నేడు, రేపు పలు రైళ్లు రద్దు | Many Trains cancelled : Rains affect Rail lines | Sakshi
Sakshi News home page

నేడు, రేపు పలు రైళ్లు రద్దు

Published Sun, Jun 21 2015 8:36 AM | Last Updated on Tue, Oct 9 2018 3:01 PM

Many Trains cancelled : Rains affect Rail lines

హైదరాబాద్ :  భారీ వర్షాలకుతోడు, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం నిజాముద్దీన్-తిరుపతి వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, పాట్నా-సికింద్రాబాద్.. పాట్నా ఎక్స్‌ప్రెస్, గోరక్‌పూర్-త్రివేండ్రం, నిజాముద్దీన్-విశాఖపట్నం, బెంగళూరు-నిజాముద్దీన్, మదురై-నిజాముద్దీన్ మదురై ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ-మద్రాస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

కాగా సోమవారం కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. వాటిలో పాట్నా-సికింద్రాబాద్ పాట్నా ఎక్స్‌ప్రెస్, తిరుపతి-నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-జైపూర్, లక్నో-మద్రాస్, జమ్ముతావి-కన్యాకుమారి, కొత్త ఢిల్లీ-త్రివేండ్రం, మద్రాస్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, మంగళూర్-భగత్‌కోటి, యశ్వంత్‌పూర్-లక్నో, చాప్రా-మద్రాస్ రైళ్లు రద్దయిన వాటిలో ఉన్నాయి. మంగళవారం రద్దైన వాటిలో నిజాముద్దీన్-ఎర్నాకులం, పాట్నా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement