సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడే పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయినా రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.
‘‘ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు!. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు. వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు!’’ అని అన్నారు.
హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని,
కనుక ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసింది
కానీ, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు.
ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు.
స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు!… pic.twitter.com/Bh0CYPXpHr— KTR (@KTRBRS) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment