానలు–ప్రకృతి వైపరీత్యాలు, బంద్‌లు ఇలా అన్నింటిని ఒప్పందంలో చేర్చారు. అలాగే వైరస్, మహమ్మారిల వల్ల కూడా ఆట రద్దయినా బీమా వర్తించాల్సిందేనన్న ‘క్లాజ్’ను చేర్చారు. ఇప్పుడు ఈ క్లాజే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు శ్రీరామరక్ష అయ్యింది. కోవిడ్–19 మహమ్మారి వల్ల రద్దయిన టోర్నీకి సదరు బీమా సంస్థ డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో అక్షరాల రూ.1064 కోట్ల (141 మిలియన్ డాలర్లు) బీమా మొత్తం ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు రానున్నాయి. దీనిపై క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రిచర్డ్ లూయిస్ మాట్లాడుతూ ‘మేం ముందుజాగ్రత్తగా తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసే మాకు అండగా నిలిచింది. ఇన్సూరెన్స్ సంస్థ, మధ్యవర్తులు ఇలా చాలా మంది ఈ వ్యవహారంలో కలిసి పనిచేశారు. అందుకే పూర్తిస్థాయి బీమా (ఫుల్ ఇన్సురెన్స్) సాధ్యమైంది. అయితే పాలసీ సొమ్ము అందేందుకు సమయం పడుతుంది. పేపర్ వర్క్ పూర్తవ్వాలి’ అని అన్నారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం 2002లో సార్స్ వైరస్ వెలుగు చూసింది. దీంతో 2003నుంచి బీమా పరిధిలోకి వైరస్, ప్రపంచాన్ని వణికించే మహమ్మారిలను కూడా చేర్చారు. గత 17 ఏళ్లుగా ఏడాదికి 2 మిలియన్ డాలర్ల చొప్పున 2019 వరకు నిర్వాహకులు ఇన్సూరెన్స్ కోసం మొత్తం 34 మిలియన్ డాలర్లు చెల్లించారు. -
కోర్టులకు వేసవి సెలవులు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు, జిల్లా కోర్టులు ఈ నెల 30 వరకూ అత్యవసర కేసుల్ని మాత్రమే విచారించాలని ఫుల్ కోర్టు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 14వరకూ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర కేసుల్ని14వ తేదీ వరకు మాత్రమే విచారించాలని గతంలో హైకోర్టు నిర్ణయించింది. తాజాగా మంగళవారం న్యాయమూర్తులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ప్రస్తుత విధానాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని నిర్ణయించారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫెరెన్స్ మాత్రమే విచారణ చేస్తున్న విధానం ఇక నెలాఖరు వరకూ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేయాలని కూడా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టు, జిల్లా కోర్టులు, రాష్ట్రంలోని ఇతర అన్ని కోర్టులు మే1వ తేదీనుంచి జూన్ 5వ తేదీ వరకు పనిచేస్తాయి. హైకోర్టు న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్టు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమావేశమై ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : 30 వరకూ రైల్వే బుకింగ్‌లు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగింపుపై సంప్రదింపులు సాగుతున్న క్రమంలో ఈనెల 30 వరకూ తాను నిర్వహిస్తున్న మూడు ప్రైవేట్ రైళ్ల సర్వీసులను నిలిపివేయాలని భారత రైల్వేల అనుబంధ ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఐఆర్సీటీసీ ప్రస్తుతం రెండు తేజాస్ రైళ్లను, కాశీ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. ఈ రైళ్లలో ఈనెల 30 వరకూ టికెట్ల బుకింగ్‌ను రద్దు చేసినట్టు వెల్లడించింది. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ పూర్తి సొమ్మును రిఫండ్ చేస్తామని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. అంతకుముందు ఐఆర్సీటీసీ 21 రోజుల లాక్డౌన్ ముగిసే ఏప్రిల్ 14 వరకూ బుకింగ్స్‌ను సస్పెండ్ చేసింది. కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ వారణాసి-ఇండోర్ రూట్లో రాకపోకలు సాగిస్తుండగా, తేజాస్ రైళ్లు లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై రూట్లలో నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రైవేట్ రైళ్లను ఏప్రిల్ 15-30 వరకూ ఐఆర్సీటీసీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లోని తమ కిచెన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టామని ఐఆర్సీటీసీ తెలిపింది. చదవండి : చుక్ చుక్ బండి.. దుమ్మురేపింది! -
హుబేలో లాక్డౌన్ ఎత్తివేత?
బీజింగ్/వూహాన్: సుమారు మూడు నెలల తరువాత మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని ప్రజలకు కరోనా నుంచి విముక్తి లభించినట్లు అయ్యింది. ఆ ప్రావిన్స్‌లో ప్రజల రాకపోకలపై పెట్టిన నియంత్రణలు (లాక్డౌన్) అన్నింటినీ ఎత్తివేయాలని చైనా మంగళవారం నిర్ణయించింది. మార్చి 25వ తేదీ నుంచి మొదలుపెట్టి దశలవారీగా నియంత్రణలను ఎత్తివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇదేమంత మంచి ఆలోచన కాదని, కరోనా కారక కోవిడ్–19 వ్యాధి మరోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూండటం గమనార్హం. విదేశాల నుంచి చైనాకు వచ్చిన వారిలో ఈ వ్యాధి బయటపడటం ఇటీవలి కాలంలో స్థిరంగా పెరుగుతోంది. హుబేలో సోమవారం కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. ప్రస్తుతం 4200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం 74 విదేశీ కేసులతో కలిపి చైనా మొత్తమ్మీద 78 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కమిషన్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ చైనాలో కరోనా కారణంగా 3277 మంది చనిపోగా, 81,171 మంది వ్యాధి బారిన పడ్డారు. సుమారు 73,159 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 4,735 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హుబే ప్రావిన్స్ రాజధాని వూహాన్లో మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఎత్తివేయాలని చైనా నిర్ణయించింది. వూహాన్ జనాభా కోటీ పది లక్షల వరకూ ఉండగా కరోనా భయంతో వీరందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచారు. (లాక్డౌన్ : జనం మారుతున్నారు..) గత ఏడాది డిసెంబరు ఆఖరులో తొలి కరోనా వైరస్ బాధితుడిని గుర్తించింది ఇక్కడే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 23వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో లాక్డౌన్ ప్రకటించారు. అయితే గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య దాదాపుగా సున్నాకు చేరిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు కేసులేవీ లేకపోగా సోమవారం ఒకే ఒక్క కోవిడ్–19 కేసు నమోదైంది. లాక్డౌన్ ఎత్తివేయనుండటంతో కోవిడ్ బాధితులు, అనుమానితులు ఎవరితోనూ సంబంధాలు లేని వూహాన్ ప్రజలు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి వూహాన్, హుబే ప్రావిన్సు బయటకు వెళ్లవచ్చు. ఈ మేరకు హుబే ప్రాంత కోవిడ్ నియంత్రణ కేంద్ర అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారిక వార్తా సంస్థ షిన్హువా తెలిపింది. వ్యాపార కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు వూహాన్ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పద్ధతులను పాటించనుంది. హుబేలోని ఇతర ప్రాంతాల్లో నేటి నుంచి రవాణా నియంత్రణలు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారిని వారు పనిచేసే ప్రాంతాలకు నేరుగా పంపనున్నారు. అయితే వ్యాధి పరీక్షల్లో ఉన్న లోపాలు, తగిన క్వారంటైన్ పద్ధతులు పాటించని కారణంగా అనేకమందిలో వ్యాధి లక్షణాలు బయటపడలేదని, ఈ నేపథ్యంలో మరోసారి వ్యాధి తిరగబెట్టే అవకాశముందని గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక నిపుణులను ఉటంకిస్తూ హెచ్చరించింది. (2021లో... టోక్యో 2020) చైనాలో కొత్త వైరస్.. ఒకరు మృతి చైనాలో మరో ప్రాణాంతక వైరస్ జాడలు బయటపడ్డాయి. హంటా అనే ఈ వైరస్‌తో ఒకరు మృతి చెందినట్లు చైనా అధికార మీడియా తెలిపింది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ కార ణంగా యున్నాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి చనిపోయాడు. షండోంగ్ ప్రావిన్సులో పనిచేసేందుకు వెళ్తుండగా అతడు హంటా వైరస్‌తో చనిపోయాడు. దీంతో అధికారులు ఆ బస్సు లోని 32 మందిని ఆస్పత్రికి తరలించి, పరీక్షలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎలుకల ద్వారా సంక్రమిం చే వైరస్లలో హంటా వైరస్ ఒకటని, ఈ వ్యాధి బాధితుల్లో లక్షణాలు కూడా ఒకేలా ఉండవని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటోంది. -
ఐపీఎల్ 2020 రద్దు!
ముంబై: ‘కరోనా హైరానా నడుస్తున్న ప్రస్తుత సమయంలో ఐపీఎల్ అప్రధానమైన అంశం’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి పలికిన పలుకు ఇది. ఐపీఎల్‌పై సమీక్షా సమావేశం నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). భారత్‌లోని నగరాలన్నీ లాక్డౌన్. రాష్ట్ర సరిహద్దులు మూసివేత.ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని ఆపేశారు. తాజాగా దేశవాళీ సర్వీసులు కూడా నిలిపేసేందుకు నిర్ణయించారు. పై విషయాలు చదివితే ఇప్పటికే మనకంతా అర్థమవ్వాలి ఐపీఎల్13వ సీజన్ రద్దేనని..! ఇంతకుమించి లీగ్‌పై మరే అప్డేట్ను ఆశించడం ఆత్యాశే అవుతుంది. ప్రపంచంతోనే కరోనా ఆడుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు ఏ ఆటలూ సాగడం లేదు. ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ... లీగ్‌పై చర్చించడానికి ఏ మీటింగ్ లేదని కరాకండీగా చెప్పేశారు. గతంలో ఏప్రిల్ 15 వరకు లీగ్‌ను వాయిదా వేసినప్పటికంటే ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయి. పక్కరాష్ట్రం వ్యక్తులు, వాహనాల్నే తమ రాష్ట్రాల్లోకి రానీయడం లేదు. విదేశీయులు వచ్చే విమానాల్ని రానిస్తారా? ఇంకా చెప్పాలంటే పగలు పప్పు, ఉప్పు కోసం, రాత్రయితే మందుల (మెడిసిన్) కోసమే రోడ్డుపై తిరిగే పరిస్థితి ఉంది. అత్యవసర సేవల వాహనాలు కాకుండా ఏ వాహనమైనా కనిపిస్తే సీజ్ చేసే చట్టాన్ని అమల్లోకి తెచ్చాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆటల్ని సాగనిచ్చే పరిస్థితే లేదు. కాబట్టి రద్దు తప్ప వాయిదాకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా చెబుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం వెల్లడించేందుకు ఇంకాస్త సమయం తీసుకుంటుంది. ఏప్రిల్ మొదటివారంలో ‘రద్దు’ ముచ్చట మన ముందుంచే అవకాశముంది. -
రద్దైన 2,400 రైల్వే సర్వీసులు
-
ఇంగ్లండ్‌లోనూ క్రికెట్ టోర్నీలు రద్దు
లండన్: కరోనా ప్రభావం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది. మే 28 వరకు ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్‌ను తాము నిర్వహించడం లేదని ఈసీబీ ప్రకటించింది. తాజా సీజన్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఈసీబీ వెల్లడించింది. శ్రీలంకలో కూడా: శ్రీలంకలోనూ అన్ని రకాల దేశవాళీ క్రికెట్‌ను రద్దు చేస్తున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. గత మంగళవారం శ్రీలంకలో ప్రతిష్టాత్మక వార్షిక స్కూల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. దీనికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరిలో ఒకరికి కరోనా ఉన్నట్లు బయటపడింది. దాంతో అందరిలో ఆందోళన నెలకొంది. నిజానికి ఈ మ్యాచ్‌ను ఆపేయాలని స్వయంగా దేశాధ్యక్షుడు గొటబాయ ఆదేశించినా నిర్వాహకులు దీనిని పట్టించుకోలేదు. తాజా ఘటన కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ పూర్తిగా రద్దయింది. -
మొనాకో గ్రాండ్‌ప్రి రద్దు
పారిస్: ఫార్ములావన్ (ఎఫ్1) క్యాలెండర్లో 65 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతోన్న విఖ్యాత వీధి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి రద్దయింది. ప్రస్తుతం కరోనా (కోవిడ్–19) యూరప్‌లో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మే 24న ఈ రేసు జరగాల్సి ఉంది. దాంతో ఈ ఏడాది ఎఫ్1 సీజన్లో రద్దయిన రెండో రేసుగా మొనాకో నిలిచింది. 1929లో ఎఫ్1 క్యాలెండర్లో అరంగేట్రం చేసిన ఈ రేసు చివరిసారిగా 1954లో జరగలేదు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (జీపి)తో గత వారమే ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ ఘనంగా ఆరంభమవ్వాల్సి ఉండగా ... కరోనా కారణంతో తొలి రేసును రద్దు చేశారు. అనంతరం ఈ ఆదివారం జరగాల్సిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఏప్రిల్‌లో జరగాల్సిన వియత్నాం, చైనీస్ రేసులను కూడా వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) నిర్ణయం తీసుకుంది. దాంతో 2020 సీజన్ మే 1న డచ్ గ్రాండ్‌ప్రితో ఆరంభమవుతుందని భావించారు. అయితే డచ్ గ్రాండ్‌ప్రి రేసును, మే 8న జరగాల్సిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసును కూడా వాయిదా వేస్తున్నట్లు రేసు నిర్వాహకులు తెలిపారు. దీంతో ప్రస్తుత సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎఫ్1 నిర్వాహకులు మాత్రం జూన్ 7న జరగాల్సిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రితో సీజన్ ఆరంభమవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. -
సైనా పయనం ఎంతవరకు?
భారత బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ది ప్రత్యేక స్థానం... దేశవ్యాప్తంగా ఆటపై ఆసక్తి పెంచడంలో, ముఖ్యంగా అమ్మాయిలు బ్యాడ్మింటన్ వైపు ఆకర్షితులు కావడంతో సైనా స్ఫూర్తిగా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో ఆమె కెరీర్ శిఖరానికి చేరగా... పెద్ద సంఖ్యలో సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు, రివార్డులు సైనా స్థాయిని చూపిస్తాయి. అయితే గత కొంత కాలంగా సైనా ఆట అంతంతమాత్రంగానే సాగుతోంది. వరుస పరాజయాలు, ఫిట్నెస్ సమస్యలు ఆమెను వెనక్కి తోస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత ఈ సారి మళ్లీ ఒలింపిక్స్‌పై ఆమె గురి పెట్టింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అసలు సైనా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలదా అనేది చూడాలి. (సాక్షి క్రీడా విభాగం): సైనా నెహ్వాల్ మంగళవారమే తన 30వ పుట్టిన రోజు జరుపుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక దశకు చేరిన తర్వాత ఆమె ముందు ఇప్పుడు పెద్ద సవాల్ నిలిచింది. మరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తీసుకున్న నిర్ణయం ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 12 వరకు జరగాల్సిన అన్ని టోర్నీలను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. రాబోయే టోర్నీలలో రాణించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకుంటున్న షట్లర్లను ఇది షాక్‌కు గురి చేసింది. మంగళవారం జరిగిన కీలక సమావేశం అనంతరం టోక్యో ఒలింపిక్స్‌ను ఎలాగైనా నిర్వహిస్తామంటూ కమిటీ విస్పష్టంగా ప్రకటించింది. కాబట్టి బ్యాడ్మింటన్‌లో నెలకొన్న తాజా పరిస్థితి ఆందోళన కలిగించేదే. వరుస వైఫల్యాలు... దాదాపు ఏడాది కాలంగా సైనా ప్రదర్శన గొప్పగా లేదు. టోర్నీ విజయాలపరంగా కూడా ఆమె టైటిల్ సాధించి చాలా రోజులైంది. 2019 జనవరిలో ఆమె చివరిసారిగా ఇండోనేసియా మాస్టర్స్ గెలిచింది. అదీ ఫైనల్లో 4–10తో వెనుకబడిన దశలో మారిన్ గాయంతో తప్పుకున్న తర్వాత దక్కింది. అంతకు ముందు చూస్తే 2017 జనవరిలో మలేసియా మాస్టర్స్ ఆమె గెలిచిన చివరి టోర్నీ. ఈ రెండు కూడా సూపర్–500 స్థాయి టోర్నీలే. సైనా ఆట సహజంగానే ఆమె ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించింది. 2019లో సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా, ఇప్పుడు 20వ ర్యాంక్‌కు చేరింది. 2020 కూడా ఆమెకు కలిసి రాలేదు. మలేసియా మాస్టర్స్, స్పెయిన్ మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా...ఇండోనేసియా మాస్టర్స్, థాయిలాండ్ మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్‌లలో తొలి రౌండ్లోనే చిత్తయింది. ఇప్పుడు కీలకమైన ఒలింపిక్స్‌కు ముందు జరిగే టోర్నీలో రాణించాలని భావించిన తరుణంలో టోర్నీల రద్దు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం 22వ స్థానంలో... బీడబ్ల్యూఎఫ్ రద్దు చేసిన టోర్నీల్లో స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ కూడా ఉన్నాయి. ఇందులో స్విస్ సైనాకు గతంలోనూ బాగా కలిసి రాగా... ఈ సారి రెండు టోర్నీల్లోనూ ఆమెకు మంచి ‘డ్రా’ ఎదురైంది. ఒలింపిక్స్‌కు అర్హత కల్పించే పాయింట్ల ప్రకారం (రేస్ టు టోక్యో) చూస్తే ఆమె ప్రస్తుతం 22వ ర్యాంకులో ఉంది. గత ఏడాది కాలంగా ఆమె ఆడిన 15 టోర్నీల ద్వారా 41,847 పాయింట్లు సైనా ఖాతాలో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో బీడబ్ల్యూఎఫ్ రద్దు చేసిన టోర్నీలు జరిగే అవకాశం లేకపోతే...సైనా చేయడానికేమీ ఉండదు! ఎందుకంటే ఒలింపిక్ అర్హత కోసం కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 30నాటికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 16 స్థానాల్లో ఉన్నవారికే అర్హత లభిస్తుంది. తాజా పరిస్థితుల్లో ఆమె ఆ జాబితాలో రాదు. ఒక వేళ కొన్ని టోర్నీలు జరిగినా ఆమె తన అత్యుత్తమ ప్రదర్శనకు మించి ఇవ్వాల్సి ఉంది. ఫైనల్ లేదా సెమీఫైనల్ చేరితేనే సైనా ఖాతాలో పెద్ద సంఖ్యలో పాయింట్లు చేరతాయి. అయితే ఇటీవలి ఫామ్‌ను చూస్తే ఇది అంత సులువుగా అనిపించడం లేదు. గెలవాలనే పట్టుదల, అందు కోసం ఆమె తగిన విధంగా శ్రమిస్తున్నా కోర్టులో సైనా కదలికల్లో చురుకుదనం తగ్గినట్లే కనిపిస్తోంది. కొత్తగా దూసుకొస్తున్న అమ్మాయిలు చెలరేగిపోతుంటే చాలా సందర్భాల్లో సైనా వారి ముందు బేలగా కనిపిస్తోంది. ఆమె తన అత్యుత్తమ దశను దాటేసినట్లుగా ఇటీవలి ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఒలింపిక్ రేసులో ఎంత వరకు ముందుకు వెళ్లగలదనేది చూడాలి. మంగళవారం తన తండ్రి హర్వీర్ సింగ్‌తో కలిసి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సైనా. -
బంగ్లాదేశ్, పాకిస్తాన్ సిరీస్ రద్దు
కరాచీ: కరోనా (కోవిడ్–19) దెబ్బకు వచ్చే నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే, టెస్టు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల మధ్య ఏకైక వన్డే ఏప్రిల్ 1న జరగాల్సి ఉండగా... ఫిబ్రవరిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌కు కొనసాగింపుగా రెండో టెస్టు ఏప్రిల్ 5 నుంచి 9 వరకు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అవి ఎప్పుడు జరుగుతాయనే విషయంపై సమాచారం లేదు. మార్చి 24 నుంచి జరగాల్సిన పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ టోర్నీ పాకిస్తాన్ కప్ వన్డే టోర్నమెంట్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఇప్పటికే కుదింపుతో సాగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) క్రికెట్ టోర్నీకి మరో షాక్ తగిలింది. కరోనా భయంతో ఈ లీగ్‌ను వదిలిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), డేవిడ్ వీస్ (ఆస్ట్రేలియా), సెక్కుగె ప్రసన్న (శ్రీలంక) కూడా చేరారు. -
ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దు
బెర్లిన్: జర్మనీ, ఇటలీ ఫుట్‌బాల్ జట్ల మధ్య ఈ నెల 31న జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ బవేరియా ప్రాంతం (జర్మనీలో)లోని న్యూరెమ్బర్గ్లో జరగాల్సి ఉండగా... ప్రస్తుతం అక్కడ కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో 100 మందికి మించి జనం గుమికూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. తొలుత ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను జరపాలని అనుకున్నా... జట్టు సభ్యులు, వారి సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీతో స్టేడియంలోని జనం సంఖ్య 100 మందికిపైగా చేరుకుంటుండటంతో రద్దు చేయడానికే జర్మనీ ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయించుకుంది. -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ రద్దు
సిడ్నీ: ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి రెండు వన్డేలతోపాటు మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను కూడా అర్ధంతరంగా రద్దు చేసింది. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు. మోచేతులను తాకించుకుంటూ అభినందించుకున్నారు. -
వన్డే సిరీస్ ముగిసింది
ముంబై: ఐపీఎల్‌కు ముందే కోవిడ్–19 ప్రభావం భారత క్రికెట్ జట్టుపై పడింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా రేపు, బుధవారం జరగాల్సి ఉన్న రెండు మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ రెండు వన్డేలను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని గురువారమే నిర్ణయం తీసుకున్న బోర్డు... ఇప్పుడు వాటిని పూర్తిగా నిర్వహించకపోవడమే మేలని భావించింది. ఇరు జట్లు శుక్రవారం లక్నో చేరుకున్న తర్వా త బీసీసీఐ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘ఐపీఎల్ ఎలాగూ వాయిదా పడింది. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో వన్డే సిరీస్ కూడా రద్దు చేయడమే మంచిది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు కూడా ఆడేందుకు ఇష్టపడటం లేదు. వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వీలైనంత తొందరగా స్వదేశం చేరుకోవాలని భావిస్తున్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని చక్కబడిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ సిరీస్‌ను ఎప్పుడైనా మళ్లీ నిర్వహిస్తామని కూడా బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నారు. వన్డే సిరీస్ రద్దుపై కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ... ‘ఆరోగ్య సమస్యలకంటే ఆర్థికపరంగా కలిగే నష్టం ఇప్పుడు పెద్దగా ముఖ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. -
వర్షార్పణం
ధర్మశాల: ఊహించినట్లే జరిగింది... భారత్, దక్షిణాఫ్రికా పోరుకు వరుణుడు సహకరించలేదు. గురువారం ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్పీసీఏ) స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్‌లో ఒక్క బంతి కాదు కదా కనీసం టాస్ వేసే అవకాశం కూడా లేకుండానే ఆట ముగిసిపోయింది. ఉదయంనుంచి నిరంతరాయంగా కురిసిన వాన ఏ దశలోనూ తెరిపినివ్వలేదు. కనీసం వర్షం ఆగితే పిచ్‌ను పరిశీలించాలని అంపైర్లు భావించగా...అదీ సాధ్యం కాలేదు. నిర్ణీత సమయంకంటే అదనంగా దాదాపు నాలుగు గంటల పాటు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ధర్మశాల అభిమానులకు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశ ఎదురైంది. గత సెప్టెంబరులో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడే భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగాల్సింది. అప్పుడు కూడా భారీ వర్షంతో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లక్నోలో జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఎలాగూ ఈ మ్యాచ్‌ను అభిమానులు ప్రత్యక్షంగా చూసే అవకాశమే లేదు. -
ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీ రద్దు
కాలిఫోర్నియా: టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌గా భావించే ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్, డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రాణాంతక వైరస్ కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టోర్నమెంట్ వేదిక కాలిఫోర్నియాలో తాజాగా కోవిడ్–19 కేసు బయట పడటంతో ఈనెల 12 నుంచి 22 వరకు జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ‘టోర్నీని నిర్వహించలేకపోతున్నందుకు తీవ్ర నిరాశతో ఉన్నాం. అయితే ఈ టోర్నీతో ముడిపడి ఉన్న అందరి ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే టోర్నీని రద్దు చేయక తప్పడంలేదు’ అని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాదీ ఈ టోర్నీని వీక్షించేందుకు దాదాపు నాలుగు లక్షల మంది అభిమానులు వస్తారు. ఎవరైనా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకొనిఉంటే వారికి టికెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్ : ప్రధాని బ్రసెల్స్ పర్యటన రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పలు దేశాలకు వ్యాపించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటన రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్ పర్యటన రద్దయింది. సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది మార్చి 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో ఇండియా-ఈయూ సదస్సు జరగాల్సి ఉంది. బ్రసెల్స్‌లో బుధవారం పది కరోనా వైరస్ కేసులు కొత్తగా వెలుగుచూడటంతో బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య 23కు చేరుకుంది. ఈయూ, భారత్‌ల మధ్య సన్నిహిత సహకార బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నామని రవీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన షెడ్యూల్‌కు అనుగుణంగా జరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. చదవండి : మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా? -
మా దేశానికి రావొద్దు...
న్యూఢిల్లీ: తజికిస్తాన్లో పర్యటించాలనుకున్న భారత కుర్ర ఫుట్‌బాలర్లకు ‘కరోనా’ షాకిచ్చింది. తమ దేశంలో భారత అండర్–16 ఫుట్‌బాల్ జట్టు పర్యటనను తజికిస్తాన్ రద్దు చేసింది. అండర్–15 దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య చాంపియన్ అయిన భారత కుర్రాళ్ల జట్టు రేపు అక్కడికి బయలుదేరాల్సి ఉంది. అక్కడ ఏఎఫ్సీ అండర్–16 చాంపియన్‌షిప్ రన్నరప్ అయిన తజికిస్తాన్‌తో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో తజికిస్తాన్ ప్రభుత్వం భారత్‌ను కరోనా ప్రభావిత దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో 35 దేశాలున్నాయి. ఈ జాబితాలోని దేశాల్లో తమ దేశస్థులు పర్యటించడాన్ని... ఆ దేశస్థులు తమ దేశంలో పర్యటించడాన్ని తజికిస్తాన్ నిషేధం విధించడం వల్లే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నట్లు ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య స్పష్టం చేసింది. ఆడండి కానీ... ఆటోగ్రాఫ్‌లు వద్దే వద్దు! ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్–19)తో అమెరికాలో ఆరుగురు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తమ ఆటగాళ్లకు, జట్ల కోచ్‌లు, ఫిజియో, ఇతర సిబ్బందికి తు.చ. తప్పకుండా పాటించే మార్గదర్శకాలు జారీచేసింది. ఆటగాళ్లెవరూ అభిమానులతో కలవరాదని కచ్చితంగా చెప్పేసింది. ఆటోగ్రాఫ్‌లు చేసేందుకు, పెన్నులను ముట్టుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు దూరంగా ఉండాలని ఎన్బీఏ స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తమ ప్రధాన ఉద్దేశమని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కరచాలనం ఇవ్వం: జో రూట్ శ్రీలంకలో క్రికెట్ సిరీస్ ఆడేందుకు మంగళవారం అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు అక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయబోరని కెప్టెన్ జో రూట్ వెల్లడించాడు. కరోనా ఎఫెక్ట్ వల్లే పరస్పర కరచాలనం చేయొద్దని నిర్ణయించుకున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడ్డారు. అయితే త్వరగానే కోలుకున్నారు. ఇప్పుడైతే కోవిడ్–19 ప్రపంచాన్నే వణికిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా శుచి–శుభ్రతను పాటిస్తామని, తమ క్రికెట్ బోర్డు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకుంటామని రూట్ చెప్పాడు. నిర్‘బంధి’ంచారు... అబుదాబీలో విదేశీ సైక్లిస్ట్‌లకు వింత అనుభవం ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వచ్చిన జట్లలో కొందరికి కరోనా సోకడంతో వాళ్లని వెంటనే వారి స్వదేశాలకు పంపేసిన అబుదాబీ వర్గాలు మిగతా వారిని బస చేసిన హోటల్ గదుల్లోనే నిర్బంధించింది. ఫ్రాన్స్, రష్యా దేశాలకు చెందిన సైక్లిస్ట్‌లకు, సిబ్బందికి నిర్బంధం విధించిన యూఏఈ ప్రభుత్వం వైరస్ బారిన పడిన ఇద్దరు ఇటాలియన్ అధికారుల్ని ఉన్నపళంగా ఇటలీకి ప్రత్యేక విమానాల్లో పంపించింది. -
జెనీవా ఆటో షో రద్దు
జెనీవా: కోవిడ్–19 వైరస్(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్ ప్రభుత్వం శుక్రవారం నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయ్యింది. ఇప్పటికే 15 కేసులను గుర్తించిన స్విస్ ప్రభుత్వం.. ఈ మహమ్మారి వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలోనే ఆటో షో రద్దు అయ్యిందని స్విట్జర్లాండ్ మంత్రి అలైన్ బెర్సెట్ ప్రకటించారు. -
కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) ఆటో ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వూహాన్ విస్తరించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ 6 ఖండాల్లో తన ఉనికిని చాటుకుని మరణ మృదంగం వాయిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి అసాధారణమైన చర్యగా 1,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలను నిషేధిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, మార్చి 15 వతేదీ వరకు ఈ నిషేధం అమల్లో వుంటుందని తెలిపింది. దీంతో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. ఆటో పరిశ్రమకు ప్రధానమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో రద్దయిందని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. "90వ జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో-2020 జరగదు" అని జెనీవా ప్రాంతీయ కంటోనల్ ప్రభుత్వ అధినేత ఆంటోనియో హోడ్జర్స్ ట్విటర్లో వెల్లడించారు. మరోమూడు రోజుల్లో ఆటో షోలో ప్రధాన వేడుక ప్రారంభం కానుండగా తాజా నిర్ణయం వెలువడింది. ఈ పరిస్థితికి చింతిస్తున్నామనీ, కానీ ఆటో షో పాల్గొనే వారందరి ఆరోగ్యమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఫౌండేషన్ బోర్డు చైర్మన్ మారిస్ తురెట్టిని తెలిపారు. భారీగా పెట్టుబడులు పెట్టిన తయారీదారులకు ఈ నిర్ణయం విపరీతమైన నష్టమే అయినప్పటికీ, అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. (కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!) ఈ కార్ షో వచ్చే వారం (మార్చి5 -15) ప్రారంభం కానుంది. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు కార్ షోలో తాము పాల్గొడంలేదని ఇప్పటికే ప్రకటించాయి. అలాగే హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తన సందర్శనను రద్దు చేసుకున్నారు. ప్రయాణ ఆంక్షలు, కరోనావైరస్ వ్యాప్తి భయాలు బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న లైట్ , బిల్డింగ్ ఫెయిర్ , బీజింగ్ ఆటో షోతో సహాపలు ముఖ్యకార్యక్రమాలను వాయిదా లేదా రద్దుకు కారణమయ్యాయి. కాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న మహమ్మారి కరోనావైరస్కు సంబంధించి మూడు ఖండాల్లోని దేశాలు మొదటి కేసులను శుక్రవారం నివేదించాయి. స్విట్జర్లాండ్‌లో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల సంఖ్య 15కి పెరిగిందని, 100 మందికి పైగా పరిశీలనలో ఉన్నారని ప్రభుత్వ మంత్రి అలైన్ బెర్సెట్ తెలిపారు. చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్ ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత? -
భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు
బ్రిస్బేన్: మహిళల టి20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. ఇక్కడి అలెన్ బోర్డర్ ఫీల్డ్ మైదానంలో ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంతో ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్ తన తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది. భారత్–పాక్ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా–వెస్టిండీస్, బంగ్లాదేశ్–థాయ్‌లాండ్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా జరగలేదు. అడిలైడ్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈనెల 21న భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్‌కు తెరలేవనుంది. -
క్షమాభిక్ష పెట్టండి!
న్యూఢిల్లీ: మరణ శిక్ష తప్పించుకునేందుకు ‘నిర్భయ’ దోషులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా దోషుల్లో ఒకరైన ముకేశ్ మంగళవారం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశ్రయించాడు. అలాగే, తన ఉరిశిక్షపై జారీ అయిన డెత్ వారంట్‌ను పక్కన పెట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టాడు. నిర్భయ దోషులు వినయ్ శర్మ(26), ముకేశ్ కుమార్(32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా(25)లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జనవరి 7వ తేదీన డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిలో ఇద్దరు వినయ్ శర్మ, ముకేశ్ కుమార్‌లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత మంగళవారం సాయంత్రం ముకేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు, వారి ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్యూరేటివ్ పిటిషన్లను నిశితంగా పరిశీలించి, వారి అభ్యర్థనను తోసిపుచ్చాలనే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం వెల్లడించింది. క్యూరేటివ్ పిటిషన్ శిక్ష పడిన వ్యక్తికి లభించే చట్టబద్ధమైన చివరి అవకాశం. అయితే, ఇప్పటివరకు మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేయలేదు. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నానని, అందువల్ల ఢిల్లీ ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను పక్కనపెట్టాలని ముకేశ్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో క్షమాభిక్ష కోరే తన రాజ్యాంగ హక్కును కోల్పోతానన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టులోని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత ధింగ్రాల ధర్మాసనం నేడు(బుధవారం) విచారించే అవకాశముంది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. ఆ తరువాత మరణశిక్షను అమలు చేసేందుకు కనీసం 14 రోజుల గడువు ఉండాలన్న నిబంధనను ముకేశ్ కోర్టుకు గుర్తు చేశారు. త్వరలో క్షమాభిక్ష పిటిషన్ వేస్తా మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ తరఫున సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లను వేస్తానని న్యాయవాది ఆర్పీ సింగ్ వెల్లడించారు. ఈ నలుగురు దోషులపై ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ‘దోషుల తరఫున క్షమాభిక్ష పిటిషన్ వేసిన తరువాత ఈ విషయాన్ని వివరిస్తూ.. ఉరిశిక్ష అమలును నిలిపేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాన’న్నారు. కాగా, వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. వారిని ఉరితీసే జనవరి 22 వ తేదీ తనకు అత్యంత ముఖ్యమైన రోజని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వద్ద హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి 2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి.. 2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి పారామెడిక్ విద్యార్థిని బస్సులో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెను దారుణంగా హింసించిన ఆరుగురు వ్యక్తులు ఆ తరువాత ఆమెను బస్సులో నుంచి రోడ్డుపై విసిరేశారు. అనంతరం, ‘నిర్భయ’గా పేరు పొందిన ఆ బాధితురాలు డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ ఆరుగురు దోషుల్లో నలుగురికి ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను 2017లో సుప్రీంకోర్టు సమర్ధించింది. దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ తిహార్ జైళ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి అయిన మైనర్ బాలుడు జువనైల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. మిగిలిన దోషుల్లో ముగ్గురు 2018 జూలైలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
ముంబయి : రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) డైరక్టర్స్ పదవికి అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాలను రుణ సంస్థల కమిటీ తిరస్కరించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. ' సీవోసీ కమిటీ అంబానీతో పాటు మిగతావారి రాజీనామాలను తిరస్కరించింది. రాజీనామా చేసిన వారందరూ ఆర్‌కామ్‌లో యధావిధిగా తమ విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది. దివాల ప్రక్రియలో ఉన్న కంపెనీకి పరిష్కారమార్గం చూపించాలని' ఆర్‌కామ్ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ జులై-సెప్టెంబర్ కాలానికి రూ 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్టెల్ రూ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది. (చదవండి : ఆర్‌కామ్‌కు అనిల్ అంబానీ రాజీనామా) -
ఎవరి పంతం వారిది!
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం పదవి కోసం బీజేపీ,శివసేన మధ్య ఏర్పడిన పీటముడి బిగుస్తోంది. ఎన్నికలకు ముందు పొత్తు ఏర్పాటైనప్పుడు బీజేపీ హామీ ఇచ్చినట్టుగా రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పట్టుబడుతున్నారు. దీనిపై తొలిసారి నోరు విప్పిన దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం పార్టీల మధ్య అలాంటి ఒప్పందమేమీ జరగలేదని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. మరో అయిదేళ్లు బీజేపీ నేతృత్వంలో కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బుధవారం కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారని వెల్లడించారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలతో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా మంగళవారం ముంబైకి రానున్నారని దీంతో ముఖ్యమంత్రి పీఠంపై చిక్కు ముడి వీడనుందని భావించారు. అయితే అమిత్ షా పర్యటన రద్దు కావడంతో ఈ విషయంపై ఉత్కంఠ పెరిగింది. 50:50 ఫార్ములా అంశాల గురించి అమిత్‌షా.. ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడి ఖరారు చేస్తారని బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ వెల్లడించారు. మహారాష్ట్రలో దుష్యంత్ లేడు: శివసేన విసుర్లు శివసేన తమకు అధికార దాహం లేదని, చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతున్నామనే చెబుతోంది. రాజకీయాల్లో తాము ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరిస్తామని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. తమ ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందానికి కట్టుబడి బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకే తమ అధినేత ఉద్ధవ్ మొగ్గు చూపిస్తున్నారని అన్నారు. హరియాణాలో దుష్యంత్ తండ్రి జైల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్రలో దుష్యంత్‌లెవరూ లేరని, అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యమవుతోందని సంజయ్ రౌత్ బీజేపీపై చెణుకులు విసిరారు. బీజేపీ ముందున్న మార్గాలేంటి! బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 40 సీట్లు కావాలి. శివసేన రొటేషన్ పద్ధతిలో సీఎం డిమాండ్‌ను విడిచిపెట్టకపోతే బీజేపీ ఎన్సీపీతో చేతులు కలిపినా ఆశ్చర్యపడనక్కర్లేదని విశ్లేషకుల అంచనా. శివసేనకు మద్దతునివ్వబోమని ఇప్పటికే శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీ తేల్చి చెప్పేసింది. ఈసారి ఎన్నికల్లో 54 సీట్లతో ఎన్సీపీ బలమైన శక్తిగానే అవతరించింది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపితే వారి బలం 159కి చేరుకుంటుంది. అందులోనూ పవార్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తూ ఉండడంతో ఎన్సీపీ రాజీపడే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈసారి ఎన్నికల్లో 17 మంది బీజేపీ రెబెల్ అభ్యర్థులు గెలిచారు. వారందరినీ తమ వైపు తిప్పుకొని బలం పెంచుకోవడం ద్వారా శివసేనను బలహీనపరిచి తామే అయిదేళ్లు పాలించే వ్యూహాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తోంది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ రెబెల్ అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకుంటే 125కి బలం చేకూరుతుంది. మరోవైపు శివసేన కూడా స్వతంత్ర అభ్యర్థులపై వల వేస్తూ తన పవర్ చూపిస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాన్చుడు ధోరణి ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పెంచుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీపై పోరాటం చేసిన తమకు అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చినప్పుడు దానిని జారవిడుచుకోకూడదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు సంకేతాలు పంపుతున్నాయి. 45 మంది శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. -
ఇక ‘మీ సేవలు’ చాలు
సాక్షి, హైదరాబాద్: ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో అడ్డగోలుగా కొత్త కేంద్రాలకు అనుమతులివ్వడాన్ని తప్పుబట్టిన సర్కారు.. ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్లను రద్దుచేయాలని ఆదేశించింది. ఇకపై ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటులో నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే కొత్త నిబంధనలు వెలువరించనున్నట్లు వెల్లడించింది. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ–సేవల వినియోగంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ‘మీ సేవ’కేంద్రాల కొనసాగింపును కూడా సమీక్షించాల్సిన పరిస్థితి రావచ్చని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి ఉంచుకొని కొత్త సెంటర్ల ఏర్పాటుపై అచితూచి అడుగేయాలని సూచించింది. గతేడాది భద్రాద్రి–కొత్తగూడెం.. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇకపై అలా జరగడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. రోజుకు లక్షన్నర సేవలు జనన, మరణ ధ్రువపత్రాలు, మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఏం కావాలన్నా ‘మీ సేవ’గడప తొక్కాల్సిందే. ఇలా దాదాపు 500 ఎలక్ట్రానిక్ సేవలందిస్తున్న మీ–సేవ కేంద్రాల్లో ప్రతిరోజు సగటున లక్షన్నర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూశాఖకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో మీ–సేవ కేంద్రాలు ప్రారంభించిన గత ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు 12.50 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,500 పైచిలుకు కేంద్రాలు పనిచేస్తుండగా.. ఇందులో 85% సెంటర్లలో నెలవారీ ఆదాయం రూ.10వేల లోపే ఉంటుంది. ఈ పరిణామం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ కూడా కష్టంగా మారడానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలు ఆన్‌సేవలు విస్తరించడమే. పోలీస్, ట్రాఫిక్, ఇతర ప్రభుత్వ విభాగాలు తమ సేవలను ఈ సేవలతోపాటు సొంతంగా ఏర్పాటు చేస్తున్న పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి. తద్వారా మీ–సేవ కేంద్రాల్లో లావాదేవీల సంఖ్య తగ్గుతోంది. దీంతో ఇప్పటికే లాభదాయంగాని సెంటర్లను నెట్టుకొస్తున్న నిర్వాహకులకు కొత్తగా ఏర్పాటు చేసే వాటితో మరింత నష్టం జరగనుంది. మేడ్చల్‌లో రెట్టింపు కేంద్రాలు గతేడాది భద్రాద్రి జిల్లాలో 5వేల జనాభా, దూరాన్ని బట్టి కొత్తగా 53 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిర్వాహకుల గిట్టుబాటును పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా కొత్తవాటికి అనుమతి ఇవ్వడం సరికాదని అన్ని జిల్లాల యంత్రాంగాలను ప్రభుత్వం హెచ్చరించినా.. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏకంగా 219 కొత్త కేంద్రాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో సర్కారు సీరియస్ అయింది. దూరాన్ని కూడా పట్టించుకోకుండా 5వేల జనాభా ఆధారంగా గల్లీకో కేంద్రం ఉండేలా నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే జిల్లాలో 297 కేంద్రాలుండగా.. తాజాగా దాదాపుగా అదే స్థాయిలో కొత్త కేంద్రాలకు పచ్చజెండా ఊపడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఇలా అడ్డగోలు వ్యవహారాలకు తావివ్వకుండా ఇకపై నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ సేవల విస్తృతితో మీ–సేవల్లో తరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇదే ట్రెండ్ కొనసాగితే.. ప్రస్తుతం ఉన్నవాటినే కుదించే పరిస్థితి రావచ్చు. ఈ ధోరణిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే కొత్త మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్లకు రాసిన లేఖలో జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. -
జేబులు నింపుకుంది చాలు..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదులకు గర్భశోకం ఆపేలా నిర్ణయం వెలువడింది. తీరాల్లో జరుగుతున్న విధ్వంస రచనకు చరమ గీతం పాడేలా ఆదేశాలు వచ్చాయి. ఉచితం ముసుగులో జరిగిన అనుచితమైన పనులు ఆగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్నాళ్లూ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు జేబులు నింపుకోవడానికి వరంగా ఉన్న ‘ఉచిత ఇసుక’ విధానం రద్దయ్యింది. ఖజానాకొచ్చే ఆదాయానికి గండి కొట్టి పార్టీ నాయకుల కడుపులు నిం పడానికి గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఇక చెల్లదు. నదుల వద్ద ఇసుక రీచ్‌ల కేటాయింపులూ ఉండవు. గత సర్కారు చేసిన తప్పిదాలను సరిదిద్ది ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన చర్యలతో నూతన ఇసుక విధానం తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. జూలై ఒకటో తేదీలోగా దీన్ని అమల్లోకి తీసుకొస్తామని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. అప్పటివరకూ జిల్లాలో ఎక్కడ ఇసుక లారీ కనిపించినా అధికారులదే బాధ్యత. అక్రమ రవాణా బాధ్యులపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించనున్నారు. జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా... ఇలా నది ఏదైనా మాఫియా ఇసుక దోపిడీకి నిలయమైపోయాయి. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అనుసరించిన రకరకాల విధానాల్లో లొసుగులు మాఫియాకు వరంగా మారాయి. ఆ అక్రమార్కులు, టీడీపీ నాయకులు చేతులు కలిపి ఇసుక ద్వారా గత ఐదేళ్లలో దోచుకున్నది సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని ఓ అంచనా. నదుల జిల్లాగా పేర్కొందిన సిక్కోలులో ఎప్పుడూ ఐదు నుంచి పది ర్యాం పులకు మాత్రమే పర్యావరణ అనుమతులతో పాటు కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్ కమిటీ నుంచి అనుమతులు ఇచ్చేవారు. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు అనేకంగా ఈ ఐదేళ్లూ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయినర్లతో ఛిద్రం చేస్తున్నారు. టీడీపీ హయాంలో గందరగోళం.. వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జిల్లాలోని 23 ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. ఆన్లైన్లో చలానా చెల్లించి, రశీదు ర్యాంపులో చూపిస్తే వాహనంలో ఇసుక లోడింగ్ చేసేవారు. ఈ విధంగా ర్యాంపు నిర్వహణ సేవలు అందించినందుకు డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరో 25 శాతం సొమ్ము స్థానిక రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పింది. ఇవేవీ సక్రమంగా అమలుకాలేదు సరికదా మరోవైపు ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయింది. డ్వాక్రా సంఘాల ముసుగులో కొంతమంది అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులే రీచ్‌లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. ఇసుక ధర ఆకాశాన్ని అంటడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. చివరకు భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు కూడా దిగిన సంగతి తెలిసిందే. ‘ఉచితం’ ముసుగులో దోపిడీ.. టీడీపీ ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి 2016, ఏప్రిల్ నెలలో ‘ఉచిత ఇసుక విధానం’ తీసుకొచ్చింది. ఎవ్వరికి అవసరమైనా నదికి వెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చని ప్రకటించింది. ఎవ్వరైనా దాన్నో వ్యాపారంగా మా ర్చుకొని అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ ఉచితం ముసుగులో మాఫియా జిల్లాలోని ఇసుక ర్యాంపులను గుప్పిట పట్టింది. ఇందుకు టీడీపీ నాయకులు అన్ని విధాలా మాఫియాకు సహాయ సహకారాలు అందించి పబ్బం గడుపుకొన్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్ ఎక్కడా కనిపించలేదు. ర్యాంపుల్లో సీసీ కెమెరాలు పెడతామంటూ చెప్పినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులను కాసులతో గలగలలాడించేందుకే ఈ ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తెచ్చిందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు పథకంలా మారిపోయింది. నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. జిల్లా శాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయినర్లు హోరెత్తుతున్నా యి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేస్తున్నారు. వంతెనలకు, ఇరిగేషన్ పం పులు, వాటర్ ఫిల్టర్ సంపులకు కనీసం 500 మీట ర్లు దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోవట్లేదు. నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోపలకు మిషనరీ వాహనాలు (జేసీబీలు, పొక్లెయినర్లు) వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలకు వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోతున్నారు. ముఖ్యంగా ఇసుకరీచ్ వద్ద కనీసం ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక మందం ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ మందం ఉన్న ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషిద్ధం. అయితే ఏ నది లో చూసినా నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఇసుక డిమాండును బట్టి రీచ్‌లవద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు చెక్ ► టీడీపీ సర్కారు ‘ఉచిత ఇసుక’ విధానం రద్దు ► నెలాఖరు వరకూ ఇసుక రవాణా నిలిపివేత ►నదుల వద్ద రీచ్‌ల కేటాయింపులు బంద్ ► అక్రమ రవాణా ఆపకపోతే అధికారులపై చర్యలు ► మాఫియా వ్యక్తులపై పీడీ యాక్ట్ ప్రయోగం ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఖజానా ఆదాయానికి గండికొట్టి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరేజీ వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరైజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను ఎక్కువగా స్థానిక సంస్థలకు ఇచ్చి మౌలిక సౌకర్యాల కల్పనకు సద్వినియోగం చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 200 లారీల వరకు ఇసుక విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ మార్కెట్లో లారీ ఇసుక ధర డిమాండును బట్టి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలుకుతుండటంతో మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఐదేళ్లలో దోపిడీ చేసింది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అందువల్లే ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ఏకంగా టీడీపీ నాయకులు తమ అనుచరులు, బంధుగణాన్ని ర్యాంపుల్లో మోహరించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. నెలాఖరు వరకూ రవాణా బంద్.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను అరికట్టి, ప్రజలకు ఇసుక కష్టాలను తప్పించేలా నూతన విధానం తీసుకురావాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తలపోస్తోంది. ఇందు కు సంబంధించిన విధివిధానాలు రూపొందిం చేవరకూ జిల్లాలో ఇసుక రవాణా నిలిపేయనున్నారు. అంతేకాదు నదికి ఆనుకొని ఉన్న పొలాల్లో ఇసుక మేటల తవ్వకాలనూ నిలిపేయాల్సిందే. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకోలేకపోతే అందుకు అధికారులే బాధ్యులవుతారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదేశాలు అందాయి.. ఇసుక తవ్వకాలకు సంబంధించిన కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ రవాణాను నిలిపేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఉచిత ఇసుక విధానం రద్దు అయ్యింది. కొత్త విధానం వచ్చేవరకూ రీచ్‌ల కేటాయింపు ఉండదు. ఎవ్వరైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కేసులు పెడతాం. – ఆర్.తమ్మునాయుడు, ఇన్చార్జ్ ఏడీ, జిల్లా గనుల శాఖ -
జెట్ సంక్షోభం : మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. పీటీఐ సమాచారం ప్రకారం శుక్రవారం మరో మూడు రోజుల పాటు అంటే ఏప్రిల్ 15, సోమవారం దాకా అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. ఇప్పటికే రెండు రోజులపాటు అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రిత్వ కార్యాలయం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిశ్రాను కలవనున్నారు. జెట్ ఎయిర్వేస్ సమస్య, పరిష్కాలపై సమీక్షించనున్నారు. ఇది ఇలా ఉంటే తమకు జీవితాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జెట్ ఎయిర్వేస్ సిబ్బంది ఆందోళనకు దిగారు. దాదాపు 2వేల మంది ఉద్యోగులు ముంబైలో ర్యాలీ నిర్వహించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం తమకు క్లారిటీ ఇవ్వాలని కోరారు. అంతేకాదు మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, సీఈవో వినోద్ దువే, యాజమాన్యంపై లేబర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. 25 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్ దేశీయంగా కూడా 10 విమానాలను రద్దు చేసింది. దీంతో అద్దె బకాయిలు చెల్లించలేక నిలిపి వేసిన విమానాల సంఖ్య 79కి చేరింది. మరోవైపు అనూహ్యంగా జెట్ విమానాలను రద్దు చేయడంతో విమాన ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. కోలకతా, ముంబై విమానాశ్రయాల్లో టికెట్ల డబ్బులు రిఫండ్ కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. అలాగే క్యాన్సిల్ అయిన టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేందుకు రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణీకులు వాపోయారు. అసలు దీనిపై నిర్దిష్టమైన సమాచారం ఏదీ అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సమస్యను పరిశీలించాల్సిందిగా సివిల్ ఏవియేషన్ మంత్రి సురేష్ ప్రభు నేడు (శుక్రవారం) పౌర విమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ సమస్యను చక్కదిద్దాలంటూ సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ వాటాల కొనుగోలుకు బిడ్లకు సమర్పించేందుకు గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. -
బాబు దావోస్ పర్యటన రద్దు వెనుక అసలు రహస్యం
-
కేరళ పండుగ కళ తప్పింది
మొన్న నిఫాతో బెంబేలెత్తిన స్వర్గసీమ కేరళ నిన్న వరదబీభత్సానికి చివురుటాకులా వణికిపోయింది. చిన్నా చితకా వ్యాపారాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ వరకూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కేరళ అనగానే గుర్తొచ్చే పూల పండుగ పది రోజులపాటు ప్రతిఇంటా ఆనందాలు వెల్లవిరిసేవి. బంతులు, చామంతులూ, మల్లెలూ ఒకటేమిటి అన్ని పూలూ కేరళని ముంచెత్తేవి. ఓనమ్ పండుగ పదిరోజులూ ప్రతి ఇంటా పూల తివాచీలే పరిచేవారు. కానీ ఈసారి వరదలు సృష్టించిన బీభత్సం కేరళ ప్రజల జీవితాలను చిందరవందరచేసింది. వ్యాపారుల దగ్గర్నుంచి పూలుకొనేవాళ్ళే కరువయ్యారు. ప్రతియేటా ఇదే సీజన్లో జరిగే కేరళ ప్రసిద్ధ ఓనమ్ పండుగకు దాదాపు 800 టన్నుల పూల వ్యాపారం జరిగేది. కేరళ సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులోని తిరునాల్వేలి నుంచి తరలివచ్చే పూల వ్యాపారులకు ఈ ఏడాది నిరాశే ఎదురయ్యింది. ఒక్క తిరునాల్వేలి నుంచే కాకుండా హోసూర్, కోయంబత్తూర్, కన్యాకుమారి, బెంగుళూరుల నుంచి వచ్చే పూల వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మతాలకతీతంగా కేరళ ప్రజలు జరుపుకునే ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలో జరిగే మొత్తం వ్యాపారమే కీలకం. ఎలక్ట్రానిక్స్, బట్టల వ్యాపారంలో 15 శాతం బిజినెస్ ఈ పండుగ రెండు వారాల్లోనే జరుగుతుంది. మాల్స్, సూపర్ మార్కెట్స్, బట్టల షాపులు పండుగ ఆఫర్లతో వ్యాపారం మరింత జోరుగా సాగేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారమే లేదని త్రిస్సూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టిఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. కేరళ రాష్ట్రానికి అధికాదాయ వనరు అయిన పర్యాటకరంగం వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నది. కేరళ లోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడటంతో చాలా మంది టూరిస్టులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. అలప్పుజా, మున్నార్, కుమరకమ్, పెరియార్ లాంటి ప్రధాన పర్యాటకప్రాంతాల్లో దాదాపు 95 శాతం పర్యాటకులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. ’’రోడ్లు పునర్నిర్మించాలి. పర్యాటక ప్రాంతాలను ప్రజల సందర్శనార్థం పునః ప్రారంభించాలంటే కొంత సమయం పడుతుంది. ఇదంతా సజావుగా సాగడానికి ఒకటి రెండు నెలలు పడుతుంది. సహజంగానే స్థానిక ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రజలు ఇష్టపడరు’’ అని ఎయిర్ ట్రావెల్స్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇఎం నజీబ్ తెలిపారు. కేరళలో పర్యాటకుల తాకిడి అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి మాత్రం 70 నుంచి 80 శాతం రెవెన్యూకి గండిపడుతుందని భావిస్తున్నారు. ప్రకృతి వైద్యం కోసం, ఇతర ఆరోగ్య అవసరాలకోసం ప్రతియేటా చాలా మంది వివిధ ప్రాంతాలనుంచి కేరళకి వెళుతుంటారు. అయితే ఈసారి మెడికల్ టూరిజం కూడా 50 శాతం నష్టపోయిందని ధాత్రి ఆయుర్వేద ఎండి, సిఐఐ కేరళ అధ్యక్షుడు డాక్టర్ సాజికుమార్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఒక్క పేషెంట్ కూడా రావడం లేదనీ మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందనీ ఆయన వివరించారు. కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించింది. పనిదినాలు, పర్యాటకుల పర్యటనల రద్దు, ఇతరత్రా అన్నీ కలుపుకొని 25,000 కోట్ల రూపాయల వరకూ రాష్ట్రం నష్టపోయినట్టు అంచనా వేసారు. అయితే ఇంత నష్టం జరిగినా కేరళల ప్రజలు, అధికారులు, సాధారణపౌరులూ, వైద్యులూ తమకు తోచిన విధంగా కేరళ పునర్నిర్మాణంలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. కొచ్చిలోని అస్తర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ సిఇఓ డాక్టర్ హరిప్రసాద్ పిళ్ళై మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తమ ఆసుపత్రిలో పనిచేసే 80 మంది డాక్టర్లు, 150 మంది నర్సులు 20 పునరావాస కేంద్రాల్లోనూ, కొచ్చీ, కలమస్సేరిలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రజాసేవలో మునిగి ఉన్నారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అధికారుల తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. వైద్య పరంగా ఈ యేడాదిలో నిఫా వైరస్ తర్వాత కేరళ ప్రజలెదుర్కొన్న రెండవ ఛాలెంజ్ ఇదేనని ఆయన అన్నారు. -
ఓలా క్యాబ్ క్యాన్సిల్, రచ్చ.. రచ్చ
లక్నో : క్యాబ్ బుక్ చేసుకుని.. ఆ వెంటనే దానిని రద్దు చేసుకున్న ఓ వ్యక్తి నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్ ఇస్లాం మతస్థుడు కావటమే తాను ఆ పని చేయటానికి కారణమంటూ సదరు వ్యక్తి ట్వీటర్లో పోస్టు చేసి పెను దుమారం రేపాడు. ఈ వ్యవహారంపై పలువురు అతన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అయోధ్యకు చెందిన అభిషేక్ మిశ్రా లక్నోలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 20న అతగాడు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే తీరా క్యాబ్ డ్రైవర్, తదితర వివరాలను ఓలా అతని మొబైల్‌కు పంపగా.. అర్థాంతరంగా అతను తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. ‘ఓలా క్యాబ్‌ను రద్దు చేసుకున్నా. ఎందుకంటే ఆ డ్రైవర్ ఓ ముస్లిం. నా సొమ్మును జిహాదీ ప్రజలకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు’ అంటూ ట్వీటర్లో పోస్టు చేశాడు. ఇక అతని ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో పలువురు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారు దేశానికి ప్రమాదకరమని కొందరు రీట్వీట్లు చేస్తే.. ఇలాంటోళ్లను దేశం నుంచి తరిమేయాలని కొందరు.. దేశానికి చెడ్డ పేరు తెచ్చేది ఇలాంటి వారేనంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై ఓలా కూడా స్పందించింది. ‘ఇలాంటి విద్వేషాలను మేం ఎప్పుడూ ఉపేక్షించబోం. డ్రైవర్లకు-కస్టమర్లకు మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యత మాది. ఒకరినొకరిని గౌరవించాలనే మేం చెప్పేది. అంతేకానీ, కుల, మత, ప్రాంతీయ బేధాలు మాకు లేవ్’ అంటూ ఓలా ట్వీట్ చేసింది. అభిషేక్ మిశ్రా మరో ట్వీట్... అభిషేక్‌కు వీహెచ్‌పీ, భజ్రంగ్దళ్, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలతో సంబంధం ఉంది. వీహెచ్‌పీ ఐటీ విభాగానికి అతను పని చేస్తున్నాడు కూడా. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను పలువురు కోరుతున్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు అభిషేక్ కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నాడు. హనుమంతుడి పోస్టర్లను క్యాబ్‌లపై వేసి నడిపించినప్పుడు.. నా వాదనను ఎందుకు అంగీకరించరు అంటూ ఓ మహిళ చేసిన ఫేస్బుక్ పోస్టును తన ట్వీటర్లో అభిషేక్ ఉంచాడు. Dear @Olacabs, if u don't believe in racial or religious discrimination of your employees, please block this moron's Ola account. https://t.co/OqhucFRNrK — Kapil (@kapsology) 22 April 2018 If this views acceptable then why my views are not acceptable ? pic.twitter.com/170MWQuBpn — Abhishek Mishra (@Abhishek_Mshra) 22 April 2018 -
చంద్రగహణం.. నేడు ప్రత్యేక దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో బుధవారం అన్నప్రసాదాల వితరణను టీటీడీ నిలిపివేసింది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. గ్రహణం కారణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 5.18 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతున్నందున రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. అలాగే శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నందున టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, శ్రీవారిని ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో నటి లావణ్యత్రిపాఠి, క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడు చాముండేశ్వరీ నాధ్లు దర్శించుకున్నారు. -
బియ్యంతో సరి
జంగారెడ్డిగూడెం : భవిష్యత్‌లో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులేవీ సబ్సిడీ ధరకు పంపిణీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ అధికారంలోకి రాకముందు రేషన్ కార్డులపై 9 రకాల సరుకుల్ని పంపిణీ చేసేవారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేషన్ కార్డులపై ఇచ్చే సరుకులు ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తూ వస్తున్నారు. సబ్సిడీపై ఇచ్చే పంచదార, కిరోసిన్ పేదలకు అందని ద్రాక్షగానే మారాయి. ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకమంటూ ఆర్భాటంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ విధానంలో మొదట్లో బియ్యం, పంచదార, కిరోసిన్‌తోపాటు పామాయిల్, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమ పిండి, కారం, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల్ని తక్కువ ధరకు సరఫరా చేసేవారు. ఆ తరువాత ప్రభుత్వం దశలవారీగా అన్ని సరుకుల పంపిణీపై కోత విధిస్తూ వస్తోంది. చివరకు బియ్యం పంపిణీకి మాత్రమే పరిమితం అవుతోంది. ఈ నెలలో పంచదార, కిరోసిన్ రేషన్ షాపులకు అవసరమైన స్థాయిలో సరఫరా కాలేదు. ప్రస్తుత నెలలో విడుదల చేసిన పంచదార, కిరోసిన్, గత నెలలో మిగిలిన పంచదార, కిరోసిన్ కలిపి ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు. పంచదార మొత్తం కోటాలో 30 శాతం, కిరోసిన్ 45 శాతం మాత్రమే జిల్లాలోని రేషన్ డిపోలకు కేటాయించారు. కిరోసిన్ ఇంకా విడుదల కాలేదు. సబ్సిడీ ఉపసంహరించిన కేంద్రం పంచదార, కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి పంపిణీకి మంగళం పాడి సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నెలనెలా కిరోసిన్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై దానిని పూర్తిగా నిలిపివేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామంటూ ప్రజలను మాయ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని, అందువల్ల కిరోసిన్ వినియోగం ఉండదని చెబుతోంది. ఇందుకు పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరిని ఎన్నుకుంది. జిల్లాకు 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా, అవి సరిపోవని మరో 80 వేల కనెక్షన్లు కావాలని జిల్లా కలెక్టర్ నివేదించడంతో 1.70 లక్షలకనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ గ్యాస్ కనెక్షన్లు వినియోగదారులకు ఇంకా అందలేదు. ఈలోగానే కిరోసిన్ పంపిణీ నిలిపివేయడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీ నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల నుంచి పంచదార పంపిణీ పూర్తిగా నిలిచిపోనుంది. దీంతో ఆ సరుకుల్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లబ్ధిదారులకు ఏర్పడుతోంది. ఇదిలావుంటే.. బియ్యం వద్దనుకునే వారికి నేరుగా వారి ఖాతాలో నగదు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా బియ్యం పంపిణీని కూడా దశల వారీగా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డీలర్ల గతేంటి! రేషన్ డీలర్లను బిజినెస్ బ్యాంక్ కరస్పాండెంట్లుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం గతంలో జీఓ జారీ చేసింది. రేషన్ షాపులను మినీ షాపింగ్‌మాల్స్‌గా మారుస్తామని ప్రకటించింది. ఇవి అమ ల్లోకి రాలేదు. రేషన్ షాపులను మినీ షాపింగ్ మాల్స్‌గా మారిస్తే అన్నిరకాల నిత్యావసర సరుకుల్ని వాటిద్వారా పంపిణీ చేయవచ్చు. రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమిస్తే సామాజిక పెన్షన్లు, కరెంటు బిల్లుల వసూలు, ఉపాధి హామీ కూలీల వేతనాలను పంపిణీ చేయవచ్చు. తద్వారా వారికి ఎంతోకొంత ఆదాయం సమకూరి ఉండేది. నగదు బదిలీ పథకం అమలు చేయడం వల్ల డీలర్లు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 11,96,418 లబ్దిదారులకు పంచదార, కిరోసిన్ అందకుండా పోతుంటే, 2,163 రేషన్ షాపుల ద్వారా సేవలు అందిస్తున్న డీలర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోంది. ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. పేదలకు అన్ని నిత్యావసర సరుకుల్ని రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలి. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజల్ని ప్రత్యక్ష ఆందోళనకు సమాయాత్తం చేస్తాం. – బూరుగుపల్లి సూరిబాబు, అధ్యక్షులు, గుడిసెవాసుల సంఘం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వానికి పతనం తప్పదు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకోకపోతే పతనం తప్పదు. ఇప్పటికే ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయని ప్రభుత్వం.. పేదవారికి చేరువగా ఉన్న చౌక డిపోలను నిర్వీర్యం చేస్తే తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రజాకంటక నిర్ణయాలు మానుకుని, ప్రజలకు చేరువయ్యే పాలన అందించే దిశగా ప్రభుత్వం కృషిచేయాలి. – బి.సాయికిరణ్, చిరుద్యోగి, జంగారెడ్డిగూడెం -
చిన్నారి మృతి: హాస్పిటల్ లైసెన్స్ రద్దు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులోని ఒక చిన్నారి అనుమానాస్పద మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రి లైసెన్సును అధికారులు రద్దు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 18 నెలల బాలుడు గురువారం ఉదయం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనిపై కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌వో దయానంద్స్వామి శ్రీనివాస పిల్లల హాస్పిటల్ వైద్యులే కారణమని తేలంటంతో లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుని కుటుంబానికి అవసరమైన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేషన్ బియ్యం.. అయోమాయం
‘రేషన్ బియ్యం తీసుకోవడం మానేయండి.. కిలోకు రూ.20 చొప్పున నేరుగా నగదు తీసుకోండి’ ఇకపై ప్రభుత్వం చేయబోయే ప్రచారమిది. ఆహార భద్రత పథకం కింద పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వారికి దూరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రేషన్ బియ్యం పంపిణీపై ఇప్పటికే సర్వే నిర్వహించామని.. చాలామంది ఈ బియ్యాన్ని తీసుకోకుండా డీలర్లకు అమ్మేస్తున్నారని చెబుతోంది. ఈ ముసుగులో బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. బియ్యానికి బదులు నగదు ఇచ్చే విధానాన్ని తొలుత మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. భీమవరం/పాలకోడేరు : జిల్లాలో అనేక నిరుపేద కుటుంబాలు రేషన్ బియ్యం అందుతుండటం వల్లే గుప్పెడు మెతుకులు తినగలుగుతున్నాయి. మనిషికి 5 కేజీల చొప్పున ఇస్తుండగా.. అవి 15 నుంచి 20 రోజులు మాత్రమే సరిపోతున్నాయి. మిగిలిన రోజుల్లో కడుపు నింపుకునేందుకు స్థోమత గలవారు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.40 చొప్పున వెచ్చించి బియ్యం కొనుగోలు చేస్తుంటే.. నిరుపేదలు పస్తులు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ బియ్యం తీసుకోవడం మానేస్తే కిలోకు రూ.20 చొప్పున ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేయడం పేదల పొట్టకొట్టడమే అవుతుందని ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. ఆహార భద్రత పథకానికి తూట్లు పొడిచే విధానాలను మానుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మనిషికి ఇచ్చే 5 కిలోల బియ్యం స్థానంలో కిలోకు రూ.20 చొప్పున రూ.100 మాత్రం ఇస్తారని.. ఆ సొమ్ముతో పేదలు ఏం తినగలరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చెబుతోందంటే.. జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా 17 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యాన్ని ప్రభుత్వం రూ.27కు కొనుగోలు చేస్తోంది. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి కిలో బియ్యం సుమారు రూ.35 అవుతోంది. జిల్లాలోని కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.59.50 కోట్లు వెచ్చిస్తున్నాయి. కిలో బియ్యాన్ని రూపాయికే కార్డుదారులకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రూ.1.70 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.57.80 కోట్ల భారం పడుతోంది. ఇంత సొమ్ము వెచ్చించినా ఆ బియ్యాన్ని వినియోగిస్తున్న వారు తక్కువగా ఉన్నారనేది ప్రభుత్వ వాదన. ఈ విషయం సర్వేలో వెల్లడైందని చెబుతోంది. చాలామంది కార్డుదారులు బియ్యాన్ని రేషన్ డీలర్లకు అమ్మేసుకుంటున్నారని.. ఈ కారణంగానే బియ్యానికి బదులు నగదు ఇవ్వాలనే ఆలోచన ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి కలెక్టర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. బియ్యం బదులు నగదు కావాలనుకునే వారి ఖాతాల్లో కిలోకు రూ.20 చొప్పున జమ చేయాలని భావిస్తున్నారు. బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక కిలోకు రూ.20 చొప్పున కార్డుదారులకు ఇస్తే నగదు రూపంలో రూ.7తోపాటు రవాణా చార్జీలు మిగులుతాయి. తద్వారా నెలకు రూ.25.50 కోట్ల వరకూ ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి 5 నుంచి 10 శాతం మంది మాత్రమే బియ్యాన్ని తీసుకోవడం లేదు. వారిలో కొందరు ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం తినడానికి అనువుగా లేకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం తినేందుకు అనువుగా ఉంటే ఎవరూ అమ్ముకునే పరిస్థితి ఉండదని.. మంచి బియ్యాన్ని సరఫరా చేయడం మానేసి ప్రభుత్వం దొడ్డిదారులు వెతకడం ఏమిటనే వాదన వినిపిస్తోంది. -
చెక్కుల చిక్కులు
తాడేపల్లిగూడెం : సాగునీటి కష్టాలకు ఎదురీది వరి పండించిన రైతులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. నగదు లావాదేవీలకు ప్రభుత్వం చెక్ పెట్టడంతో.. ధాన్యం అమ్మిన రైతులకు చెక్కుల రూపంలోనే సొమ్ము చెల్లించాలని బ్యాంకులు మెలిక పెడుతున్నాయి. రైతుల పేరిట ఖాతాలు రాసి.. మిల్లర్ల పేరిట ధాన్యం కమీషన్ వ్యాపారుల ఖాతాల్లోకి సొమ్ములు బదలాయించే విధానానికీ మంగళం పలి కాయి. మరోవైపు ధాన్యం రవాణాకు సంబంధించిన వే బిల్లులను ఆన్ లైన్ విధానంలోజారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనలన్నీ రైతుల పాలిట శాపంగా పరిణవిుంచాయి. ఇకపై ధాన్యం విక్రయించే రైతులు ముందుగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లి ఫొటో తీయించుకుని, వేలిముద్ర వేయాలి. అప్పుడే రైతు తీసుకెళ్లిన ధాన్యం రికార్డుల్లో నమోదవుతుంది. ధాన్యం అమ్మిన సొమ్ము సదరు రైతు పేరిట బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ తతంగమంతా రైతులను అయోమయంలోకి నెడుతోంది. కొనుగోళ్లకు దూరంగా మిల్లర్లు సార్వా సీజన్ కు సంబంధించి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం«ధించి బకాయిలు ఇంకా చెల్లిం చలేదు. దాళ్వాలో పండిన ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో విక్రయించే విష యంలో కొత్త నిబంధనలు రూపొం దించారు. ధాన్యం అమ్మడానికి ముందే రైతులు విధిగా ఐకేపీ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ ఫొటో తీయించుకుని వేలిముద్రలు వేయాలి. ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో దాళ్వా ధాన్యం కొనుగోళ్లలో అయోమయం నెలకొంది. మిల్లర్లు గత సీజన్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిల చిక్కుముడి వీడకపోవడంతో వారు కొనుగోళ్ల విష యంలో పట్టు బిగించారు. అప్రకటితంగా ధాన్యం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ఈ చర్యలు రైతులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. మిల్లర్ల ఖాతాల అనుసంధానం ఐకేపీ కేంద్రాలకు రైస్ మిల్లర్ల బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాచరణ రూపొందిం చింది. దీనిపై అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులకు అదేశాలు అందాయి. 17 శాతం తేమ, ఒక శాతం మట్టి, తాలుతప్ప ఉన్న ధాన్యాన్ని గ్రేడ్–ఏ రకంగా గుర్తించి క్వింటాల్ రూ.1,510, కామన్ రకం క్వింటాల్‌కు రూ.1,470 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. రైతులు ధాన్యం తూర్పారబట్టి, తేమ శాతం నిబంధనల మేరకు ఉండేలా ఐకేపీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించింది. ధాన్యం కొనుగోలులో గత నిబంధనలే ఉంటాయని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వెంకట కొండయ్య చెబుతున్నారు. సార్వాలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబం ధించి బకాయిలను ఇబ్బంది లేకుండా చెల్లింపులు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కన్నెత్తి చూడని కమీషన్ వ్యాపారులు ప్రభుత్వం మాన్యువల్ వే బిల్లులకు చెక్ పెట్టింది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆన్ లైన్ వే బిల్లులు జారీ చేయాలని నిబంధనలు విధించారు. తద్వారా చెక్ పోస్టుల కళ్లుగప్పి ధాన్యాన్ని తరలించడాన్ని నిరోధించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆన్ లైన్ వే బిల్లుల ద్వారా వ్యవహారాలు నిర్వహిస్తే ఆదాయ పన్నుశాఖ కళ్లల్లో పడతామనే భయం ధాన్యం కమీషన్ ఏజెంట్లకు పట్టుకుంది. దీంతో వారు ధాన్యం కొనేందుకు వెనుకాడుతున్నారు. ఇదిలావుంటే.. రైతులు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తోలినా, మిల్లర్లకు విక్రయించినా, కమీషన్ దారులకు అమ్మినా సొమ్ములు నగదు రూపంలో పొందలేకపోతున్నారు. ఆర్టీజీఎస్ లేదా ఆన్ లైన్లో నగదు బదలాయించే ప్రక్రియ సాగుతోంది. ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త నిబంధనలు పెట్టడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఖాతాల్లో సొమ్ములున్నా చేతికందక.. రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా.. విత్ డ్రా చేసుకునే విషయంలో బ్యాంకులు నిబంధనలు విధించాయి. వరి కోతలు, ధాన్యం మాసూళ్ల కోసం వచ్చిన కూలీలకు సైతం రైతులు చెక్కు రూపంలోనే చెల్లింపులు చేయాలి. బంటాకు సొమ్ములు ఇవ్వాలన్నా ఇదే పద్ధతి. దీంతో రైతుల ఖాతాల్లో సొమ్ములున్నా కూలీలకు చెల్లించలేని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎంటీయూ–1156 రకం పండించిన రైతులకు కష్టాలు జిల్లాలో కొత్తగా సాగులోకి వచ్చిన సంకర రకం ఎంటీయూ–1156 ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు, ఎఫ్‌సీఐ ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఈ రకాన్ని సూపర్ ఫైన్ గా కొనుగోలు చేయాలి. ఇందులో పిండి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు బ్లాక్ స్పాట్ (గింజ తలపై నల్లటి మచ్చ) వస్తోందంటూ ఎఫ్‌సీఐ నిరాకరిస్తోంది. దీంతో మిల్లర్లు సైతం ఈ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. జిల్లాలోని మొత్తం వరి సాగు విస్తీర్ణంలో 18.2 శాతం (31 వేల హెక్టార్లు) ఎంటీయూ–1156 రకాన్ని రైతులు సాగుచేస్తున్నారు. సుమారు మూడు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో కొన్నిచోట్ల పిండి గింజలు మాదిరిగా, కొన్ని ప్రాంతాల్లో అవి లేకుండా ఈ రకం ధాన్యం ఉంది. పూర్తిస్థాయి మాసూళ్లు జరిగితే కాని ఎలాంటి నిర్ధారణకు రాలేమని సివిల్ సప్లైస్ వర్గాలు చెబుతున్నాయి. -
రెండు ప్రత్యేక రైళ్లు రద్దు
విజయవాడ: సాంకేతిక కారణాల దృష్ట్యా ముందుగా ప్రకటించిన కోచివేలి –గౌహతి –కోచివేలి ప్రత్యేక రైళ్లను ఈ నెల 26, మార్చి 1వ తేదీన రద్దు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 వ తేదీన రావాల్సిన కోచివేలి–గువాహటి నంబరు 06336 ప్రత్యేక రైలును, అలాగే నంబర్ 06335 గౌహతి-కోచివేలి ప్రత్యేక రైలు (మార్చి1వ తేదీ)ను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రాజశేఖర్ కోరారు. -
‘స్మార్ట్’గా వేటు!
- కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు - ప్రజాసాధికార సర్వే ప్రభావం - జిల్లాలో 3,700 కార్డుల తొలగింపు అనంతపురం అర్బన్ : ప్రజాసాధికార సర్వే (స్మార్ట్ పల్స్) విషయంలో పేదలు భయపడినట్లే జరుగుతోంది. నాలుగు చక్రాల వాహనం, సొంత ఇల్లు... ఇలా వివిధ కారణాలతో కార్డుల తొలగింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా మంజూరైన బీపీఎల్ కార్డులపై తొలి దశలో ‘స్మార్ట్’గా వేటువేసింది. కొత్త కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసింది. లబ్ధిదారుల ఆధార్‌ను ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం చేసి అర్హత లేదంటూ తొలగించింది. దీంతో కార్డు వచ్చిన ఆనందం లబ్ధిదారుల్లో అంతలోనే ఆవిరైపోయింది. 3,700 కార్డుల రద్దు జిల్లాకు కొత్తగా 95 వేల రేషన్ కార్డుల మంజూరయ్యాయి. నాల్గో విడత జన్మభూమిలో 72,531 కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలినవి లబ్ధిదారులు స్వయంగా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకున్నారు. కొత్తగా మంజూరైన వాటిలో 3,700 కార్డులను పూర్తిగా రద్దు చేశారు. కార్డులు పొందిన వారికి సంబం«ధించిన ఆధార్ వివరాలను ప్రజాసాధికార సర్వే వివరాలతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆరు అంచెల పరిశీలన చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనం ఉందంటూ కొందరిని, పరిమితికి మించి సొంత ఇల్లు ఉందని మరికొందరిని.. ఇలా వివిధ కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ కార్డులను రద్దు చేసింది. ఇదే క్రమంలో మున్ముందు మరిన్ని కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ‘ఉపాధి’ కోసం పెట్టుకుంటే.. జిల్లాలో పలువురు వ్యాన్లు, టాటా సుమోలు, జీపులు వంటి నాలుగు చక్రాల వాహనాలను నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, కనగానపల్లి, తగరకుంట, గుత్తి, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, రాయదుర్గం.. ఇలా పలు ప్రాంతాల్లో పేద వర్గాలకు చెందిన నిరుద్యోగులు నాలుగు చక్రాల వాహనాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో రుణం పొంది వాహనాలు కొనుగోలు చేశారు. సొంతంగా నడుపుతూ.. తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి వారికి కార్డులు రద్దు చేయడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. – ఓ.నల్లప్ప, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్షేమ పథకాలకు పేదలను దూరం చేసేందుకే ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం నిర్వహించిందని తొలి నుంచి చెబుతున్నాం. సర్వే వివరాలకు ఆధార్‌ను అనుసంధానం చేసి కార్డులు తొలగిస్తారని జనం భయపడినట్లే ఇప్పుడు జరుగుతోంది. జిల్లాలో వేలాది మంది పేద నిరుద్యోగ యువకులు అప్పులు చేసి.. నాలుగు చక్రాల వాహనాలు కొన్నారు. వీటి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వీరిని ప్రోత్సహించాల్సింది పోయి కార్డులు తొలగించడం అన్యాయం. -
‘తెలుగు మీడియం రద్దు’
జీఓను ఉపసంహరించాలి విద్యావికాస వేదిక రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ కాకినాడ సిటీ : మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో తెలుగుమీడియం రద్దు చేసి ఇంగ్లిష్ మీడియంను కొనసాగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని విద్యావికాస వేదిక డిమాండ్ చేసింది. బుధవారం ‘మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టుట– విద్యారంగంపై ప్రభావం’ అనే అంశంపై జనవిజ్ఞానవేదిక జిల్లా కార్యాలయంలో విద్యావికాస వేదిక జిల్లా కన్వీనర్ కె.సత్తిరాజు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా క్రియా ఫౌండేష¯ŒS నిర్వాహకులు ఎస్ఎస్ఆర్ జగన్నాథరావు పాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆసక్తి మేరకు సమాంతరంగా తెలుగు, ఇంగ్లిష్ మాద్యమాలు ప్రవేశపెట్టి, తగిన సిబ్బందిని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యావికాస వేదిక జిల్లా కన్వీనర్ కె.సత్తిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకువచ్చే సంస్కరణలపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులతో సంప్రదించకుండా మున్సిపల్ శాఖామంత్రి ఏకపక్షంగా నిర్ణయించడం తగదన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఇంగ్లిష్ మీడియం తరగతులకు పోస్టులు మంజూరు చేయాలని, విద్యారంగంలో కార్పొరేట్ విధానాలు తొలగించాలని, విద్యకు బడ్జెట్లో తగినన్ని ఎక్కువ నిధులు కేటాయించాలని, మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియానికి సంబంధించి విడుదల చేసిన జీఓ 14ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షులు జి.ప్రభాకరవర్మ, బాలవేదిక కన్వీనర్ ఎ¯ŒS.బలరామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కారెం శివాజీకి మళ్లీ చుక్కెదురు
-
నోటు పాట్లు.. గుండె పోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రోజులు గడుస్తున్నాయి. బ్యాం కుల వద్ద క్యూలు మాత్రం తరగడం లేదు. ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో రెండు రోజులకు డబ్బులు అందుబాటులో ఉండవన్న భయంతో శనివారం చాలా బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనపడ్డాయి. క్యూలో నిలబడలేక గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల కృష్ణమూర్తి (70) నగదు తీసుకునేందుకు గణపవరంలోని స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలబడగా, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఖాతాదారులు, పోలీసులు ఆర్ఎంపీతో ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆయనను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. రోడ్డెక్కిన మహిళలు బ్యాంకుల్లో నగదు లేదన్న బోర్డులతో మహిళలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇరగవరం ఎస్బీఐ వద్ద నగదు లేదని బోర్డు పెట్టడంతో బ్యాంకు ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో శనివారం ఉదయం 7 గంటలకే ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు క్యూలో నిలబడ్డారు. 10 గంటలకు వచ్చిన అధికారులు నగదు లేదని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించి 165 జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భీమవరం–పాలకొల్లు రహదారిలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతలపూడి నియోజకవర్గంలో శనివారం బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్బీఐ ఏటీఎం మధ్యాహ్న నుంచి పని చేసినా.. మిగిలిన ఏటీఎంలు మూతపడ్డాయి. జంగారెడ్డిగూడెంలో ఏటీఎంలు పని చేయలేదు. బ్యాంకుల్లో నగదు లేదు. ఆంధ్రాబ్యాంక్‌లో మాత్రం రైతులకు రూ.10 వేల చొప్పున ఇచ్చారు. కామవరపుకోట ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతాదారులకు చిల్లర పంపిణీ చేశారు. ఏటీఎంలు మాత్రం పని చేయలేదు. లింగపాలెంలో బ్యాంకుల్లో క్యాష్ లేదని చెప్పారు. ఏటీఎంలు పని చేయలేదు. నగదు ఇవ్వడం లేదని ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి బ్యాంక్ వద్దకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు రాగా, రూ.వెయ్యి చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచంట ప్రాంతంలోని బ్యాంకుల్లో నాలుగైదు రోజుల నుంచి ఖాతాదారులకు టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం వెళ్లి క్యూలో నిలబడితే తప్ప టోకె¯ŒS దక్కే పరిస్థితులు లేకపోవడంతో తెల్లవారకుండానే బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. భీమవరం పట్టణంలో బ్యాంకుల వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాయి. జిల్లాలో కూడా దీనిపై ఊదరగొడుతున్నారు. అయితే, స్వైపింగ్ మెషిన్ల కోసం నెలరోజుల క్రితమే బ్యాంకర్లకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకూ ఇవ్వలేదు. -
నోటు పాట్లు.. గుండె పోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రోజులు గడుస్తున్నాయి. బ్యాం కుల వద్ద క్యూలు మాత్రం తరగడం లేదు. ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో రెండు రోజులకు డబ్బులు అందుబాటులో ఉండవన్న భయంతో శనివారం చాలా బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనపడ్డాయి. క్యూలో నిలబడలేక గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల కృష్ణమూర్తి (70) నగదు తీసుకునేందుకు గణపవరంలోని స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలబడగా, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఖాతాదారులు, పోలీసులు ఆర్ఎంపీతో ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆయనను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. రోడ్డెక్కిన మహిళలు బ్యాంకుల్లో నగదు లేదన్న బోర్డులతో మహిళలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇరగవరం ఎస్బీఐ వద్ద నగదు లేదని బోర్డు పెట్టడంతో బ్యాంకు ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో శనివారం ఉదయం 7 గంటలకే ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు క్యూలో నిలబడ్డారు. 10 గంటలకు వచ్చిన అధికారులు నగదు లేదని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించి 165 జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భీమవరం–పాలకొల్లు రహదారిలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతలపూడి నియోజకవర్గంలో శనివారం బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్బీఐ ఏటీఎం మధ్యాహ్న నుంచి పని చేసినా.. మిగిలిన ఏటీఎంలు మూతపడ్డాయి. జంగారెడ్డిగూడెంలో ఏటీఎంలు పని చేయలేదు. బ్యాంకుల్లో నగదు లేదు. ఆంధ్రాబ్యాంక్‌లో మాత్రం రైతులకు రూ.10 వేల చొప్పున ఇచ్చారు. కామవరపుకోట ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతాదారులకు చిల్లర పంపిణీ చేశారు. ఏటీఎంలు మాత్రం పని చేయలేదు. లింగపాలెంలో బ్యాంకుల్లో క్యాష్ లేదని చెప్పారు. ఏటీఎంలు పని చేయలేదు. నగదు ఇవ్వడం లేదని ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి బ్యాంక్ వద్దకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు రాగా, రూ.వెయ్యి చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచంట ప్రాంతంలోని బ్యాంకుల్లో నాలుగైదు రోజుల నుంచి ఖాతాదారులకు టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం వెళ్లి క్యూలో నిలబడితే తప్ప టోకె¯ŒS దక్కే పరిస్థితులు లేకపోవడంతో తెల్లవారకుండానే బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. భీమవరం పట్టణంలో బ్యాంకుల వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాయి. జిల్లాలో కూడా దీనిపై ఊదరగొడుతున్నారు. అయితే, స్వైపింగ్ మెషిన్ల కోసం నెలరోజుల క్రితమే బ్యాంకర్లకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకూ ఇవ్వలేదు. -
బాబోయ్ బ్యాంకు
