![Thee Hundred Trains Cancelled Due To Michaung Cyclone - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/12/5/Cancelled-Due-To-Michaung-Cyclone.jpg.webp?itok=SSSyKCoA)
సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాన్ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో) తెలిపారు. ఎస్సీఆర్ పరిధిలో రైళ్లపై తుపాన్ ఎఫెక్ట్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్‌లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
‘ప్రస్తుతం రైల్వే ట్రాక్ లపై ఎక్కడా నీళ్ళు నిలవలేదు. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమచారం అందించాం. ఎస్ఎంఎస్‌లు, సామాజిక మాధ్యమాల్లోనూ అందించాం. ప్రయాణికుల రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేశాం. తుపాను తీరం దాటాక వీలైనంత త్వరగా రైళ్లు పునరుద్ధరిస్తాం’ అని సీపీఆర్వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment