యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయ మండపాల స్లాబ్‌పై నీళ్లు నిలిచాయి. దీంతో అష్టభుజి ప్రాకార మండపం, బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, ప్రధానాలయ ముఖమండపంలోని అండాళ్ అమ్మవారి ఆలయం వెనుకున్న గోడ, ఆంజనేయస్వామి ఆలయం వెనక భాగాల్లోని గోడ నుంచి వర్షపు నీరు కారుతోంది.
గతంలో వర్షం కురిసిన సమయాల్లో లీకేజీలు ఏర్పడ్డ చోట మరమ్మతులు చేపట్టినా లీకేజీలు అవుతున్నాయి. ఇక మాడ వీధుల్లో అక్కడక్కడా వర్షపు నీరు నిలిచింది. క్యూకాంప్లెక్స్ మూడో అంతస్తులో స్లాబ్ బీమ్ నుంచి వర్షపు నీరు చుక్కలుగా పడుతున్నాయి. కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం నుంచి ప్రధానాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న మట్టి రోడ్డు సైతం కోతకు గురైంది.
ఇది కూడా చదవండి: కొత్త భవనంలోకి సచివాలయ శాఖల షిఫ్టింగ్.. కేసీఆర్ ఆఫీస్ ఏ ఫ్లోర్‌లో ఉంటుందంటే?
Comments
Please login to add a commentAdd a comment