సత్తువ లేకపోయినా ఓపిక తెచ్చుకుని మరీ వృద్ధులు, వితంతువులు, దివ్యాం గులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఉదయం నుంచీ క్యూలో నిలబడక తప్పడం లేదు. చేతికందేది స్వల్ప మొత్తమే అయినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఉదయం నుంచే నిరీక్షిస్తున్నా.. డబ్బు చేతికి అందుతుందో లేదోననే ఆందోళన. ఖాతాల్లో సొమ్ములున్నా.. అవసరానికి సరిపడేంత తీసుకునే అవకాశం లేదు. అందరిలోనూ అస హనం పెరిగిపోతోంది. బ్యాంక్ ఉద్యోగులకు బీపీ వస్తోంది. నిస్సహాయ స్థితిలో తమను తామే తిట్టుకుంటూ నోట్ల కోసం పాట్లు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో కష్టాల కుంపట్లో పడి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రోజంతా క్యూలో నిలబడినా.. సొమ్ము చేతికందుతుందో లేదోననే ఆందోళన అందరిలోనూ కనబడుతోంది. ఒకటో తారీఖున బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు.. కేవలం పింఛను డబ్బులపైనే ఆధారపడి జీవించే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఏటీఎంలు, బ్యాంకుల పనితీరును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఎన్ని బ్యాంకులున్నా.. ఏం లాభం జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించి 585 శాఖలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 594 ఏటీఎంలు ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో 368 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. వీటిలో కేవలం 62 ఏటీఎంలలో రూ.100 నోట్లు పెట్టారు. మిగిలిన ఏటీఎంలలో రూ.2 వేల నోట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ ఏటీఎంలు కూడా గంట, గంటన్నర మాత్రమే పనిచేశాయి. దీంతో పింఛనుదారులు బ్యాంకుల్లోనే సొమ్ము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు, చేనేత, కల్లుగీత విభాగాల్లో 3.38 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరందరికీ రూ.37 కోట్లు చెల్లించాల్సి ఉంది. గడచిన రెండు రోజుల్లో కేవలం రూ.7 కోట్లు మాత్రమే బ్యాంకులు చెల్లించాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా 34వేల మంది ఉద్యోగులుండగా, 6,800 మంది మాత్రమే బ్యాంకుల నుంచి కొంతమొత్తంలో జీతం సొమ్మును తీసుకోగలిగారు. ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. రద్దీ ఉన్న సమయాల్లో సైతం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వారి ఇబ్బం దులు అన్నీఇన్నీ కావు. మొదటి రోజున పింఛను సొమ్ము ఖాతాలో పడకపోవడంతో రెండో రోజైనా వస్తుందనుకున్న వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నిరాశ తప్పలేదు. చాలాచోట్ల వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఒకపక్క బ్యాంకులో నగదు నిల్వలు సరిపడా లేక, మరోవైపు ఖాతాదారుల నుంచి వస్తున్న వత్తిళ్లతో బ్యాంకు సిబ్బంది కూడా నలిగిపోతున్నారు. ప్రతి బ్యాంకుకు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు మాత్రమే నగదు వస్తుండటంతో ఎక్కువ మందికి చెల్లించలేకపోతున్నారు. ఖాతాదారులు వాదనకు దిగుతుండటంతో తమపై కోపం తెచ్చుకుంటే ఉపయోగం లేదని, ప్రభుత్వంపై చూపండంటూ బ్యాంక్ ఉద్యోగులు అంటున్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం అంధ్రాబ్యాంక్లో పింఛను సొమ్ముతీసుకోవడానికి వచ్చిన కార్సిక సూర్యకుమారి అనే వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన కాకర్లముడి రాములమ్మ (68) అనే వృద్ధురాలు బ్యాంకు వద్ద క్యూలో నిలబడినా సొమ్ము అందలేదు. ఇంటికి వెళ్లిన అనంతరం వంట చేసుకుంటూ గురువారం రాత్రి మృతి చెందింది. తన కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని డబ్బులు ఇప్పించాలని కామవరపుకోటకు చెందిన ఆకుల చంద్రకళ అనే మహిళ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌కు విన్నవించుకుంది. బ్యాంకులో డబ్బు లేదని, ఎవరైనా జమ చేస్తే ఇస్తానని మేనేజర్ సమాధానం ఇచ్చారు. ఎనీ టైం మూత ఏటీఎంలు ఎనీటైమ్ మూత అన్న చందంగా తయారయ్యాయి. భీమవరంలో దాదాపుగా ఏ ఏటీఎంలోనూ నగదు లేదు. చింతలపూడి నియోజకవర్గంలో 35 ఏటీఎంలు ఉండగా ఆరు మాత్రమే పనిచేశాయి. నిడదవోలులో 20 ఏటీఎంలు 11 గంటలకే మూతపడ్డాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడులో 59 ఏటీఎంలకు గాను 6 మాత్రమే పనిచేశాయి. ఉండి మండలంలో ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలతోపాటు పట్టణ పరిధిలో మొత్తం 50 ఏటీఎంలు ఉండగా ఆరు మాత్రమే పనిచేశాయి. నరసాపురంలో 14 ఏటీఎంలు ఉండగా ఒక్కటి కూడా పనిచేయలేదు. ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచ్ వద్ద ఏటీఎం మాత్రం ఉదయం 2 గంటలపాటు పనిచేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ ఏటీఎంలు పనిచేశాయి. ఆచంట నియోజకవర్గంలో 22 ఏటీఎంలు ఉండగా 13 మూతపడ్డాయి. కొవ్వూరులో ఉన్న 5 ఏటీఎంలు మధాహ్నానికే మూతపడ్డాయి. -
నోటు మీద కొట్టారు
కొవ్వూరు : రెండు రోజుల నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. అసలే నోట్లు అవసరమైన మేరకు రాకపోవడంతో ఏటీఎంలలో అరకొరగానే నగదు పెడుతున్నారు. దీంతో శనివారమే జిల్లాలో చాలాచోట్ల ఏటీఎంలు సొమ్ముల్లేక మూతపడ్డాయి.ఆదివారం జిల్లావ్యాప్తంగా దాదాపు ఏటీఎంలన్నీ ఖాళీ కావడంతో జనం నానా అవస్థలు పడ్డారు. రెండు రోజుల వరుస సెలవులు విషయం తెలియకపోవడంతో కొందరు నగదును ముందస్తుగా డ్రా చేసుకోలేకపోయారు. జిల్లాలో సుమారు 700 బ్యాంకులు, 350 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క కొవ్వూరులోనే పదికిపైగా ఏటీఎంలు ఉన్నాయి.ఆదివారం ఒక్క ఏటీఎంలోనూ సొమ్ముల్లేవు. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈరెండు రోజుల్లో రోజుకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయినట్టు అంచనా. నేడు హర్తాళ్‌కుSపిలుపు పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా వామపక్షాలు హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి.దీనికి వైఎస్సాఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేంత వరకు పాతనోట్లను వినియోగంలో ఉంచాలని, లేదంటే సరిపడినంత చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ చేపట్టిన ఈ హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. పంట డబ్బుకూ తంటా భీమడోలు : ఈయన పేరు బొబ్బనబోయిన వెంకటేశ్వరరావు. స్వగ్రామం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురం. వయస్సు 80 ఏళ్లు. వ్యవసాయంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ఏడాది తనకున్న రెండెకరాలకు తోడు, మరో రెండెకరాలను కౌలుకు తీసకుని సాగుచేశాడు. దిగుబడి బాగానే వచ్చింది. ధాన్యాన్ని కమీష¯ŒS వ్యాపారికి విక్రయించాడు. అతని వద్ద నుంచి రూ.1.60 లక్షలు రావాలి. ఇంతలో పెద్దనోట్లు రద్దయ్యాయి. దీంతో నగదు ఇవ్వాలంటే ఆధార్, బ్యాంకు పుస్తకాల జిరాక్స్ తేవాలని కమీష¯ŒS వ్యాపారి చెప్పాడు. ఎందుకంటే మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తానన్నాడు. అదీ నెల తర్వాతని చెప్పాడు. దీంతో వెంకటేశ్వరరావు తన వద్ద ఉన్న డొక్కు సైకిల్ వేసుకుని చిరిగిన పంచెతో నాలుగుకిలోమీటర్ల దూరంలోఉన్న పూళ్ల వచ్చాడు. గ్రామంలో జిరాక్స్ యంత్రం లేకపోవడమే దీనికి కారణం. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం డబ్బులు వస్తే పంట కోసిన కూలీలకు, పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు ఇవ్వాలని, వారు మాటిమాటికి ఇంటికి వచ్చి నిద్రపోనివ్వడం లేదని వాపోయాడు. నెల తర్వాత వ్యాపారి డబ్బిస్తే ఎలాగో అర్థం కావడం లేదని, దాళ్వా సాగు పెట్టుబడికి నగదు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
నోటు మీద కొట్టారు
కొవ్వూరు : రెండు రోజుల నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. అసలే నోట్లు అవసరమైన మేరకు రాకపోవడంతో ఏటీఎంలలో అరకొరగానే నగదు పెడుతున్నారు. దీంతో శనివారమే జిల్లాలో చాలాచోట్ల ఏటీఎంలు సొమ్ముల్లేక మూతపడ్డాయి.ఆదివారం జిల్లావ్యాప్తంగా దాదాపు ఏటీఎంలన్నీ ఖాళీ కావడంతో జనం నానా అవస్థలు పడ్డారు. రెండు రోజుల వరుస సెలవులు విషయం తెలియకపోవడంతో కొందరు నగదును ముందస్తుగా డ్రా చేసుకోలేకపోయారు. జిల్లాలో సుమారు 700 బ్యాంకులు, 350 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క కొవ్వూరులోనే పదికిపైగా ఏటీఎంలు ఉన్నాయి.ఆదివారం ఒక్క ఏటీఎంలోనూ సొమ్ముల్లేవు. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈరెండు రోజుల్లో రోజుకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయినట్టు అంచనా. నేడు హర్తాళ్‌కుSపిలుపు పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా వామపక్షాలు హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి.దీనికి వైఎస్సాఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేంత వరకు పాతనోట్లను వినియోగంలో ఉంచాలని, లేదంటే సరిపడినంత చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ చేపట్టిన ఈ హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. పంట డబ్బుకూ తంటా భీమడోలు : ఈయన పేరు బొబ్బనబోయిన వెంకటేశ్వరరావు. స్వగ్రామం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురం. వయస్సు 80 ఏళ్లు. వ్యవసాయంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ఏడాది తనకున్న రెండెకరాలకు తోడు, మరో రెండెకరాలను కౌలుకు తీసకుని సాగుచేశాడు. దిగుబడి బాగానే వచ్చింది. ధాన్యాన్ని కమీష¯ŒS వ్యాపారికి విక్రయించాడు. అతని వద్ద నుంచి రూ.1.60 లక్షలు రావాలి. ఇంతలో పెద్దనోట్లు రద్దయ్యాయి. దీంతో నగదు ఇవ్వాలంటే ఆధార్, బ్యాంకు పుస్తకాల జిరాక్స్ తేవాలని కమీష¯ŒS వ్యాపారి చెప్పాడు. ఎందుకంటే మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తానన్నాడు. అదీ నెల తర్వాతని చెప్పాడు. దీంతో వెంకటేశ్వరరావు తన వద్ద ఉన్న డొక్కు సైకిల్ వేసుకుని చిరిగిన పంచెతో నాలుగుకిలోమీటర్ల దూరంలోఉన్న పూళ్ల వచ్చాడు. గ్రామంలో జిరాక్స్ యంత్రం లేకపోవడమే దీనికి కారణం. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం డబ్బులు వస్తే పంట కోసిన కూలీలకు, పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు ఇవ్వాలని, వారు మాటిమాటికి ఇంటికి వచ్చి నిద్రపోనివ్వడం లేదని వాపోయాడు. నెల తర్వాత వ్యాపారి డబ్బిస్తే ఎలాగో అర్థం కావడం లేదని, దాళ్వా సాగు పెట్టుబడికి నగదు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆటో నగర్ స్థలాల కేటాయింపు రద్దు
ఏలూరు రూరల్ : ఏలూరు నగర శివారున గల ఆటోనగర్‌లో ఆటోమొబైల్ మెకానిక్స్ యూనియ¯ŒS సభ్యులకు స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ ఏపీ ఇండస్ట్రియల్ ఇ¯ŒSఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేష¯ŒS (ఏపీఐఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. స్థలాలు ఇచ్చిన రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయాలనే నిబంధనను ది ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేష¯ŒS పాటించనందున వారికి కేటాయించిన స్థలాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ కాకినాడ జోనల్ మేనేజర్ పి.నాగేశ్వరరావు ఉత్తర్వులిచ్చారు. దీనికితోడు స్థలాలు కేటాయించినప్పటికీ 170 మెకానిక్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా నేటికీ ఏలూరు నగరంలోనే కొనసాగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసోసియేష¯ŒS పనితీరుపై అందిన ఫిర్యాదులను పరిశీలించగా అనర్హులకు స్థలాలు కేటాƇయించినట్టు తేటతెల్లమైందని అందులో స్పష్టం చేశారు. ఆటోనగర్‌లో భవనాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, రిజిస్ట్రేషన్లను పరిశీలించగా, ప్రభుత్వంతో చేసుకున్న స్థలాల ఒప్పందంలోని నిబంధనలను అసోసియేష¯ŒS అమలు చేయలేదని తేలిం దన్నారు. ఈ ఆదేశాల ప్రతులను ఏపీఐఐసీ అధికారులు ఏలూరు తహసీల్దార్ ద్వారా అసోసియేష¯ŒS కార్యాలయ గోడపై అతికించారు. దీంతో ఆటోమొబైల్ వర్గాల్లో గుబులు పుట్టింది. అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం శనివారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న పలువురు సభ్యులు అధ్యక్షుడి వ్యవహార శైలిపై గళమెత్తారు. కొందరు ఆయనకు మద్దతు పలికారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అక్రమాలను బట్టబయలు చేసిన ‘సాక్షి’ ఆటోనగర్‌లో ఇష్టారాజ్యంగా స్థలాలు కేటాయిస్తున్నారన్న వాదనల నేపథ్యంలో.. అక్కడి అక్రమాలపై ’పెద్దలే గద్దలు’ శీర్షికన నవంబర్ 22న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ తరువాత 175 మంది బాధితులు ముందుకొచ్చి కలెక్టర్ కాటంనేని భాస్కర్, అప్పటి ఎస్పీ రఘురామ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అసోసియేష¯ŒS అధ్యక్షుడు మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేపట్టారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు నాగభూషణం ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతుగా రాజకీయం నడిపారు. అర్హుల ఆందోళన 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆటోనగర్‌లో ఇప్పటికే కొందరు అర్హులు షెడ్లు వేసుకున్నారు. వారికి కేటాయించిన స్థలాలు రద్దుకావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థలాలు దక్కని అర్హులు మాత్రం ఏపీఐఐసీ ఆదేశాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నిబంధనల మేరకు అర్హులందరికీ స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. అక్రమాల పుట్ట అసోసియేష¯ŒS కార్యకలాపాలు ఇష్టారాజ్యంగా సాగాయి. అర్హుల స్థలాలను డివిజ¯ŒS చేసి అనర్హులకు కట్టబెట్టారు. దీనిపై నిలదీసినందుకే మాకు స్థలాలు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పటికైనా అర్హులందరికీ స్థలాలను కేటాయించాలి. – జి.రాజు, అసోసియేషన్ సభ్యుడు ఏపీఐఐసీకి అధికారం లేదు ఆటో నగర్‌లోని స్థలాల కేటాయింపులను రద్దు చేసే అధికారం ఏపీఐఐసీకి లేదు. రెండేళ్లలోపు యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య ఏర్పడింది. మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 173 మంది షెడ్లు వేసుకున్నారు. – మాగంటి నాగభూషణం, అధ్యక్షుడు, మెకానిక్స్ అసోసియేష¯ŒS -
ఖాతాలపై కన్ను
బతుకులు బజారున పడిన భావన.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆవేదన. ‘నోటు’కాడ కూడు నేల పాలైన ఆందోళన. ఇదీ జిల్లాలోని సామాన్యులు, చిరు వ్యాపారుల పరిస్థితి. నల్లధనం పోగేసిన కుబేరులపై యుద్ధం చేయాలంటే.. సామాన్యుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయాలా? అనే ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. ఒకచోట గంటల తరబడి బ్యాంకుల్లో చిల్లర కోసం పడిగాపులు పడుతున్న జనం.. మరోచోట వ్యాపారాలు లేక ఆవేదన చెందుతున్న వ్యాపార గణం.. గ్రామగ్రామాన ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు కుబేరులు నిరుపేదలకు సంబంధించిన జన్ధ¯ŒS యోజన ఖాతాల్లో పెద్దఎత్తున సొమ్మును డిపాజిట్ చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ¯ŒSధ¯ŒS ఖాతాల్లో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే సదరు ఖాతాలను స్తంభింప చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. పెద్ద మొత్తాలని డిపాజిట్ చేసిన జ¯ŒSధ¯ŒS ఖాతాలు జిల్లాలోనూ ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్తంభింపచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. జీలుగుమిల్లి మండలంలో రూ.3 లక్షల సొమ్ము జమ అయిన ఖాతాలను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. అయితే, పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయా ఖాతాల వివరాలను ఐకేపీ అధికారులకు అందచేస్తామని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అవే కష్టాలు మరోవైపు పెద్దనోట్లు రద్దుచేసి 15 రోజులు దాటినా నగదు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడం, పనిచేసే ఏటీఎంలలో డబ్బులు అయిపోవడంతో జనం బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. బ్యాంకుల్లో చిల్లర లేదంటూ రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు రూ.500 నోట్లు వచ్చినా.. బ్యాంకులకు చేరుకోలేదు. మరోవైపు నగదు ఇవ్వడం లేదని తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ తెరిచిన అరగంట లోపే నగదు అయిపోయిందని చెప్పడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో పాత నోట్లు మార్చుకోవడానికి గురువారం అర్ధరాత్రితో గడువు ముగియ డంతో ఆందోళన ఎక్కువైంది. గడువు పెంచాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చొరవతో స్వైపింగ్ మెషిన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. భక్తలనూ తాకిన పెద్దనోట్ల సెగ పెద్ద నోట్ల సెగ భక్తులనూ తాకింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇరుముడులకు అవసరమయ్యే పూజా సామగ్రి కొనుగోలుకు చిల్లర నోట్ల సమస్యగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం సగానికిపైగా పడిపోయిందని పూజా సామగ్రి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 25 శాతం తగ్గింది. ఇళ్ల స్థలాల క్రయ విక్రయాలు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి డిసెబర్ 31 తరువాత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో పాత నోట్లు తీసుకునే వెసులుబాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లేదని ఆ శాఖ డీఐజీ లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఇదిలావుంటే.. నగదు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట ధర్నాలు జరిగాయి. కొత్తనోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేవరకూ చట్ట, న్యాయబద్ధమైన లావాదేవీలకు పెద్దనోట్లను అనుమతించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. -
నెల రోజులు 24 రైళ్లు బంద్
లక్నో: ఉత్తరప్రదేశ్ గుండా వెళ్లే 24కు పైగా రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేశారు. యూపీలో ఉన్నావో నుంచి కాన్పూర్ను కలిపే రైల్వే బ్రిడ్జికి మరమ్మత్తులు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాన్పూర్-లక్నో రైలు సెక్షన్ మధ్య నడిచే రైళ్లపై కూడా దీని ప్రభావం పడనుంది. లక్నో-న్యూఢిల్లీ గోమ్ని ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నుంచి 27 రోజుల పాటు రద్దు చేశారు. గోరఖ్‌పూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-లక్నో ఎక్స్‌ప్రెస్, ఆగ్రా ఇంటర్సిటీ తదితర ముఖ్యమైన రైళ్లు డిసెంబర్ మొదటి వారం వరకు నడవవని రైల్వే అధికారులు చెప్పారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. -
పెళ్లెందుకు రద్దు చేసుకున్నానంటే...
పెళ్లెందుకు రద్దు చేసుకున్నానంటే..! అంటూ సుదీర్ఘ కాలం తరువాత నటి త్రిష నోరు విప్పారు. గతేడాది ఈ అమ్మడి పెళ్లి సంగతులు పుంఖానుపుంఖాలుగా ప్రచారమయ్యాయి. వాటిలో కలకలం రేపిన అంశాలే అధికం అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే త్రిష సినీ వయసు 17 ఏళ్లు అని చెప్పకతప్పదు.1999లో నటి సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడి చిత్రంలో ఆమెకు స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తరువాత సుమారు మూడేళ్లకు లేసా లేసా చిత్రంలో కథానాయకిగా అవకాశం సంపాదించారు. ఆపై వరుసగా అవకాశాలు తలుపు తట్టడంతో కెరీర్ పరంగా ఎలాంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం త్రిషకు రాలేదు. విశ్వనటుడు కమలహాసన్, విజయ్, అజిత్, శింబు నుంచి గణేశ్ వెంకట్రామన్ వరకూ వరుస పెట్టి నటించేస్తున్నారు. అదే విధంగా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునల నుంచి సిద్ధార్ధ్‌ల వరకూ జత కట్టేశారు. నాయకిగా దశాబ్దంన్నరకు చేరువవుతున్న త్రిష నేటికీ కథానాయకిగానే రాణించడం విశేషమే అవుతుంది. ఇటీవల ధనుష్‌తో కలిసి కొడి చిత్రంలో నటించారు. అందులో రాజకీయనాయకురాలిగా ప్రేమికుడిని అంతం చేసే ప్రతినాయకిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినిలో నటిస్తున్నారు. తదుపరి విక్రమ్‌తో సామి 2లో రొమాన్స చేయడానికి సిద్ధం అవుతున్నారు. అదే విధంగా యువ నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఇలా నటిగా ఎవర్గ్రీన్ నాయకిగా వెలిగిపోతున్న త్రిష వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. టాలీవుడ్ యువ నటుడు రానాతో చెట్టాపట్టాల్ అంటూ త్రిష గురించి పెద్ద దుమారమే చెలరేగింది. అయితే రానాతో తనది మంచి స్నేహబంధమే అని ఈ చెన్నై చిన్నది స్పష్టం చేయడంతో ఆ దుమారానికి తెర పడింది. కాగా గత ఏడాది జనవరిలో వ్యాపార వేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో త్రిష పెళ్లి నిశ్చయమైంది.వారి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక వివాహమే తరువాయి అన్నకున్న తరుణంలో త్రిష, వరుణ్‌మణియన్‌ల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. పెళ్లి రద్దయింది. దీనికి కారణాలంటూ అనధికారంగా పలు విషయాలు మీడియాలో హల్చల్ చేసినా, నటి త్రిష మాత్రం స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.అయితే మళ్లీ నటించడం ప్రారంభించారు. అలాంటిది ఇన్నాళ్లకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న త్రిషను తన వివాహం గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాను ఇంతకు ముందు పెళ్లిని ఎందుకు రద్దు చేసుకున్నానంటే ..! సినిమానే తన జీవితం. సినిమాను వదిలి ఉండలేను. అంతగా సినిమాను ఇష్టపడుతున్నాను. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను అని అన్నారు. వివాహానంతరం కూడా సినిమాకు దూరంగా ఉండలేను. ఒక వేళ పెళ్లికి తరువాత సినిమాకు దూరం అవ్వాల్సి వస్తే అన్న ప్రశ్న తనలో తలెత్తింది. సినిమాను వదిలి ఉండడం తన వల్ల కాదని భావంచడంతో పెళ్లి రద్దు చేసుకున్నాను అని బదులిచ్చారు. ఇప్పటికీ తనకు కథానాయకిగా అవకాశాలు వస్తున్నాయని భవిష్యత్తులో హీరోయిన్ అవకాశాలు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా కొనసాగుతానని త్రిష పేర్కొన్నారు. -
విలీన మండలాల్లో జగన్ పర్యటనకు పోలీసుల అభ్యంతరం
పర్యటన వాయిదా సాక్షిప్రతినిధి, కాకినాడ: ఏజెన్సీలోని విలీన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన పోలీసులు అభ్యంతరాలతో వాయిదా వేసినట్టు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ చెప్పారు. బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ విలీన మండలాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ ఈ నెలలో పర్యటించాల్సి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా జగన్ ఆదేశించారన్నారు. అయితే ఈలోపు ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపధ్యంలో జగన్ పర్యటనపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ పోలీసు అధికారులను కలిసి పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినా పోలీసులు అంగీకరించలేదని చెప్పారు. దీంతో పర్యటన వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. -
ఆర్టీసీలో జోన్ల విధానం రద్దు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల నేపథ్యంలో ఆర్టీసీలో జోన్ల విధానాన్ని రద్దు చేశారు. ఇక నుంచి రీజనల్ మేనేజర్లే నేరుగా ఎండీకి బాధ్యత వహిస్తారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు (ఈడీ) ఆర్టీసీ పరిపాలనా కార్యాలయానికే పరిమితమవుతారు. హైదరాబాద్ సిటీ జోన్ మాత్రమే యథావిధిగా కొనసాగనుంది. కరీంనగర్ జోన్ ఈడీగా ఉన్న సత్యనారాయణకు ఆర్టీసీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత అప్పగించారు. ఆపరేషన్ ఈడీగా ఉన్న నాగరాజు ఇప్పటివరకు ఈ బాధ్యత నిర్వహించారు. గతంలో ఆర్టీసీ సమీక్ష నిర్వహించిన సమయంలో కొత్తగా రెవెన్యూ ఈడీ పోస్టును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ అది ఇప్పటివరకు అమలుకాలేదు. తాజా మార్పుల్లో భాగంగా ఈడీ వేణుకు రెవెన్యూ ఈడీ పోస్టు కేటాయించారు. దీంతోపాటు ఆర్టీసీ బోర్డు కార్యదర్శి బాధ్యతను కూడా ఆయన నిర్వర్తించనున్నారు. ఇంజనీరింగ్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న రవీందర్‌కు ఇప్పటివరకు కార్యదర్శి బాధ్యత ఉండేది. ఇంజనీరింగ్ సివిల్, కొనుగోళ్లు యథావిధిగా ఎండీ వద్దే ఉన్నాయి. హైదరాబాద్ సిటీ జోన్ ఈడీగా ఉన్న పురుషోత్తం యథావిధిగా కొనసాగనున్నారు. -
3800 కు పైగా విమానాలు రద్దు
వాషింగ్టన్ : హైతీలో మాథ్యూ హరికేన్ సృష్టించిన విలయం అమెరికాను, అక్కడి విమానాశ్రయాలను వణికిస్తోంది. దాదాపు 339 మందిని పొట్టన పెట్టుకున్న మాథ్యూ హరికేన్ ప్రకంపనలతో విమానాశ్రయాల్లో కూడా విపత్తు వాతావరణం నెలకొంది. ఈ మృత్యు తుఫాను ఫ్లోరిడా దిశగా పయనిస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సుమారు 3,862 విమానాలను బుధవారం మరియు శనివారం మధ్య రద్దు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు పామ్ బీచ్ విమానాశ్రయాన్ని తెరిచి వుంచినప్పటికీ, ప్రధాన కార్యకలాపాలు స్థంభించాయి. వాణిజ్య విమానాలను నిలిపివేశారు. 2005 సం.రంలో కత్రినా హరికేన్ తర్వాత లాడర్డల్-హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మూత పడడం ఇదే మొదటిసారి. మాథ్యూ విలయం కారణంగా గురువారం సాయంత్రం నాటికి మూసివేయబడింది. ఫ్లైట్స్ అవేర్. కాం ప్రకారం దాదాపు 3,862 విమానాలను రద్దు చేశారు. బుధవారం మరియు శనివారం మధ్య రద్దు చేసినట్టు ఎబిసి న్యూస్ రిపోర్ట్ చేసింది. కాగా లెస్ ఆంగ్లాయిస్ ప్రాంతాన్ని ముందుగా తాకిన ఈ మాథ్యూ హరికేన్ అనంతరం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ ను తాకనుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ వార్తలతో ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇసుక తుఫానులా మాథ్యూ తరముకొస్తోంది....ఈ తుఫాను మిమ్మల్మి చంపేసే ప్రమాదం ఉంది, ఒక భూతంలా ముంచుకొస్తోంది జాగ్రత్త పడాలని ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మాథ్యూ తూర్పు తీరంలో విధ్వంసకర ప్రభావాన్ని పడవేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 580 మైళ్ళ అట్లాంటిక్ తీరం అంతటా నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కోరారు. -
కావేరీ సీడ్స్ లైసెన్స్ తాత్కాలిక రద్దు
అమరావతి: కావేరీ సీడ్స్ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. కావేరీ సీడ్స్‌కు చెందిన ‘జాదూ’ పత్తి విత్తనాల నాణ్యత సరిగ్గా లేదని గుంటూరు జిల్లా చిలకలూరిపేట, అచ్చంపేట మండలాల రైతులలు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వ్యవసాయశాఖ అధికారులు నివేదిక తయారుచేశారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని కావేరీ సీడ్స్ లెసైన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు రద్దు ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది. -
నా గన్ లైసెన్స్ ఎప్పుడో రదై్దంది
నయీమ్ కేసుకు గన్ లైసెన్స్ రద్ధుకు ఎలాంటి సంబంధం లేదు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నయీమ్‌తో సంబంధాలు వెలుగులోకి వస్తాయి నా పై హత్యకు కుట్ర పన్నారు దుబ్బాక నర్సింహారెడ్డి నల్లగొండ: ‘ఆత్మరక్షణ కోసం నేను కొనుగోలు చేసిన గన్ను ప్రభుత్వానికి ఎప్పుడో సరెండర్ చేశాను. నా గన్ లైసెన్స్ ఎప్పుడో రద్దు అయింది. నయీమ్ కేసుకు నా గన్ లైసెన్స్ రద్దుకావడానికి ఎలాంటి సంబంధం లేదు’ అని టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీమ్‌తో సంబంధాలు కలిగిఉన్నట్లు ఆ కారణంగానే ప్రభుత్వం నా గన్ లైసెన్స్ రద్దు చేసినట్లు’ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను హత్య చేయించడానికి కోమటరెడ్డి బ్రదర్స్ పథకం పన్నారని దాంతో ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం నుంచి గన్‌లైసెన్స్ పొందినట్లు దుబ్బాక పేర్కొన్నారు. నయీమ్‌తో సంబంధాలు కలిగినట్లు విచారణలో తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేశారు. 2009 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో నయీమ్ భౌతికంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి గెలుపునకు పనిచేశారని, నల్లగొండను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేశారాని ఆరో పించారు. నయీమ్ అనుచరుడు యూసుఫ్ సహకారంతో టీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు పాల్పపడ్డారని, ముస్లింసోదరులను చంపుతామని బెదిరించాడని తెలిపారు. నయీమ్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సంబంధాలు ఉన్నాయని సిట్విచారణలోత్వరలోనే అవన్నీ వెలు గులోకి వస్తాయన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కా ర్యక్రమాలు చేపడుతున్నందున ఓర్వలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నైతికదెబ్బతీసేందుకే తన పై దుష్ప్రచారం చేస్తున్నారని దుబ్బాక విమర్శించారు. నయీమ్ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం ఉన్నా బాధితులు తన పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అబ్బగోనిరమేష్ గౌడ్, బషీర్, పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
కాకినాడ సిటీ : కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలు రద్దు చేసినట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రత్రికలకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల జరిగిన ఈ మార్పును ప్రజలు, అర్జీదారులు గమనించాలని కోరారు. -
పలు రైళ్ళు రద్దు
* 21 నుంచి 28వ తేదీవరకు మార్పులు * విజయవాడ రైల్వేస్టేషన్లో పనుల కారణంగానే... నగరంపాలెం: విజయవాడ రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు జరుగుతున్నందున ఈనెల 21 నుంచి 28 వరకు వివిధ తేదీల్లో పలు రైళ్ళు రద్దు, దారిమళ్లింపు, పాక్షికంగా రద్దు చేసినట్టు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజరు కె. ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్ళు.. ట్రై న్నెం 17239/17240 గుంటూరు–విశాఖపట్నం–గుంటూరు ఎక్స్‌ప్రెస్ 22,23,24 తేదీల్లో, ట్రై న్నెం 17201/17202 గుంటూరు– సికింద్రాబాద్–గుంటూరు 23 తేదీ, ట్రై న్నెం 17212 యశ్వంతపూర్–మచిలీపట్నం 24వ తేదీ బయలుదేరి 25వ తేదీ గుంటూరు వచ్చేది, ట్రై న్నెం17644 కాకినాడ పోర్టు – చెన్నైఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ 23వ తేదీ, ట్రై న్నెం17643 చెన్నై ఎగ్మోర్–కాకినాడపోర్టు ఎక్స్‌ప్రెస్ 23వ తేదీ బయలుదేరి గుంటూరు 24వ తేదీ వచ్చేది, ట్రై న్నెం 17211 మచిలీపట్నం– యశ్వంతపూర్ 23 తేదీ, ట్రై న్ నెం 17212 యశ్వంతపూర్–మచిలీపట్నం 24వ తేదీలలో రద్దు చేశారు. గుంటూరు స్టేషన్ నుంచే రాకపోకలు సాగించే∙రైళ్ళు.. ట్రై న్ నెం 12077/12078 చెన్నై సెంట్రల్ –విజయవాడ– చెన్నై ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 21 నుంచి 26 వ తేదీ వరకు, ట్రై న్ నెం 17226/17225 హుబ్లీ– విజయవాడ–హుబ్లీ సెప్టెంబరు 21,22,23 తేదీలలో, ట్రై న్ నెం 12796/12795 సికింద్రాబాద్–విజయవాడ–సికింద్రాబాద్ సెప్టెంబరు 21 నుంచి 24 వ తేదీ వరకు, ట్రై న్నెం 17216 ధర్మవరం– విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబరు 20,22 తేదీలలో, ట్రై న్నెం 17215 విజయవాడ–ధర్మవరం సెప్టెంబరు 21,24 తేదీలలో గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి గుంటూరు రైల్వే స్టేషన్ వరకే నడుస్తాయి. వేరే డివిజన్ మీదుగా దారిమళ్లించిన రైళ్లు.. ట్రై న్ నెం 16032 జమ్ముతావీ– చైన్నె ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23 వతేదీ, ట్రై న్నెం నెం 17221 కాకినాడపోర్టు– లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 21,24 తేదీలలో, ట్రై న్నెం 12805/12806 సికింద్రాబాద్– విశాఖపట్నం– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22,23 తేదీలలో, ట్రై న్ నెం 18464 బెంగుళూరు సిటీ– భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22 తేదీ, ట్రై న్ నెం 17222 లోకమాన్యతిలక్– కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23, 26 తేదీలలో, ట్రై న్నెం 17231 నర్సపూర్–నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23వ తేదీ, ట్రై న్నెం 18463 భువనేశ్వర్– బెంగుళూరు సిటీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23 వ తేదీ, ట్రై న్ నెం 17204 కాకినాడ టౌన్–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 22 తేదీలలో గుంటూరు నుంచి కాకుండా వేరే డివిజను నుంచి దారి మళ్లించారు. గుంటూరు డివిజను మీదుగా దారిమళ్ళించిన రైళ్ళు.. ట్రై న్నెం 12706/12705 గుంటూరు–సికింద్రాబాద్– గుంటూరు సెప్టెంబరు 21 నుంచి 26 తేదీలలో ,ట్రై న్నెం 17406/17405 ఆదిలాబాద్–తిరుపతి కష్ణా ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 21 నుంచి 26వ తేదీ వరకు, ట్రై న్నెం 12710 సికింద్రాబాద్–గుడూరు సింహపూరి ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22,23 తేదీలలో, ట్రై న్ నెం 12764/12763 సికింద్రాబాద్–తిరుపతి–సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22,23,24,25,26 తేదీలలో గుంటూరు డివిజనులోని పగిడపర్రి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, సత్తెనపల్లి ,గుంటూరు మీదుగా నడుస్తాయి. రీషెడ్యూల్ చేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్ళు.. ట్రై న్నెం 22831 హౌరా జంక్షన్ –సాయిప్రశాంతినిలయం ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబరు 21 తేదీ 15.35కు బయలుదేరాల్సి ఉండగా 19.30కి , ట్రై న్నెం 16031 చెన్నైసెంట్రల్–జమ్ముతావీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22 వ తేదీ 5.15కి బయలుదేరాల్సి ఉండగా 08.30కి, ట్రై న్నెం 18047 హౌరా జంక్షన్–వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 22వ తేదీ 23.30కి బయలుదేరాల్సి ఉండగా 23వ తేదీ 05.00గంటలకు, ట్రై న్నెం 22832 సాయి ప్రశాంతినిలయం–హౌరా జంక్షన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 23 వ తేదీ 07.40కి బయలుదేరాల్సి ఉండగా 11.00 గంటలకు బయలుదేరేవిధంగా షెడ్యూల్ మార్పు చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి రద్దు చేసిన ప్యాసింజరు రైళ్ళు.. ట్రై న్ నెం 77221 విజయవాడ– గుంటూరు సెప్టెంబరు 22 నుంచి 28వతేదీ వరకు, ట్రై న్నెం 57382 నర్సపూర్–గుంటూరు సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్నెం 77283/77284 గుంటూరు–విజయవాడ –గుంటూరు సెప్టెంబరు 21,22,23,24,26,27,28 తేదీలలో, ట్రై న్నెం 67273 /67274 విజయవాడ– గుంటూరు–విజయవాడ సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్నెం 57381 గుంటూరు – నర్సాపూర్ సెప్టెంబరు 20 నుంచి 27 వరకు,ట్రై న్నెం 57316 నర్సాపూర్ – గుంటూరు సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్నెం 77230 గుంటూరు– విజయవాడ సెప్టెంబరు 21 నుంచి 28 వరకు, ట్రై న్నెం 77289 గుంటూరు– విజయవాడ సెప్టెంబరు 21, 22, 23, 24, 26, 27, 28 తేదీలలో రద్దు చేశారు. పాక్షికంగా రద్దు చేసిన ప్యాసింజరు రైళ్ళు.. ట్రై న్నెం 56503 /56504 బెంగుళూరు –విజయవాడ– బెంగుళూరు, ట్రై న్నెం 56501 /56502 విజయవాడ–హూబ్లీ–విజయవాడ, ట్రైన్ నెం 57318 మాచర్ల–బీమవరం జంక్షన్ ప్యాసింజరు రైళ్ళు సెప్టెంబరు 21 నుంచి 28 వరకు విజయవాడ, గుంటూరు మధ్యలో రద్దుచేశారు. ట్రై న్నెం 67254/67259 విజయవాడ– గుంటూరు– విజయవాడ ప్యాసింజరు రైలు కెనాల్, విజయవాడ మధ్యలో రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాల్సిందిగా సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. -
భారీ సంఖ్యలో టీవీ, ఎఫ్ఎం చానెల్స్ పై వేటు
న్యూఢిల్లీ: సమాచార, ప్రసార మంత్రిత్వి శాఖ సంచలన నిర్ణయ తీసుకుంది. భారీ సంఖ్యలో టీవీ ఛానెల్స్, ఎఫ్ ఎం లపై వేటు వేసింది. ఇటీవల సంవత్సరాలలో నిబంధనలు ఉల్లంఘించిన 73టీవీ ఛానెళ్ళు, 24 ఎఫ్ ఎం చానెల్స్ , తొమ్మిది వార్తాపత్రికలు లైసెన్సులను ఐ అండ్ బి శాఖ రద్దు చేసింది. కాలపరిమితి మించిన కొన్ని టీవీ చానల్స్, నిబంధనలు ఉల్లంఘించిన ఆరు ప్రైవేట్ ప్రసారసాధనాలు సహా, 24 ఎఫ్ఎం, ఛానల్ లైసెన్సుల రద్దు చేసింది. మంత్రిత్వ శాఖ అనుమతి ఒప్పందం (జీవోపీఏ) ప్రకారం ప్రసార మార్గదర్శక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈనిర్ణయం తీసుకున్నామని కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ రాజ్యసభలో చెప్పారు. అలాగే 1867 సం.రం నాటి పీఆర్బీ చట్టాన్ని ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్ గా ఇప్పటికే మార్చినట్టు చెప్పారు. మరోవైపు ప్రింట్ మీడియా ప్రమాణములను కట్టడిచేసే పనిలోమంత్రిత్వ శాఖ పూర్తిగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ విధానాల సరళీకరణ తరువాత ఈ రంగంలో నెలకొన్న అసాధారణ అభివృద్ధి కారణంగా వీటిని అప్ డేట్ చేయాలని, ప్రింట్ సెక్టార్లో న్యాయ విధానం పునరుద్దరించాల్సిన అవసరం వచ్చిందని మంత్రి తెలిపారు. కాగా దేశంలో 42 ప్రైవేట్ ఛానెళ్లు, 196 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 892 రిజిస్టర్డ్ ప్రయివేట్ శాటిలైట్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. -
దుబాయ్ వెళ్లే విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమాన ప్రమాదం పలు విమానాల రద్దుకు దారి తీసింది. మరికొన్నింటిని షార్జా, అబుదాభి విమానాశ్రయాల ద్వారా దారి మళ్లించాల్సి వచ్చింది. కేవలం పెద్ద విమానాలకు మాత్రమే దుబాయ్ ఎయిర్ పోర్ట్ అనుమతిస్తోంది. ఈ ఆటంకాలకు శనివారం ఉదయానికి తెరపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యలో భారత విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. గురువారం ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు కాన్సిల్ అయినట్టు తెలిపారు. ముఖ్యంగా వైడ్ బాడీ విమానాలకు మాత్రమే శుక్రవారం వరకూ అనుమతి ఉందని, ఎయిర్ ఇండియా జెట్ ఎయిర్ వేస్ కు మాత్రమే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటు ఇండియా నుంచి దుబాయ్ మీదుగా వెళ్లే పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థలు కూడా ప్రకటించాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ కు వెళ్లే విమానాలను రీషెడ్యూల్ చేసినట్టు జెట్ ఎయిర్వేస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వరుస ట్విట్లతో ప్రయాణికులకు అప్ డేట్ చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యంకోసం సాధ్యంమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పైస్ జెట్ ట్వీట్ చేసింది. అల్ మక్ టం అంతర్జాతీయ విమానాశ్రయం, రాస్ అల్ ఖైమాహ్, షార్జా మళ్లిస్తూ, తమ ప్రయాణీకులకు దుబాయ్ నగరం చేరుకోవడానికి వీలుగా ఈ విమానాశ్రయాల నుంచి ప్రయాణ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని స్పైస జెట్ తెలిపింది. ఇండిగో గురువారం పలు విమానాలనురద్దు చేసినట్టు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు ఒక ప్రకనటలో తెలిపింది. దుబాయ్ ఎయిర్ పోర్టులో రన్ వే అందుబాటులో లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ప్రయాణికుల ఏర్పాట్లకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రకటించాయి. శుక్రవారం ఉదయం 7.30 వరకు ఉన్న విమానాలు అందుబాటులో వుండవని ఇండిగో తెలిపింది. ఆదివారం లిమిటెడ్ గా తమ సర్వీసులను నడుపుతామని తెలిపింది. ఇండిగో ప్యాసింజర్లు దీన్ని గమనించాలని కోరింది. ప్రయాణీకులు తమ తమ విమాన స్థితిని తనిఖీచేసుకోవాలని అభ్యర్థించింది. కాగా ఎమిరేట్స్ బుధవారం 27 విమానాలను రద్దు చేసింది. మిగిలినవాటిని దారి మళ్లించింది. అనుకోని సంఘటనతో దాదాపు 23 వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు బుధవారం, అంతకుముందు బుక్ చేసుకున్న టికెట్లు ఎలాంటి చార్జ్ లేకుండా క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపాయి. 21.5 లక్షలమంది ప్రయాణికులతో ముంబై దుబాయ్ మధ్య అత్యంత రద్దీ గా ఉండే అంతర్జాతీయ మార్గంగా ఖ్యాతి గడించింది. దీనితర్వాత 17 లక్షలమందితో ఢిల్లీ-దుబాయ్ మార్గం రెండవ స్థానంలో నిలిచింది. Dubai- only widebody aircraft allwd till 7 AM tom. AI routing thru Sharjah, Jet thru Sharjah&Abudhabi & Indigo,Spicejet cncld today. — Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) August 4, 2016 (1/3) #TravelUpdate: Some of our flights to & from #Dubai are affected due to single runway operations at Dubai airport and contd… — Jet Airways (@jetairways) August 4, 2016 -
తెలంగాణ ఎంసెట్-2 రద్దు
-
ట్రూజెట్ సర్వీసు రద్దు
మధురపూడి : హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానా్రÔ¶ యానికి సాయంత్రం 4–20 గంటలకు రావాల్సిన ట్రూజెట్ విమాన సర్వీసు మంగళవారం కూడా రద్దయింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సర్వీసు రద్దయినట్టు స్థానిక ప్రతినిధి తెలిపారు. సాయంత్రం 4–20 గంటలకు ఇక్కడకు చేరే ఈ సర్వీసు 4–40 గంటలకు తిరిగి చెన్నైకు బయలుదేరుతుంది. కొన్ని రోజులుగా ఈ సర్వీసు రద్దవుతున్న సంగతి తెల్సిందే. కాగా వర్షాకాలం ప్రారంభం కావడం, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడటం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులు దీనిని నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
రాజ్‌నాథ్ అమెరికా పర్యటన రద్దు
-
వీవీఐపీ సిఫారసు చికిత్సలు ఇక బంద్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్రభుత్వ ఆసుపత్రి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో వీవీఐపీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పేద రోగుల చికిత్సకు ప్రాధాన్యం ఇస్తూ వీవీఐపీ సిఫారసు చేసే 'ప్రాధాన్య చికిత్స'లకు చరమగీతం పాడింది. అవసరం ప్రాతిపదికనే వైద్యులు రోగులకు సేవలు అందించాలని మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఆదేశాలిచ్చింది. రోగులకు చికిత్స అందించే క్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మెడికల్ సూపరింటెండెంట్ చేసే సిఫారసులను పరిగణనలోకి తీసుకోరాదని, వాటికి ప్రాధాన్యత ఇవ్వొద్దంటూ ఆసుపత్రి యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆస్పత్రి వర్గాలు, సీనియర్ వైద్యులు, రోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి పరిపాలన విభాగం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని, ఇకమీదట ఆసుపత్రి పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని ఓ సీనియర్ వైద్యుడు చెప్పారు. కాగా ఇటీవలి ఆసుపత్రి యాజమాన్య నిర్ణయంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. ఆసుపత్రి యాజమాన్య ఆదేశాలపై విచారణ చేపడతామన్నారు. ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి తాజా నిర్ణయం. అయితే ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీవీఐపీ సంస్కృతిని విడిచిపెట్టాలనే ఆకాంక్షను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల తరచు వ్యక్తం చేస్తోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ ఆయా ఆసుపత్రులలోని స్పెషల్ వార్డులను జనరల్ వార్డులుగా మార్చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
సవాంగ్ సెలవు రద్దు
-
దట్టంగా మంచు... ఆగిన విమానాలు
శ్రీనగర్ : శ్రీనగర్‌లో దట్టమైన మంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు కూడా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన విమానాలు రద్దయ్యాయి. విమానం కిందకి దిగాలంటే ఎదురుగా 1000 మీటర్ల మేర కనిపించాలని కానీ ఎదురుగా 300 నుంచి 400 మీటర్ల మేర ఉన్న ప్రాంతమే కనిపిస్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఉదయం వేళ్లలో విమానాలను రద్దు చేసినట్లు చెప్పారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్వాన్స్డ్ ఇనుస్ట్రుమెంటేషన్ ల్యాండింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రక్షణ, పౌర విమానయాన శాఖ మంత్రిత్వశాఖలకు లోక్‌సభలో విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రిపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, లోక్‌సభ సభ్యురాలు మహబూబా ముఫ్తి వెల్లడించారు. శీతాకాలం భారీగా మంచు కురుస్తుండమే కాకుండా కొండ చరియలు విరిగి పడుతుండటంతో జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు. -
ఫుట్‌బాల్ స్టేడియంలో బాంబు కలకలం
-
ఒక్క బంతీ పడలేదు..!
వర్షంతో మూడో టి20 రద్దు సిరీస్ 2-0తో దక్షిణాఫ్రికా సొంతం ఆదివారం తొలి వన్డే కోల్‌కతా: టి20 సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయినా... చివరి మ్యాచ్‌లో నెగ్గి కాస్త పరువు దక్కించుకుందామని భావించిన భారత్‌కు ఆశాభంగం కలిగింది. దక్షిణాఫ్రికాతో గురువారం ఇక్కడ జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం కొద్దిసేపే పడినా... అవుట్ ఫీల్డ్ అనుకూలంగా లేకపోవడంతో ఆట సాధ్యం కాలేదు. గ్రౌండ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా బౌండరీ సమీపంలో మైదానం చిత్తడిగానే ఉండిపోయింది. అంపైర్లు గంటకు ఒక సారి చొప్పున మొత్తం మూడు సార్లు మైదానాన్ని పరీక్షించారు. చివరకు 9.30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా టాస్ వేయకుండా, ఒక్క బంతి కూడా పడకుండానే కోల్‌కతా మ్యాచ్ కథ ముగిసిపోయింది. దీంతో 2-0తో టి20 సిరీస్ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరింది. జేపీ డుమినికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిరీస్ కోల్పోయి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగునుంచి ఆరో స్థానానికి పడిపోగా, దక్షిణాఫ్రికా ఐదో స్థానానికి చేరింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం కాన్పూర్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రహానేతో ఓపెనింగ్ చేయించాలని, రైనాను మూడో స్థానంలో పంపాలని... మిశ్రా, బిన్నీలను ఆడించాలని కూడా నిర్ణయించాం. అయితే అది సాధ్యం కాలేదు. ఇలాంటి వేదికకు వచ్చి మ్యాచ్ ఆడకపోవడం అసంతృప్తి కలిగించింది. ఇక్కడి అవుట్ ఫీల్డ్ చాలా మారాల్సి ఉంది. వన్డేల్లోనూ మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ కీలకమే. సొంతగడ్డపై సిరీస్ కాబట్టి పిచ్‌లపై పచ్చిక ఉండాలని కోరుకోవడం లేదు. -ధోని, భారత కెప్టెన్ మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో నిరాశ చెందాం. అయితే ఇలాంటి సుదీర్ఘ పర్యటనంలో ఆటగాళ్లు గాయాల పాలు కాకుండా ఉండటం కూడా ముఖ్యం. భారత్‌లో సిరీస్ గెలవడం అంత సులువు కాదు. మా నలుగురు పేసర్లు కూడా బాగా ఆడారు. ఈ విజయం వన్డేల్లో మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది - డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ -
పోర్ట్బ్లయిర్ విమానం రద్దు
విశాఖపట్నం: విశాఖ నుంచి అండమాన్ రాజధాని పోర్ట్బ్లయిర్ వెళ్లాల్సిన విమానం గురువారం రద్దయింది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైజాగ్ చేరుకునే ఈ విమానం షెడ్యూల్ ప్రకారం వెంటనే తిరిగి బయలుదేరుతుంది. సాంకేతిక కారణాలతోనే గురువారం రద్దు చేశామని, యథావిధిగా రేపు నడుపుతామని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులను అధికారులు స్థానిక హోటల్‌కు తరలించి, బస కల్పించారు. -
బంగారంపై వ్యవసాయం రుణమాఫీ ఎగవేత
-
విమానప్రయాణాన్ని ఆపేసిన ఎలుక
-
నేడు, రేపు పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ : భారీ వర్షాలకుతోడు, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం నిజాముద్దీన్-తిరుపతి వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, పాట్నా-సికింద్రాబాద్.. పాట్నా ఎక్స్‌ప్రెస్, గోరక్‌పూర్-త్రివేండ్రం, నిజాముద్దీన్-విశాఖపట్నం, బెంగళూరు-నిజాముద్దీన్, మదురై-నిజాముద్దీన్ మదురై ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ-మద్రాస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. కాగా సోమవారం కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. వాటిలో పాట్నా-సికింద్రాబాద్ పాట్నా ఎక్స్‌ప్రెస్, తిరుపతి-నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-జైపూర్, లక్నో-మద్రాస్, జమ్ముతావి-కన్యాకుమారి, కొత్త ఢిల్లీ-త్రివేండ్రం, మద్రాస్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, మంగళూర్-భగత్‌కోటి, యశ్వంత్‌పూర్-లక్నో, చాప్రా-మద్రాస్ రైళ్లు రద్దయిన వాటిలో ఉన్నాయి. మంగళవారం రద్దైన వాటిలో నిజాముద్దీన్-ఎర్నాకులం, పాట్నా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. -
యూపీ సీఎంని పరిగెత్తించిన భూకంపం.