Rains affect
-
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
-
RK బీచ్ వద్ద అలల ఉగ్రరూపం
-
చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి చేరిన వరద నీరు
-
Fengal Cyclone: దూసుకొస్తున్న ఫెంగల్
-
Red Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
-
ఏపీకి హై అలర్ట్..
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
Cyclone Dana: భారీ గాలులతో అర్ధరాత్రి తీరం దాటనున్న తుఫాను
-
వరద గుప్పిట్లో బెంగళూరు
-
తమిళనాడును కుదిపేస్తున్న భారీ వర్షాలు
-
ఏపీకి అల్పపీడనం ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
నాలుగు రోజులు భారీ వర్షాలు..
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
స్వామి ఉన్నచోటనే నిమజ్జనం అవుతామన్నాయి!
-
AP Rains: ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
-
ముంచుకొస్తున్న మరో ముప్పు! రెండు రోజులుగా ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వర్షాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నిజం ఒప్పుకున్న చంద్రబాబు.. దెబ్బకు పవన్ సైలెంట్
-
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
విజయవాడ వరద బాధితుల కోసం వైఎస్ జగన్ రేషన్ వాహనాలు..
-
విజయవాడ వరద ప్రమాదానికి చంద్రబాబే కారణం
-
ప్రభుత్వం ఫెయిల్ అంటూ, విజయవాడలో వరద బాధితుల ధర్నా
-
మళ్లీ ఉప్పొంగుతున్న బుడమేరు విజయవాడలో టెన్షన్ టెన్షన్..
-
వాళ్ళ టార్గెట్ ఒక్కటే.. చంద్రబాబు నీచ రాజకీయం : MLC Bharath
-
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
-
వరద బాధితుల చిన్నారి సాయం.. వైఎస్ జగన్ ఫిదా..
-
వరద గుప్పిట్లో సర్వం కోల్పోయి
-
జగన్‌ను చూసి చిన్నారి భావోద్వేగం.. కన్నీళ్లు తుడిచిన జననేత
-
AP: అల్పపీడనం టెన్షన్..
-
నా 8 ఏళ్ళ కష్టం 30 లక్షలు వరదపాలు.
-
ప్రభుత్వం ముందే హెచ్చరిక చెయ్యాలి కదా మా ఇంట్లో మనిషిని కోల్పోయాం
-
అధికారం అండతో అదనపు కట్నం కోసం కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత
-
రాజధాని మునిగిందా... లేదా..? అసలు నిజాలు
-
ఏపీలో కేంద్ర బృందం పర్యటన
-
AP Capital: రాజధాని అమరావతి.. బాబు గుండెల్లో గుబులు
-
మరో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
-
మూసీ నదికి పోటెత్తిన వరద.
-
రాజరాజేశ్వరిపేటకు YS జగన్
-
సినీ తారల వరదసాయం...
-
చేతకాని ప్రభుత్వం 4పులిహోర ప్యాకెట్లు..400 ఫోటోలు
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
-
చంద్రబాబు నీకు చేతకాకపోతే చెప్పు కోటి లక్షలు తీసుకొస్తా...
-
చేతులెత్తేసి కలెక్టరేట్ లో బాబు బస..
-
మాకు ఏడుపే మిగిలింది తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు
-
ప్లీజ్ మమ్మల్ని కాపాడండంటూ వ్యక్తి సెల్పీ వీడియో..
-
ఒక్క పాలప్యాకెట్ కోసం వరద నీటిలో 3 కి.మీ ప్రయాణం..
-
Amaravati Roads Close: కృష్ణా నది ఉగ్రరూపం.
-
కరెంట్ లేదు.. తిండి లేదు నీరు లేదు బాబు మీ విజనరీ సేవలు ఎక్కడ..?
-
పాల వ్యాన్ వద్ద ఎగబడుతున్న జనం
-
అమరావతి అస్తవ్యస్తం.. ఇప్పుడెలా ఉంది?
-
ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు బంద్
-
రూ.5,438 కోట్ల నష్టం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత మూడు రోజులుగా వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సర్వం కోల్పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు తక్షణ తాత్కాలిక ఉపశమనంగా ఈ నిధులను మంజూరు చేయాల్సిందిగా ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని కోరామని వెల్లడించారు. వారు సంపూర్ణ సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్ళామని తెలిపారు. కేంద్రం వెంటనే కనీసం రూ.2 వేల కోట్లు అయినా విడుదల చేసేలా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా పెద్దన్న పాత్రలో సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ సమీపంలో వరద తాకిడితో గండిపడిన ఎన్నెస్పీ కాల్వను సోమవారం ఆయన పరిశీలించారు. ఆ తర్వాత పాలేరు రిజర్వాయర్ అలుగు, దెబ్బతిన్న ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి, అక్కడే పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప వద్ద ముంపునకు గురైన బాధితుల ఇళ్లను సందర్శించి వారిని పరామర్శించారు. ఆపై ఖమ్మంలోని మున్నేటి సమీపాన ఉన్న బొక్కలగడ్డ, మంచికంటినగర్ల్లో వరద ఉధృతిని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్లో వరద పరిస్థితిపై సమీక్షించారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరం వద్ద మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల వాటిల్లిన నష్టంపైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అండగా నిలిచేందుకే వచ్చాం ‘ఖమ్మం జిల్లాలో మున్నేరు, పాలేరు, ఆకేరు పోటెత్తడంతో పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాలకు ఊహించని ఉపద్రవం జరిగింది. రెండు రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీసు అధికారులు పని చేస్తున్నారు. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించాం. ప్రజలు ఆవేదనతో ఉన్నప్పుడే ప్రభుత్వం వెళ్లి వారి బాధలు వినాలనే ఉద్దేశంతో జిల్లాలకు వచ్చాం. ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పిస్తున్నాం. 80 ఏళ్లలో మున్నేరుకు ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదని స్థానిక ప్రజలు చెప్పారు. సూర్యాపేట జిల్లాలో 21 చెరువులు తెగిపోయాయి. 15 గ్రామాల నుంచి 420 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 20 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. 7 పశువులు చనిపోగా, 7 పక్కా ఇళ్లు, 33 కచ్చా ఇళుŠల్ కూలిపోయాలి. వరదల్లో చిక్కుకుని ఇద్దరు చనిపోయారు. వరద బాధితులకు అండగా ఉండి ఆదుకుంటాం. ఆందోళన చెందవద్దు. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి సాయం కోరాం. తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కూడా అడిగాం. మేం కూడా రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాం. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చాం..’ అని సీఎం రేవంత్ తెలిపారు. నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేల తక్షణ సాయం ‘ఎక్కడో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాల కోసం ఎదురుచూస్తూ సమయం వృధా కాకుండా ఉండేందుకు తెలంగాణ డీఆర్ఎఫ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 8 చోట్ల 100 మంది చొప్పున యూనిట్లను పెట్టనున్నాం. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికీ తక్షణ సాయంగా రూ.10 వేలు ఇస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఇళ్లల్లో నీరు చేరి నిత్యావసర వస్తువులు పాడైన ప్రతి ఇంటికి రూ.10 వేలు ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారుల సెలవులు రద్దు ‘రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలి. వరదల కారణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలి. వరదల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నాం. ఎవరైనా విధులకు హాజరు కాకపోతే వారి వివరాలను నమోదు చేయాలి. తక్షణ సహాయం కోసం అధికారులు నివేదికలను నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలి. ప్రతిఒక్కరూ ప్రజలకు అండగా నిలవాలి ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా బాధితులను ఆదుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలబడాలి. వరదల వల్ల నష్టపోయిన ప్రజల సహాయార్థం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం. ఇలాగే స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఎవరైనా సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. వరద ముంపు అంశాలపై ప్రభుత్వానికి మీడియా కూడా సహకరించాలి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. కొన్ని పార్టీలకు చెందిన మీడియా పోకడలు మారకపోతే ప్రజలే చూస్తారు..’ అని రేవంత్ అన్నారు. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల వద్దకు వెళ్తున్నారు.. ‘ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అర్ధరాత్రి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ కూడా హుటాహుటిన వచ్చారు. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల వద్దకు వెళ్లి వరదల్లో నష్టపోయిన వారిని పరామర్శిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష నేత మౌనముద్ర దాల్చారు. కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదని విమర్శిస్తున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు? కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్షల కోట్ల సొమ్ములో రూ.వెయ్యి కోట్లో.. రూ.రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వొచ్చు కదా?..’ అని రేవంత్ అన్నారు. ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం వరద విపత్తుతో నష్టపోయిన ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం మర్చిపోయిన గత పాలకులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా విమర్శించడం తగదన్నారు. భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉండటం, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ముందస్తుగా అప్రమత్తం చేయడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు. ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటాం: మంత్రి పొంగులేటి వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. 85 ఏళ్ల క్రితం మున్నేరు వద్ద 35 అడుగుల మేర వరద ప్రవహించిందని, మళ్లీ ఇప్పుడు 35 అడుగులు దాటిందని చెప్పారు. మున్నేరు ప్రళయం ధాటికి వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం హెలికాప్టర్ తెప్పించే ప్రయత్నం చేసినా వాతావరణం అనుకూలించలేదని తెలిపారు. వరదలను కూడా ప్రతిపక్ష పారీ్టలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. చేతతనైతే మంచి సూచనలు ఇవ్వండి కానీ, రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యవద్దని హితవు పలికారు. ఊహించని ఉపద్రవం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కనీ వినీ ఎరుగని విధంగా మున్నేరు ప్రళయం వచ్చిందని, ఇది ఊహించని ఉపద్రవం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలోనే 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. రెండు అంతస్తుల భవనాలు కూడా నీటమునిగాయని తెలిపారు. పేద కుటుంబాల గూడు చెదిరిందని, నష్ట తీవ్రత భారీగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కోమటిరెడ్డి వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. మున్నేరు ముంపునకు గురైన వారి పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆవేదన చెందారని, మున్నేరు ఉధృతికి సంబంధించి టీవీలో వార్తలు చూసిన తర్వాత తాను కూడా ఖమ్మం రావాలనుకున్నట్లు తెలిపారు. అంతలా ఖమ్మంలో వర్ష బీభత్సం కొనసాగిందన్నారు. అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఉద్రిక్తత నడుమ సీఎం పర్యటన ఖమ్మంలోని మున్నేరు పరివాహక ప్రాంతం బొక్కల గడ్డలో సీఎం పర్యటన సందర్భంగా, ఆయన రాకముందు వరద బాధితులు కొందరు సీఎం డౌన్ డౌన్, ముగ్గురు మంత్రులు డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ రోడ్డుకు అడ్డంగా తడిసిన సామాగ్రి వేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం భారీ భద్రత నడుమ మంచికంటినగర్ మీదుగా సీఎం పర్యటన కొనసాగింది. మధ్య మధ్యలో కూడా కొందరు నిరసన తెలపగా పోలీసులు చెదరగొట్టారు. ఇక ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో తురకకుమారి, అన్నపూర్ణమ్మ ఇళ్లకు వెళ్లి జరిగిన నష్టంపై సీఎం ఆరా తీశారు. అయితే తమకు వరద సహాయం మరింత పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళలు కొందరు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఓపెన్ టాప్ జీపు పైనుంచి బాధితులతో మాట్లాడిన సీఎం.. వెళ్తున్న క్రమంలో ఆయనను అడ్డుకుని త్వరగా సాయం అందించాలని కోరడంతో, అన్నిరకాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కాగా సీఎం వెంట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాఘమయి, యశశి్వనిరెడ్డి, రామదాసు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, నలమాద పద్మావతిరెడ్డి, సామేల్, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లాల ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి పొంగులేటి ఇంట్లో బస.. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఖమ్మం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వరద ప్రాంతాల్లో పర్యటన అనంతరం కలెక్టరేట్లో రాత్రి 8 గంటల వరకు సమీక్ష జరిపారు. ఆ తర్వాత ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిలో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం ఇక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లి అక్కడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. -
కుంభకర్ణ ప్రభుత్వానికి స్పందనేది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడే పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయినా రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.‘‘ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు!. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు. వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు!’’ అని అన్నారు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని, కనుక ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిందికానీ, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు!… pic.twitter.com/Bh0CYPXpHr— KTR (@KTRBRS) September 2, 2024 -
డేంజర్ లో ప్రకాష్ బ్యారేజ్..
-
వరద నీటిలో ఏపీ రాజధాని అమరావతి
-
Telangana: వర్షం.. విలయం
రాత్రీ పగలూ ఎడతెరిపి లేకుండా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు కుండపోత.. అడుగు బయటపెట్టలేకుండా ఎటు చూసినా నీళ్లే.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మిగిలింది కన్నీళ్లే. వాగులు, వంకలు ఉప్పొంగుతూ, చెరువులు అలుగుపారుతూ.. ఊర్లు, రోడ్లను ముంచేస్తూ అతలాకుతలం చేస్తున్నాయి. వరద దాటే ప్రయత్నం చేసిన ఎన్నో ప్రాణాలను మింగేస్తున్నాయి. ఇది మరో రెండు రోజులూ కొనసాగుతుందని, మరింతగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానల తీవ్రత శనివారం రాత్రి నుంచి మరింత పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దీనితో జనజీవనం అతలాకుతలమైంది. వరద పోటెత్తి, రహదారులు కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలూ నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు నిండి అలుగెత్తాయి. వాగులు, వంకలు పోటెత్తాయి. దీనితో పదులకొద్దీ గ్రామా లు జలదిగ్భంధం అయ్యాయి. పలుచోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలు, సహాయక చర్యలు, ముందు జాగ్రత్తల గురించి దిశానిర్దేశం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్రూమ్భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో 040–23454088 నంబర్ ద్వారా.. వర్షాలు, వరదల పరిస్థితిపై కలెక్టర్లతో సంప్రదిస్తూ.. అవసరమైన సహాయ సహకారాలు, సూచనలను అందిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.రికార్డు స్థాయిలో వర్షపాతం..రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు సరికొత్త రికార్డును నమో దు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.87 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే ఇంత భారీగా వానలు కురవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో సెప్టెంబర్ 1 నాటికి 58.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతంనమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 76.19 సెంటీమీటర్లు కురిసింది. ఇది సాధారణం కంటే 31శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం సీజన్లో నమోదవాల్సిన వర్షపాతం.. మరో నెల రోజులు ఉండగానే కురిసింది.మరో రెండు రోజులు భారీ వర్షాలురాష్ట్రంలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షా లు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఆదిలాబాద్, నిజామాబాద్, రా జన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగా రెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నల్లగొండ, సూర్యా పేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారా యణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.తడిసి ముద్దయిన హైదరాబాద్రెండు రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. శనివారం రాత్రి నుంచీ ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. నాలాలలో వరద పెరిగి, డ్రైనేజీలు పొంగుతున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాల కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. హుస్సేన్‌సాగర్ నిండిపోవడంతో తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. దాదాపు 165 వాటర్ ల్యాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో.. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్‌బోర్డుల ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు ఎప్పటికప్పుడు నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి.ఖమ్మం.. అల్లకల్లోలం భారీ వర్షాల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అల్లకల్లోలమైంది. పాలేరు, మున్నేరు, వైరా, ఆకేరు, కట్టలేరు నదులు పోటెత్తాయి. చాలాచోట్ల రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా వర్షం పడటం, ఎగువన మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం కురవడంతో.. ఒక్కసారిగా మున్నేరు, ఆకేరు ఉగ్రరూపం దాల్చాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఖమ్మం నగరానికి వరద పోటెత్తింది. 35 కాలనీలు నీటమునిగాయి. తమను కాపాడాలంటూ కాలనీలు, గ్రామాల వాసులు నేతలు, అధికారులకు ఫోన్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇంకా చాలా మంది తమ భవనాలపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 5వేల మంది వరద బాధితులను తరలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్ నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వరదలను, సహాయక చర్యలను పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు కూడా పలుచోట్ల సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మణుగూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలంలో సీతారామ ప్రధాన కెనాల్‌కు గండి పడింది. ములకలపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. వరంగల్.. ఎటు చూసినా వరదే! ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవడంతో.. జలదిగ్బంధమైంది. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 56 చెరువులు తెగిపోయాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ కింద కట్ట కొట్టుకుపోయింది. దీనితో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామపంచాయతీ సీతారాం తండాలు నీటమునిగాయి. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు.. ‘ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆదుకోండి’ అంటూ అధికారులు, బంధువులకు ఫోన్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వందల కొద్దీ పాత ఇళ్లు కూలిపోయాయి. వేములవాడ నుంచి భద్రాచలానికి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. శనివారం రాత్రి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం– తోపనపల్లి శివార్లలో వరదలో చిక్కుకుంది. ప్రయాణికులు వరద మధ్య బస్సులోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉమ్మడి నల్లగొండ వాన బీభత్సం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సూర్యాపేట జిల్లా కాగితరామచంద్రాపురం వద్ద, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం శివారు రంగులబ్రిడ్జి వద్ద గండ్లు పడ్డాయి. సూర్యాపేట మండలం పిల్లలమర్రి– పిన్నాయిపాలెం మధ్య మూసీ ఎడమ కాలువకు గండిపడింది. వేల ఎకరాలు నీట మునిగాయి. పలుగ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మఠంపల్లి మండలం చౌటపల్లిలో ఊరచెరువుకు, హుజూర్నగర్ మండలం బూరుగడ్డ చెరువు, మేళ్లచెరువులో నాగుల చెరువులు తెగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట, చౌల్లరామారం, అడ్డగూడూరులలో చెట్లు విరిగిపడ్డాయి. ఉమ్మడి మెదక్ నిలిచిన రాకపోకలు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో నారింజ వాగు ఉప్పొంగడంతో కర్ణాటక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నర్సాపూర్–హైదరాబాద్ రహదారిపై చెట్లు కూలిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. గుండువాగు, పెద్దవాగు, గంగమ్మ వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణం జలదిగ్బంధమైంది. ఉమ్మడి రంగారెడ్డి దెబ్బతిన్న పంటలు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో కాగ్నా, ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. దీనితో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జిల్లాలో టమాటా, ఆకుకూరల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు పరిధిలోని గౌతాపూర్ సబ్‌స్టేషన్‌లో వరద నీరు చేరడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ నిండుకుండల్లా ప్రాజెక్టులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వరదలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. కుమురం భీం, కడెం, వట్టివాగు, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జైనథ్ మండలం పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్పూర్లలో పంటలు నీట మునిగాయి. బోథ్ మండలం పొచ్చెర జలపాతం ఉప్పొంగుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో సిద్దాపూర్ వాగు పొంగడంతో సిద్దాపూర్, కౌట్ల, ముజ్జిగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నిర్మల్ మండలం చిట్యాల వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. వాహనంలోని వారికి ఈతరావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ రోడ్లు జలమయం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వర్షం దంచికొట్టింది. కలెక్టరేట్ ఆవరణలోని భారీ వృక్షం కూలిపడి, విద్యుత్ స్తంభం విరిగింది. వీణవంక, మామిడాలపల్లిలో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణిలోని ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి– తాండ్య్రాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లెలోని బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి బస్టాండ్, రంగంపల్లి, పెద్దకల్వల, సుల్తానాబాద్ బస్టాండ్, రామగుండం–మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారి (ఎస్‌హెచ్–1)పై వరద నీరు చేరి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి పాలమూరు దెబ్బతిన్న రోడ్లు రెండు రోజులుగా కురుస్తున్న వానలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. మహబూబ్‌నగర్ లోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. జడ్చర్ల పట్టణంలోని యాసాయకుంట తెగి పలు కాలనీలు నీటమునిగాయి. పెద్దగుట్ట రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై దోమలపెంట వద్ద కొండచరియలు విరిగిపడి.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిడ్జిల్ మండలం మున్ననూర్ వాగు వద్ద కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండిపడి 167 జాతీయ రహదారిపై నీళ్లు చేరాయి. ఇదే రహదారిపై మహమ్మదాబాద్‌లో రెండు చోట్ల రోడ్డు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ దంచికొట్టిన వాన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు నిండి అలుగు పోస్తోంది. మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో వాగులు పొంగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలు నీట మునిగాయి. చెట్లు కూలిపడటంతో మెదక్–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వానలకు 18 ప్రాణాలు బలివానలు, వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. ⇒ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పవన్ నక్కల వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు. రామగిరి మండలం రాజాపూర్‌లో అంకరి రాజమ్మ (65) విద్యుత్ షాక్‌తో మృతిచెందింది. కమాన్‌పూర్ మండలం జూలపల్లిలో వ్యవసాయ కూలీ ఇలాసారం కిరణ్ (36)కు ఫిట్స్ వచ్చాయి. వర్షంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందాడు. ⇒ నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడులో వర్షానికి పాత ఇల్లు పైకప్పు కూలి హన్మమ్మ (60), అంజులమ్మ (40) మృతిచెందారు. ⇒ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లికి చెందిన ఎరుకలి శేఖర్ (35) పల్లం చెరువులో మునిగి కన్నుమూశాడు. ఇదే జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో రైతు యాదయ్య (50) పశువుల కొట్టానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి మృతి చెందాడు. ⇒ కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బొందగూడకు చెందిన టేకం గణేశ్ (35) గ్రామశివార్లలో వాగుదాటుతూ కొట్టుకుపోయి మృతి చెందాడు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రీకూతుళ్లు నునావత్ మోతీలాల్, అశి్వని.. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయిగూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. మధిర మండలం దెందుకూరులో గేదెలు కాసేందుకు వెళ్లిన పద్మావతి వరదలో కొట్టుకుపోయి మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరద నీటిలో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. అశ్వాపురం మండలంలో తోగువాగు ఉప్పొంగడంతో ఇద్దరు పశువుల కాపర్లు కొట్టుకుపోయి మృతి చెందారు. ⇒ వరంగల్ జిల్లా రాజీపేటలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన రాములు (58) మృతిచెందాడు. ఇదే జిల్లా దుగ్గొండి మండలం మందపల్లిలో వృద్ధురాలు కొండ్ర సమ్మక్క (75) వరద నీటిలో పడిపోయి మృతి చెందింది. ⇒ సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగం రవికుమార్ వాగు దాటే క్రమంలో కారుతో సహా కొట్టుకుపోయి మరణించాడు. ఉత్తమ్ పద్మావతినగర్ వద్ద యారమాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్‌పై వరదను దాటుతూ ప్రమాదానికి గురై మరణించారు. -
తెలంగాణకు రెడ్ అలర్ట్
-
వరదల్లో మునిగిన కార్లు, బస్సులు
-
తెలంగాణకు రెడ్ అలర్ట్..
-
ఒక్కసారిగా మారిన వాతవరణం..
-
వయనాడ్ ఘటనలో 89కు పెరిగిన మృతుల సంఖ్య
-
నీటమునిగిన పంటలు పశువులకు మేత లేదు రైతుల ఆవేదన
-
చంద్రబాబు వేస్ట్.. రైతుల ఆవేదన
-
నీళ్లు లేక ఎండిపోయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు
-
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
మూడు రోజులు వర్షాలు
-
దుబాయ్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
రెండు వారాలకు ముందు దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ఘటన మరువకముందే మరోసారి ఎడారి దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) అంచనా వేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రేపు (మే 3) వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అంచనా వేసింది.ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు మాత్రమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.1949 తరువాత భారీ వర్షం ఏప్రిల్ 14, 15వ తేదీలలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో పడ్డ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. వాహనాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా అని ప్రజలు భయపడుతున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు వర్షాలు
-
పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుతో నష్టపోయిన రైతన్నలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కొండంత భరోసానిస్తోంది. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు తడిసి, తేమ శాతం, రంగు మారిన ధాన్యాన్ని సాంకేతిక కారణాలను పట్టించుకోకుండా, నిబంధనలు సడలించి మరీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అదీ రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా మద్దతు ధరకే కొని, మిల్లులకు తరలించింది. మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు సన్నద్ధమయ్యాయి. రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఒకటి రెండ్రోజుల్లో ముంపు నీరు దిగిపోయిన వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలకు ఈ బృందాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల మూడో వారంలోగా పంట నష్టం అంచనాలు కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. నెలాఖరులోగా లేదా జనవరి మొదటి వారంలో పరిహారం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి ఖరీఫ్ సీజన్లో 64.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 28.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 14.91 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక మిగిలిన విస్తీర్ణంలో 17 లక్షల ఎకరాల్లో పంటలు కోతలు పూర్తయ్యాయి. మరో 14.37 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి. ప్రాథమికంగా సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురి కాగా, మరో లక్ష ఎకరాలకు పైగా కోతకు సిద్ధంగా ఉన్న పంట నేల కొరిగినట్టు అంచనా వేశారు. వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలపై ప్రభావం చూపినట్టుగా గుర్తించారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తుపాను ప్రారంభమైంది మొదలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఆర్బీకే సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆర్బీకే సిబ్బంది రైతులతో నిత్యం మమేకమవుతూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. స్వయంగా చేలకు వెళ్లి నష్ట నివారణకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. కోతలు పూర్తయిన పంటను కల్లాల నుంచే కొనుగోలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ముంపునకు గురైన పొలాల్లో నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. వర్షాలు తెరిపినిచ్చిన కొద్ది గంటల్లోనే చేలల్లోని నీరు కిందకు దిగిపోవడం మొదలైంది. మరో వైపు నేలకొరిగిన వరి, ఇతర పంటలను కాపాడుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరి పంటను కోయకుండా రైతులను అప్రమత్తం చేశారు. నేలకొరిగిన వరిచేలలో కూడా ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. వేరుశనగ, పత్తి, మిరప, శనగ, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసిన రైతులను కూడా ఇదే రీతిలో అప్రమత్తం చేశారు. -
తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
-
రాష్ట్రానికి మరో 36 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం
-
Telangana: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో అతలాకుతలం
భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపాయి. గత మూడు రోజుల్లో వాగులు, వరద నీటిలో పదుల సంఖ్యలో జనం గల్లంతుకాగా.. వారిలో కొందరి మృతదేహాలు గురు, శుక్రవారాల్లో బయటపడ్డాయి. దీనితో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో చిక్కుకున్నాయి. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉందని స్థానికులు చెప్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్నవాగు వరదలో గల్లంతైన 15మందిలో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా ఆహారం జార విడుస్తున్న ఐఏఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో గురువారం రాత్రి వరదలో గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజన గల్లంతయ్యారు. వారి కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు.సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రుప్ప గ్రామ పెద్ద చెరువులో కృష్ణ అనే యువకుడు, మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్‌లో పడమంచి నర్సింహులు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాములు చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన పెండ్ర సతీశ్ (23) గురువారం రాత్రి మున్నేటి వరదలో గల్లంతుకాగా. శుక్రవారం మృతదేహం లభ్యమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంకు చెందిన ఎస్కే గాలీబ్ పాషా (33) ఈ నెల 26న భార్యతో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తిప్పనపల్లి వద్ద వాగులో ఆయన మృతదేహం లభించింది. భద్రాచలం వద్ద మహోగ్రంగా గోదావరి.. 53 అడుగులకు నీటిమట్టం బుధవారం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కుమ్మరిపాడులోని పాములేరు వాగులో కొట్టుకుపోయిన కుంజా సీత (60) మృతదేహం శుక్రవారం మామిళ్లగూడెం శివారులోని వాగులో బయటపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివిధ చోట్ల వాగుల్లో గల్లంతైన నలుగురు మరణించారు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి మొరంవాగులో రేకల కౌశిక్ (9), మోహన్ (40) కొట్టుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా సిరి కొండ మండలం వైపేట్కు చెందిన సంగం గంగాధర్ (45) స్థానిక వాగులో గల్లంతయ్యాడు. భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్షి్మ, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మంథనిలో పొలాలను ముంచిన గోదావరి ఏ ఆధారమూ లేని పరిస్థితిలో.. గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది. అన్నీ కొట్టుకుపోయి.. మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు. వరద ముంపులో వరంగల్ గ్రామస్తులకు భరోసా.. తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు. గల్లంతై.. కరెంటు తీగలపై వేలాడి.. మేడారం జంపన్నవాగులో గల్లంతైన యాచకుడి మృతదేహం శుక్రవారం వరద తగ్గిన తర్వాత ఇలా కరెంట్ తీగలకు చిక్కుకొని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని కరెంట్ తీగలపై నుంచి తొలగించి పంచనామా నిర్వహించారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వర్షాలు ఎఫెక్ట్..!
-
ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక, భారీ వానల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, రోడ్ల మీద భారీగా వదర నీరు చేరడంతో మింట్ బ్రిడ్జ్ ప్రాంతంలో అండర్ పాస్‌ను అధికారులు మూసివేశారు. మరోవైపు.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. #DelhiRains Daryaganj in a Darya @AtishiAAP @ArvindKejriwal pic.twitter.com/s4VBDscyAJ — Abantika Ghosh (@abantika77) July 8, 2023 दिल्ली में सुबह से ही लगातार बारिश हो रही है बारिश ने मचाई तबाही, राजधानी की सड़कें हुई जाम। बारिश की वजह से जगह-जगह जलभराव की स्थिति देखने को मिली। शहर तालाब में तब्दील हो गया और बरसाती नदियां उफान पर देखने को मिली। #DelhiRains #capital pic.twitter.com/g0CQice4Oc — kumkum (@kumkumgupta00) July 8, 2023 दिल्ली के श्रीनिवासपुरी में बारिश के बाद नाला टूट गया... और नदी की धार की तरह पानी बहता दिखा... #DelhiRains pic.twitter.com/UjuLorgTg7 — kumkum (@kumkumgupta00) July 8, 2023 #DelhiRains| #PragatiMaidanTunnel, which connects India Gate with Ring Road, witnesses severe waterlogging on Saturday following heavy rainfall.#DelhiRain #DelhiNews #Delhi #Rain pic.twitter.com/fPZLwist6r — Prakash K 🇮🇳 (@PrakashK_Legal) July 8, 2023 -
రోడ్లకు వాన దెబ్బ.. గాలికొదిలేసిన ప్రభుత్వం
గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ, అతి భారీ వానలతో వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. పలుచోట్ల నామ్కేవాస్తేగా పైపైన సాధారణ మరమ్మతులు చేసినా.. ఇటీవలి వర్షాలకు మరింతగా పాడయ్యాయి. చాలా చోట్ల గతుకులు, గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పైన తారు కొట్టుకుపోయి.. మట్టిరోడ్లలా మారిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వానాకాలం ముంచుకొస్తుండగా.. ఇప్పటికీ రోడ్ల మరమ్మతు అంశం కొలిక్కి రాలేదు. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్‌కు సంబంధించి నిర్ధారించుకున్న నిడివిలో కేవలం 20 శాతమే పూర్తయింది. వానాకాలం మొదలైతే పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్ తీరు ఇదీ.. మొత్తం ఎంపిక చేసిన రోడ్ల నిడివి: 6,617 కి.మీ. ఇందుకు మంజూరు చేసిన నిధులు: రూ.2,852 కోట్లు ఇప్పటివరకు పూర్తయిన రెన్యువల్: 1,400 కి.మీ. ఇంకా పనులు జరుగుతున్న రోడ్లు: 1,350 కి.మీ. పనులు ప్రారంభం కావాల్సిన నిడివి: 2,263 కి.మీ. టెండర్లు కూడా ఖరారు కాని రోడ్లు: 1,190 కి.మీ. భారీ వర్షాలు పడితే ఇబ్బందే.. గత రెండు వానాకాలాల్లో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర రోడ్లకు నష్టం జరిగినట్టు అంచనా. ఎప్పటికప్పుడే రోడ్లను మెరుగుపరిస్తే.. తదుపరి వరదకు అంతగా నష్టం ఉండదు. అదే మరమ్మతులు చేయని పక్షంలో.. మళ్లీ వరద పోటెత్తితే ఆ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రోడ్లను పూర్తిగా పునరుద్ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చు భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలుపెట్టినా.. 2021 వానాకాలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు దాదాపు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ.1,200 కోట్లు అవసరమని నిర్ధారించారు. 2021లో దెబ్బతిన్న రోడ్లను సకాలంలో బాగు చేయకపోవటంతో.. వాటి పటుత్వం తగ్గి 2022లో మరింతగా దెబ్బతిన్నాయి. అయినా సకాలంలో పునరుద్ధరణ చేపట్టలేదు. గతేడాది చివరలో రోడ్ల పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.2,852 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేసరికి ఫిబ్రవరి వచ్చేసింది. ఏప్రిల్ రెండో వారం నాటికి 20 శాతం పనులు పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత రెన్యూవల్స్.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లకు రెన్యూవల్స్ జరగాలి. అంటే పైన దెబ్బతిన్న తారు పూతను పూర్తిగా తొలగించి కొత్తగా వేయాలి. దీనికి భారీగా వ్యయం అవనున్నందున.. ఐదేళ్లకు బదులు కనీసం ఏడేళ్లకోసారి కొత్తగా వేసినా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసలు పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టలేదు. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఇప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు. 6,617 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించి.. వరదలతో దెబ్బతిన్న రోడ్లను ఇందులో చేర్చి పనులు ప్రారంభించారు. కానీ అనుమతులు, నిధుల విడుదలలో జాప్యంతో పనులు ఆలస్యంగా చేపట్టారు. మరో నెలలో వానాకాలం మొదలవుతుండటంతో.. గతంలో రోడ్లు మరింతగా పాడైపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జడ్చర్ల–వనపర్తి మధ్య బిజినేపల్లి ప్రాంతంలో రోడ్డు కనీస మరమ్మతులు కూడా లేక వానలకు దెబ్బతిని ఇలా గోతులమయంగా మారింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతుండటంతో గోతులు మరింత పెరిగి వాహన దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో బిజినేపల్లి–జడ్చర్ల మధ్య ప్రయాణ సమయం అరగంట అయితే... ఇప్పుడు గోతుల వల్ల గంటకుపైగా పడుతోంది. బిజినేపల్లి సమీపంలోని నల్లవాగుపై నిర్మిస్తున్న వంతెనపై రోడ్డుమీద రెండు చిన్న వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కన నిర్మించిన తాత్కాలిక రోడ్డు వానలకు పాడైపోయింది. ఇటీవల ఈ రోడ్డుమీద అదుపుతప్పిన ఓ టిప్పర్ కరెంటు స్తంభాన్ని ఢీకొంది. తెగిన కరెంటు వైరు ఆ పక్కగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉండటంతో.. బస్సులో ఉన్న 70 మంది పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. నల్గొండ జిల్లా యాద్గార్పల్లి– కేశవాపురం మధ్య ఉన్న సింగిల్ రోడ్డు కాస్తా భారీ వర్షాలకు ధ్వంసమైంది. వరదలతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే క్రమంలో ఇలా పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. -
AP: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తిరస్కరించకుండా రైతులకు అండగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తొలుత తడిసిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొనసాగుతున్న వర్ష సూచనలతో రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అటువంటి ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి డ్రయర్ సౌకర్యం, డ్రయర్ ప్లాట్‌ఫారమ్ ఉన్న మిల్లులకు తరలిస్తున్నాం. అక్కడ ఆరబోత తర్వాత ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తాం’ అని తెలిపారు. రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీనికి అదనంగా ఆర్బీకేల వద్దకు ధాన్యం తెచ్చే ప్రతి రైతుకూ మద్దతు ధర అందిస్తామన్నారు. ఇప్పటివరకు 5.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 55 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.803 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. ధాన్యాన్ని వేగంగా కల్లాల నుంచి మిల్లులకు తరలించేందుకు రవాణా కోసం ఐదు గోదావరి జిల్లాలకు కలెక్టర్ కార్పస్ ఫండ్ కింద రూ.కోటి చొప్పున కేటాయించామన్నారు. కోటా పూర్తవగానే తిరిగి నిధులు అందిస్తామన్నారు. గత ఖరీఫ్‌లో 6.40 లక్షల మంది రైతుల నుంచి 35.41 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దాదాపు రూ.7,208 కోట్లు (99 శాతం) చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని కోరారు. తొలిసారిగా జయ రకానికి మద్దతు ధర తొలిసారిగా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల బొండాలు (జయ రకం) ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఫలితంగా బయట మార్కెట్లో జయ రకం ధాన్యానికి మంచి ధర పలుకుతోందన్నారు. వేసవి ప్రారంభంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ధాన్యంలో నూక శాతం పెరిగినట్లు తెలిపారు. వీటిని బాయిల్డ్ రైస్ కింద కొనుగోలు చేస్తామన్నారు. గోనె సంచులకు కొరత లేదు వర్షాల నేపథ్యంలో నిత్యం ప్రతి జిల్లాలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ చెప్పారు. ఎక్కడా గోనె సంచులకు కొరత లేదన్నారు. ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన 31 మిల్లులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 8 వరకు వర్షాలు.. తగ్గగానే పంట నష్టం అంచనా వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులను వేగంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ నెల 8వ తేదీ వరకు వర్ష సూచన ఉందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం అంచనాలు, ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఎక్కువగా జొన్న, మొక్కజొన్న, వరి పంటలు ముంపునకు గురైనట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. వర్షాల నుంచి పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులుంటే వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే పరిహారం రెండు నెలల క్రితం మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 23,473 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. దాదాపు రూ.34.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే జమ చేస్తామన్నారు. వాటితో పాటే ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ఆ పరిహారాన్ని కూడా రైతులకు ఈ నెలాఖరులోగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక ముందే రైతులకు పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.1,911 కోట్ల మేర పంట నష్టం పరిహారాన్ని అందించినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం -
Telangana: వాన పడి.. కంటతడి
సాక్షి నెట్వర్క్: అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తీవ్ర వేగంతో వీస్తున్న ఈదురుగాలులు దాటికి చాలా చోట్ల వరి నేలకొరిగింది. వరి గింజలు రాలిపోయాయి. మరోవైపు వరి కోతలు పూర్తిచేసి.. ధాన్యాన్ని కల్లాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందే ధాన్యం తడిసిపోతున్నా, నీటిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పాట్లు పడుతున్నారు. వానకు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడం, మళ్లీ వానకు తడిసిపోవడం, మళ్లీ ఆరబోయాల్సి రావడంతో అరిగోస పడుతున్నారు. వరుసగా వానలతో తడిసే ఉంటుండటంతో.. చాలాచోట్ల ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. మరోవైపు మామిడి పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర, నువ్వుల పంటలకు నష్టం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజులూ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కొనుగోళ్లలో ఆలస్యంతో.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సమస్యగా మారిందని.. కొనుగోళ్లు ఊపందుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదని రైతులు అంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూడా వర్షాలు తెరిపినివ్వడం లేదని.. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పలుచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు మెలిక పెడుతున్నారు. లేకుంటే క్వింటాల్‌కు నాలుగైదు కిలోలకుపైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. అకాల వర్షం మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి 19,568 ఎకరాల్లో పంటలు నష్టపోగా.. అందులో 17 వేల ఎకరాల్లో వరి పంటే దెబ్బతిన్నది. ఇంకా పంట నష్టం సర్వే కొనసాగుతూనే ఉంది. ఇక వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో 40వేల టన్నులకుపైగా ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. టార్పాలిన్లు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకలెత్తుతోంది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానతో భారీగా ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. అన్ని పంటలు కలిపి 1,52,577 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో భారీగా వరి చేన్లు నీట మునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అకాల వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను కొలుకోలేని దెబ్బతీశాయి. సిద్దిపేట జిల్లాలో సుమారు 91,569 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 13,947 వేల ఎకరాల్లో, సంగారెడ్డిలో 5,682 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోతకొచ్చే దశలోని వరి నేలకొరిగింది. మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం గణనీయంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 42వేల మంది రైతులకు చెందిన 60,289 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతినగా.. అందులో వరి 19,500 ఎకరాలు, నువ్వులు 4,500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 52 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,905 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 8,014 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి పంట దెబ్బతిన్నది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 40వేల క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ మండలాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరితోపాటు మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరితోపాటు మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 15,494 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏన్కూరు, ఖమ్మం అర్బన్, కూసుమంచి, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో వరి నేలవాలింది. జిల్లాలో ఇప్పటివరకు 197 కొనుగోలు కేంద్రాలను తెరవగా.. 102 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తీసుకురాగా.. వానలకు తడిసిపోతోందని వాపోతున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు 3,299 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వరితోపాటు మామిడికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాను వడగళ్ల వానలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో పంటలు చేలలోనే దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆదివారం రాత్రి కొందుర్గు మండలంలో వడగళ్ల వానకు వరి, మామిడి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. -
చిన్న వానే.. యాదాద్రి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయ మండపాల స్లాబ్‌పై నీళ్లు నిలిచాయి. దీంతో అష్టభుజి ప్రాకార మండపం, బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, ప్రధానాలయ ముఖమండపంలోని అండాళ్ అమ్మవారి ఆలయం వెనుకున్న గోడ, ఆంజనేయస్వామి ఆలయం వెనక భాగాల్లోని గోడ నుంచి వర్షపు నీరు కారుతోంది. గతంలో వర్షం కురిసిన సమయాల్లో లీకేజీలు ఏర్పడ్డ చోట మరమ్మతులు చేపట్టినా లీకేజీలు అవుతున్నాయి. ఇక మాడ వీధుల్లో అక్కడక్కడా వర్షపు నీరు నిలిచింది. క్యూకాంప్లెక్స్ మూడో అంతస్తులో స్లాబ్ బీమ్ నుంచి వర్షపు నీరు చుక్కలుగా పడుతున్నాయి. కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం నుంచి ప్రధానాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న మట్టి రోడ్డు సైతం కోతకు గురైంది. ఇది కూడా చదవండి: కొత్త భవనంలోకి సచివాలయ శాఖల షిఫ్టింగ్.. కేసీఆర్ ఆఫీస్ ఏ ఫ్లోర్లో ఉంటుందంటే? -
భగ్గుమంటున్న పప్పుల ధరలు.. కేంద్రం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ళ వానల కారణంగా చాలా రాష్ట్రాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రభావం పప్పు ధాన్యాల ధరలపై పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. పప్పు ధాన్యాల నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని టోకు వ్యాపారులు, మిల్లర్లను ఆదేశించింది. అంతేకాకుండా దిగుమతులపై ప్రత్యేకంగా దృషి పెట్టింది. దేశంలో పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 1.67 కోట్ల హెక్టార్లు కాగా, గత ఏడాది 1.27 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. కంది, మినుము అధికంగా సాగయ్యే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో ఈ నష్టం మరింత పెరుగనుంది. ఫలితంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది కందిపప్పు ఉత్పత్తి 36 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాస్తవానికి ఇది గత ఏడాది ఉత్పత్తి కంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ. మినప ఉత్పత్తితోనూ 3 నుంచి 5 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రేడ్–1 కందిపప్పు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కిలో రూ.125 నుంచి రూ.135 దాకా పలుకుతోంది. మిగతా పప్పుల ధరలు సైతం 8 నుంచి 10 శాతం వరకూ పెరిగాయి. దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం పప్పు ధాన్యాల స్టాక్ హోల్డర్లు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 28.66 లక్షల టన్నుల పప్పు ధాన్యాల నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వం తేలి్చంది. వివిధ పోర్టుల్లో ఉన్న నిల్వలను పరిశీలించింది. ఈ వివరాలను నాఫెడ్ వెబ్సైట్లో పొందుపర్చింది. ఎక్కడైనా నిల్వలు తగ్గిపోతే మరొక చోటు నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించింది. కంది, పెసర, మినప పప్పుల ధరలు పెరగకుండా చూడాలని అధికారులకు కేంద్ర ఆహార శాఖ ఆదేశాలు జారీ చేసింది.